సాగర తీరం
- T. V. L. Gayathri
- Jun 10
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #SagaraTheeram, #సాగరతీరం

గాయత్రి గారి కవితలు పార్ట్ 27
Sagara Theeram - Gayathri Gari Kavithalu Part 27 - New Telugu Poems Written By T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 10/06/2025
సాగర తీరం - గాయత్రి గారి కవితలు పార్ట్ 27 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
సాగర తీరం
(కవిత)
**********************************
సాయం కాలంలో సాగర తీరంలో
ఇసుక తిన్నెల్లో ఇళ్ల కట్టడాల్లో
మునిగిపోతుంటాములే మురిపాల్లో
పిల్లలతో గడుపుతూ కేరింతల్లో
వేడిగా వేయించిన సెనగగుళ్ళు
బుట్టలో పెట్టి అమ్మెడి కుర్రవాళ్ళు
నీడలోన కూర్చున్నారు పెద్దవాళ్ళు
వేడుకతో నాడుతున్న పిల్లగాళ్ళు
ప్రాతఃకాలములోన పందెములతో
ఈతలు కొడతారు వీరంగముతో
వ్యాయామాలు చేస్తారుసంతోషముతో
ధ్యేయసాధనా సక్తులు ధైర్యముతో
తెల్లని నురుగుల తుంపరలతో
మెల్ల మెల్లగా వీచే సమీరాలతో
సుడులు తిరిగెడి తరంగాలతో
కడలీ నాదపు ధ్వని సంగీతంతో
అల్లంత నదే పెద్ద పెద్ద ఓడలు
వెల్లికిలా దొర్లు విదేశీ వాసులు
జిల్లని పించునా సాగరజలాలు
కళ్ళ నిండుగా కనుపించు దృశ్యాలు
అదే అదే జలనిధి సోయగము
మదిలోని కల్మషాలన్నీ మాయము
ఉదయాన సూర్యోదయ దర్శనము
కుదిరితే మళ్ళీ మళ్ళీ చూసొద్దాము//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
תגובות