top of page

అక్కడ పాప!!..ఇక్కడ అమ్మ!!..'Akkada Papa Ikkada Amma' - New Telugu Story Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 13/03/2024

'అక్కడ పాప!!..ఇక్కడ అమ్మ!!' తెలుగు కథ 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్మన పవిత్ర భారతదేశం సనాతనులు దైవజ్ఞులు పండితోత్తములు అయిన మహాఋషులకు నిలయం. అస్తికతకు ప్రత్యక్ష సాక్ష్యం మన పూర్వీకులందరూ... ఋషి సంతతి. కృత ద్వాపర త్రేతాయుగాల్లో దేవ దానవులు వసించారు. ఎప్పుడూ దైవత్వానికి, దానవత్వానికి వైరం. మనం ఖర్మ సిద్ధాంతపు.... ’పునరపి జననం.... పునరపి మరణం, (పుట్టుట గిట్టుటా... గిట్టుటా (మరణం) పుట్టుటా... పై వేదవాక్కు అర్థం. జన్మరాహిత్యమో...మోక్షం అది సిద్ధించాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి. గిట్టాలి. పుట్టాలి. మంచిని అదే పుణ్యాన్ని మన ఆచరణలతో దైవ భక్తితో సాధించుకోవాలి. మనం చూచే గొప్పవారు గతించిన కీర్తిశేషులు కాలచక్ర భ్రమణంలో మరణ జనన మూలంగా ఆయా స్థితిలను పొందినవారే!.... కొందరికి వారి గత జన్మ జ్ఞాపకాలు ఈ జన్మలో కలిగిన వారు వున్నారు. ఆ మాటలు వినేటందుకు చోద్యంగా వుంటాయి కాని అది నిజం... మరు జన్మకు అది సాక్షి....


అది రాజస్థాన్ భూభాగం...

త్రిపురాంతక్ అనే చిన్న గ్రామం.


అక్కడికి కింజర్ అనే మరో గ్రామం ముఫ్ఫై కిలోమీటర్లు.

పేదకుటుంబీకులు, రామ్‍లాల్, లక్ష్మి భార్యా భర్తలు. కొద్దిపాటి భూమిలో వ్యవసాయం. ఆ ఫలింపు వారి జీవనాధారం.... రామ్‍లాల్, లక్ష్మి దంపతులది మంచి అన్యోన్యమైన సంసారం. వారి వివాహం జరిగిన మూడు సంవత్సరాలు సంతతి లేదు.


ఆ వూరి పెద్ద ఆనంద్ బాబు సంపన్నుడు. ఆంజనేయస్వాముల వారి భక్తుడు. ఆయనకు ఆ వూరిలో ఒక ముస్లిం సోదరుడు పేరు ఫకీరా. ఆయన కన్నా వయస్సులో పెద్దవాడు. ఇరువురూ మంచి స్నేహితులు. 


ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేయాలనే సంకల్పం రామ్‍లాల్‍కు కలిగింది.

వూర్లోని వారికందరికీ తన అభిప్రాయాన్ని చెప్పి సాయం కోరాడు. వారివారికి తోచిన ధన సాయం చేశారు గ్రామస్థులు. ముస్లిం వర్గీయులు పది ఇళ్ళవారు ఉన్నారు. వారికి పెద్ద ఫకీరా. గొప్ప భక్తిపరుడు. "ఈశ్వర్ అల్ల తేరే నామ్" అని పాడేవాడు. గుడ్డల వ్యాపారి.


రామ్ తన నిర్ణయాన్ని మిత్రునికి తెలియజేశాడు కానీ సాయం కోరలేదు. చందాగా వచ్చిన ధనం శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ నిర్మాణానికి సరిపోయేలా లేదు. తనకున్న భూమిలో కొంత భాగాన్ని అమ్మి స్వామి వారి విగ్రహాన్ని నిర్మింప నిర్ణయించుకొన్నాడు రామ్‍లాల్.

ఆ విషయాన్ని విన్న ఫకీరా రామ్‍లాల్‍ను కలిశాడు.


"అరే భాయ్! ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించాలనుకొన్నవటగా!.... వూరంతా చందా దండావట! మరి నన్ను అడగలేదేం!....." చిరునవ్వుతో అడిగాడు ఫకీరా.


"అన్నా!.... తప్పుగా అనుకోకు. నేను నాకు నమ్మకం లేని పనిని చేయను. మీకు విగ్రహారాధనపై నమ్మకం లేదుగా.... అందుకే అడగలేదు" వినయంగా జవాబు చెప్పాడు రామ్‍లాల్.


ఫకీరా నవ్వాడు.

"ఎందుకన్నా నవ్వుతున్నావ్?"

"సాయం వేరు, నమ్మకం వేరు కదా!...."


"అవును...."


"నేను ఇస్తే తీసుకోవా!"


"మీరుగా ఇస్తే తీసుకొంటాను"


"అయితే నన్ను అడగవన్నమాట!"


"ఉహూ!" తల ఆడిస్తూ చెప్పాడు రామ్‍లాల్.


రెండు క్షణల తర్వాత "తప్పుగా అనుకోకండి" అనునయంగా చెప్పాడు.


"రామూ! నీ సంకల్పం చాలా మంచిది. నాకు రామాయణ కథ పూర్తిగా తెలుసు. పవనసుత హనుమాన్ జీ, బల్‍వావ్ గ్రేట్ గ్రేట్ వారు... చిరంజీవి భయ్యా!..." నవ్వుతూ చెప్పాడు ఫకీరా.


జేబులోనుంచి కొంత సొమ్ము తీసి రామ్ లాల్ చేతిలో వుంచి, చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోయాడు. లెక్కపెడితే అది పాతిక వేలు.


మూడు మాసాలలో నలభై అడుగుల శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం ఆకర్షణీయమైన రంగులతో సర్వాంగ సుందరంగా ఊరి గవిడిలో (Entrance) వెలసింది. మంచి రోజున వేదమంత్రాలతో ఘనంగా స్వామి వారి సంప్రోక్షణ పూజ, నైవేద్యాదులు జరిగాయి. రామ్‍లాల్ అర్థాంగి లక్ష్మి నెల తప్పింది. నవమాసాలు నిండాయి. పాప పుట్టింది. పావని అనే పేరు పెట్టారు.

  *

పావనీ ఎంతో అందంగా వుండేది. ఆనోట ఈనోట ఆ మాట (అందం) పడి ఊర్లోని అమ్మలక్కలు రామ్‍లాల్ ఇంటికి వచ్చి పావనిని చూచి సంతోషించి, మనసరా దీవించి వెళ్ళేవారు. ప్రతి సాయంత్రం లక్ష్మి పాపకు దిష్టి తీసేది.


"హే పవసూత! తండ్రి న బిడ్డకి నీవే రక్ష," ఆ వీరాంజనేయ స్వామిని మనసారా వేడుకొనేది లక్ష్మి.

పావని ఆరోగ్యంగా వుండేది. అల్లరి, ఏడుపు ఎప్పుడూ లేదు. బోర్లా పడడం..... బోసి నవ్వులు నవ్వడం, అమ్మా నాన్నలను గుర్తుపట్టి కేరింతలు కొట్టడం చేసేది. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. అంతా శ్రీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం అని ఆ స్వామిని మనసారా కొలిచేవారు.


పావనికి మూడు సంవత్సరాలు నిండాయి. ఎప్పుడు ఆమె అంజనేయ స్వామి వారి విగ్రపు అరుగుమీదనే వుండేది. ఆ చిరంజీవితో ఈ పాప మాట్లాడేది. ఆయన తనకు జవాబు చెప్పిన అనుభూతిని పొందేది.


కొందరికి పావని ఆ చర్య ఆశ్చర్యాన్ని కలిగించేది. ప్రధమంలో లక్ష్మి రామ్‍లాల్ కూడ ’ఏదిరా ఇది!’ అని అయోమయ స్థితిలో వుండేవారు. రోజులు గడిచేకొద్ది ’పాప చిన్నవయస్సులోనే మంచి భక్తురాలు’ అనుకొని సంతోషించేవారు.


కింజర్ గ్రామం లక్ష్మి అమ్మగారి వూరు. ఆ ఊరిలో రామాలయం ఉంది. లక్ష్మి తండ్రి రఘునాథన్. ఆ ఆలయ అజమాయిషి కర్త. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి సీతామాత శ్రీరాముల పూజలను ఉత్సవాన్ని ఘనంగా జరిపించేవాడు. ఆ ఉదయం నుండి సాయంత్రం శ్రీరామచంద్రుని ఊరేగింపు ముగిసి, ఆ మాతాపతిలు ఆలయానికి చేరేవరకూ మంచినీళ్ళను కూడా త్రాగకుండా ఉపవాసం ఉండేవాడు రఘునందన్. వారి సతీమణి జానకి కూడ అలాగే వుండేది.


రఘునందన్‍కు లక్ష్మి పెద్దకూతురు. ఆమె కాక వారికి మరో ఇరువురు ఆడసంతానం. అహల్య, సుమతి. వారిరువురూ కవల పిల్లలు. లక్ష్మి పుట్టిన ఆరు సంవత్సరాలలో వారిరువురూ జన్మించారు. పావనీ పుట్టుక ముందు సంవత్సరం క్రిందట రఘునందన్ అర్థాంగి జానకి విష జ్వరంతో సరైన వైద్య సదుపాయాలు లేక మరణించింది. అహల్య, సుమతీ తల్లిలేని పిల్లలైనారు.


బంధువులు, హితులు రఘునందన్‍తో.... ’పిల్లలు చిన్నవారు కదా పెంచి పెద్ద చేయాలి కదా, అందునా ఆడపిల్లలు తల్లి అవసరం వారికి ఎంతైనా ఉంటుంది. నీవు మరో పెండ్లి చేసుకో!" అన్నారు. బలవంతం చేశారు. బ్రతిమిలాడారు.


కానీ.... రఘునందన వారి మాటలను వినిపించుకోలేదు. ఆ పిల్లలను సవతి తల్లి సరిగ్గా చూడదని అతని భయం. ఆ కారణం మరో వివాహాన్ని అతను చేసుకోలేదు. తల్లీ, తండ్రి తానే అయ్యి వారిని పెంచి పెద్ద చేశాడు రఘునంద.


జానకి బ్రతికి వుండగ పుట్టిన కవల పిల్లల వయస్సు పన్నెండు సంవత్సరాలు, లక్ష్మి వయస్సు పదునెనిమిది సంవత్సరాల ప్రాయంలో, ఆ దంపతులు తమ మేనల్లుడు రామ్‍లాల్‍తో లక్ష్మి వివాహాన్ని జరిపించారు. అది ఆ ఇంట్లో జరిగిన గొప్ప శుభకార్యం.


ప్రస్తుతంలో అహల్యా సుమతీల వయస్సు పదహారు సంవత్సరాలు. వారు ప్లస్ టు చదువుతున్నారు.

  *

ప్రతి సంవత్సరం తాను జరిపించే శ్రీరామనవమి ఉత్సవానికి రఘునందన్ తన అల్లుడు రామ్‍లాల్, కూతురు లక్ష్మి, మనుమరాలు పావని ఆహ్వానించారు. అప్పటికి వారు ఆ వూరికి వచ్చి ఒక సంవత్సరం గడిచింది.


ఇంటికి వచ్చిన బావ అక్కలను అహల్య, సుమతిలు ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. చిన్నారి పావనిని ఎత్తుకొని ముద్దులాడారు.


పావని అహల్య చేతుల నుండి క్రిందికి జారింది. ఆమె కళ్ళల్లో కన్నీరు. అహల్యా, సుమతిలు భయపడ్డారు. పావనీ ఏడుపుకు కారణం తెలియనివారు ఆశ్చర్యపోయారు. తమ అక్క లక్ష్మిని పిలిచారు. లక్ష్మి వారిని సమీపించింది.


పావని.... వేగంగా ఆ ఇంటిని, వెనుక పెరటి భాగాన్ని కన్నీటితో వేగంగా తిరిగింది. పొంగి వచ్చిన ఏడుపుతో బోరున ఏడుస్తూ వుంది పావని.


అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది. బిడ్డకు ఏమైందనే ఆవేదన....

పావనీ!... రఘునందనను సమీపించింది ఏడుస్తూ....

"ఏమయ్యా!... నన్ను మరిచిపోయావా! ఎలా వున్నావు? నేను... నేను... నీ జానకినీ.... నీ జానకినీ...."

రఘునందన చేతులు పట్టుకొని భోరున ఏడ్చింది పావని.


అందరి పరిస్థితి అయోమయం....

"జానకి.... జానకి..." రఘునందన పెదాలు అప్రయత్నంగా పలికాయి.


పావనీ, అహల్యా సుమతీలను సమీపించింది. వారి చేతులను తన చేతుల్లోకి తీసుకొంది.

"ఏమ్మా!....అహల్యా, సుమతీ ఎలా వున్నార్రా!..... మీ నాన్న మిమ్మల్ని బాగా చూసుకొంటున్నాడా!" దీనంగా కన్నీటితో అడిగింది.


అహల్యా, సుమతీలకు అయోమయ పరిస్థితి..... వారి నయనాల్లో కన్నీరు. అప్పటికి పెద్దవారైన రఘునందన్‍కు, రామ్‍లాల్ లక్ష్మీలకూ విషయం అర్థం అయ్యింది.


’ఈ పావని ఎవరో కాదు!.... ఎవరో కాదు!..... చనిపోయిన నా భార్య లక్ష్మి....’ అనుకొన్నాడు రఘునందన్.


"నా కూతురు పావని ఎవరో కాదు నా లక్ష్మి తల్లి.... మా అత్తయ్యా!’ అనుకొన్నాడు రామ్‍లాల్.


"నా కూతురు పావని నాకు జన్మనిచ్చిన తల్లి...’ అనుకొంది లక్ష్మి.


రఘునందన వేగంగా ఇంటినుండి బయటికి నడిచాడు. తన ప్రక్క ఇంట్లో వున్న డాక్టర్ లక్ష్మణ్ జీకి విషయాన్ని చెప్పాడు. లక్ష్మణ్‍జీ ఆశ్చర్యపోయాడు.

తన మందుల సంచిని చేతికి తీసుకొని....

"పదండి. నేను పాపను చూస్తాను" అన్నాడు అయోమయ స్థితిలో.


ఇరువురూ రఘునందన ఇంట్లోకి వచ్చారు.

పావనీ తన ఇరువురు కూతుళ్ళను ఏం చదువుతున్నారని అడిగింది.


"అమ్మా!....అమ్మా!.... మీరువురువూ బాగా చదువుకోవాలి. పెద్ద చదువులు చదవాలి. గొప్పవారు కావాలి. మీ నాన్నను బాగా చూసుకోవాలి" దీనంగా కన్నీటితో చెప్పింది. 


ఇంట్లోకి వచ్చిన డాక్టర్ లక్ష్మణ్ జీ ఆ మాటలను విన్నాడు ఆశ్చర్యపోయాడు.

అతన్ని చూచిన (పావని) లక్ష్మి!.....

"ప్యారా భయ్యా! లక్ష్మణ్‍ జీ ఆప్ కైసే హో.... పత్నీ బచ్చే సభీ కుశల్ మంగళ్ హోనా!"

చిరునవ్వుతో అడిగింది పావని. 


లక్ష్మణ్‍జీకి విషయం అర్థం అయ్యింది.

"పూర్వజన్మ జ్ఞాపకాలు" అతని పెదవులు అప్రయత్నంగా పలికాయి.


"డాక్టర్ సాబ్! నా బిడ్డ!...." ఆ తరువాత మాట్లాడలేకపోయాడు రామ్‍లాల్ ఆవేదనతో....


"లక్ష్మణ్ మామా! మేర బేటీ.... మేర బేటీ....! బొంగురు పోయిన కంఠంతో కన్నీటితో ఆ తరువాత ఏమీ చెప్పలేకపోయింది లక్ష్మి.


అహల్యా, సుమతీలు కన్నీటితో ఆశ్చర్యంగా చూస్తున్నారు. 

లక్ష్మణ్ జీ కొన్ని క్షణాలు ఆలోచించాడు.

పావనిని సమీపించాడు.

"దీదీజీ అప్ తోడ్ సమై ఆరాంకీజియే!..." ఎత్తుకొని మంచాన్ని సమీపించాడు. పడుకోబెట్టాడు. లక్ష్మికి సైగచేసి పాప చేతులను పట్టుకొమ్మని సూచించారు డాక్టర్ లక్ష్మణ్ జీ.


లక్ష్మి పాప తలవైపున విచారంగా కూర్చుంది. మెల్లగా ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకొంది.

డాక్టర్ లక్ష్మణ్ జీ పావనికి ఇంజక్షన్ చేశాడు.

"అమ్మా!....." అరిచింది పావని.


అందరూ బెదిరిపోయి పావని ముఖంలోనికి చూచారు. లక్ష్మి పావనిని తన హృదయానికి గట్టిగా హత్తుకొంది.

పావనీ కళ్ళు మూసింది.


"మీరెవరూ భయపడకండి.... బాధపడకండి... ఏమీకాదు. మత్తు ఇంజక్షన్ ఇచ్చాను. కొంతసేపు ప్రశాంతంగా నిద్రపోతుంది.. రెండు గంటల తర్వాత నేను మళ్లా వచ్చి చూస్తాను" లక్ష్మణ్‍జీ వెళ్ళిపోయాడు.


అందరూ పావని ముఖంలోకి కన్నీటితో దీనంగా చూస్తున్నారు.

పావని ప్రశాంతంగా నిద్రపోయింది.


జరిగిన సంఘటన వలన వారందరికీ అర్థం అయ్యింది. మరుజన్మ ఉన్నదని. ఆ చిన్నారి పావని రామ్‍లాల్ ఇంట (త్రిపురాంతక్‍లో) పాప.... (అక్కడ) రఘునందన్ ఇంట (కింబర్‍లో) అమ్మ (ఇక్కడ) అని....

  *

సమాప్తి

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.62 views0 comments

Comments


bottom of page