top of page

మీ టూ



'Me Too' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 28/05/2024

'మీ టూ' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


సమాజంలో ఏదైనా మంచి జరగాలన్నా.. మంచిని ఆశించాలన్నా.. సమాజాన్ని మంచి మార్గంలో పెట్టాలన్నా.. ఏదైనా ముందు మనతోనే మొదలెట్టాలని పెద్దలు చెప్తుంటారు కదా.. ! 


ప్రతి మనిషి పుట్టుకతో ఎప్పుడూ చెడ్డవాడు కాదు, అలా అని మంచివాడు కాదు. వారి పరిస్థితులు వారిని అలా మారుస్తాయి. కొందరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరికీ హాని తలపెట్టరు. కొందరు తమ పరిస్థితులను తట్టుకోలేక ఇతరుల పొట్ట కొట్టి బతుకుతుంటారు. ఇంకొందరు డబ్బు ఉందనే అహంకారంతో ఇతరులను అవమానిస్తూ, బాధపెడుతూ విర్రవీగుతుంటారు. 


ఈ జగంలో డబ్బుకు లొంగని మనిషి లేడు. డబ్బు వలన, డబ్బు కోసమే అనేకమంది మనిషి, మానవత్వం అనే పేర్లకు మచ్చ తెస్తున్నారు. మరికొందరు అయితే ఎంత డబ్బు ఉన్నా.. సాదాసీదాగా ఉంటారు. 


జగమంత జగంలో దోపిడీలు, దోచుకోవడాలు, డబ్బు కోసం ఒకరిని ఒకరు చంపుకోవడాలు ఇలా ప్రతి మనిషికి ఒక రంగు ఉంది. సమాజంలో చెడుని ఆపలేకపోతున్నారు. కారణం.. ? 

 మేధావుల మౌనం, మంచివాళ్ళు తమ మంచితనాన్ని ఇతరులకు విస్తరింపచేయలేకపోవటం‌‌, ఇతరులకు మోసం చేయకుండా బతికే ధైర్యం లేకపోవటం. 

పైన చాలా రకల మనుషులు గూర్చి విన్నాం. ఇప్పుడు ఓ కొత్త రకమైన వ్యక్తి గూర్చి వినాలి. 


మాధవరావు ఒక వ్యాపారవేత్త. తండ్రి ముకేష్. అతను బతికున్నప్పుడే వ్యాపార మెలుకువలు నేర్చుకుని అతను పోయిన ఏడాదిలోపే దేశంలో నలుమూలలా తన వ్యాపారాన్ని నడిపించే స్థాయికి ఎదిగాడు. ఒక వ్యాపారవేత్తకు సమాజంలో భిన్నమైన వ్యక్తిత్వాలు గల మనుషులు గూర్చి తెలియకపోతుందా.. ? 


పైగా తండ్రి ముకేష్.. మాధవ్ కు గతంలోనే చెప్పాడు. 

"ఈ సమాజం ఎంత చెడ్డదైతే నువ్వు అంత మంచివాడివి కావాలని. అలాగే నీ యొక్క హోదా పెద్దదైతే దానితో అడ్డదిడ్డంగా పోకుండా మంచిని, మంచి మనుషులను కాపాడుకుంటు పోవాలి. అహంకారులను, దుర్మార్గులను నీ హోదాతో ఏరిపారేయా"లని


తండ్రి మాటలే శిరసువహించి ముందుకు నడుస్తు, సమాజాన్ని కూడా మంచి మార్గంలో నడపించటానికి ఒక అడుగు ముందుకు వేసే వారిలో నేను కూడా.. అంటాడు మాధవ్. 


తన వ్యాపారంలోనే కాదు.. ! తన ప్రయాణంలో కూడా సమాజాన్ని గమనిస్తూ ఉంటాడు మాధవ్. 


మాధవ్ ఒకనాడు హైదరాబాద్ మహానగరంలో ఎండ తీవ్రత వలన శీతల పానీయాల కోసం ఒక షాపు లోపలకి వెళ్ళి కూర్చున్నాడు. 


అక్కడ ఓనర్ వెయిటర్స్ పై కేకలు వేస్తున్నాడు. అందులో ముఖ్యంగా ఒక కుర్రాడినే టార్గెట్ చేసుకుని మరీ అరుస్తున్నట్లు ఉన్నాడు. అతడు పేదోడై ఉంటాడు. బాగానే పనిచేస్తున్నా.. పాపం ఓనర్ కేకలకు భయపడి పని వేగంగా చేస్తున్నాడు. 


సరిగ్గా అతడినే మాధవ్ పిలిచి రెండు అప్సరస బాదంలను తీసుకురమ్మని ఆర్డర్ ఇచ్చాడు. ఆ కుర్రాడు వెళ్ళి రెండు నిమిషాల్లోనే వాటిని తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళబోగా

మాధవ్ అతడిని పిలిచి వాటి మూతలను కూడా తీయమన్నాడు. 


మెడలో బంగారు గొలుసు, ఎడమచేతికి వెండి కడియం, చేతి వేళ్ళకి బంగారు ఉంగరాలూ ధరించిన మాధవ్ ని చూసి కిక్కురుమనకుండా మూతలు తీసి వెళ్ళబోగా మరలా మాధవ్ ఆ కుర్రాడిని పిలిచాడు. ఈసారి ఆ కుర్రాడికి కోపం వచ్చినా.. తప్పదన్నట్లు వెనక్కి తిరిగాడు. 


మాధవ్ అతడిని 

"రెండు ఎందుకు తెచ్చావు.. ?” ప్రశ్నించాడు. 


"అదేంటీ సార్.. మీరే తీసుకురమ్మన్నారు" 

బదులిచ్చాడు కుర్రాడు. 

"కదా.. నేను ఒక్కడినే. నాకోసం నువ్వు తెస్తున్నావు కాబట్టి నువ్వు కూడా నాతో కలిసి తాగుతావ్ అని నా డబ్బు పెట్టుకుని నీకు ఇస్తున్నాను" 


"అంటే..”

 

"అంటే ఈ రెండింటిని నువ్వొకటి నేనొకటి తాగలన్నమాట. కూర్చో" అన్నాడు మాధవ్. 


"సారీ సార్, నాకు చాలా పని ఉంది. ఓనర్ ఊరుకోడు" వెళ్ళబోగా

"హే.. ఎవడా ఓనర్? మీరు చేస్తున్న ఈ పని వలన వాడికి మెతుకులు దొరుకుతున్నాయి. అలాంటి మీకు వాడిచ్చే రెస్పెక్ట్ నేను చూశాను. నీకు నేను ఉన్నాను. ఏం భయంలేదు కూర్చో" 


అతను కంటి నుండి వచ్చే కన్నీటి చెమ్మని మాధవ్ కి కనపడకుండా తుడుచుకుని తాగుతున్నాడు. ఓనర్ వచ్చి తిడుతుండగా.. 


"డబ్బు ఉందని విర్రవీగకు. నీ దగ్గర పనిచేసేవాళ్ళనే నువ్వు గౌరవించలేకపోతే ఇంక కస్టమర్స్ కి ఏం గౌరవం ఇస్తావ్.. ? మంచిగా బతకటం రాకపోయినా పర్వాలేదు కానీ మంచివాళ్ళని బతకనీయకుండా చేయకు, కళ్ళు పోతాయి " అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. 


అలా దారి వెంట వెళ్తున్న మాధవ్ కి రోడ్లు పై చెత్త ఊడ్చే ఓ మహిళ ఒక కారులో నుండి ఒక్కొక్కటిగా పడుతున్న చెత్తను సంచిలో వేస్తుంది. అది చూసి అక్కడికి వెళ్ళి ఆమె చేతిలో ఉన్న చెత్త సంచిని తీసుకుని కారులో ఉన్న వ్యక్తి పై పోశాడు. 


వెంటనే కారులో ఉన్న వ్యక్తి కోపంతో బయటకు రాగా.. మాధవ్ వెనుక ఉన్న బలగం అతడిని అణచివేసి తిరిగి కారులోకి తోశారు. ఆ మహిళకు తన వద్ద ఉన్న కొద్ది మొత్తంలో డబ్బులు సహాయం చేసి ముందుకు వెళ్ళాడు. 


మాధవ్ ఒకనాడు తన తోటి వ్యాపారవేత్త కుమారుడు పెళ్ళి కొరకు డిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. విందులో పాల్గొన్నాడు. ఒక మానవతవాదిగా మాధవ్ తోటి వ్యాపారవేత్తలతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఆ భోజనాలను వడ్డించేందుకు పదిమంది కేటరింగ్ బాయ్స్ పనిచేస్తున్నారు. అందులో ఒక కుర్రాడిని చూసి దగ్గరకు పిలిచాడు. 


తన కోసం అప్పుడే వడ్డించిన స్వీట్స్ లో ఒకదానిని అతడికి తినిపించబోయాడు. పనివాడికి అలా తినిపించటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడు తిరస్కరించి దూరంగా వెళ్ళబోయాడు. మాధవ్ నిలబడి మరీ అతడిని పిలవటం, బతిమాలటం మొదలెట్టాడు. 


అది గమనించిన ఆహ్వానాధిపతి మాధవ్ కోరిక మెరకు అతడిని మాధవ్ తో కలిసి భోజనం చేసేందుకు ఆనుమతిచ్చాడు. ఆ పదిమందిలో అతడినే ఎందుకు అలా పిలిచావని తోటి వాళ్ళు మాధవ్ ని అడిగారు. 


"ఒక ఆటోలో గర్భిణీని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అనుకోకుండా అది నిర్మానుష్య ప్రాంతంలో మరమ్మత్తుకు గురైంది. ఆ సమయంలో ఈ కుర్రాడు బైక్ పై వెళ్తు వారి బాధ చూసి ఆటోని ఆసుపత్రి వరకు తోసుకుంటు వెళ్ళాడు. వాళ్ళు ప్రేమతో డబ్బులు ఇవ్వగా తాను సహాయం మాత్రమే చేశానని, డబ్బులు తీసుకుంటే మనశ్శాంతి ఉండదని, మీరు కూడా ఆపదలో ఉన్నవారికి సహాయం చేయండి. అప్పుడు నాకు సహాయం చేసినట్లే అన్నాడు. 


విందుకు వచ్చిన వందలమంది వ్యాపారవేత్తలు ఇంత డబ్బుగల వ్యక్తి తోటి మనిషికి ఎంతో గౌరవం ఇస్తున్నాడని, అందులోను మంచివాళ్ళకి మరింత గౌరవం ఇస్తున్నాడని చప్పట్లు కొట్టగా, చప్పట్లు నాకు కాదని, పేదరికంలో ఉండి డబ్బు గుంజటానికి అవకాశం ఉండి కూడా సహాయం చేశాడు. పొట్ట కొట్టి బతికే ఈ మనుషుల మధ్యలో ఏమీ ఆశించకుండా సహాయం చేశాడు. ఇతడికి చప్పట్లు కొట్టాలని అన్నాడు.

 

ఆ చప్పట్లతో అక్కడ ఉన్న చాలామంది వ్యాపారవేత్తలు కూడా ఉంటే మాధవ్ లా ఉండాలని లేకపోతే, బతుకునకు ఒక అర్థం ఏముందని మనసులో అనుకుంటున్నారు. 


ఎంతో మంచివాడైన మాధవ్ డబ్బున్న సాదారణ మనిషిలా తోటి వారితో కలిసిపోతాడు. రోడ్డు మీద స్నేహితులతో కలిసి టీ తాగుతుండగా దూరంలో ఉన్న ఓ మహిళ నలుగురు వ్యక్తుల దగ్గరకు వెళ్ళి ఏదో అడ్రస్ అడుగుతున్నట్లు గమనించాడు మాధవ్. వాళ్ళు ఆమెకు అడ్రస్ చెప్పటం లేదు. ఆమెకు అల్లరి చేస్తున్నారు. ఒకడు ఆమె ఫోన్ లాక్కున్నాడు. ఇంకొకడు ఆమె పర్స్ తీసుకున్నాడు. దూరం నుండే గమనిస్తున్న మాధవ్ అక్కడికి వచ్చి ఫోన్ పర్స్ తీసుకుని వాళ్ళని కొట్టి తరిమాడు. పర్స్ ఆమె చేతికి ఇస్తు ఓపెన్ చేశాడు. 


చూసి సెల్యూట్ చేస్తూ.. "ఒక పోలీసు ఆఫీసర్ అయి ఉండి వాళ్ళని ఎందుకు ఏమనలే"దని అడిగాడు. 


"ఆపదలో ఉన్న మనుషులను కాపాడేందుకు ఇక్కడ ఉన్న వారిలో ఎంత మంది వస్తారో చూడా”లని చెప్పిందామె. 


"ఒక పోలీసు ఆఫీసుర్ గా సమాజాన్ని మార్చటానికి మీరు ముందుకు వస్తే మీతో పాటే నేను కూడా.. " అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు మాధవ్. 

**** **** **** **** **** ****

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం


47 views1 comment

1 comentário


బాగుంది, చక్కగా రాశారు.

Curtir
bottom of page