top of page

మనసుకు మాటలొస్తే



'Manasuku Matalosthe' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 30/03/2024

'మనసుకు మాటలొస్తే' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


ఈ కాలంలో నిజాయితీగా బతికే మనుషులు ఉండరు కదా.. 

అలాంటిది కష్టాల్లోను నిజాయితీగా బతుకుతుంది సూర్య కుటుంబం. 


సూర్య నిజంగా అంతటి పేదవాడు. భార్య రాకమునుపు ఎప్పుడూ మనసులో మాట్లాడుతుంటాడు. అందులో తొలి మాట ఇంతటి పేదింట్లో ఎందుకు పుట్టించావు దేవుడా.. అని. నిజంగా సూర్య పని చేస్తూనే తన పేదరికం పై మనసులో ఎన్నెన్నో మాటలు మాట్లాడుకునేవాడు. అయితే అవి ఎవరికైనా వినపడితేగా.. 


ఈరోజుల్లో ఇల్లే లేని పేదలు ఉంటారా.. ? అసలు ఇల్లు లేక రోడ్ల యొక్క డివైడర్ పక్కన పడుకునే వారు, ఖాళీ ప్రదేశంలో గుడారాలు వేసుకుని బతికేవారు దాదాపు బిచ్చగాళ్ళే. ఊరిలో స్థిర నివాసం ఉండి పూరె గుడిసెలో మట్టి గోడలు మద్య బతుకుతుంది సూర్య కుటుంబం. సూర్య తల్లి ఎప్పుడో పోగా జన్మనివ్వటం తప్పా తనకోసం ఏమీ సాదించిపెట్టని తండ్రి వీరయ్యకు కష్టాల్లోను తానే చూసుకుంటు వస్తున్నాడు. పెద్దగా చదువుకోకపోయినా అక్షర జ్ఞానం తెలిసినవాడే. వెహికల్స్ మెకానిక్ గా పట్టణం పోయి రాత్రనక, పగలనక కష్టానికే నమ్ముకుని సంపాదిస్తు బతుకుతున్నాడు. అన్నీంటికి మించి పేదోడైనా సూర్యకు అదృష్టం అంటే అతడి భార్య రవళి. 


లోకంలో పేదోడైనా, ధనవంతుడైనా.. అర్థం చేసుకునే ఇల్లాలు లేనప్పుడు ఎన్ని ఉన్నా ఫలితం ఉండదు మరియు త్రుప్తి ఉండదు. ఆ అద్రుష్టం సూర్యకు లభించింది. ఆ చిన్న గుడిసెలో ఎన్నెన్నో ప్రేమ ప్రపంచాలను సూర్యకు పరిచయం చేసి ఇన్నాళ్లు సూర్య మనసులో ఉన్న ఈ కటిక పేదరిక పుట్టుక అనే బాదని దాదాపు చెరిపేసేది. మనిషిలో అంతర్లీనం అయిన మనసుకి నిజంగా మాటలు రావు కానీ వస్తే సూర్యలాంటి పేదవాడి మాటలు ఎందరికో వినపడేవి. అయినా.. ! బార్యగా సూర్య మనసులో మాటలును రవళి వింటూనే ఉంటుంది. పేదరికం అనేది మనకు మన స్రృష్టించుకున్ననది కాదు కదా.. ? పుట్టుకతో వచ్చినది. డబ్బున్న వాళ్ళు అయితే మాత్రం సంతోషంగా ఉంటున్నారా.. ? అందుకే రవళి సూర్యకు ఆ మట్టి గోడల మద్యలో ఎన్నో అపురూపమైన ప్రేమలు పంచింది. భర్తకు సంసారంలో తోడుగా కూడా ఉంటుంది. 


 వీరయ్య చాలా ముసలివాడు. వీరయ్య కూడా పేదరికం గూర్చి తన మనసులో బాదపడుతుండేవాడు కానీ.. ! కొడుకుని చదివించి పేదరికాన్ని జయించలేకపోయాడు. వీరయ్య కూడా మనసులో ఎన్నో కోరికలు పెట్టుకుని నెరవేర్చుకోలేకపోయాడు. ముఖ్యంగా చచ్చేలోపు రుచికరమైన విలాసవంతమైన బోజనం చేయాలని అతడి ఈ వ్రుద్దాప్యంలో కోరిక. ఆ కోరికను మంచి మనసు కలిగిన కొడుకు కోడలితో చెప్పుకోలేదు. ఎంత కష్టం ఉన్నా.. , తీరని కోరికలు ఉన్నా.. ఏ రోజు ఒకరికి చెయ్యిచాచి అడగలేదు ఈ తండ్రి కొడుకులు. అలాగే ఒకరిని మోసం చేయలేదు సరికదా.. కష్టపడకుండా సులభంగా వచ్చేవాటిని ఏనాడూ స్వీకరించలేదు. అలాంటి కుటుంబాలు ఉండటం నిజంగా అసాధ్యం. 


ఒకరోజు వీరయ్య పట్టణంలో ఒక హోటల్ వద్దకు వెళ్ళాడు. అక్కడ ఉన్న కిటికీ వద్ద చాలామంది వచ్చి డబ్బులు చెల్లించి తమకు కావల్సినవి కొనుక్కుని వెళ్తున్నారు. తన వద్ద 20రూపాయలు మాత్రమే ఉన్నాయి. అక్కడ జనం రద్దీ తగ్గే వరకు వేచి చూశాడు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఉన్నప్పుడు దగ్గరకు వెళ్ళాడు. ఆ వ్యక్తి తన జేబులో నుండి పొరపాటున పర్స్ ను పారేసుకున్నాడు. ఆ విషయం అతడు గమనించలేదు. వీరయ్య గమనించి పర్స్ తీసి చేతికి ఇచ్చాడు. వీరయ్య వైపు అదోలా చూసుకుని తన దారిన తాను పోయాడు. 


లోకం కూడా ఇంతే కదా.. కనీసం క్రృతజ్ణత బావం లేకుండా బతకుతుంది. ఇక 20 రుపాయలతో తనకు ఏదో కావాలని హోటల్ వాడికి అడగాలనుకుంటు సంకోచిస్తున్నాడు వీరయ్య. ఏమైందో ఏమో.. ఆ వ్యక్తి తిరిగి వచ్చాడు. చేతిలో 20 రూపాయలు పట్టుకుని బాదపడుతున్న వీరయ్య, వీరయ్య దినస్థితిని చూసి చలించిపోయాడు. అతడిలో ఏదో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ముందు వీరయ్యకు కావల్సిన కోరికలు అడిగి తెలుసుకుని అతడికి కావల్సిన ఆహర పదార్థాలు హొటల్ లోపలికి వెళ్ళి కూర్చోబెట్టి ఇప్పించాడు. వీరయ్య కళ్ళలో ఆనందం కన్నీటి బిందువులు తుడుచుకుంటు తింటుండగా ఆ వ్యక్తి ఇలా ఆలోచించాడు. 

తాను తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఇంత నిజాయితీగా నా పర్స్ నాకు ఇచ్చాడు. తమది కాకపోయినా తమదే అని బుకాయించే ఈ జనాల్లో ఇతడు బెస్ట్ గా కనిపించాడు. అలాంటి వ్యక్తికి సహాయం చేయటంలో తప్పు లేదు. పైగా అతడు తనకు కొంత డబ్బులు కూడా ఇస్తుంటే సున్నితంగా తిరస్కరించాడు. అది అతడి గొప్పతనం. నీతి, నిజాయితీ, గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తికి నేను బోజనం పెడుతున్నా.. నాకు ఆనందం లేదు. ఎందుకంటే అతడు నా పర్స్ నాకు ఇవ్వటం వలన పరిచయం అయ్యాడు కానీ.. లేదంటే నేను ఇతడిని పట్టించుకునేవాడిని కాదు కదా. ఇది ఆ వ్యక్తి మనసులో మాట. ఏదైతేనేం కొంత డబ్బులు కూడా ఇచ్చి వీరయ్యని సాగనంపాడు. 


 ఆ రోజు వాతావరణం చల్లగా ఉంది. దానితో సంబంధం లేకుండా సూర్య పనిసాగింది. రాత్రి 8 కావొస్తుంది. వర్షం కూడా అప్పుడే మొదలవుతుంది. పట్టణం నుండి తన ఊరు బయలుదేరి వస్తుండగా మార్గం మద్యలో ఓ మహిళ వనజ తన కారు పాడై 2గంటలు పాటు అక్కడే ఉండి సహయం కోసం ఎదురు చూస్తుంది. ఆమె 6గంటలకే అక్కడికి చేరుకునే సరికి కారు పాడైంది. అటుగా ఎవరు రాకపోవటం, తన ఫోన్ సిగ్నల్ సమస్య వలన ఏమీ చేయలేకపోయింది. మేఘాలు నల్లగా మారుతు అప్పుడే చీకటి పడుతుంది. ఆమె బయపడుతుంది. చుట్టుపక్కల ఎవరు లేరు. వర్షం పడితే తన పరిస్థితి ఏంటీ అని బయపడుతుంది. ఆ సమయంలో సైకిల్ పై సూర్య వస్తు ఆమె బాదని అర్థం చేసుకుని కారు రిపేర్ చేశాడు. ఆమె సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. తన వద్ద ఉన్న డబ్బు ఇచ్చింది. 


" సహాయం మాత్రమే చేశా"నని డబ్బు తిరస్కరించాడు. 

" నువ్వు రాకపోతే నా పరిస్థితి ఏమి కాను.. తలుచుకుంటే ఎంతో భయంగా ఉంది పర్వాలేదు తీసుకో"మని ఆమె బతిమాలింది. సూర్య డబ్బు తీసుకోలేదు. తన జేబులో కాగితం, పెన్ తీసి ఏదో రాసి ఆమెకు ఇచ్చి బయలుదేరాడు. ఆమె చిరాకు పడి చేతిలో పట్టుకుని చూడకుండా బయలుదేరింది. వనజ.. సూర్య ఇల్లు చూడాలని అతడి వెనుకే కారు పోనిచ్చింది. అతడి ఇల్లు చూడగానే తెగ బాదపడింది. వెంటనే ఆ కాగితం చదివింది. 


అందులో, " మేడం నేను ఒక మనిషిగా మీకు సహాయం చేశాను. ఈ సహయానికి ఫలితంగా నేను మీ నుండి ఒకటి ఆశిస్తున్నాను. నాలాగే మీరు కూడా ఆపదలో ఉన్న మనిషికి ఆదుకోండి. అప్పుడు మీకు నేను చేసిన సహాయం వృధా కానట్లు. ఇలా ఉంది. 


నిజంగా ఇంత పేదరికంలో ఉండి ఇంత నిజాయితీతో బతుకుతున్నాడు సూర్య. పరుల అవసరాల్ని అవకాశంగా చేసుకుని డబ్బు గుంజే ఈ మనుషుల్లో సహాయం తప్పా డబ్బులు ఆశించని మనిషి పైగా తనలాగే ఇంకెవరో ఎక్కడో ఆపదలో ఉంటే సహాయం చేసి ఆదుకోమన్నాడు. అంటే సాటి మనిషి పట్ల ఇతడికి ఇంత గౌరవం.. ఈలోకంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా.. అలాంటి వ్యక్తితో ఈరోజు నేను మాట్లాడానా.. అది నా అద్రుష్టం. సూర్య చెప్పినట్లు నేను కూడా ఆపదలో ఉన్నవారికి ఆదుకోకపోతే అతడికి నేను అగౌరవించినట్లే ఇది ఆమె మనసులో మాట. 


రెండురోజుల తర్వాత వనజ ఓ బట్టలు దుకాణంలో బట్టలు కొనటానికి వెళ్ళింది. అక్కడ ఒక మహిళ నిండు గర్భిణీ. దాదాపు డెలివరీ టైం వచ్చినట్లే ఉంది. ఇలాంటి సమయంలో కూడా ఆమె ఎంతో హూందాగా పని చేస్తుంది. అంటే ఆమె కుటుంబ పరిస్థితి బాలేదని అర్థం చేసుకుంది. వెంటనే సూర్య సహాయం గుర్తొచ్చింది. ఒక బాక్స్ ఒక పేపర్ పై ఏదో రాసి ఆమెకు ఇచ్చి వెళ్ళింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో ఆమె తేరుకుని కస్టమర్ వనజ కోసం బయటకు రాగా ఆమె వెళ్ళిపోయింది. కాగితం చూడగా.. ఇలా ఉంది. 


మై డియర్ ఫ్రెండ్ నాకు కష్ట సమయంలో ఒకరు సహాయం చేశారు. ఫలితంగా అతడు నన్ను కూడా ఆపదలో ఉన్నవారికి ఇలాగే సహయపడండని అదే మీరు మాకు ఇచ్చే నిజమైన కృతజ్ణత అని అన్నాడు. అందుకే నీ పరిస్థితి చూసి నీ కుటుంబం డబ్బులు కోసం ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకున్నాను. ఆ బాక్స్ లో కొంత డబ్బు ఉంది దయచేసి స్వీకరించండి అని ఉంది. 


ఇంట్లో సూర్య రవళి డెలివరీ కోసం డబ్బులు లేక బాదపడుతున్నాడు. ఇంతలో రవళి వచ్చి 

" ఎవండీ డెలివరీ కి డబ్బులు లేవనే కదా బాదపడుతున్నారు.. చూడండి డబ్బులు" అన్నది. 


తండ్రి వీరయ్య వచ్చి 

" సూర్య డబ్బులు లేవని ఎందుకురా బాధపడతావ్.. ఇదిగో నా వద్ద కట్టలు ఉన్నాయి "చూపించాడు. ఇంత డబ్బులు తెచ్చిన ఆ ఇద్దరిని ఎలా గౌరవించాలో తెలియక తనలో తానే తెలియకుండా ఆనందపడ్డాడు. 


మనం మంచిగా బతుకుతుంటే.. కష్టాలే కాదు.. దేవుడు కూడా మనకు తోడుంటాడని మనసులో అనుకుంటు రవళి డెలివరీ కి ఏర్పాట్లు చేశాడు. 

**** **** **** **** **** ****

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం




54 views0 comments
bottom of page