top of page
Writer's pictureSampath Kumar S

సంపత్ సినిమా కథలు - 3


'Sampath Cinema Kathalu - 3' New Telugu Web


Series Written By S. Sampath Kumar



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

కిరణ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న మానసిక చికిత్సాలయానికి వస్తుంది కావ్య.

కిటికీలో నుంచి కావ్యను చూసిన కిరణ్, ఆమె అందానికి ముగ్దుడై పోతాడు.

తన పుట్టినరోజు సందర్భంగా పేషెంట్లకు పండ్లు పంచి పెడుతుందామె.

తనను షాలిని అనే యువతి మోసం చేసి, డ్రగ్స్ రాకెట్ లో ఇరికించినట్లు లింగస్వామితో చెబుతాడు కిరణ్.

ఇక 'సంపత్ సినిమా కథలు’ మూడవ భాగం చదవండి.

నారాయణ- రంగా, బీమ ల దగ్గరకి వచ్చి

"ఏమి చెప్పి ఆ నర్సింహను పంపించారు రా" అని అడిగాడు.

"మళ్ళీ నీ జోలికి రాకుండా ‘ఆ పిచ్చోడు అవతారం దగ్గర అప్పు చేయాల్సిన ఖర్మ మా నారాయణకు ఏమి పట్టింది... వాడికే పెళ్ళాం ద్వార ఆస్తి కలసివచ్చి ఆమె పేరు మీద రెండు గెస్ట్ హౌస్ లు కొన్నాడు’ అని చెప్పాం” అన్నారు వాళ్ళు.


"ఓహో అలాగా"

" ‘అనవసరంగా నారాయణను అపార్థం చేసుకొన్నా’ అని చెప్పి వెళ్ళిపోయాడు"

" అబ్బా.. మీరెంత మంచివాళ్లు రా.. ఇంక మిమ్మల్ని డ్యూటి విషయంలో సతాయించను" అంటూ

" ఈరోజు మా గెస్ట్ హౌస్ లో మీకు మందు పార్టీ " అని చెప్పి ఆనందంగా వెళ్లిపోయాడు నారాయణ.


"మనం ఇప్పుడు నాటకం ఆడామని తర్వాత వీడికి అసలు విషయం తెలిస్తే ఎలా" అన్నాడు భీమ.

" తెలిసినప్పుడు ఇంకో ప్లాన్ వేద్దాం. ముందు మందు పార్టీ కి పోదాం " అన్నాడు రంగా.

***

అది ఊటీలో కాలేజ్ రోడ్.

ఆ రోడ్లోనే కిరణ్ సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు.

ఎదురుగా కావ్య, తన ఫ్రెండ్ మేరీ ఇద్దరూ ఎవరి సైకిల్ వారు త్రోసుకుంటూ వస్తున్నారు.

వీళ్ల వెనక ఒక ఇద్దరు స్టూడెంట్స్ రాజు, రవి.. వాళ్లు కూడా ఎవరి సైకిల్ వాళ్లు తోసుకుంటూ వస్తూ, కావ్యను ఆట పట్టిస్తున్నారు.


"కావ్యా కరుణించవా..... ఈ ప్రేమదాసుడు నీవు లేక బ్రతక లేడు"

"అబ్బా.. రోజూ ఈ రాజుగాడు ఈ డైలాగ్స్ తో ప్రాణం తీస్తున్నాడు. ఎలాగైనా వీడికి బుద్ది చెప్పలి" అంది కావ్య.


అప్పుడే మేరీ మాట్లాడుతూ "చూడవే.. ఇంకో బకరా నీవంక అలాగే చూస్తున్నాడు" అంది.

అంతే.. ఎదురుగా సైకిల్ ఆపి తననే కళ్ళు ఆర్పకుండా చూస్తున్న కిరణ్…

వెంటనే కావ్య ఏదో గుర్తుకు వచ్చినట్టు కిరణ్ ని చూస్తూనే

"బావా.. బావా...ఇంత లేట్ గా వచ్చవేమి బావా " అంటూ

"మేరీ.. నీకు చెప్పలేదు కదా.. మా బావ.. నిన్న హైదరాబాద్ నుండి వచ్చాడు " అంది.


మేరీకి కు ఏమీ అర్థం కాలేదు.

మళ్ళీ కావ్య మాట్లాడుతూ"బావా! మేరీ.. నా ఫ్రెండ్ " అంటూ మేరిని చూపించింది.

కావ్య అందం తనవితీర చూస్తున్న కిరణ్కు సడన్ షాక్ ఇచ్చిన కావ్య మాటలు.. ఏమీ అర్థం కాక అలాగే మాట రాక ఉండిపోయాడు.


ఇంక ఆమెను ఫాలో అవుతున్న రాజు సంగతి చెప్పనక్కర్లేదు. ముఖములో ఒకటే అలజడి.

"పదరా పోదాం" రాజు అనగానే అక్కడ నుండి

రాజు, రవి సైకిళ్ల మీద స్పీడ్ గా తొక్కుకుంటు పారిపోయారు.

వాళ్లు అలా పారిపోగానే అసలు విషయము అర్థం అయ్యింది కిరణ్కు. ఇంక కిరణ్కు మంచి ఛాన్స్ దొరికినట్టు అయ్యింది.


వెంటేనే కావ్య, మేరీతో

" ఆ రాజుగాడు మళ్లీ నా జోలికి రాడు. పోదాం పద "అంటూ కిరణ్ వంక చూస్తూ

" సారి.. ఏమీ అనుకోవద్దు. సమయానికి మీరు వచ్చారు, వాడి పీడ వడలించుకోడానికి ఇలా డ్రామా అడవలిసివచ్చింది " అంది.


"అదేమీ మరదలా, నీవు చెప్పావు కదా ఆ రాజుగాడు ఏడిపిస్తూన్నాడు రమ్మని.. మళ్ళీ నేనెవరో తెలియనిదానిలా నిజంగా డ్రామా ఆడుతున్నావు "


"ఓయి.. నేనేదో వాడి నుంచి తప్పించుకోవాలని చిన్న డ్రామా ఆడుతే నీవేమి కొత్త డ్రామా మొదలు పెట్టావు."


"నీవు నాకు నచ్చావు. నా ప్రేమకు మంచి ఎంట్రీ ఇచ్చావు. బై.. మళ్ళీ కలుస్తా " అంటూ గాలిలొ ముద్దులు ఇస్తు సైకిల్ మీద స్పీడ్ గా వెళ్ళిపోయాడు కిరణ్.

"వాడుపోయడు అనుకుంటే కొత్తగా వీడేమే ఇలా తగులుకున్నాడు"


"భలే ఉన్నాడే. నీకు మంచి జోడు నీకు....నాకు తెగ నచ్చాడు" అంది మేరీ.

"అయితే నీవు తగులుకో. పద పోదాం." అంది కావ్య.

డాక్టరు సుజాత ఇల్లు..

"కావ్యా.. కావ్యా.. "

"వస్తున్నా అమ్మా"


"నాకు చాలా నీరసంగా ఉంది. ఈ రోజు హాస్పిటల్కు వెళ్లను. ఈ రోజు నీకు కాలేజీ లేదు కదా.. హాస్పిటల్ వెళ్లి ఈ పేపర్స్ డాక్టర్ సుధకు ఇవ్వు."

"అలాగే అమ్మా"

కావ్య వాళ్ల అమ్మ ఇచ్చిన పేపర్స్ తీసుకొని సైకిల్ మీద హాస్పటల్కి బయలుదేరింది.

***

సెల్ రింగ్ అయ్యింది

నీరసంగా మంచం మీద ఉన్న సుజాత సెల్ రింగ్ కావడంతో ఎవరా అని చూస్తే రాజారావు..


"చెప్పు.. చాలా రోజులకు గుర్తుకు వచ్చినట్లు ఉన్నా"

"ఎలా మరచిపోతాను. మనది మరచి పోయే బంధమా"

"ఛీ.. నీనుంచి ఇలాంటి మాటలు వస్తె చాలా కంపరంగా ఉంటుం. మరి ఈ వయసులో కుడా అలాంటి మాటలు మాట్లాడి నీ మీద ఇంకా నాకు అస్యహం కలిగించకు."

"అది కాదు సుజు"


"ఏమి సుజు, ఎప్పుడైతే నన్ను కాదని డబ్బు కోసం ఇంకో ఆడదాని మెడలో తాళి కట్టావో అప్పుడే నేను చచ్చిపోయాను. ఇప్పుడు ఇలా బ్రతికి ఉన్నానంటే మా అన్నకు ఇచ్చిన మాట కోసం. అయినా ఇప్పుడు కాల్ ఎందుకు చేశావో తెలుసు.. నీ ముద్దుల కొడుకు కనపడకుండా పోయాడు. ఆ బాధతో చేశావు."


రాజారావు కొడుకు తన హాస్పటలోనే ఉన్నాడని లింగస్వామి ‘ఇప్పుడే చెప్ప వద్దు, పూర్తి గా కోలుకున్నతర్వాత చెబుదాం’ అన్నాడు. అందుకు రాజారావు కొడుకు ఇక్కడ ఉన్న టాపిక్ తీయలేదు సుజాత... రాజారావుతో తెగతెంపులు చేసుకున్నా, ఇష్టం లేకున్నా ఎప్పటికప్పుడు అక్కడ జరిగే విషయలు తనకు, ఇక్కడ జరిగే తన విషయలు లింగస్వామి చెబుతుంటాడు అని సుజాతకు తెలుసు.


రాజారావు భార్య చనిపోయాక లింగస్వామి ఇద్దరిని కలిపే ప్రయత్నం చేశాడు. కాని సుజాత ‘ప్రాణం పోయినా కలిసి రాజారావుతో జీవించను’ అని తెగేసి చెప్పింది. మళ్ళీ ఆ ప్రయత్నం లింగస్వామి చేయలేదు.


తన కొడుకు కిరణ్ కనపడకుండా పోయిన విషయం సుజాతకు లింగస్వామి చెప్పివుంటడు అనుకున్నాడు రాజారావు.

"అది కాదు సుజు. నేను చెప్పేది పూర్తిగా విను"

"ఏమీ వినను " అంటూ కాల్ కట్ చేసింది.


రాజారావు మళ్ళీ మళ్ళీ ట్రై చేసిన కాల్ లిఫ్టు చేయలేదు సుజాత.

హాస్పిటల్లో పిచ్చోడు అవతారం

భీమ,రంగ దగ్గరకు వచ్చి " నారాయణా ఎక్కడ.." పిచ్చి యాక్షన్తో అడిగాడు

అప్పుడే నారాయణ అటు వచ్చి

"ఒరేయ్ పిచ్చోడా! నీ పిచ్చి ఏమో కాని నీవు 5 కోట్లు ఎప్పుడు ఇస్తావని అడగడం.. నేను త్వరలో ఇస్తాననడం.. వెంటనే నీవు సరే అనుకుంటూ వెళ్ళడం వల్ల ఎదో నీ పిచ్చిచేష్టలు కాస్త కంట్రోల్ పెడుతున్నా అనే సంతోషంతో సరదాగ 5 కోట్ల నీ బాకీ తీరుస్తా అనటం వలన ఆ రౌడి నరసింహ అప్పుడే రావడం..నిజంగా నేను నీకు 5 కోట్లు బాకీ ఉన్నానని నమ్మడం.. దాని నుంచే నీకి పిచ్చి పట్టిందని నాకు నరకం చూపడం.. సమయానికి ఈ బీమా, రంగ లు ఆ నరసింహా నుండి నన్ను కాపాడారు. లేకుంటే ఈ పాటికి నీకు 5 కోట్లు ఇస్తే నీ పిచ్చి అన్న తగ్గుతుంది అని చంపుకొని తినేవారు"


నారాయణ అంత చెప్పిన ఆ పిచ్చి అవతారం నారాయణ షర్ట్ కాలర్ పట్టుకొని నా 5 కోట్లు ఎప్పుడు ఇస్తావు చెప్పు" అంటూ గోల చేయసాగాడు.

"ఆరే.. ఇంతసేపు మొత్తుకున్నా నా బాధ అర్థం అయినట్లు లేదురా వీడికి"

వెంటనే రంగ అన్నాడు "ఎలాగో ఆ నరసింహ భాద తప్పింది కదా.. ఆ 5 కోట్లు నీ భార్య పేరు మీద ఉన్న గెస్ట్ హౌస్ లు అమ్మగనే ఇస్తా అని చెప్పు"


ఇంతలో భీమ "అవును నారాయణ.. చెప్పు. లేకుంటే ఆ పిచ్చి అవతారం ఇక్కడ నుండిపోడు "

"అంతె అంటావా, సరే అవతారం.. మా భార్య గెస్ట్ హౌస్లు అమ్మకానికి పెట్టాను. అవి అమ్మగానే నీ 5 కోట్ల బాకీ తీరుస్తా"


"అలాగే నారాయణ " అంటూ పట్టుకున్న నారాయణ షర్ట్ కాలర్ వదలి పిచ్చిగా నవ్వుకుంటూ పోయాడు పిచ్చి అవతారం.

కాని నారాయణ వెనుకనే నరసింహా తన అనుచరులతో ఉన్న విషయం గమనించలేదు.

ఇంకేమివుంది.. నారాయణతో

" ఎదో సరదాగా అన్నాను అని ఇప్పుడు భార్య గెస్ట్ హౌస్లు అమ్మాక 5 కోట్ల బాకీ తీరుస్తా అని చెబుతున్నావు. నిజమే అన్న మాట అవతారంనికి 5 కోట్లు బాకీ ఉన్నది.."


"అయ్యో! వీడు మళ్ళీ వచ్చాడు రా, మీరేమీ రాడు అని మళ్ళీ ఆ అవతారంనికీ 5 కోట్ల బాకీ ఉన్నట్లు చెప్పించారు."

భీమ మాట్లాడుతూ "నారాయణ.. నీవు ఉండు.


"నర్సింహ.. త్వరలో అవతారానికి బాకీ ఉన్న 5 కోట్లు తీరుస్తాడు. వాడికి పిచ్చి తగ్గుతుంది. అలాగే నీకు అవతారం ఇవ్వవలసిన 2 కోట్లు వసూలు చేసుకోవచ్చు."

"మీరు అంతగా చెబుతున్నారు కదా సరే.. అలాగే వచ్చే వారం వస్తా" అంటూ నరసింహా అనుచరులతో అక్కడనుండి వెళ్ళిపోయాడు.


"ఆరే.. మీరు ఏమిరా.. నిజంగా ఆ పిచ్చి అవతారంకి బాకీ ఉన్నట్లు కమిట్మెంట్ చేయించారు"

"ఆరే పిచ్చి నారాయణ. చెప్పేది విను. ఇప్పుడు అలా చెప్పకుంటే వాడు ఇక్కడినుంచి పోడు, ఆందుకే ప్రస్తుతం. అలా చెబితేనే పోతాడు. కాని ఆ నరసింహా పీడ పర్మనెంట్ గా వదిలించడానికి ఒక ప్లాన్ ఉంది."


రంగా చెబుతుంటే భీమ మధ్యలో కల్పించుకొని

"ప్లాన్ ఇప్పుడు చెప్పవద్దు. నారాయణ, భార్య గెస్ట్ హౌస్ లో మందు పార్టీ ఏర్పాటు చేస్తాడు, అక్కడ చెప్పు నీ ప్లాన్"

"ఔను, ఇప్పుడు నిజంగా పిచ్చి నారాయణనే, ఆ ప్లాన్ ఏమిటో అప్పుడే చెప్పండి." విరక్తి గా అన్నాడు నారాయణ.


సైకిల్ తొక్కుంటూ హాస్పిటల్ కి వచ్చింది కావ్య. వస్తూనే నారాయణ కనపడ్డాడు. ఆట పట్టిద్దమని "నారాయణ అంకుల్ ఆ పిచ్చి అవతారంకి 5 కోట్ల బాకీ తీర్చావా"

"ఊరుకో కావ్య.. సరదాగా అన్న ఆ మాట ఇప్పుడు నా కొంప ముంచింది." అంటూ బావురుమన్నడు నారాయణ.


అంతలో

"ఏ.. మరదలు పిల్ల ఇలా వచ్చావు" అంటూ కిరణ్ అక్కడికి వచ్చాడు.

"ఏం కోతి బావ, ఈ మెంటల్ హాస్పిటలా తమ నివాసం."

"అవును మరదలా"

"అందుకే పిచ్చి బాగా ముదిరింది"


నారాయణకు వీళ్ల మాటలు ఏమీ అర్థం కాక "ఏం కిరణ్ బాబు కావ్య మీ మరదలా"

"సుజాత ఆంటీ నాకు ఆంటీ అయినప్పుడు ఆమె కూతురుకీ నేనూ బావనే కదా అప్పుడు ఈ కావ్య మరదలే కదా"

"ఔను కదా,ఏమీ లాజిక్ బాబు"


"అయితే నారాయణాను కూడా అంకుల్ అంటావు కదా.. మరి నారాయణ కూతుళ్ళు కూడ మరదల్లే కదా" అంది కావ్య.

"అమ్మ, మీ పిచ్చి లాజికకులు నా మీద ప్రయోగించి నన్ను పిచ్చివాడిని చేయకండి. ఇప్పటికే ఆ అవతారం వలన సగం పిచ్చివాడిని అయ్యాను"


"నారాయణా అంకుల్.. ఇప్పుడు నీవు ఇక్కడే ఉంటే నిజంగా పూర్తి పిచ్చి పడుతుంది. ఆ అవతారం ఇటే వస్తున్నాడు."

"అబ్బో.. నేను జంప్" అంటూ అక్కడనుంచి స్పీడ్ గా వెళ్ళిపోయాడు నారాయణ

"ఆ అవతారం ఇటూ రావడం లేదు కదా" అంది కావ్య

"అరే.. మన మధ్య ఆ నారాయణా అంకుల్ ఎందుకు అని అలా అన్నా"


"అయితే నీ దగ్గర నేనెందుకు" అంటూ అమ్మ, డాక్టర్ సుధకు ఇవ్వాల్సిన పేపర్స్ తీసుకుని, ఆమె రూమ్ కావ్య వైపు వెళ్ళింది.

ఎలాగైనా హాస్పటల్ నుంచి ఈరోడ్లోనే వస్తుందని సైకిల్ తీసుకొని రోడ్డుకు ఒక వైపు కావ్యకు కనపడకుండా ఎదురు చూస్తున్నాడు.


ఇంతలో కావ్య సైకిల్ మీద ఆ రోడ్ మీద రావడం కిరణ్ చూసి ఆమెకు కనపడకుండా వెనుక ఫాలో అవుతూ కావ్య సైకిల్ కి అడ్డు వచ్చి తన సైకిల్ ఆపాడు..

ఇంకా వుంది...

సంపత్ సినిమా కథలు ధారావాహిక నాలుగవ భాగం త్వరలో

S. సంపత్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link


Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : S. సంపత్ కుమార్

చదువు M.A. Archeology

కథలు రాయడం, వివిధ పత్రికలలో సుమారు 20 , అలాగే తీసిన షార్ట్ ఫిల్మ్స్ 6లో ఒక షార్ట్ ఫిల్మ్ కు డైరెక్టర్ గా స్పెషల్ జ్యూరీ అవార్డు, రెండు షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ స్టోరీ అవార్డ్స్ వచ్చాయి.





30 views0 comments

コメント


bottom of page