top of page

అల్‍విదా



'Alvida' - New Telugu Story Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 01/02/2024

'అల్‍విదా' తెలుగు కథ 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ



"వాన్నాగుబా!.. వాబా!" రంగా పలకరింపు.

"ఆ..వునీ.." సుబ్బు జవాబు

"న్నాగుబా.. లాచా.. లాచా!"

"దివుం టూంమఏ క్కఅ నీ"

"దివుం స్తూరివలక న్నేని.."

"కలే.. నా తోంనమాభిఅ.."

"వాబా!.. మేనమాభిఅ గార్తిపూ"

"దాంగ్గిత మురకాంహఅ"

"వాబా దింగ్గత"

"ఆ.. దింవుటూంమఏ ల్లిచె నా!"

"టదంస్తుచే య్యమమా లోరత్వ న్నుని.."

"టీంఏ!"

"వాబా స్‍య.."

"ఒరేయ్ రంగా! ఇక ఆ గులుతె భాష ఆపి తెలుగులో విపులంగా మాట్లాడు"

"దింవు క్కఅ నేక్కప్ర"

"ఉండనీరా.. వుంటే ఏం!.. నాకు భయమా!"

"నీకు భయంలేదు.. నాకు భయం!" విచారంగా చెప్పాడు రంగ.

ఎదుటి సోఫాలో కూర్చొని వుంది తార. రంగ పెదనాన్నగారి కూతురు. సుబ్బుకు కాబోయే భార్య..

అంతవరకు రంగ చేసిన అర్థంగాని భాషను తాను విన్న వాడి ఆ ఛాటింగ్.. సుబ్బుతోనే అని తారకు అనుమానం.

"రంగా! ఇంతవరకూ నీవు మాట్లాడింది బావతోనే కదా" సందేహంగా అతని ముఖంలోకి చూస్తూ అడిగింది తార.

"అవును.."

"ఏమంటున్నాడు మీ బావగాడు!"

"ఏ విషయంలో!"

"నా విషయంలో!.."

"నీ విషయంలో అంటే!"

"విషయం నీకు తెలీదా"

"నీవు చెప్పావా?"

తార ఆశ్చర్యపోయింది. కొన్ని క్షణాలు రంగ ముఖంలోకి తీక్షణంగా చూచింది.

"చెల్లీ!.. ఏందే ఆ చూపు!" అడిగాడు రంగ.

"రంగా! నేను నిన్ను నమ్మవచ్చా!"

"ఏ విషయంలో?"

"నా విషయంలో!"

"అంటే..! అర్థం కాలేదు. కాస్త విపులంగా చెప్పు"

"నాకు మీ బావ అంటే ఇష్టం లేదు!"

"ఏమిటీ!" ఆశ్చర్యంతో అడిగాడు రంగా

"అవును.. నేను చెప్పింది నిజం" గంభీరంగా చెప్పింది తార.

ఆశ్చర్యంతో కొన్ని క్షణాలు రంగా తార ముఖంలోకి చూచాడు.

తార.. సుబ్బు మేనమామ కూతురు. వైజాగ్‍లో బి.టెక్. చదువుతూ వుంది. ఫైనల్ ఇయర్. ఆమె తల్లిదండ్రులు. రామారావు.. కాత్యాయనీలు ఫైనల్ ఇయర్‍లో పరీక్షలు ముగియగానే తార వివాహం సుబ్బుతో జరిపించాలని నిర్ణయంలో వున్నారు. ఆ వివాహం.. ఆ రెండు కుటుంబాల సభ్యులకు ఆమోదం.

"మీ బావ.. అన్నావ్! సుబ్బు నీకు బావ కాదా!"

"కాదని నేను అనలేదే" వ్యంగ్యంగా జవాబు చెప్పింది తార.

"మన కుటుంబాల మధ్యవున్న బంధుత్వాన్ని మనకు ఒకరిపట్ల ఒకరికి వున్న అభిమానాన్ని, ప్రేమను మరచి మాట్లాడావు తార! బావ నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు తెలియదా!"

"అది ప్రేమ కాదు వ్యామోహం"

"అంటే!"

"వాడికి కావాల్సింది నా అందం. నా చేరిక.. తప్ప నామీద నిజమైన అభిమానం లేదు. అందుకే చెప్పాను నేను వాడిని వివాహం చేసుకోనని" నిర్లక్ష్యంగా చెప్పింది తార.

"నీ అభిప్రాయం సరైనది కాదు తార!"

"దాన్ని తేల్చి చెప్పేదానికి నీవెవరు? అది నా స్వవిషయం. అందులో జోక్యం కలిగించుకొనే హక్కు ఎవరికీ లేదు" ఆవేశంతో చెప్పింది తార.

ఆశ్చర్యంతో కొన్ని క్షణాలు రంగా తార ముఖంలోకి చూచాడు.

’తారలో ఎంత మార్పు.. ఎంత ధైర్యం.. తనకంటే వయస్సులో పెద్దవాళ్ళు అయిన బావను.. నన్ను.. వాడు వీడు అనే లెవల్‍కు ఎదిగింది. అంటే!.. తను ఎవరినో ఎన్నుకొంది. బావను తృణీకరిస్తూ వుంది. బావతో తాను తిరిగిన తిరుగుళ్ళను, చెప్పిన మాటలను, అన్నింటినీ మరచిపోయింది. ఆ మార్పుకు కారణం అయిన ఆ వ్యక్తి ఎవరు?.. కనిపెట్టాలి.. తార తనతో మాట్లాడిన మాటలను బావకు చెప్పకూడదు. బాధపడతాడు. బావది ఎంతో మంచి మనసు. తారను ఎంతగానో ప్రేమించాడు. తాను కోరినవన్నీ తీసి ఇచ్చాడు. అభిమానించాడు.. ఆదరించాడు.. ప్రేమించాడు. కానీ.. తార ఈనాడు బావకు తనకు ఎలాంటి సంబంధం వుండబోదని తేల్చి చెప్పింది. ఆమె మనస్తత్వం మారే దానికి కారణం ఎవరో కనిపెట్టాలి. వాళ్ళ వివరం తెలుసుకోవాలి’ అనుకొన్నాడు రంగ.

రంగా సెల్ మ్రోగింది.

"హలో!.. భాషా ఏమిటి విషయం!"

"వాట్సప్‍లో నీకు రెండు ఫొటోలను పెట్టాను చూడు. చూచిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి. నీకో ముఖ్యమైన విషయం చెబుతాను" భాషా సెల్ కట్ చేశాడు. 

రంగా సెల్‍ను జేబులో పెట్టుకొని..

"తారా! నేను మా ఇంటికి వెళుతున్నాను. బావ విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించు. ఆవేశంతో తీసుకొనే నిర్ణయాలు ఆనందాన్ని కలిగించవు" రంగా తార ఇంటి ప్రాంగణాన్ని దాటి వీధిలో ప్రవేశించాడు. 

  *

గతంలో..

సుబ్బు ఆఫీసునుంచి వచ్చి తన గదిలో ప్రవేశించి బూట్లు విప్పుకొంటున్నాడు. అతని ఐ ఫోన్ మ్రోగింది.

"హలో!.."

తార కంఠం భోరున ఏడుస్తూ వుంది.

సుబ్బు ఆశ్చర్యపోయాడు.

"తారా!.. ఎందుకు ఏడుస్తున్నావ్?" ఆత్రంగా అడిగాడు.

"నా సెల్ పనిచేయడం లేదు. అమ్మా నాన్నలతో మాట్లాడలేక పోతున్నాను. నాకు ఓ సెల్ కావాలి!" ఏడుస్తూనే చెప్పింది తార.

"సరే..! సరే!.. ఇప్పుడు సమయం ఎనిమిది గంటలు. నేను నీ హాస్టలు దగ్గరకు వచ్చేదానికి గంటపైగా పడుతుంది. అప్పటికి షాపులు మూయవచ్చు. కాబట్టి ప్రశాంతంగా తిని.. పడుకో! రేపు నేను నీకు కొత్త సెల్ కొని ఇస్తాను" ఎంతో అభిమానంతో చెప్పాడు సుబ్బు. 

తార శాంతపడింది.

"రేపు తప్పకుండా సెల్ తీసివ్వాలి!"

"అలాగే!.. మాట చెప్పానుగా.. నేను మాట తప్పనని నీకు తెలియదా!"

"ఏమో అది నాకు తెలీదు. నాకు ఐ ఫోన్ కావాలి"

"అలాగే రేపు తీసి ఇస్తాను సరేనా!"

"మాట తప్పకూడదు"

"తప్పను"

"సరే!.. చూస్తాను"

"చూడు.." నవ్వాడు సుబ్బు.

తార సెల్ కట్ చేసింది.

ఏదో మాట్లాడబోయిన సుబ్బు.. నిరుత్సాహంతో సెల్ జేబులో వేసుకొన్నాడు.

అన్నమాట ప్రకారం ఆ మరుదినం సుబ్బు తారకు సెల్ కొనిచ్చాడు.

  *

"సుబ్బూ!.."

"చెప్పు తార!"

"నీవు నన్ను ప్రేమిస్తున్నావా!"

"నామీద నీకు సందేహమా!"

"అవును.." నిశ్చలంగా చెప్పింది తార.

"నీపట్ల నాకు వున్న ప్రేమను రుజువు చేయడానికి నేను ఏం చేయాలి?"

"నేను చెప్పింది చేయాలి"

"ఏం చేయాలో చెప్పు!"

"నీవు నాతో డెంటల్ డాక్టర్ దగ్గరకు రావాలి!"

"ఎందుకు?"

"నేను నాపై ముందు రెండు పళ్ళను డాక్టర్‍కు చూపించాలి"

"నీ పై దవడ మధ్యన వున్న ముందు పళ్ళు ఎంతో అందంగా వున్నాయి తార!"

"అవి కాస్త ముందుకు వున్నాయి. అది నాకు నచ్చలేదు. సరి చేయించుకోవాలి. నాతో వస్తావా! రావా!"

"వస్తాను.. పద!.."

ఇరువురూ డెంటిస్టును కలిశారు. ఫీజు వెయ్యి రూపాయలు తీసుకొన్నాడు. తార పళ్ళను పరీక్ష చేశాడు డాక్టర్.

"పండ్లను గ్రైండ్ చేసి.. వాటిపైన కోటింగ్ వేస్తాము. ఖర్చు ఇరవై ఒక్క వేయి అవుతుంది" చెప్పాడు డాక్టర్.

తను వూరికి వెళుతున్నానని ఐదు రోజుల తర్వాత రావాల్సిందిగా చెప్పాడు డాక్టర్.

అప్లికేషన్ ఫారం పూర్తిచేసి డాక్టర్ అసిస్టెంట్‍కు ఇచ్చి క్లినిక్‍ నుంచి బయటకు వచ్చారు తార సుబ్బు. తనకు ఇష్టం లేనందున సుబ్బు తారతో ఆ విషయాన్ని గురించి తర్వాత మాట్లాడలేదు.

  *

వరుసకు బావా మరదలు అయిన సుబ్బు, తారలు మేనత్త మేనమామ సంతతి. ఆ ఇరువురికి వయస్సున ఐదేళ్ళ వ్యత్యాసం ఇరువురూ వుండేది వైజాగ్‍లోనే. సుబ్బు రైల్వే ఇంజనీర్.. తార.. బి.టెక్ ఫైనల్ ఇయర్. కాలేజీలో తారకు తన సీనియర్ నారాయణతో కాలేజీలో చేరిన మూడు వారాలకే పరిచయం కలిగింది. నారాయణ కళాకారుడు.. అందాన్ని ఆరాధిస్తాడు. అవకాశం దొరికితే అనుభవిస్తాడు. చక్కగా ఛలోక్తులతో మాట్లాడి ఎదుటివారు ఎలాంటివారైనా బుట్టలో పడేయగల సమర్థుడు నారాయణ. రెండు సంవత్సరాల క్రిందట తార.. అని వలలో చిక్కుకుంది. అవసరాలను తీర్చేటందుకు సుబ్బును.. ఆనందాన్ని పంచుకొనేటందుకు నారాయణను ఎన్నుకొంది ఆ నవనాగరికపు అందాలరాశి. అదే కాలేజిలో చదువుతున్న బాషాకి తార నారాయణులు, వారి లీలలు బాగా తెలుసు..

  *

రంగా తార ఇంటినుంచి బయటకు రాగానే బాషా వాట్సప్‍లో తనకు పంపిన ఫొటోలను చూచి ఆశ్చర్యపోయాడు. ఆ రెండు ఫొటోలలో తార, నారాయణులు చేరువగా ఆనందంగా నవ్వుకొంటున్నారు. ఒక గ్లాసులో జ్యూస్‍ను ఇరువురూ ఒక స్ట్రాతో తాగుతున్నారు. రంగాకు తలపై పిడుగు పడినట్లయింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు.

కొన్ని క్షణాల తర్వాత బాషాకు ఫోన్ చేసి.. సుబ్బు ఇంటికి రమ్మని చెప్పాడు. రంగా సుబ్బు ఇంటికి వెళ్ళాడు. ముగ్గురూ కలిశారు. రంగా, తనకు భాషా పంపిన ఫోటోలను సుబ్బుకు చూపించి, తార తనతో మాట్లాడిన విషయాలను అన్నింటిని సుబ్బుకు తెలియజేశాడు.

సుబ్బుకు ఎంతో ఆశ్చర్యం.. ఆవేదన కలిగింది. విచారంతో తలదించుకొన్నాడు.

అతన్ని కొన్ని క్షణాలు పరీక్షగా చూచి భాషా..

"భాయ్!.. సుబ్బూ!.. రంగా నీ గురించి నాకు అంతా చెప్పాడు. నీకేం తక్కువ.. గొప్ప అందగాడివి. మంచి ఉద్యోగం. ఎంతో గొప్ప మనసున్నవాడివి. నీకు ఆ తార తగదు భాయ్.. అది నారాయణ వలలో వుంది. వాడికి పెళ్ళి కూడా అయ్యిందట. ఫేస్‍బుక్‍లో తన బయోడేటాలో అవివాహితులు అని ముద్రించాడు. నేను రంగా నీకు మంచి హితులం. నీ మేలు కోరేవాళ్ళం. మా మాట విను.. ఆ తారకు మార్‍గోలీ.. కహో ఆల్‍విదా.. అల్లా నీకు మంచి అందాలరాశిని.. నీలాంటి మంచి గుణవతిని నీకు జీవిత భాగస్వామిగా చేస్తాడు. నీ యీ దోస్తు బాషా మాట నమ్ము. నీవు ఇలా విచారంగా ఉంటే చూడలేకపోతున్నా అన్నా!.. నవ్వు అన్నా.. ఒకసారి నవ్వు.. ప్రేమాభిమానాలతో చెప్పాడు బాషా..

"బావా! బాషా చెప్పింది నిజం.. ఆ తార నీకు తగదు. నీకు ఇల్లాలు కావాల్సిన నా చెల్లి త్వరలోనే మనకు తారసపడుతుంది. ఆ రాక్షసిని మరిచి.. ఆనందంగా నవ్వు బావా!" ప్రాధేయపూర్వకంగా కోరాడు రంగ.

వారిరువురి మాటలు విన్న సుబ్బు.. నిట్టూర్చి వారి ముఖాల్లోకి చూచాడు. నవ్వుతూ వారి ఇరువురి చేతులను తన చేతులతో గట్టిగా పట్టుకొన్నాడు. అప్రయత్నంగా అతని పెదవులు పలికాయి ’అల్‍విదా!’

*

సమాప్తి

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


31 views0 comments
bottom of page