top of page

ప్రిస్క్రిప్షన్



'Prescription' - New Telugu Story Written By Susmitha Ramana Murthy

Published In manatelugukathalu.com On 19/01/2024

'ప్రిస్క్రిప్షన్' తెలుగు కథ

రచన : సుస్మితా రమణ మూర్తి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“అమ్మా! మంజులా!... గేస్ కట్టేసావా? “

“కట్టేసాను మావయ్యా!“ 

“రెగ్యులేటర్ని సిలిండర్నుంచి వేరు చేసావా? “

“రెగ్యులేటర్నాబ్ ఆఫ్ చేసాను “

 “ట్యూబుకి డేట్అయిపోయింది. మెకానిక్ కి   ఫోన్చేసాను. ఈలోగా గేస్లీకైతే  ప్రమాదం  కదా?”

“ఆ విషయం నాకు తెలియదండీ! మీ అబ్బాయికి  చెబుతాను “

“ఈ మాత్రందానికి అబ్బాయెందుకూ?... నేను లేనూ?... పదమ్మా! రెగ్యలేటరు వేరు చేస్తాను. నీవు చూద్దువుగాని “

 ****

“మావయ్య గారికిఈమధ్యమరీ చాదస్తం పెరిగి పోయిందండీ!  ట్యూబు మార్చేదాకా, ప్రతిసారీ రెగ్యులేటర్ని సిలిండర్నుంచి వేరుచేయిస్తూ ఎంత హడావుడి చేస్తున్నారని!?.. ”

“ వారిది చాదస్తమైనామనందరి   భద్రతకేగా? “

“ అర్ధ రాత్రి లేచి లైట్లు ఆపామా, లేదాని చూస్తుంటారండీ!.. అన్ని టేప్ లు బంద్చేసామా లేదాని కూడా తనికీ చేస్తుంటారు. వీధితలుపు గెడలు సరిగ్గా పెట్టామా లేదాని కూడా చూస్తున్నారు!... అత్తయ్య గారు— మీకెందుకండీ అవన్నీ? వారేమీచిన్న పిల్లలుకాదు. అన్నీ

వారే చూసుకుంటారు. మీరు ప్రశాంతంగా నిద్రపోండని అంటున్నా వినటంలేదు. ఈ వయసులోవారికివన్నీ అవసరమా చెప్పండి! “

 “పెద్ద వారందరూఅలానేఉంటారు. క్రమశిక్షణకు, భద్రతకు ప్రాణం పెడతారు “

“మానాన్న గారు, ఎదురింటిపెద్దాయన , మావయ్య గారిలా లేరు . చక్కగా తమపని మాత్రమే చూసుకుంటూ హాయిగా ఉంటున్నారు “

“వారి చర్యల్ని భూతద్దంలోంచి చూడకుంటే మనకే మంచిది“

 “నేను మీలా సరిపెట్టుకోలేనండీ! మనం వేరే 

 వెళ్ళిపోదామండీ! “

“కొన్నాళ్ళు ఓపికపట్టవే!... త్వరలో అమెరికాకి 

 వెళ్ళిపోతాంకదా? “

“అక్కడైనా వీరితోఇబ్బందేకదా? “

“డాడీ, మమ్మీ వేరేదేశం కిరమ్మన్నా రారు .  నీవు నిశ్చింతగా ఉండొచ్చు “

 “అయిత సరేనండీ ! “

 ****

“ ఏరా సురేష్!... మేమొచ్చి మూడు వారాలు కావస్తోంది. ఇప్పటికి తీరుబడి అయిందా మమ్మల్ని చూడ్డానికి?... ”

 “ వెంటనే రావాలనే అనుకున్నారా శేఖర్! ఇంటి సమస్యతో రాలేకపోయాను “

“ ఇంటి సమస్యేఁవిట్రా!?... నీది స్వంతిల్లే కదా?”

”స్వంతిల్లేరా! మాఆఫీసుకి బాగా దూరమని అద్దెకిచ్చేసి, మేము ఆఫీసుకి దగ్గరలో అద్దెకు ఉంటున్నాం. మూడు నెలల నుంచి ఓనర్ ఇల్లు ఖాలీ చేయమంటున్నాడు “ 

“ ఓఁ!... అదే నీ సమస్య అయితే, నా సలహా పాటిస్తే 

 నీ సమస్యకు పరిష్కారం, నాకు కాస్త ఊరట లభిస్తాయి “

“నాసమస్యపరిష్కారమైతే, నీకు ఊరటా!?... ”

“అవున్రా. అదంతే!... మమ్మీ, డాడీలను అప్పట్లోనే మాతో అమెరికా వచ్చేయమంటే వినలేదు. ఈ మధ్య మమ్మీ పోపడంతో, డాడీ  బాగా డల్ అయారు. కార్యక్రమాలన్నీ  అయిపోయాయి. వారిని మాతో రమ్మంటే మా మాట వినటం లేదు. జన్మభూమి కన్నతల్లని, పరాయిదేశం రానంటున్నారు”

“ మీడాడీయే కాదు. పెద్దవారందరి ఆలోచన అలానే ఉంటుంది. మనం చేసేదేమీ లేదు”. 

“ఈ ఇల్లువారుతనకు నచ్చినవిధంగా దగ్గరుండి కట్టించుకున్నారు”

“అందరిలాన వారూ చేసారు?... కాకుంటే నీ చదువు, పెళ్ళి. …అన్ని శుభకార్యాలు ఈ ఇంట్లోనే అయ్యాయి  కనుక వారి నమ్మకాన్నిసెంటిమెంటుని కొట్టిపారేయలేం “

“అలాని ఒక్కరినీ వదిలేసి మేము వెళ్ళిపోలేం కదా?... ఏదైనా ఆశ్రమంలో ఉంచుదామన్నా వారికి ఇష్టంలేదు “

“అవును. వారికి నచ్చనిపని  చేయలేం!”

“అద్దె కొంపల వెతుకులాట మానేసి, హాయిగా  మా ఇంట్లోకి వచ్చేయండి. విశాలమైన ఈ ఇంటిలో ఒకగదిలో డాడీ, మిగతా మూడు గదుల్లో మీరు  ఉండొచ్చు “

“.....”

“ ఏఁవిటలా సైలెంట్ అయిపోయావ్!?... “

“నా సమస్య ఇంత సులభంగా పరిష్కారం అవుతున్నందుకు ఆశ్చర్య పోతున్నారా! స్నేహానికి నీవిస్తున్న విలువకు హేట్సాప్రా! త్వరలో మీఇంట్లోకి వచ్చేస్తాం . అద్దె విషయం గురించి ఓ మాట అనుకుంటే.. “

“అద్దెగురించి ఆలోచన వద్దురా!... మన స్నేహబంధాన్ని డబ్బుతో ముడిపెట్టలేను “

“ అంటే!?... ”

“నిస్సంకోచంగా మీరు అద్దెప్రసక్తి లేకుండా, మా ఇంట్లో ఉండొచ్చు. డాడీ మాతో రావడానికి సుముఖంగా లేరు కాబట్టి, వారి పూర్తి బాధ్యత నీవ తీసుకోవాలి “

“ డాడీ విషయంలో నీవేమీ దిగులు చెందాల్సిన పనిలేదు. వారి పూర్తి బాధ్యతతో బాటు, ఇంటి సంరక్షణకూడా నేనే చూసుకుంటాను. మీరు హాయిగా అమెరికాకు వెళ్ళిపోవచ్చు. 

వారి క్షేమసమాచారాలు ఎప్పటికప్పుడు  నీకు తెలియజేస్తుంటాను “

“హమ్మయ్య!... కొండంత ధైర్యం వచ్చిందిరా! “

“ నాకూ అంతేరా! “

****

“ ఏఁవండీ! మనఇంట్లోకి వెళ్ళిపోదామండీ! ఆఫీసుకి  దూరమైనా, ఇప్పటి మీ ఆఫీసర్ హోదాకి  కారు ఎలవెన్సుఉంది కదా? దర్జాగా ఆఫీసుకి మన కారులో వెళ్ళి రావచ్చు “ 

“నీవన్నదె నిజమే! అయినా ఈఇల్లు మనకు ఎంతోసౌకర్యంగా ఉంది కదా?... “

“ఆ ముసలాడికి  సేవలు  చేయడం ఇకనావల్ల కాదండీ!  ఎప్పుడూఏవేవో చాదస్తపు మాటలు అంటుంటారు. ఏ పనైనా తనకు నచ్చిన విధంగానే చేయాలంటారు. మన ఇష్టాలు చంపుకుని, వారు చెప్పిన విధంగా నడుచుకోవాలా?... మూడేళ్ళనుంచి భరిస్తున్నాను. ఇక నావల్ల కాదు. వెంటనే  మీ మిత్రుడికి చెప్పేయండి. మన ఇంట్లోకివెళ్ళిపోతామని “

“ అలాగే! ఒక విషయం చెబుతాను  విను. వివరాలైతే తెలియవు గాని, మావాడు వచ్చేనెలలో వచ్చేస్తున్నాడు. అంతదాకా మనం ఉండకతప్పదు“

“మంచి మాట చెప్పారండీ! మీ మిత్రుడు రాగానే వెళ్ళిపోదాం. మనింటిలో ఉన్న వారికి వెంటనే ఖాలీ  చేయమని చెప్పేయండి “

“ఈరోజేచెబుతాను “

****

“ ఏఁవిట్రా!?... ఈ సమయంలో ఫోన్జేసావ్?... పిల్లలు, కోడలు బాగున్నారా? నీ ఆరోగ్యం బాగుందా?”

“అందరం బాగున్నాం డాడీ! ఒకముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేసాను. ఇక్కడ మాకంపెనీ పరిస్థితి ఏమీ బాగు లేదు. నాఉద్యోగం నేడో, రేపో ఊడేలా ఉంది. అందుకే మేము త్వరలో మన హైదరాబాదు వచ్చేస్తాం. బెంగుళూరులో సెటిల్  అవుతాను. అక్కడ ఓ ఆఫర్కూడా  ఉంది. జీతం ఇక్కడంత కాకున్నా, ఇండియాలో ఆ పేకేజ్ తక్కువేమీకాదు“

“ చాలా సంతోషంరా! ఎంతో అనుభవం, మంచి చదువు ఉన్ననీకు మంచి ఉద్యోగం ఎక్కడైనాదొరుకుతుంది. మరో ఆలోచన లేకుండా వెంటనే  వచ్చేయండి “

“ అలాగే డాడీ!”

****

“ డాక్టర్ గారూ! డాడీ ఆరోగ్యం బాగుంది కదా?... 

గాభరా పడాల్సిందేమీ లేదు కదా? “

“ మీరు  బెంగుళూరులో సెటిల్  అవ్వాలనుకోవడం వారిని మానసికంగా కృంగదీసింది. వారి ఆరోగ్యం పూర్తిగా మీచేతుల్లోనే  ఉంది “

వివరంగా చెప్పండి సార్! “

“డాడీ నిద్ర పోతున్నప్పుడు, తెరచివున్న వారి డైరీలోని  చివరి పేజీలు అనుకోకుండా చూడ్డం జరిగింది. వారు మానసికంగా బాధపడుతున్నారు. ఆ డైరీ ఇదే! చివరి పేజీలు  చూడండి. మీడాడీ మానసికస్థితి ఎలావుందో తెలుస్తుంది”

“ అలాగే డాక్టర్ గారూ!... ఈ పేజీలేనా?... ”

“ అవును!ఆ పేజీలే! .. 

“నాకు అన్నీ ఎక్కువే  -  దగ్గరనుంచి చదవండి. డాడీ నిద్ర పోతున్నారు. లేపకండి”

“ అలాగే సార్!... 

“నాకుఅన్నీ ఎక్కువే!... విశాలమైన ఇల్లుంది. 

 గాలి, వెలుతురు  నన్నెప్పుడూ పలకరించే మిత్రులు!... 

 కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు ఇప్పుడు స్వదేశంలోనే ఉన్నా, ఎప్పుడైనా ఫోన్లో మాత్రమే పలకరించే ఆత్మీయులు!... 

అందరూ ఉన్నా ఎవరికీ అవసరం లేని ఒంటరిని!... 

రాత్రిపూట ఏ కాస్తఇబ్బంది పడినా--

 ‘మీకేమీకాదు ‘ అనే ఆత్మీయతా పలకరింపుకి, 

కర స్పర్శకు తహతహలాడుతున్న  వాడిని!... 

రేపటి గురించి దిగులు లేదు. 

ప్రశాంత జీవనం కోసం ఓ స్నేహహస్తం, 

మాట సాయం, ప్రేమ పూరితమైన పలకరింపు, 

చిరునవ్వుకోసం పరితపిస్తున్న వాడిని!... 

కష్ట కాలంలో  నన్నుపలకరించే నావారికోసం నిరంతరంఎదురు చూస్తున్నఅభాగ్య జీవిని!…”

“డాక్టర్ గారూ! డాడీ మాకోసం ఆలోచిస్తూ, ఆరోగ్యం  పాడుచేసుకున్నారని అర్థం అయింది. 

ఇకమీదట జాగ్రత్తగా ఉంటాం. వారు త్వరగా కోలుకోవడానికి మంచిమందులు రాయండి”

“వారి మనోభావాలు తెలుసుకున్న తర్వాత కూడా ప్రిస్క్రిప్షన్ కావాలంటే తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు వాడుతున్నమందులకంటే ఇవి  చాలా చాలా అవసరం. నేను చెప్పినట్లు చేస్తే మంచిఫలితం తప్పక ఉంటుంది. ఇదే నా ప్రిస్క్రిప్షన్ తీసుకోండి”

“ వాట్సాప్, ఫేస్బుక్, పాతమిత్రులతో  కాలక్షేపం 

కుటుంబ సభ్యుల ఆత్మీయత... ఇదేఁవిటిడాక్టర్

గారూ!?... ”

“ఆశ్చర్యపోకండి. ప్రస్తుతం మీడాడీకి  కావాల్సినవి 

 అవే!... ఇప్పుడు వారి  మానసిక స్థితికి, చరమాంకపు సుఖ జీవనం అవసరం. అందుకు ఈ  ప్రిస్కిప్షనే సరైనది” 

 “ అర్థంకాలేదు సార్! “

 “ డాడీని ఏదైనా వాట్సాప్గ్రూపులో చేర్చండి. 

 ఫేస్ బుక్కులో – మిత్రులారా నేనిక్కడ, మీరెక్కడ అంటూ డాడీపోటోను  ఫోన్నెంబరు పెట్టండి. ఎక్కడెక్కడో ఉండే పాతమిత్రులు తప్పక పలకరిస్తారు. అలానే దిన పత్రికలలో ప్రకటించండి. 

సీనియర్ సిటిజన్స్ క్లబ్బులో చేర్చండి. ఆహ్లాదకరమైన ప్రాంతాలకు తీసుకు వెళ్ళండి. ఒక్కరినీ వదిలేయకండి. కుటుంబంలోని అందరూ వారితో ఆత్మీయంగా మెలగండి. ఈ విధంగా చేస్తే, వారిలో  చోటుచేసుకున్న ఒంటరివాడినన్న  భావం తగ్గుతుంది. మీరిక్కడికి వచ్చి సెటిలైతే, ప్రేమాభిమానాలతో చూసుకుంటే, వారికి పూర్తి ఆరోగ్యంచే కూరుతుంది. నా బెస్ట్ సలహా, ప్రిస్కిప్షన్ఇదే! “

 “అర్థమైంది డాక్టర్ గారూ! మేమందరం బెంగుళూరు  నుంచి వెంటనే ఇక్కడకు వచ్చేస్తాం. దగ్గరుండి వారిని ప్రేమాభిమానాలతో చూసుకుంటాం. అమూల్యమైన మీ సలహా, ప్రిస్క్రిప్షన్తప్పక అందరం  అమలు చేస్తాం!“

 / సమాప్తం /

################## ######### 

సుస్మితా రమణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి

కలం పేరు : సుస్మితా రమణ మూర్తి

పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.

విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.

కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.

బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో

      మీ సుస్మితా రమణ మూర్తి.























Komentarze


bottom of page