top of page
Writer's pictureA . Annapurna

ఆధునిక యుగంలో సీత


'Adhunika Yugamlo Sita' New Telugu Article

Written By A. Annapurna

'ఆధునిక యుగంలో సీత?' తెలుగు వ్యాసం

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)



ఆంద్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటన దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. సాయి సుజిత అనే మహిళను భర్త తో సహా అత్తా మరిది సహా 14 సం. లు గృహ నిర్బంధంలో గృహహింసకు గురిచేయడం, ముగ్గురు పిల్లలను తల్లికి దూరం చేయడం అమానుషం. ఆ పిచ్చి తల్లి ఎలా భరించిందో.. అనుకుంటే అందుకు ఒంటిమీద సృహ లేకుండా మెదడు పనిచేయకుండా కుటుంబంలో వాళ్ళు ఏవో మందులు ఇచ్చి ఉండాలి. కారణాలు ఏమిటో పరిశీలిస్తున్నారు న్యాయవాదులు పోలీసులు మహిళా బృందాలు వగైరా!


ఇంకా విచిత్రం సుజిత భర్త న్యాయవాదిట. సుజిత కూడా పీ. జీ. చేసిన వున్నత విద్యావంతురాలు.

భార్యమీద ప్రేమ అనేది లేదు. తల్లిమాట విని ఆమెను హింసించడం, తల్లి హింసింస్తు ఉంటే ఊరుకోడం ఎంతటి హీనం? అలాంటి వాడు పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? తల్లి చెప్పిందని ఏమో. దానికి తోడు మరిదికూడా వారితో కలిసాడు. ఇంతటి దారుణం నేను ఎక్కడా ఎప్పుడూ వినలేదు. ఈ ఆధునిక యుగంలో ఇలాంటి దారుణాలు జరగడం సిగ్గు సిగ్గు. మహిళా దినోత్సవాలు మహిళా పోరాటాలు ఉద్యమాలు చేసి మనం సాధించినది ఏమిటి? వాటి ప్రయోజనం ఉందా.. ?


అత్తవారింట పరిస్థితి అలాగే ఉంటే పుట్టింటివారు ఎందుకు పట్టించుకోలేదు? కొంతకాలం సుజిత దాచిపెట్టి ఉండచ్చు. ఆతరువాత అనుమానించాలికదా! సుజిత మామగారి ప్రసక్తిలేదు. ఆయన ఉన్నాడా లేదా ? ఈ మిష్టరీ ఏమిటి? ఇరుగు పొరుగు వారుకూడా సుజితను చూసి జాలితో ఎందుకు రక్షించే ప్రయత్నం చేయలేదు? మానవత్వం మంట కలిసిందా. అన్ని సందేహాలే.


ఇక భరించలేక తనంత తానూ బయటకు పరుగెత్తి వచ్చానని చెప్పింది. పాపం ఆమె ప్రాణం లేనట్టు నోటమాట రానీ స్థితిలోవుంది. అంతటి దీనంగా వున్నా ఆమెను వీడియోలో చూస్తే కడుపు తరుక్కు పోయినదే! ఆ రాక్షసుల చేతిలో ఒకటికాదు రెండుకాదు 14 ఏళ్ళు నరక యాతన పడిన ఆమెపై పురాణగాథ సీతా వనవాసం ప్రభావం పడిందా అనికూడా నాకు అనిపించింది. పురాణ గ్రంధాలు చదవద్దు. సినిమాలు చూడద్దు. చూసిన పట్టించుకోవద్దు. ఆ కథలు మన జీవితానికి అన్వాయిన్చుకుంటే ఇదిగో ఇలాటి నష్టమే కలుగుతుంది.


మనకంటూ ఒక జీవితం వుంది. అది నిర్మించుకోవాలి. అని మరువద్దు. భర్త మంచివాడు అయితే సంతోషం. ఏమాత్రం కష్టం వచ్చిన మార్చడానికి ప్రయత్నించి ఫలించక పోయినా ధైర్యంగా బయటికి వచ్చేయండి.


ఈ రోజుల్లో చదువు లేనివాళ్లు లేరు. లేకపోయినా ఫర్వాలేదు. ఆత్మా విశ్వాసం పెంచుకుని ఏదో ఒక పని చేసుకుని స్వేచ్ఛగా జీవించండి. ఎవడో రాక్షసుడి చేతిలో కష్టాలు పడవలసిన అవసరం లేదు. ఇక్కడ సుజిత విషయంలో ఆమె మంచితనం అమాయకత్వం ఆసరాగా తీసుకుని ఆమెను గృహ నిర్బంధం చేశారు.


భర్త లాయరు కదాని ఇరుగు పొరుగు వారు భయపడివుండచ్చు. కొంత మానవత్వం అంటూ ఉండాలికదా..


రహశ్యంగా రిపోర్ట్ చేయచ్చు. మూలనవున్న గ్రామాల్లో చదువులేనివారు సైతం మహిళల్లో ఇప్పుడు చైతన్యం చూస్తున్నాం. ఆధునిక పరి జ్ఞానాన్ని స్వంతం చేసుకుని నగర మహిళతో సమానంగా వారు కోరుకున్నవి సాధిస్తున్నారు. ఎవరికైనా ఆత్మవిశ్వాసం ధైర్యం అవసరం. మహిళలు ఎవరికీ బానిసలు కారు.


ఇక మగవారు అందరూ ఒకేలా వుండరు కానీ ఇలా చేదు ఆలోచనలు చేసే తల్లిని దూరం పెట్టడం మంచిది. ఎవరి స్తానం వారికీ ఇచ్చి గౌరవించాలి. అమ్మకి -అర్ధాంగికి. భార్య కంటే తల్లి ముఖ్యం అనుకుంటే పెళ్లి చేసుకోకండి. అమ్మకే సేవలు చేయండి. భార్య చేసే సేవలు అమ్మ ఎన్నటికీ చేయదు. కొడుకు-కోడలు సుఖంగా ఉంటే చూడలేని తల్లి ఆడదే కాదు.


భార్య లేకుంటే మరో భార్య వస్తుందని ఆశ పడకండి. ఆమె మీ అంటూ చూస్తుంది. వూరికే పడి ఉండదు.. మీ నైజం బయట పడి మిమ్ములను అందరూ అసహ్యించుకుంటారు. అంతదాకా మవునంగా వున్నవారు మొహం మీదే అడిగేస్తారు. ఇంకా కోపం వస్తే చావగొట్టి పోలీసులకు

అప్పగిస్తారు. అప్పుడు మీ పరువు ప్రతిష్ట చదువు ఆంతా గంగలో కలుస్తుంది. సహాధర్మచారిణిగా అన్ని సహించిన మీ భార్య హింసకు గురిచేసిన మిమ్మలను గురించి ధైర్యంగా కేసుపెడుతుంది. మీరు మారుతారని నమ్మదు. మీ తల్లి కొడుకులకు కఠిన శిక్ష పడాలి.


అత్తగా పెత్తనం చేసిన ఆ మహిళా తన కొడుకులు తన చెప్పు చేతల్లో వుండాలని కోరుకుని. , కోడలును పిల్లలను విడదీసింది. అందుకు కూడా శిక్ష పడుతుంది. చవట సన్నాసి కొడుకులు ఉంటే వాళ్లకు పెళ్లి చేయకు తల్లి ! అలాంటి వాళ్ళు ఉండబట్టే పెళ్లిళ్లు చేసుకోకుండా హాయిగా స్వేచ్ఛగా వుంటున్నారు చాలా మంది మహిళలు. మగాళ్లు వారిని చూసి నేర్చుకోండి మీరుకూడా.


అమాయకురాలైన అమ్మాయిని చేసుకుని వారి జీవితాలను ఛిద్రం చేయకండి. సమాజంలో మీ ఉనికిని గౌరవాన్ని కోలుపోకండి. ఇలాగ ప్రవర్తిస్తే తల్లి కొడుకు 14 ఏళ్ళు మీరూ జైలు లో కూర్చుంటారు. నేనే జడ్జి ని అయితే మీ నేరం హత్య కంటే క్రూరమైంది కనుక జీవితకాలం జైలు విధిస్తా. బుద్ధి కలిగి వుండండి. #

***

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ




నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)









37 views0 comments

Comments


bottom of page