'Arogyam Mahabhagyam' New Telugu Article Written By A. Annapurna
'ఆరోగ్యం మహాభాగ్యం' తెలుగు వ్యాసం
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
మనిషికి జీవిత కాలం ఎంతో తెలియదు. ఎవరిమీదా ఆధార పడకుండా జీవించాలని ప్రతి వారు కోరుకుంటారు. అందుకు తాత తండ్రి మేన మామల ఆయుర్దాయం కారణం.. వారసత్వం అనుకుంటారు.
అది తరువాత..
ఎవరికివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పదు. మొదట ఆరునెలలకు అన్ని రకాల టెస్టులు చేయిన్చుకుని ఏది అవసరమో దానికి మందులు వాడుతూ ఆహార నియమాలు పాటించాలి.
వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అన్నిటిలో సులువైనది మన స్కూళ్లలో డ్రిల్ల్ క్లాస్ లో చెప్పిన వ్యాయామం చేస్తే చాలు. వాకింగ్ చాలదా అంటే అది కేవలం కాళ్లకు మాత్రమే ఎక్సర్ సైజు. చేతులకు, పొట్టకు కాదు. కనుక చేతులు, శరీరం మొత్తం కదిలించే ఎక్సర్సైజ్ చేయాలి.. స్టేషనరీ బైక్ చేయాలి.
ఇప్పుడు చాలా మంది నడక ఒక్కటే నడుస్తున్నారు. అది చాలదు.
వాకింగ్కి వెళ్లేముందు సాయంకాలం ఎక్సర్సైజ్ తప్పని సరిగా చేస్తే సులువుగా అన్నిపనులు చేసుకుంటాం. ఎవరి సహాయం అవసరం ఉండదు. సీనియర్ సిటిజెన్ హోమ్స్ అవసరం రాదు.
పిల్లలు పట్టించుకోరు.. అనుకోడం కాదు. “మిమ్మల్ని మీరే పట్టించుకోడం లేదు అనేది నిజం! మీ శరీరం మీకు సహకరించాలి అంటే మీదే బాధ్యత. ఎక్సర్ సైజ్ అంటే చాల సులువైన పద్ధతులు పాటించవచ్చు.
గూగుల్ సెర్చిలో బోలెడు వీడియోలు వున్నాయి. ఆహారం కూడా పాత పద్ధతులు రుచి అంటూ ఎగబడక్కరలేదు.
వాటికి దూరంగా ఉండాలి.
హెయిర్ స్టైల్, మాట, నడక తీరు మార్చుకున్నప్పుడు ఆహారం కూడా మార్చుకోగలం. సలాడ్స్, ప్రోటీన్స్, పళ్ళు, గింజలు ఎందుకు తినలేము? తినగలం.
అలవాటు చేసుకోవాలి అనే పట్టుదల అవసరం.
సీనియర్ సిటిజెన్స్ కి ఏదో ఒక అనారోగ్యం వచ్చినా గమనించి తగిన శ్రద్ద తీసుకుంటే నివారణ వుంది. మాకు తెలిసిన వారు ఎనభై ఏళ్ల వయసులో స్పైనల్ కార్డు, మోకాళ్ళు, హిప్ సర్జరీలు చేయిన్చుకుని హాయిగా వున్నారు.
కొంతమంది డబ్బు వున్నా ఖర్చు చేయరు. మీ డబ్బు మీకోసం ఖర్చు చేసుకోండి. ఆరోగ్యంగా వుండండి.
అమెరికా లో మా అల్లుడి తాతగారు ఫ్రొఫసర్ గా రిటైర్ అయ్యారు. భార్య చనిపోతే ఒంటరిగా వున్నా క్రమబద్ధమైన జీవితం గడిపి నూటొక్క ఏళ్ళు బతికారు.
ఆయనను పదిహేను ఏళ్లపాటు గమనించాను.
వారి ఇంటి బ్యాక్ యార్డ్ లో చాలా చెట్లు ఉండేవి. ఆ చెట్లమీద పక్షులు గూళ్ళు కట్టుకోడం, పిల్లలను జంట పక్షులు పెంచిన తీరు గమనిస్తూ వాటికి ఆహారం పెట్టేవారు. అప్పట్లో బుక్స్ చదివి జీవన విధానం, పక్షులలో రకాలు తెలుసుకుని కొని తెచ్చి పెంచేవారు. అంటే పంజరంలో పెట్టడం కాదు. చెట్లమీదే ఉండేవి.
కుందేళ్లు ఉడతలు ప్రకృతి పక్షులే ఆయనకు స్నేహితులు!
ఆయన కొడుకులు మనవలు ఊళ్ళోనే వుండి, ప్రతి వారం ఆయనతో గడిపేవారు.
మేము వెళ్ళినపుడు ఇడ్లి, ఫ్రైడ్ రైస్- కారము మసాలాలు లేకుండా చేసి ఇస్తే ఇష్టంగా తిన్నారు. చనిపోవడానికి ముందు ఒక నెల రోజులు రీహాబిలిటేషన్ సెంటర్లో వున్నారు తప్ప, ఒంటరిగానే గడిపారు. చివరిదాకా ట్రెడ్మిల్ చేశారు. స్వయంగా వొండుకునే వారు. కొద్దిగా మతి మరుపు వచ్చినా ఇబ్బంది పడలేదు. పూర్తిగా శాఖాహారి.
ఇలాంటి వారిని చూసి మనమూ ఎంతైనా నేర్చుకోడం మంచిది.
***
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)
コメント