top of page

 వేములవాడ భీమకవి

కవులను గూర్చిన కథలు - పార్ట్ 1


'Vemulavada Bhimakavi' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 26/04/2024

(కవులను గూర్చిన కథలు - పార్ట్ 1)

'వేములవాడ భీమకవి' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



దక్షరామం బీమేశ్వరస్వామి భక్తుల కోరికలు తీర్చేవాడని ప్రసిద్ధి. ఒక పర్యాయం, కొందరు బ్రాహ్మణ స్త్రీలు భీమేశ్వరుని దర్శించి, పూజలు చేసి, తమ కోరికలు విన్నవించుకున్నారు. వారిలో అమాయకురాలైన ఒక బాల వితంతువు తనకు కుమారుడు కావాలని భక్తితో కోరుకుంది. 

 స్వామి దయవలన ఆమె గర్భవతి అయి పుత్రుడు ని కన్నది. అతడే వేములవాడ భీమకవి. 


 వితంతువు బిడ్డని కన్నదనగానే ఆ ఊరివారు ఆ కుటుంబాన్ని వెలివేసారు. అయినను జంకక ఆమె స్వామిని నమ్ముకుని, ఆ బాలుడిని పెంచి పెద్దవాణ్ని చేసింది. ఒకనాడు ఒక శ్రీమంతుని యింట్లో శుభకార్యం జరుగుతుంది. వూరిలోని బ్రాహ్మణలందరిని భోజనానికి పిలిచారు. కాని, వెలిలో వున్న భీమన్నని పిలువలేదు. భీమన్నకు యిది అవమానంగా తోచింది. 


భోజనాలు జరిగేచోటుకి వెళ్ళాడు. అక్కడ వారు యితనిని చూసి తలుపులు బిడాయించుకున్నారు. భీమన్నకు కోపం వచ్చింది. వీధి ఆరుగు మీద కూర్చుని " అప్పాలన్నీ కప్పలు కావాలి, అన్నమంతా సున్నం కావాలి " అని చప్పట్లు చరుస్తో పాడాడు. భీమేశ్వరస్వామి తన కుమారునికి కలిగిన అవమానానికి కోపించాడేమో అన్నట్టుగా విస్తళ్ళలో 

అన్నమంతా సున్నమైపోయింది, అప్పాలన్నీ కప్పలై గెంతడం మొదలుపెట్టాయి. భోజనానికి వచ్చిన బ్రాహ్మణలందరు ఖంగారుపడి, తలుపులు తీసి చూస్తే, అరుగు మీద కూర్చొని పాడుతున్న భీమన్న కనపడ్డాడు. 


అది అతని మహాత్యమేనని గ్రహించి గృహయజమాని బ్రతిమాలి, క్షమించమని కోరి, భీమన్నను కూడా విందుకు ఆహ్వానించాడు. తిరిగి బీమన్న కప్పలన్నీ అప్పాలు కావాలి అని, సున్నమంతా అన్నం కావాలని పాడగా అన్నీ యధాస్థితికి వచ్చాయి. దానితో వెలి తొలిగిపోయింది. 


భీమేశ్వరుని అనుగ్రహం వల్ల భీమన్నకు కవిత్వం శాపానుగ్రహశక్తి అలవడ్డాయి. ఒకరోజు ఆయన లేటవారపు పోతరాజు అనే రాజుని చూడటానికి వెళ్ళాడు. పోతరాజు యింట్లో వుండి కూడా నౌకర్లు చేత లేడనిపించాడు. భీమకవి అది గ్రహించి, కోపించి


 " కూటికి కాకులు కూసెడు 

 నేటావలా మూక గూడి ఏడువ దొడగెన్ 

 కాటికి కర్రలు చేరెను 

 లేటవరపు పోతారాజు లేడా లేడా "


అని కళ్ళేఱ్ఱచేసి అడిగాడు. వెంటనే యింట్లో వున్న పోతరాజు గిలగిలా తన్నుకుని మరణించాడు. ఇది భీమకవి మహాత్యమేనని తెలిసి, పోతరాజు బంధువులు ఆయన కాళ్ళపై పడి ప్రార్ధించగా :-


 " నాటి రఘురాము తమ్ముడు, 

 పాటిగ సంజీవి చేత బ్రతికిన భoగీన్ 

 కాటికి భో నీకేటికి, 

 లేటవరపు పోతరాజ లేమ్మా రమ్మా "

అని దీవించాడు. పోతరాజు నిద్రపోయినవాడు లేచ్చినట్టుగా లేచి కూరుచున్నాడు. 


ఒకసారి భీమకవి సామర్లకోట దగ్గర వున్న చాలాఖ్య భీమవరం అనే గ్రామంకి వెళ్ళాడు. ఇతని నోటికి భయపడి, ఆ వూళ్ళో వుండటానికి ఎవ్వరు యిల్లు ఇవ్వలేదు. దానితో కోపం వచ్చి "ఈ ఊరు పాడుపడుగాక "అని శాపమిచ్చాడు. ఊరు పాడుపడిపోయింది. ఈనాటికి కూడా పాడుపడిన దిబ్బలు కనిపిస్తాయి. ఇప్పటి ఊరు ఆ దిబ్బలకు అరమైలు దూరంలో వుంది. 


భీమకవి రచించిన రాఘవ పాండవీయమనే రెండు అర్ధలా కావ్యం కాలాగర్భంలో కలిసి మనకు దక్కకుండా పోయింది. 


ఈయన మరణం గురించి కూడా చిత్రమైన కథ వుంది. ఈయన తల్లిగారు బ్రాహ్మణులకు సoతర్పణ చేసింది. నెయ్యి వడ్డీస్తోవుండగా, నేతి గిన్నికి వున్న మసి ఆజాగ్రత్త వల్ల ఆమె కడుపుకు అంటుకుంది. అది చూసి భీమకవి " అమ్మా నీ కడుపు మసి అయ్యింది " అన్నాడు. ఆయన అన్న మాట అయితీరుతుంది కనుక వెంటనే నేలబడి మరణించాడు. కడుపు మసి అయిందంటే కొడుకు చనిపోవడం అని అర్ధం. 


ఈ కవి కావ్యాలు ఏమీ మిగలకపోయినా ఆయన చాటువులు ఆయన మహాత్యానికి సంబందించిన కథలు తెలుగు వారు మరువరానివి. 



 శుభం

 త్వరలో యింకో కవి గారి గురించి 

కవులను గూర్చిన కథలు - పార్ట్ 2 త్వరలో..

***

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.













35 views0 comments
bottom of page