top of page

పుట్టినరోజు కానుక


'Puttinaroju Kanuka' New Telugu Story


Written By Lanka Sankara Narayana


రచన: లంకా శంకర నారాయణ


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

సమయం మధ్యాహ్నం గం. 2.00 అవుతోంది. శ్రీవిద్యని స్కూల్ నుంచీ తీసుకురావటానికి స్కూటర్ తీసుకుని బయలుదేరాను.


ఇంతకీ శ్రీవిద్య ఎవరో మీకు తెలీదు కదా, నా మనవరాలు. ఇప్పుడు దానికి 5 ఏళ్ళు. మా ఇంటి దగ్గర స్కూల్లో ఒకటవ తరగతి చదువుతోంది.


నేను స్కూల్ దగ్గరకు వెళ్ళే సరికి అప్పుడే పిల్లలను బయటకు పంపిస్తున్నారు.

నేను వెళ్ళి గేటు దగ్గర నిలబడగానే మా శ్రీవిద్య రోజూలాగే పరిగెత్తుకుంటూ వచ్చి నా మెడ చుట్టూ చేతులు వేసి నన్ను గట్టిగా హత్తుకుని వదిలిపెట్టింది.


నేను దాని స్కూల్ బ్యాగు, లంచి బ్యాగు తీసుకుని దాని చెయ్యి పట్టుకుని నా స్కూటర్ దగ్గరకు తీసుకువచ్చా.

అప్పుడు అది “తాతా! ఇవాళ మా క్లాస్ లొ శ్రీకర్ పుట్టినరోజు” అని జేబులొనుంచి ఒక చాక్లెట్ తీసి నా చేతిలో పెట్టింది.

నేను చాక్లెట్ కవర్ తీసి దాని నోట్లో పెడుతుండగా “అదిగో.. వాడే తాతా శ్రీకర్” అంది.


నేను తల తిప్పి అది చూపించిన వైపు చూసా.

ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకుని వస్తూ కనిపించాడు.

వాళ్ళిద్దరూ మా దగ్గరకు రాగానే శ్రీకర్ వాళ్ళమ్మతో “అమ్మా! శ్రీవిద్య వాళ్ళ తాతకు కూడా ఒక చాక్లెట్ ఇస్తా” అని బ్యాగులొ నుంచి ఒక చాక్లెట్ తీసి నా దగ్గరకు వచ్చి "అంకుల్" అని ఏదొ చెప్పబోయాడు.


నేను “అంకుల్ ఏమిటిరా.. ‘తాతా’ అని పిలువు” అన్నా.

అప్పుడు వాడు “ఇవాళ నా పుట్టిన రోజు తాతా” అని చాక్లెట్ నా చేతిలో పెట్టాడు.


నేను 'హ్యపీ బర్త్ డే' నాన్నా అని చెప్పి జేబులొ నుంచి ఒక 500 రూపాయల నోటు తీసి వాడి చేతిలొ పెట్టబోయా.

వెంటనే వాడు “నాకు వద్దు తాతా” అన్నాడు.


“వద్దా.. మరి ఏమికావాలి రా?” అన్నా.

“మరి.. మరి..” అని మొహమాట పడుతున్నాడు.

“చెప్పు నాన్నా! ఏంకావాలి?” అన్నా.


“మరి స్కూల్ అయిపొగానే శ్రీవిద్య పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను 'హగ్' చేసుకుంటుందే.. అలా ఒకసారి నిన్ను 'హగ్' చేసుకోనా” అన్నాడు.


ఏమిటీ విచిత్రమైన కోరిక! నాకు ఏమి సమాధానం చెప్పాలో తెలీలా.

పొనీ పుట్టిన రోజు కదా, వాడి కోరిక తీర్చేస్తే పోలా.. అనుకున్నా.

ఒకసారి తల తిప్పి శ్రీవిద్య వంక చూసా.

అప్పటికే అది కోపంగా అటు తిరిగి కూర్చుంది.

చిన్న పిల్లల మనస్తత్వం చాలా చిత్రంగా ఉంటుంది. నాది అనుకున్న దాన్ని ఎవరితో పంచుకోవటానికి వాళ్ళు ఇష్ట పడరు.


నేను శ్రీవిద్య వంక తిరిగి “కన్నా! ఇవాళ వాడి పుట్టినరోజు కదా.. వాడు అడిగింది ఇస్తే బాగుంటుంది కదా” అన్నా.

“సరే. అయితే ఒక్కసారే” అంది.


నేను శ్రీకర్ ని దగ్గరకు తీసుకుని వాడి తల, వీపు నిమిరి వాడి నుదిటి మీద ముద్దు పెట్టుకుని ఒక 500 రూపాయల నోటు వాడి జేబులొ పెట్టా.


వాడి కళ్ళళ్ళో ఎంతో ఆనందం.

వాడు శ్రీవిద్యతొ మాట్లాడుతూ ఉంటే నేను పది అడుగుల దూరంలొ ఉన్న శ్రీకర్ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి

“అమ్మా, శ్రీకర్ కి తాత మామ్మ లేరా?” అని అడిగా.


దానికావిడ “ఉన్నారండి” అంది.


“అయితే ఈఊళ్ళొ ఉండరేమో” అన్నా.


“లేదండి. ఈఊళ్ళొనే ఉంటారు” అంది.


“మరి మీ ఇంట్లో కాకుండా విడిగా ఉంటారేమో”అన్నా.


“లేదండి. వాళ్ళు వృద్దాశ్రమంలొ ఉంటారు” అంది

“వృద్దాశ్రమంలొనా? ఎందుకు” అన్నా.


“దానికి కొంతవరకూ నేనే కారణమండి. ఇంట్లొ పెద్దవాళ్ళు ఉంటే పిల్లవాడిని గారాబం చేస్తారని దాని వల్ల పిల్లవాడు సరిగా చదవడనుకుని పంపించానండి. కానీ పిల్లలు బాగా చదవాలంటే వాళ్ళ మనస్సు సంతోషంగా ఉండాలని, ఆ సంతోషం పెద్దవాళ్ళ ప్రేమవల్లే లభిస్తుందని మిమ్మల్ని, మీ మనవరాలిని చూసి తెలుసుకున్నాను” అంది.


“నన్నూ, మా మనవరాలినా?” అన్నా.


“అవునండీ, మిమ్మల్నే! మా అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఒక అరగంట మీ ఇద్దరి గురించే చెబుతాడు.

‘అమ్మా.. శ్రీవిద్యకి రోజూ వాళ్ళ తాతయ్యే స్నానం చేయించి పోడర్ రాసి స్కూల్ డ్రస్ వేస్తాడుట. ఇంకా జడ కూడా వేస్తాడుట, సాయంత్రం పార్క్ కి తీసుకు వెడతాడుట. ఇంక పార్క్ బయట ఐస్ క్రీం కొనిపెడతాడుట..’ ఇలా చెపుతూనే ఉంటాడు. అలా చెబుతున్నప్పుడు వాడి కళ్ళళ్ళో అవి వాడు పొందలేదే అన్న బాధ ప్రతిరోజూ చూస్తున్నాను”


“మీరు కూడా బాబుని ప్రేమగానే చూసుకుంటారుగా” అన్నా.


“ఏం ప్రేమలెండి! వాళ్ళ నాన్న ల్యాప్ టాప్ చూస్తూ ఉంటాడు. నేను ఇంటి పని, వంట పని చేస్తూ మధ్యలో సెల్ ఫోన్ చూస్తూ ఉంటాను. ఇంక వీడు ఎవరూ మట్లాడే దిక్కు లేక సెల్ ఫోన్ లొ వీడియో గేమ్సు, రైమ్సు చూస్తుంటాడు” అంది.


ఇంతలొ శ్రీకర్ ఆక్కడకు వచ్చి, “అమ్మా! తాతగారు 500 రూపాయలు గిఫ్ట్ ఇచ్చారు. నువ్వు ఏమి గిఫ్ట్ ఇస్తావమ్మా?” అన్నాడు.


“నేను నువ్వు జీవితంలొ మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తా నాన్నా! పద..” అని, వాళ్ళమ్మ వాడి చెయ్యి పట్టుకుని వెళ్ళిపొయింది.


నేను స్కూటర్ దగ్గరకు వచ్చి శ్రీవిద్యని ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాను. నేను ఆవీధి చివరకు వచ్చేసరికి శ్రీకరు, వాళ్ళ అమ్మ ఆటొ మాట్లడుతూ కనిపించారు.


నేను ఆ ఆటొ దాటుతుంటే 'బాబూ! శ్రినివాసా వృద్దాశ్రమానికి వస్తావా' అన్న శ్రీకర్ వాళ్ళ అమ్మ గొంతు నాకు వినిపించింది.


శుభం


లంకా శంకర నారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :

నా పేరు లంకా శంకర నారాయణ. నేను 1956 అక్టోబర్ 16 న జన్మించాను. మా స్వస్థలం అంధ్ర ప్రదేశ్ ఇండియా లోని బందర్. నేను హైదరాబాద్ లోని రాష్ట్ర సహకార బాంక్ లొ పని చేసి 2014 లొ పదవీ విరమణ చేసాను. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరూ ప్రస్తుతం అమెరికా లొ ఉంటున్నారు.


41 views0 comments
bottom of page