నవ సమాజ స్థాపకుడు
- Pitta Govinda Rao
- Apr 19, 2024
- 4 min read

'Nava Samaja Sthapakudu' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 19/04/2024
'నవ సమాజ స్థాపకుడు' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
కొంతమంది ఉంటారు పేదరికంలో పుట్టి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఎలాగైనా అనుకున్నది సాధించి ఈ కష్టాలను దాటాలి, పదిమందికి సహాయ పడాలని. అయితే.. వాళ్ళు అనుకున్నది సాధించడమే ఒక ఎత్తు. ఇంకా.. కష్టాలను దాటడం, పదిమందికి సహాయపడటం మరో ఎత్తు. అంతే కదండి.. ? అనుకున్నవన్ని సాధించడం అంటే అంత ఆషామాషీ కాదు కదా.. ? అలాగే అందరికీ సాధ్యం కాదు కూడాను. గొప్ప గొప్ప గమ్యాలను గుండెల్లో దాచుకుని పరిస్థితులు అనుకూలించక సర్దుకుపోతున్నవారు ఎందరో ఉన్నారు.
జాన్ ఒక యువకుడు, ప్రభుత్వ ఉద్యోగి. తహశీల్దార్ గా ఈమధ్యనే ఉద్యోగంలో చేరాడు. అదేంటో కానీ.. జాన్ వచ్చాక ఆ కార్యాలయంలోనే కాదు ఆ మండలంలోనే చాలా మార్పు వచ్చింది. గతంలో అదే ఆఫీసులో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రోజులు తరబడి తిప్పించుకునే ఉద్యోగులు జాన్ తహశీల్దార్ గా వచ్చాక కిక్కురుమనకుండా ఎప్పటికప్పుడు పని పూర్తి చేస్తున్నారు. అది జాన్ రేంజ్. అంతేనా..
తన ఆఫీసు బయట ఇలా బోర్డు రాసి ఉంచాడు. నాకు ప్రభుత్వం జీతం ఇస్తూ మీకు అవసరాలు, సమస్యలు తీర్చమంది. నాకు కానీ నా కిందిస్థాయి ఉద్యోగులకు కానీ ఎటువంటి పారితోషికాలు, లంచాలు ఇవ్వకుండా మీ పని పూర్తి చేసుకోవచ్చు. ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి ఆఫీసులో ఏ ఉద్యోగి అందుబాటులో లేకున్నా.. లంచాలు అడిగినా నన్ను సంప్రదించండని.
ఇంతటి గొప్ప ఉద్యోగిని మనం చూడగలమా.. ? ఏ ప్రభుత్వ కార్యాలయామైనా.. , ఏ ప్రభుత్వ ఉద్యోగైనా.. వేలకు వేలు జీతాలు తీసుకుని అవనీతి, లంచాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, పసలేని పనితనము షరా మాములే. నిజాయితీ గల మనిషి, నమ్మకం, ఖచ్చితత్వం గల పనితనం ఎక్కడ కూడా ఈరోజుల్లో కనపడవు. అలాంటి సమాజంలో జాన్ తన పనిని నిజాయితీగా చేస్తుండటం విశేషం. జాన్ ఉద్యోగి అయినా.. చాలా సాదారణమైన మనిషిలానే ఉంటాడు. అది మరో విశేషం.
జాన్ ఒక రోజు కళింగపట్నం సముద్రం తీరాన సేదాతీరుతు తిరిగి బయలుదేరుతున్నాడు. అతడు ఒక కారు వద్ద సెల్ఫీ దిగుతున్న ఇద్దరు దంపతులను సమీపించి వారినే తదేకంగా చూస్తున్నాడు. జాన్ చూడ్డానికి పలచబడిన పాత లుంగి, మరియు చొక్కా ధరించి పేదోడిలాగనే ఉన్నాడు, ఆపై అతడి చూపులకు ఆ దంపతులుకు కోపం తెప్పించింది. అయినా సముదాయించుకుని జాన్ ని చూసి బిచ్చగాడు అనుకుని చేతిలో ఐదు రూపాయలు పెట్టారు.
ఊహించని ఈ ఘటనకు షాక్ అయ్యాడు జాన్. తర్వాత తనలో తాను నవ్వుకుని ఆ దంపతులపై జాలితో చూసి కారు తాళాలు చూపుతు కారు ఎక్కుతాడు. అది చూసి వాళ్ళు షాక్ అవ్వటమే కాక బాధపడతారు. ఎందుకంటే.. ? ఆ కారుపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఇంగ్లీషులో ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఇంత సాదాసీదాగా ఉన్నాడని వాళ్ళు అనుకున్నారు. జాన్ మాత్రం వాళ్ళని మనసులో అప్పుడే క్షమించేశాడు.
జాన్ ఒకరోజు తన కార్యాలయంలో స్వీపర్ గా పని చేస్తున్న కామాక్షి అనే ఒంటరి మహిళ యొక్క కూతురుని జిల్లా కేంద్రంలో ఒక కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేర్పించటానికి పాఠశాలకు వెళ్ళాడు. అక్కడ ప్రధానోపాధ్యాయురాలు ఒకరు మొదట బాలికను, సంతకం పెట్టమన్నారు. తర్వాత ఫారం నింపి జాన్ ని సంతకం పెట్టమని చెప్పి అతడి వాలకాన్ని చూసి ప్రధానోపాధ్యాయురాలు పెన్ పక్కనపెట్టి వెలిముద్ర వేసుకునే పరికరాన్ని ఆయన ముందు ఉంచింది. జాన్ దానిని తిరస్కరించి మనసులో నవ్వుకుని పెన్ తో ఇంగ్లీషులో సంతకం పెట్టి ఆమెను మనసులోనే క్షమించి వచ్చాడు. జాన్ ని తక్కువ అంచన వేసినందుకు తానే పశ్చాత్తాపం చెందింది.
జాన్ ఒకనాటి సాయంత్రం ఖరీదైన గేదె పాలను దాదాపు ఇరవై లీటర్లు సైకిల్ పై అటు ఇటు తగిలించుకుని ఒక్కడే వెళ్తున్నాడు. ఆ సమయంలో అటుగా ఇద్దరు యువకులు ఖరీదైన బైక్ పై వెళ్తూ.. జాన్ ని అనుసరిస్తూ జాన్ వాలకాన్ని చూసి అతడి సైకిల్ ని తమ బైక్ ను చూపిస్తూ అవమానించటం మెదలెట్టారు.
అయినా.. ముఖం పై చిన్న చిరునవ్వుతో వాళ్ళని చూసి సైకిల్ తొక్కుకుని పోతుండగా మమ్మల్ని లెక్కచేయకుండా పోతావేంట్రా అని బైక్ పై నుండి సైకిల్ పై పోతున్న జాన్ ని తన్నటంతో జాన్ సైకిల్ తో పాటు కింద పడతాడు. కొన్ని పాలు నేలపాలయ్యాయి. అదృష్టవశాత్తు జాన్ కి దెబ్బలు తగలలేదు కానీ.. సరిగ్గా ఆ సమయంలోనే డిప్యూటీ తహసీల్దార్ మరియు మరికొందరు ఉద్యోగులు రెండు కార్లలో అక్కడకి వచ్చి జాన్ కి సెల్యూట్ చేసి
"సార్ ఇతడి పేరు కోటి. ఇండియన్ ఆర్మీ ఉద్యోగి. ప్రస్తుతం ఇతడి కొడుకునకు ఆరోగ్యం బాలేదు. చెన్నైలో చికిత్స అందిస్తున్నారు. దాదాపు ముప్పై లక్షలు ఖర్చు అవుతుందని డబ్బు చెల్లిస్తామని, పలానా ఏరియాలో ఉంటున్నావని తహసీల్దార్ సంతకంతో కూడిన పత్రం జతచేసి మాకు ఇస్తే చికిత్స అందిస్తామన్నారని తెలిసింది"
విషయం చెప్పగానే పత్రాలు చూసి అక్కడే సంతకం పెట్టి సైకిల్ పైకెత్తి తొక్కుకుంటు వెళ్ళిపోయాడు జాన్.
ఈ తతంగం చూసిన ఆ యువకులు "అతను ఎవరు.. ? మీరు కారులో రావటం ఏంటీ.. ? సైకిల్ పై వెళ్ళే వ్యక్తి సంతకం అడగటం ఏంటీ.. ?” వాళ్ళకి అర్థం కాక ప్రశ్నించారు.
"అతడు పోలాకి మండల తహసీల్దార్. అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. అందులో భాగంగానే రోజు వేకువజామున, సాయంత్రాన గేదెపాలను అనాథాశ్రమానికి, వృద్ధాశ్రమానికి ఉచితంగా సరాఫరా చేస్తుంటాడు. వాటిని తీసుకెళ్ళే వ్యక్తి అనారోగ్యం కారణంగా ఈ పూట రాకపోయే సరికి తానే అతడి వాహనం అయిన సైకిల్ పై తీసుకెళ్తున్నాడు. " వివరించి వెళ్ళిపోయారు వాళ్ళు.
తమ తప్పునకు చాలా బాధపడ్డారు వాళ్ళు. ఎందుకంటే ఆంత గొప్పవాడు ఇంత సింపుల్ గా ఉంటే.. రోజు పొద్దల్లా కూలిపని చేసి సాయంత్రం ఖరీదైన బైక్ పై పట్టణం పోయి ఇరవై రూపాయల పకోడి తినటానికి వెళ్ళే తాము ఇంత బిల్డప్ ఇస్తున్నందుకు. అయినా.. జాన్ వారిని చిరునవ్వుతో క్షమించాడు.
ఇలాంటి సంఘటనలే మరిన్ని జరగటంతో జాన్ జీవితగాథని ఆరా తీశారు ప్రజలు.
ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనుకబడిన జిల్లా అయిన శ్రీకాకుళంలో అందులోను చిట్ట చివరన ఉన్న పోలాకి మండల ప్రాంతంలో పేద కుటుంబం అయినటువంటి ప్రుద్వి షా; దేవికల కుమారుడు జాన్. పేదరికం వలన తండ్రితో కలిసి ఇతరుల ఇంట్లో పాచి పనులు చేస్తూ, ఇతరుల పశువులు మేపటంతో వాళ్ళు ఇచ్చే నెలసరి జీతం, బత్తెంతో జాన్ కుటుంబం నడుస్తుంది. ఆ నడవటంలో, ఆ బత్తెం సంపాదించటంలో కష్టం సంగతి అటు ఉంచితే అవమానాలు, మాట పడటాలే ఎక్కువ.
అయినా.. ! బువ్వ పెడుతున్నందుకు తప్పేది కాదు. అలాంటి కష్టాల నడుమ సాగుతుంది వారి జీవితం. ఒకనాడు తండ్రితో కుల మరియు ఆదాయ ద్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ ఆఫీసుకి వెళ్ళిన జాన్ కి అక్కడ జరిగిన పరిస్థితులు తొలిసారిగా ఆలోచనలో పడేసాయి. ఆనాడే నిర్ణయించుకున్నాడు. ఇక్కడే నేను ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని. ఆ ఆలోచనతో ఆగిపోలేదు. పుస్తకాలు కొనుక్కున్నాడు కానీ.. బడికి పోలేకపోయాడు.
బర్రెలనే పట్టుకుని వెళ్ళి అక్కడే చదువుకుంటూ తండ్రికి సహయపడ్డాడు. అలా అన్ని కష్టాలను ఎదిరించి తహశీల్దార్ ఉద్యోగం పొందాడు. ఉద్యోగం పొందినా.. ఆస్తులు సంపాదించినా.. జాన్ కి ఒక లోటు మిగిలింది. అవన్నీ అనుభవించటానికి తన తల్లిదండ్రులు లేరు.
అలా ఎన్నో అవమానాలు, కష్టాలను ఎదుర్కుని ఈ స్థాయికి వచ్చిన జాన్ ఎంత ఎదిగిన ఒదిగి ఉంటు ఒకరి తప్పులను క్షమిస్తూ.. అందరికీ అందుబాటులో ఉంటు పని చేస్తుండటం గొప్ప విషయమని డబ్బు కోసం ప్రాణం తీసుకునే సమాజంలో జాన్ చేస్తున్న పనికి ఒక కొత్త సమాజం అవిర్బవించక తప్పదని ఆ నవ సమాజ స్థాపకుడు జాన్ అని అతడి జీవిథ గాథ తెలిసిన వారు అందరు అంటారు.
**** **** **** **** **** ****
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Commentaires