'Premaku Prathirupam' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 14/12/2023
'ప్రేమకు ప్రతిరూపం' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
శంకర్ చాలా మొండివాడు మరియు ధైర్యవంతుడని అందరూ అంటుంటారు. వందశాతం నిజం. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. కానీ.. !
వందేళ్లు బతకమని నా తల్లి జన్మనిస్తే నన్నెవడు ఆపేది అన్నట్లు ఉంది శంకర్ పట్టుదల.
శంకర్ తల్లిదండ్రులుకు ఆస్తి లేకపోయినా ఉండటానికి గూడు ఉంది. ఇంకేం.. చిన్నతనం నుండే కష్టపడుతూ సంపాదించటం నేర్చుకున్నాడు.
అయితే తల్లిదండ్రులు లేనివాడు, మంచి విషయాలు చెప్పేవారు దగ్గర లేకపోవడంతో బాగుపడడని అందరూ అనుకుంటుండేవారు.
కానీ శంకర్ మాత్రం తల్లిదండ్రులు లేకపోతే బాధ్యతలు అన్ని చిన్నప్పటి నుండే ఒంటబట్టుకుని అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఒకవైపు పాఠశాల, మరోవైపు ఇంటివద్ద చదువు, ఇంకోవైపు ఏదో ఒక పని.. ఇలా శంకర్ తన జీవితాన్ని చిన్నప్పటి నుండే పునాది వేసుకున్నాడు.
అందరి పిల్లలల్లాగానే ఉంటు తల్లిదండ్రులు లేరనే బాధని కళ్ళల్లో కూడా కనపడకుండా బతుకుతున్నాడు.
అతడి జీవత గాథ తెలిసిన ఒక మంచి లక్షణాలు ఉన్న స్నేహితుడు లక్మణ్, శంకర్ తో జతకట్టాడు. ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు.
బాధపడాల్సిన విషయం ఏంటంటే..
అతడికి కూడా తల్లిదండ్రులు లేరు. ఒక్కడే నివసిస్తున్నాడు. పైగా శంకర్ కంటే రెండేళ్ళు పెద్దవాడు. అయినా ఏనాడు పెద్దవాడిలా ఉండలేదు. ఇద్దరు స్నేహితుల్లానే ఉన్నారు. ఇద్దరి నివాసాలు దూరం వ్యవధి తక్కువగానే ఉండటంతో ఒకరోజు శంకర్ ఇంట్లో, మరో రోజు లక్మణ్ ఇంట్లో నిద్రిస్తు.. అలా చదువులో శంకర్ కి తనకు తెలిసిన విషయాలు చెబుతు కాలేజీలోకి అడుగుపెట్టారు.
ఇక ఇద్దరు గతాలన్ని మరచి కొత్తగా ఆలోచిస్తు కాలేజీ విద్యను అభ్యసిస్తు అందరిలాగే ప్రేమలో పడ్డారు.
అయితే స్కూల్ స్థాయి నుండే అలేఖ్య అనే అమ్మాయి ని ప్రేమిస్తున్న విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు శంకర్. ప్రాణ స్నేహితుడుగా వెన్నంటే ఉన్న లక్మణ్ కి విషయం చెప్పాడు.
అతడు కూడా "ప్రేమించటం తప్పు కాదు. ఇప్పుడు ప్రేమించకపోతే వయసు అయిపోయాక ప్రేమిస్తారా.. అయితే ప్రేమే గొప్ప కాదు. అన్ని విషయాల్లో ముందు ఉండా"లని చెప్పాడు.
అలా ఒకవైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తు మరోవైపు చదువు కొనసాగించేవారు. మరోవైపు ప్రేమ అంటు చెట్టపట్టలేసుకుని తిరిగేవారు.
లక్మణ్ ఏమో.. కానీ..
శంకర్ ది ట్రూలవ్ మరియు చాలా ఏళ్ళు నుండి. అందువలన అలేఖ్య అంటే శంకర్ కి పిచ్చి, అదే ప్రేమ అవతలవైపు అలేఖ్య కూడా. ఈ కారణంతో శంకర్ ఎలాగైనా ఒక ఉద్యోగం కొట్టాలని, అందులోను తనకు ఇష్టమైన పోలీసు ఉద్యోగం కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఉద్యోగం కొట్టే విషయంలోను శంకర్ మొండితనం వీడలేదు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా భయపడలేదు. ఎందుకంటే శంకర్ చాలా తెలివైనవాడు. అతడు ఫెయిల్ అయిన తీరు అతడికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందనే నమ్మకం కల్గించింది.
ఇదిలా ఉంటే అలేఖ్య పెళ్ళి విషయం తమ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తే ఏ తలనొప్పి ఉండదని శంకర్ కి చెప్పింది.
దీంతో అలేఖ్య ఇంటికి వెళ్ళాడు శంకర్.
"నమస్కారమండి, నా పేరు శంకర్. అలేఖ్య క్లాస్ మెట్ ని " పరిచయం చేసుకున్నాడు శంకర్.
"హో.. అలాగా, ఏంటీ సంగతి " అలేఖ్య తండ్రి రామయ్య అడిగాడు.
అలేఖ్య ఓ గదిలో నుండి తొంగి చూస్తుంది.
"మరీ.. ఏం లేదండి.. నేను మీ అమ్మాయిని ప్రేమించాను. మీరు అనుమతిస్తే పెళ్లి చేసుకుందామని " అన్నాడు శంకర్.
ఆ మాటకు శంకర్ తండ్రి రామయ్య అలేఖ్య వైపు చూశాడు.
"ఏంటి సార్ అటు చూస్తున్నారు.. ఆలోచింటానికి ఏముంది" అన్నాడు శంకర్.
చిర్రెత్తుకొచ్చిన రామయ్య "చక్కగా చదువుకుంటున్న పిల్లని ప్రేమలోకి పెట్టి నాశనం చేస్తుంది చాలకా పెళ్ళి అంటు ఇంటికి వస్తావా " అంటు చెంప చెళ్లుమనిపించాడు.
"సార్! నేను నాశనం చేసేవాడిని అయితే మీకు చెప్పకుండా కూడా పెళ్ళి చేసుకోగలను సార్.. కానీ తల్లిదండ్రులను ఒప్పించి చేసుకునే పెళ్ళి నా దృష్టిలో గొప్పది " సముదాయించాడు శంకర్.
"సరే, ఇంతకీ నువ్వు ఏం చేస్తుంటావ్ " అడిగాడు రామయ్య.
" ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను. మీరు పెళ్ళికి ఒప్పుకుంటే ఖచ్చితంగా అప్పటికి ఉద్యోగం వస్తుంది" అన్నాడు శంకర్.
"చాల్లేరా నీ మాయమాటలు.ముందు బయటకు నడువు" అంటు చొక్కా పట్టుకుని బయటకు నెట్టేశాడు. అడ్డుకోవటానికి వచ్చిన అలేఖ్య ని తల్లి రాధిక కొట్టసాగింది.
శంకర్ ని బయటకు ఈడ్చి అందరిని పిలిచి మరీ కొట్టించాడు రామయ్య.
మందే తాగని శంకర్ ఆ రాత్రి ఇంట్లో మందు తాగుతూ బిగ్గరగా ఏడుస్తుండగా.. లక్మణ్ వచ్చి ప్రశ్నించాడు.
"అరేయ్ మామ, ప్రేమని ఎవడు కనిపెట్టాడో కానీ.. దండేసి దండం పెట్టాలిరా. చావనివ్వదు, బతకనివ్వదు. బతికే ఉంటాం, లోకాన్ని చూడం. " అంటూ ఏడుస్తాడు శంకర్.
"బాధపడకు రా. నీ ప్రేమ గూర్చి నాకు, అలేఖ్య కి, నీకు, దేవుడికే తెలుసు. నువ్వు ప్రేమకి ప్రతిరూపం రా హ.. " బాధగా శంకర్ ని తన గుండెకి ఆన్చి ఓదార్చాడు లక్మణ్.
అలా కాలం మందుకు వెళ్ళి రెండేళ్ళు పూర్తి చేసుకోగా..
శంకర్ పోలీసు యూనిఫామ్ లో ఏదో పనిమీద గోదావరి బ్రిడ్జి పై నుండి వెళ్తున్నాడు. అతడి బైక్ వేగంగా పరుగులు తీస్తుంది. ఇంతలో అతడి కళ్ళు అవతల లైన్ లో బ్రిడ్జి వద్ద నదిలోకి దూకటానికి సిద్దంగా ఉన్న వృద్ధ దంపతులు పై పడింది. వెంటనే సడన్ బ్రేక్ వేసి చూసి హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. శంకర్ వాళ్ళని గుర్తు పట్టాడు. శంకర్ ని చూడగానే ఎక్కడో చూసినట్టు ఉన్నా గుర్తు పట్టలేక అలా చూస్తూ..
"బాబు.. నువ్వూ.. !!” ప్రశ్నించాడు రామయ్య.
"నేనంకుల్.. అలేఖ్య ని ప్రేమించానని వస్తే నన్ను కొట్టి బయటకు గెంటేశారు కదా, శంకర్ ని " అన్నాడు.
"బాబు శంకర్, నన్ను క్షమించు బాబు. ఎంత అవమానించినా మమ్మల్ని ఆప్యాయంగా పలకరించావు. ప్రేమకి ప్రతిరూపం నువ్వే బాబు " కంటతడి పెట్టాడు రామయ్య.
"పర్వాలేదులే అంకుల్. అది వదిలేయండి. ఇంతకీ..
మీరు ఏంటీ ఇక్కడ. ?” ప్రశ్నించాడు శంకర్.
"చచ్చిపోదామని వచ్చాం బాబు"
"చాల్లే ఊరుకోండీ. మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను. నాకు తల్లిదండ్రులు లేరు. మిమ్మల్ని చూసుకోవటం నాకు కష్టం ఏమి కాదు. ఇంతకీ ఎందుకు చనిపోదా మనుకుంటున్నారు.. ? ఏమైంది.. ?” అడిగాడు శంకర్.
"నీ మీద కోపంతో అలేఖ్యని ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశాను బాబు. అంతే.. కట్నం కోసం వేధిస్తూ నా దగ్గర అంతా ఊడ్చేశాడు బాబు. ఇంకా డబ్బు కోసం వేధిస్తూ డబ్బు తీసుకురాకపోతే తిండి పెట్టేది లేదు అన్నాడని ఏడుస్తూ చెప్పింది బాబు. నా కూతురు మాటలు విని డబ్బు పంపటానికి నా వద్ద గోచి గుడ్ఠ తప్ప ఇంకేం లేవు బాబు. అందుకే కూతురు బాద చూడలేక..” కన్నీరు పెట్టుకున్నాడు రామయ్య.
ఆ మాటలకు అలేఖ్యని తలుచుకుని కనపడకుండా కన్నీరు కార్చాడు శంకర్.
"ఓస్ ఇంతే కదా.. ఇక ఈ సమస్యలు అన్ని నాకు వదిలేయండి.. నేను చూసుకుంటా. దయచేసి మీరు చనిపోదామనుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకుని నాతో రండి" అని తన బైక్ ఎక్కించుకుని పట్టణంలో ఒక ఏటీయం వద్ద ఆపి కొంత నగదు తీసుకుని, లక్మణ్ ని వెంట తీసుకుని అలేఖ్య ఇంటికి వెళ్ళాడు శంకర్.
కాలింగ్ బెల్ కొట్టగా చింపిరి జుట్టు జిడ్డు ముఖంతో పాతబడిన చీర కట్టుకుని తలుపు తీసింది అలేఖ్య.
శంకర్ ని పోలీసు యూనిఫామ్ లో చూసి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది.
శంకర్ కూడా ఓకింత భావోద్వేగానికి గురై స్థిమితపడి రాధికా, రామయ్యలను లోపలికి తీసుకెళ్ళి సోఫా పై దర్జాగా కూర్చున్న అలేఖ్య భర్త దగ్గరకు వెళ్ళి డబ్బులు ఇస్తూ..
"ఇదిగో ఈ డబ్బులు తీసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని కట్టుకున్నదానిని బాగా చూసుకో. లేకపోతే మక్కలు ఇరగదన్ని సెల్ లో పడేస్తా. ఏం.. పెళ్ళంటే తమాషాగా ఉందా.. జాగ్రత్త” అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.
దెబ్బకి భయపడి దిగివచ్చిన అలేఖ్య భర్త, క్షమించమని వేడుకుని రామయ్య వద్ద తీసుకున్న ఆస్తి, డబ్బు తిరిగి ఇచ్చి అలేఖ్యని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చాడు. దీంతో అలేఖ్య, రామయ్య, రాధికాల ముఖాల్లో నవ్వులు విరబూయగా మనసులో మోయలేనంత భారంతో అలేఖ్య గత జ్ణాపకాలతో మనసు తడుస్తుంటే దుఃఖం దిగమింగి మారు మాట్లాడకుండా వెనుదిరిగాడు శంకర్.
కొందరు పెద్దలు ఉంటారు ముందు వెనుక ఆలోచించకుండా ఏదో ఆవేశాలతో పరువు, ప్రతిష్టలు అంటూ పిల్లలు జీవితాలు తమకు తెలియకుండా తామే నాశనం చేస్తారు.
పెద్దలు కుదిర్చే పెళ్ళి అయితే మాత్రం కూలిపోవటం లేదా.. పిల్లల ప్రేమని అర్ధం చేసుకోవటంలో తప్పులేదు కదా..
పాపం అలేఖ్య జీవితం ప్రస్తుతం కుదుటపడినా.. శంకర్ లేని తన జీవితం ఎంత వరకు ఆనందంగా ఉంటుందో తెలియదు.
శంకర్ విషయం అయితే దారుణం..
కోరుకున్న ఉద్యోగం వచ్చిందని దానికి న్యాయం చేయవల్సి రావటంతో ఆగిపోయాడు కానీ.. కోరుకున్న అమ్మాయి రానందుకు ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడు.
ప్రస్తుతం ప్రేమకు చిహ్నంగా ఉండే శంకర్ బతికున్నాడే కానీ.. తన మనసులో తాను ఎప్పుడో చనిపోయి ఉంటాడు. అది నిజం.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments