top of page

అక్షర ప్రబోధం

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AksharaPrabodham #అక్షరప్రబోధం, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 86


Akshara Prabodham - Somanna Gari Kavithalu Part 86 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 10/06/2025

అక్షర ప్రబోధం - సోమన్న గారి కవితలు పార్ట్ 86 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


అక్షర ప్రబోధం

----------------------------------------

రాతిలాంటి మనసులు

కోతి వంటి చేష్టలు

పాతిపెట్టుము మొదట

ఖ్యాతి నొందు బ్రతుకులు


నీతిలేని మనుషులు

కాంతి లేని రాత్రులు

ఛాతీపై చెయ్యేసి

భీతి లేక జీవించు


నోటు కన్న బ్రతుకులో

విలువ ఉంది మాటలో

చోటివ్వు విలువలకు

విద్య పంచు గురువులకు


దేవునితో ఆటలు

నిప్పుతో చెలగాటం

పనికిరాని దానికై

ఎందుకు ఆరాటం
















అమ్మానాన్నల ఆశ

----------------------------------------

చుక్కలా పొడవాలి

మొక్కలా ఎదగాలి

చక్కనైన దారిలో

ఎంచక్కా నడవాలి


పువ్వులా విరియాలి

మువ్వలా మ్రోగాలి

గువ్వలా విహరిస్తూ

దివ్వెలా వెలగాలి


తేరులా మారాలి

కారులా పోవాలి

ఊరు పేరు నిలిపి

యేరులా పారాలి


తీరు కాస్త మారాలి

మరుమల్లె కావాలి

దరహాసం చిందుతూ

ధరణిలో బ్రతకాలి

















తల్లి హితబోధ

-----------------

మిన్ను విరిగి మీద పడినా

సునామీలు చుట్టుముట్టినా

ఆందోళన చెందకు నేస్తము

విడనాడకు గుండె ధైర్యము


ఆపదలు వెల్లువై వచ్చినా

బ్రతుకులో చీకట్లు క్రమ్మినా

పద! సాహసమే ఊపిరిగా

నమ్మకమే ఆయుధంగా


ఏవీ! కలకాలం ఉండవు

ఎదురిస్తే ఏమీ! చేయవు

స్థిరత్వమే ప్రామాణికము

సమకూర్చునోయ్! సత్ఫలితము


సానుకూల దృక్పథం గెలుపు

ప్రతికూల యోచనలు చెరుపు

ఏది కావాలో! తేల్చుకో!

నిన్ను ఉన్నతంగా మలచుకో!
















చిన్నోడి సూక్తులు

----------------------------------------

బలమైనది బంధము

గుబాళించు గంధము

జాగ్రత్తగా మసలి

నిలువుకున్న అందము


మనోవ్యాధి నరకము

మనశ్శాంతి నాకము

పనికిరాని పనులతో

చేయకు బ్రతుకు వ్యర్థము


చేతనైన సాయము

చేయాలోయ్! న్యాయము

ఎట్టి పరిస్థితుల్లో

తప్పరాదు ధర్మము


మితిమీరిన కోపము

తెస్తుంది అనర్ధము

చెరుపును ఆరోగ్యము

దోచును ఆనందము







నాన్నమ్మ సూక్తి సుధ

----------------------------------------

ఓటమి స్థిరంగా ఉండదు

ప్రయత్నం వృధా కానేరదు

ప్రయత్నిస్తే పోయేది లేదు

లేకుంటే విజయమే రాదు


తప్పటడుగులు వేస్తేనే

చక్కగా నడక వచ్చేది

కష్టపడి పనిచేస్తేనే

భావి బ్రతుకు బాగుండేది


సాహస పనులు చేస్తేనే

చరిత్రలో నిలిచిపోయేది

ఉన్నతంగా చదివితేనే

ఉజ్వల భవిష్యత్ ఉండేది


తల్లిదండ్రులను చూస్తేనే

కుటుంబాలు వర్ధిల్లేది

పున్నమి నాటి రాత్రుల్లా

పండు వెన్నెల వెదజల్లేది


-గద్వాల సోమన్న


Comentarios


bottom of page