top of page

 వీకెండ్స్'Weekends' - New Telugu Story Written By L. V. Jaya

Published in manatelugukathalu.com on 29/02/2024 

'వీకెండ్స్' తెలుగు కథ

రచన: L. V. జయ"రేపు మీ నాన్నగారి తద్దినం".ఆఫీస్ లో ఉండగా జాగృతి వాళ్ళ అమ్మ లత ఫోన్ చేసి చెప్పారు.


"అవును అమ్మా. గుర్తు వుంది" అంది జాగృతి.


"ఆయన పోయి 20 ఏళ్ళు అయ్యింది." అన్నారు బాధగా లత.


"20 ఏళ్ళు అయిపోయాయి అంటే నమ్మలేకపోతున్నాను అమ్మా." జాగృతి కి కూడా బాధగా ఉంది. 


"రేపు తమ్ముడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టిన వెంటనే ఫోన్ చేస్తాను. నువ్వు కూడా దణ్ణం పెట్టుకుని తిను" అని చెప్పారు లత. 


"సరే మీరు ఫోన్ చేశాకే తింటాను " అని చెప్పి ఫోన్ పెట్టింది జాగృతి.   

    

చుట్టూ కొలీగ్స్ మాట్లాడుకుంటున్నవి వినపడ్డాయి. వీకెండ్ గురించి మాట్లాడుకుంటున్నారు. 

' ఫ్రైడే వస్తే చాలు. వీకెండ్ ప్లాన్స్ ఏంటి? అని తప్పకుండా అడుగుతారు'. జాగృతి వాళ్ళు కూడా వీకెండ్లో ఎక్కడైనా వెళ్తూవుంటారు. వీకెండ్ కి ఎక్కడికి వెళ్ళాలి అని జాగృతి భర్త, సమర్థ్ ముందే ప్లాన్ చేస్తాడు. ఈ సారి ఏమి చెయ్యలేదు ఇంట్లోనే ఉండాలి కాబట్టి. 


ఆ వీకెండ్ అంతా తన చిన్నప్పటి విషయాలు ముఖ్యంగా వీకెండ్స్ గుర్తువచ్చాయి జాగృతి కి. 

అవి అన్ని సమర్థ్ తో,  పిల్లలు శాన్వి, సార్థక్ లతో చెప్పింది. 


"చిన్నప్పుడు వీకెండ్ అంటే ఒక రోజే. ఆదివారం. అందరూ ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు. కానీ మా ఇంట్లో మాత్రం ఆదివారం రాకుండా ఉంటే బాగుణ్ణు అనుకునేవాళ్లం".


"ఏం" అడిగారు పిల్లలు ఆశ్చర్యంగా. 


"దానికి కారణం మీ తాతగారు. ఆయన స్కూల్ లో హెడ్ మాస్టర్ గా చేసేవారు. చాలా స్ట్రిక్ట్. స్కూల్ లో పిల్లలకి ఆయనంటే ఎంత భయమో ఇంట్లో మా అందరికి కూడా అంతే  భయం. పైగా ఆయనకి విపరీతమైన శుచి శుభ్రత. ఇల్లు, ఇంట్లో మనుషులు, వస్తువులు ఎంత శుభ్రంగా వున్నా, ఆయనకి ఎక్కడో ఎదో చోట ఎదో ఒకటి బాగులేనట్టు అనిపించేది. ఆదివారం వచ్చిందంటే చాలు మా ఇంట్లో శుచి శుభ్రత కార్యక్రమాలు మొదలు అయ్యేవి. నేను, మావయ్య ఎంత బాగా చదువుకున్నా, ఎక్కడో ఎదో లోటు కనపడేది. చదువులు, రోజు కంటే ఇంకొంచెం ఎక్కువ అయ్యేవి". 


"అందరూ ఆడుకుంటూ ఉంటే మీరు ఆ రోజు కూడా చదువుకునేవారా?" అడిగారు శాన్వి, సార్థక్. 


"అవును. ఆదివారం అయినా కూడా ఉదయాన్నే లేవాలి. లేచిన వెంటనే బెడ్ మీద వున్న దుప్పటిని దులిపి నీట్ గా వెయ్యాలి. పళ్ళు తోముకోవటం అయిన వెంటనే వాష్ బేసిన్స్ క్లీన్ అయిపోవాలి. స్నానాలు అయిన వెంటనే బాత్రూమ్స్ క్లీన్ అయిపోవాలి".


"ఎందుకు?" అడిగారు పిల్లలు.


"ఇలాంటివి వాడిన వెంటనే క్లీన్ చెయ్యాలి. లేకపోతే మరకలు పడతాయి, బాక్టీరియా పెరుగుతుంది అనేవారు. అది అయిన తరువాత ఒంటి మీద వేసుకునే వాటి శుభ్రత".


"అంటే" అడిగారు పిల్లలు.


"బట్టలు, చెప్పులు, షూస్" నవ్వుకుంటూ చెప్పాడు సమర్థ్. జాగృతి వాళ్ళ నాన్నగారిని సమర్థ్ చూడలేదు .వాళ్ళ పెళ్ళికి ముందే ఆయన పోయారు. కానీ జాగృతి మాటల్లో ఆయన గురించి కొంత తెలుసుకున్నాడు. ఎప్పుడు జాగృతి వాళ్ళ నాన్నగారి గురించి చెప్పినా సమర్థ్ కి చాలా నవ్వు వస్తుంది. 


"అవును. అమ్మమ్మ బట్టలు ఉతుకుతూ ఉంటే తాతగారు చెప్పులు, షూస్ క్లీన్ చేసేవారు."


"ప్రతి వారం క్లీన్ చెయ్యాలా షూస్?" అడిగింది శాన్వి .


"అవును. వారానికి ఒక్కసారి అయినా ఇవి క్లీన్ చెయ్యాలి. ఎక్కడెక్కడ తిరిగి వస్తాయో కదా అనేవారు. ఉతకడం అయ్యాక, ఇద్దరూ కలిసి గోలాలు శుభ్రంగా కడిగి ఆరబెట్టేవారు."


"గోలాలు అంటే?" అడిగింది శాన్వి.


"వాటర్ ట్యాంక్స్"చెప్పాడు సమర్థ్. సమర్థ్ కి చాలా నవ్వు వస్తోంది ఇదంతా వింటూ. 


"అవి ఎందుకు ప్రతి వారం క్లీన్ చెయ్యడం?" మళ్ళీ అడిగింది శాన్వి.


"వాటిల్లో నీళ్లు, తడి ఎక్కువ సేపు ఉండిపోతే కలరా, డియేరియా, టైఫాయిడ్ లాంటివి వస్తాయి అనేవారు. తరువాత, డాబా మీదకి బట్టలన్ని తీసుకుని వెళ్లి ఆరేసేవారు తాతగారు. బట్టలకి  క్లిప్స్ పెట్టేవారు కాదు."


"అలా ఎందుకు? ఎగిరిపోతాయి కదా పెట్టకపోతే?" అడిగాడు సార్థక్.


"క్లిప్స్ పెట్టిన చోట మడతలు పడిపోతాయని అవి పెట్టావారు కాదు. ఆరేసిన బట్టలు ఎగిరిపోకుండా, పక్షులు రెట్టలు వెయ్యకుండా బట్టలు ఆరేంతవరకు ఎండ లో కూర్చునే వారు."


సమర్థ్ కి మళ్ళీ నవ్వు వచ్చింది.


"ఆ టైం లో చందమామ పుస్తకం లో కథలు, సీరియల్స్ చదివి, మంచి కథలు కట్ చేసి ఫైల్ చేసి తరువాత బుక్ బైండ్ చేసేవారు. విక్రమ్ బేతాళ కథలు, విక్రమార్కుడు సాలభంజికల కథలు ఇవన్నీ మీకు చెప్పానుగా. అవన్నీ తాతగారు తయారుచేసిన బుక్స్ లో చదివినవే. ఈ బుక్స్ ని మా చుట్టాలు, ఫ్రెండ్స్ కూడా అడిగి తీసుకువెళ్లేవారు చదవడానికి. ఇప్పటికీ వున్నాయి మా దగ్గర ఆయన బైండ్ చేయించిన బుక్స్ అన్నీ. మేము హాలిడేస్ లో ఎన్నిసార్లు చదివేవాళ్ళమో ఆ బుక్స్ అన్నీ."


"ఈ సారి మేము కూడా చదువుతాం" అన్నారు పిల్లలు ఇద్దరూ.


"అమ్మమ్మ రోజు పూజ చేసుకున్నా, ఆదివారం ఆఫీస్ ఉండదు కాబట్టి ఇంకా ఎక్కువ సేపు పూజ చేసేవారు. అమ్మమ్మ కి  శ్లోకాలు బయటకి చదివే అలవాటు ఉంది కదా అవి వింటూ మాకు కూడా అన్ని నోటికి వచ్చేసాయి." 


"అమ్మమ్మ, తాతగారు ఇద్దరూ కలిసి మధ్యాహ్నం లంచ్ తయారుచేసేవారు. భోజనాలు అయ్యాక, ఆరిన బట్టలని ఇస్త్రీ చేస్తూ నన్ను, మావయ్యని మా టెక్స్ట్ బుక్స్ తెమ్మని చెప్పి  అందులో అప్పటి వరకు అయ్యిన చాఫ్టర్స్ లో క్వశన్స్ అడిగేవారు. ఎక్కడ నుంచి ఏమి అడుగుతారో అన్న భయంతో ఇద్దరం అన్ని ముందే చదువుకునేవాళ్ళం. ఒకవేళ ఏదైనా  చెప్పలేకపోతే అవి వచ్చేంత వరకు చదివించేవారు. ఆ టైం లో ఆయన వారం మొత్తం న్యూస్ పేపర్స్ లో వచ్చిన ముఖ్యమైన కథలని, సీరియల్స్ ని, సైన్స్ ఆర్టికల్స్ ని కట్ చేసి ఫైల్స్ లో పెట్టేవారు. వాటిని తరువాత వేరేగా బుక్ బైండ్ చేయించేవారు."


"రోజంతా పని, చదువేనా? రెస్ట్ లేదా?" వెక్కిరిస్తూ అన్నాడు సమర్థ్.     


"ఇవన్నీ అయ్యాక అయినా రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటే మంచం కిందో,  ఫ్యాన్ కో వున్న చిన్న బూజు  కనపడేది. మంచం కిందకి నన్ను, మావయ్యని దూరి అవి క్లీన్ చేయమని చెప్పి, తను స్టూల్ వేసుకుని ఫ్యాన్ క్లీన్ చేసేవారు. ఫ్యాన్ క్లీన్ చేసాక, అది మెరవాలని ఆయిల్ రాసి ఫ్యాన్ మెరుస్తుంటే చూసి ఇది క్లీనింగ్ అంటే అని ఆనందపడేవాళ్లు. ఆదివారం ఇంట్లో వస్తువులు అన్నీ తళతళా మెరిసిపోయేవి."


జాగృతి వాళ్ళ నాన్నగారి గురించి చెప్తూ ఉంటే, సమర్థ్ కి అసలు నవ్వు ఆగటం లేదు.


"ఇక సాయంత్రం ఐదు అయ్యాక, ఎక్కడైనా వెళ్దాం అని చెప్పి రెండు కిలోమీటర్లు దూరం లో వున్న సిటీ మెయిన్ సెంటర్ వరకు నడిపించి అక్కడ ఆగి ఆలోచించేవారు ఎక్కడికి వెళ్ళాలి అని. ఎక్కడికో వెళ్లాలో నిర్ణయించుకున్నాక మళ్ళీ రెండు, మూడు కిలోమీటర్లు నడిపించి ఫ్రెండ్స్ ఇళ్లకో, చుట్టాల ఇళ్లకో తీసుకు వెళ్ళేవాళ్ళు. అప్పుడు వచ్చేది మాకు ఫ్రెండ్స్ తో ఆడుకునే అవకాశం." 


"అబ్బా. ఇదేం లైఫ్ అమ్మా. రోజంతా పని, చదువు, నడక. వీకెండ్ హ్యాపీనెస్ ఏముంది ఇందులో. బోర్ కొట్టించావ్ ఇంత సేపు ఇదంతా చెప్పి." అన్నారు శాన్వి, సార్థక్.


"మేము అలానే అనుకునే వాళ్ళం. ఇంటి చుట్టుపక్కల వున్న వాళ్ళు, ఫ్రెండ్స్, అందరూ  పిల్లలు రోజంతా ఆడుకుంటూ ఉంటే మేము మాత్రం ఏమిటి ఇలా పనివాళ్ళలాగా రోజంతా ఎదో  ఒక పని చేసుకుంటున్నాం అని. కానీ పెద్ద అయ్యాక తెలిసింది ఎంత బాగా పెంచారో అని. వాళ్ళకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు, ఎన్నో మంచి అలవాట్లు నేర్పారని. చదువు ధ్యాసలో, భక్తి లో పూర్తిగా వుంచేవారని. ఎక్కడికి వెళ్లాలన్నా, నడిపించి తీసుకెళ్లి చాలా 

ఎక్సర్సైజ్  చేయించేవాళ్ళు. అమ్మమ్మ, తాతగారు ఇద్దరూ ఉద్యోగం చేస్తూ, ఇద్దరూ కలిసి వంట తో సహా అన్ని పనులు చేస్తూ, నా చేతా, మావయ్య చేతా ఒకేలాగా పనులు చేయిస్తూ,  మా ఇద్దరినీ ఒకేలాగా చూస్తూ ఆడ, మగకి తేడా చూపించకుండా పెంచారు." 


"నేను ,మావయ్య ఇద్దరూ ఇంజనీరింగ్ చదివాము. మంచి ఉద్యోగాలు చేస్తున్నాం. ఇద్దరికీ రోజూ పూజ చెయ్యటం అలవాటు అయిపొయింది. నీటుగా ఉండడం అలవాటు అయిపొయింది. అన్ని పనులు చేసుకోవడం వచ్చు. ఎవరి మీదా డిపెండ్ అవ్వకుండా బతకడం వచ్చు. వీలయినంత ఎవరికైనా సాయం చేస్తాం. ఇద్దరూ ఆరోగ్యం గా, ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా వున్నాం. ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవే కదా."


"చిన్నప్పటి విషయాలు అంటే గుర్తుకు వచ్చేవి, ఈ ఆదివారాలే. చిన్నప్పుడు ఎంత బాధపడినా, మమల్ని తీర్చి దిద్దినవి ఈ ఆదివారాలే. మమల్ని సమాజం లో నిలబెట్టినవి ఈ ఆదివారాలే. " 


"నిజమే అమ్మా. సారీ, ఇందాక అలా అన్నందుకు. మీరు మమల్ని అలానే పెంచండి. మాకు బాగా చదువుకుని, సొంతగా కంపెనీస్ పెట్టాలని ఉంది ?" అంది శాన్వి. 

శాన్వి తమ్ముడు సార్థక్ కూడా " నాకు అలానే ఉండాలని ఉంది " అన్నాడు. 


" మీరు మా మాట వింటూ పెరిగితే అలానే అవుతారు మరి. వింటారా? " అడిగింది జాగృతి . 


" తప్పకుండా " అని పిల్లలు ఇచ్చిన  సమాధానం తో చాలా ఆనందంగా సమర్థ్ ని చూసింది  జాగృతి.  


అప్పటికి అర్ధం అయ్యింది సమర్థ్ కి ఇన్నాళ్లు జాగృతి తన తల్లితండ్రుల గురించి ఏం చెప్పాలని అనుకుందో. ఇన్నాళ్లు విననందుకు జాగృతి కి సారీ చెప్పి పిల్లలతో  

"తల్లితండ్రులు పిల్లలకు ఇవ్వాల్సినవి ఆస్తులు, డబ్బులు, ఇళ్ళు కావు. మంచి అలవాట్లు, మంచి సంస్కారం, భక్తి, చదువు, సేవ చేసే గుణం, ఇవన్నీ. సేవ, ముందు ఇంట్లో మొదలు అవ్వాలి. అమ్మకి ఇవన్నీ వాళ్ళ పెంపకం ద్వారా చూపించారు. మనం కూడా ఇక నుంచి వీలయినంత ఒకరికి ఒకరు సాయం చేసుకుందాం. బయటవాళ్ళకి సాయం చేద్దాం." అని చెప్పాడు .


ఇప్పటి వరకు జరిగిన వీకెండ్స్ అన్నీ ఒక ఎత్తు. ఈ వీకెండ్ ఒక ఎత్తు. జాగృతి ఆనందానికి హద్దులు లేవు.

***సమాప్తం***


L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : LV జయ

నా పేరు LV జయ. 
https://www.manatelugukathalu.com/profile/jaya

నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. 
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

ధన్యవాదాలు

45 views0 comments

Comments


bottom of page