top of page

బడబానల భట్టారకుడు

కవులను గూర్చిన కథలు..3 వ భాగం 


'Badabanala Bhattarakudu' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 06/05/2024

(కవులను గూర్చిన కథలు - పార్ట్ 3)

'బడబానల భట్టారకుడు' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
బడబానల భట్టారకుడు


సూర్యోదయం అయ్యింది. తెలుగు రాయుడనే రాజు త్రవించిన ఆ తటాకంలో తామర పువ్వులు వికసించి, కలకలా నవ్వుతున్నాయి. తమరాకుల మీద నీటిబోట్లు, ముత్యాల్లా తళ తళా మెరుస్తున్నాయి. నీటిపిట్టలు శ్రావ్యంగా గానం చేస్తున్నాయి. ఒక ప్రయాణికుడు, నెమ్మదిగా నీటిలో దిగి సూర్యుని కి కర్జ్యం యివ్వడం కోసం దోసిలితో నీళ్లు తీసుకున్నాడు. కుడి చేతి వ్రేలునున్న ఉంగరం బుదంగున నీటిలో పడిపోయింది. నెమ్మదిగా గట్టుమీదకి వచ్చి చెరువు వైపు దృష్టి నిగుడించి 


 " బడబానల భట్టారకు

 కుడి చేయుంగరము రవికిగోబుక్కున కరజ్జం 

 బిడువేళ నూడి నీలో 

 బడియె తటాకంబ నీటి బాయుము వేగన్ "


అని అశువుగా పద్యం చెప్పాడు. ఆనాడు శ్రీరాముడు లంకకు సేతువు కట్టే నిమిత్తం బాణం సందిస్తే, సముద్రుడు పాతాళానికి ఇంకిపోయి నెల బయటపడినట్టు, చెరువు ఎండిపోయి ఉంగరం బయటపడింది. కవిశ్వరుడు దానిని తీసుకుని చెరువు వైపు దయగా చూడగానే మళ్ళీ చెరువు నీటితో నిండి కళ కళ లాడింది. 


బడబానల భట్టారకుడు, శ్రీనాధుడి సమకాలికుడైనా కవిశ్వరుడు. 

***


 తిక్కన సోమాయజి 


నన్నయ్యభట్టు ఆంద్రీకరించగా మిగిలిన పదిహేను సంస్కృత భారతాన్ని సంపూర్ణంగా తెలుగు చేసి, తెలుగు మాటల కండబలాన్ని, జీవశక్తిని నిరూపించి తెలుగు వారికి కవితాబిక్ష పెట్టిన మహనీయుడు 

తిక్కన సోమాయజి. ఈయన పదమూడవ శతాబ్దంలో నెల్లూరి నేలిన 

మనుమసిద్ధి వద్ద మహామంత్రి. 


 తిక్కన, తాను భారతం చెప్పేటప్పుడు వ్రాయడానికి, కుమ్మరి గురునాధుడనే వాణ్ణి నియమించుకున్నాడు. అతడికి చెప్పిన దానిని మళ్ళీ అడగకుండా వ్రాసే శక్తి వుండడంతో తిక్కన తదువుకోకుండా కవిత్వం చెపుతాననీ, చెప్పిందానిని తిరిగి మార్చుకోనని ప్రతిజ్ఞ చేసి, భారతాoధ్రీకరణ ఆరంభించాడు. రచన గంగా ప్రవాహం లా, అడ్డులేకుండా సాగిపోతోంది. శల్యపర్వం లో సహదేవుడు శకునిని చంపిన తరువాత ధుర్యోధనుడు తొలిగిపోయాడని సంజయుడు, ధృతరాష్ట్రుడికి చెప్పే చోట 


 " పలపలని మూకలో, 

 గాల్నిలువక గుర్రంబుడిగ్గి నీ కొడుకు గదా 

 కలితభుజుడగుచు నొక్కడు 

 దొలగి చనియే.. 


అన్నంతవరకు పద్యం చెప్పి, తరువాత తోచక తిక్కన " ఏమి చెప్పుదున్ గురునాధా " అని కుమ్మరి గురునాధుని ఆడిగాడు. అతడది పద్యంలో చేర్చి నాల్గవపాదం " దొలగి యనియె నేమిచెప్పుదు గురనాధా " అని వ్రాసేసాడు. తిక్కన, తనకు తడబాటు వచ్చిందని, ప్రతిజ్ఞ చెడిపోయింది అని విచారిస్తోవుండగా, కుమ్మరి గురునాధుడు పద్యమంతా చదివి " ఏమి చెప్పుదున్ గురునాధా " అన్నది పద్యంలో కలిసిపోయింది అని " కురునాధా " అన్నమాట ధృతరాష్ట్రుడికిఅన్వయిస్తుంది అని, అందువల్ల ప్రతిజ్ఞ కి భంగం కాలేదని సర్ది చెప్పాడుట. తిక్కన ఆశుకవితాశక్తి అంత గొప్పది. 


ఆరోజుల్లో శైవులకి, వైష్ణువులకి మధ్య తరుచుగా పోరాటాలు జరుగుతువుండేవి. అందువల్ల దేశంలో ఆశాంతి ప్రబలిపోయింది. తిక్కన తన భారతనికి హరిహరనాధునికి అంకితమిచ్చి, శివకేశవులకు తేడా లేదని నిరూపించి ఆ ఆశాంతి తగ్గడానికి సహాయపడ్డాడు. 


తిక్కన మహాకావియే కాదు, మహా మంత్రి, రాజనీతి విశారదుడు కూడా, . ఒకప్పుడు అక్కడ అక్కన్న, బయన్న అను మనుమసిద్ధి దాయాదులు నెల్లూరుని ముట్టడించి మనుమసిద్ధిని పారద్రోలి సింహసనం ఆక్రమించుకున్నారు. అప్పుడు తిక్కనామాత్యుడు సహాయం కోసం కాకతీయ గణపతిదేవుడు ఎలుచున్న ఓరుగల్లుకు బయలుదేరాడు. తిక్కన వస్తున్నాడని తెలిసి గణపతిదేవుడు ఎదురేగి, ఆయనను పల్లకిలో మహా వైభవంగా రాజనగరికి తీసుకుని వెళ్ళాడు. రాజసభలో తిక్కన తా భారతన్ని చదివి, వినిపించి శ్రోతలిన్ని మెప్పించాడు. అప్పుడు గణపతిదేవుడు తిక్కన కు కాశ్మీర్ శాలువలు, బంగారు నాణాలు, కొన్ని అగ్రహారాలు సమర్పించి " యింకా ఏమి కావాలో " కోరుకొమ్మన్నాడు. 


తిక్కన మనుమసిద్ధికి రాజ్యం ఇప్పించమని కోరాడు. గణపతిదేవుడు పెద్ద సైన్యం తీసుకుని నెల్లూరు వెళ్లి, కోటను ముట్టడించి, అక్కన, బయన్నలను పారద్రోలి మనుమసిద్ధి ని తిరిగి సింహాసనం మీద కుర్చోపెట్టాడు. 


తిక్కన పినతండ్రి కుమారుడైన ఖడ్గతిక్కన్న మనుమసిద్ధి వద్ద సేనానాయకుడు. ఇతడు మహావీరుడు. ఒకప్పుడు మనుమసిద్ధికి కాటాంరాజు అనువానికి వివాదం వచ్చి జరిగిన యుద్ధం లో, ఖడ్గతిక్కన ఓడి, యింటికి వచ్చినప్పుడు అతడి తల్లీ, భార్య కలిసి స్నానానికి నీళ్లు తోడి నులకమంచం చాటు పెట్టి, పసుపు ముద్ద పీటమీద పెట్టారట. ఖడ్గతిక్కన్న " ఇదేమిటి అని " అడుగగా, 


 " పగరకు వెన్నిచ్చినచో 

 నగరే నిను మగతనంపు నాయకులందున్ 

 ముగురాడువార మైతిమి 

 వగవేటికి జలకమాడ వచ్చినచోటన్ "


అని జవాబు యిచ్చారుట. దానితో ఖడ్గతిక్కన్నకు రోషం వచ్చి, మళ్ళీ వెంటనే యుద్ధరంగానికి వెళ్లి, ఘోరంగా పోరాడి వీరమరణం పొందాడు. అటువంటి వీరమాతలు, భార్యలు, మహావీరులు ఆంధ్రుల చరిత్రలో అడుగడుగునా కనిపిస్తూ వుంటారు. 


తెలుగు కవులలో తిక్కన ని మించిన వారు యింతవరకు జన్మించలేదు. 


 మూడవ భాగం సమాప్తం

 నాలుగవ భాగం త్వరలో. 


ఆధారం మా తండ్రిగారు కీర్తిశేషులు జీడిగుంట రాఘవేంద్ర రావు గారి రచన

  • శ్రీనివాసరావు జీడిగుంట


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
45 views0 comments

Comments


bottom of page