top of page

అంతా మంచికే'Antha Manchike' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 20/04/2024

'అంతా మంచికే' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ఆ రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. నేను వైజాగ్ కి అమ్మను చూడడానికి వెళ్ళాను. చాలా సరదాగా అక్కడ ఉన్న అన్ని రోజులు గడిచిపోయాయి. అంతే కదా.. ! కావాల్సిన వారిని కలిసినప్పుడు టైం అస్సలు తెలియదు మరి.. ! 


వైజాగ్ లో మా పేరెంట్స్ ఉంటారు. నేను హైదరాబాద్ లో ఉద్యోగం లో జాయిన్ అయిన తరువాత, నా దగ్గరకు రమ్మన్నా.. రాలేదు. అక్కడే సొంత ఇంట్లో ఉంటానని అంటారు. మా అమ్మకు నాతో హైదరాబాద్ రావాలని ఉన్నా, నాన్నకి మాత్రం ఆ ఇల్లు వదిలి రావడం ఇష్టం లేదు. నేను కూడా.. వాళ్ళని అడిగి అడిగి వదిలేసాను. నాకు వీలైనప్పుడల్లా.. వైజాగ్ వెళ్లి ఒక వారమో, పది రోజులో ఉంటాను. 


అప్పుడు నాది ఒక పది రోజుల ట్రిప్. వైజాగ్ లో అమ్మకు కావాల్సిన వస్తువులన్నీ కొని ఇచ్చాను. నాకు పెళ్లి చెయ్యాలని అమ్మ అన్నాది. నచ్చిన అమ్మాయి దొరకగానే చెబుతాను అని చెప్పాను. సరదాగా ఉన్న ఆ పది రోజులు గడిచిపోయాయి. ట్రైన్ కు ముందే హైదరాబాద్ రిటర్న్ రిజర్వేషన్ అయిపోయింది. రిటర్న్ వెళ్లే రోజు రానే వచ్చింది. వెళ్లాలని లేకపోయినా.. తప్పదు. అక్కడ హైదరాబాద్ లో ఉద్యోగం.. అక్కడ సొంత ఇల్లు.. అన్నీ ఉన్నాయి. 


ఆ రోజు రైల్వే స్టేషన్ కు వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసాను. వాతావరణం చల్లగా.. వర్షం పడేలా ఉంది.. దానికి గాలి కూడా తోడు అయ్యింది. క్యాబ్ ఎంత సేపటికీ రావడం లేదు. అమ్మకి అసలే హై బీపీ. మర్నాడు ఆఫీస్ లో మీటింగ్ కోసం ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోతానేమో అని అమ్మ తెగ టెన్షన్ పడుతోంది. చాలా సేపటి తర్వాత క్యాబ్ ఒకటి వచ్చింది. 'బై' చెప్పి క్యాబ్ ఎక్కాను. 


క్యాబ్ మెల్లగా మొదలైంది. గాలి తగ్గి.. చినుకులు మొదలయ్యాయి.. దానితో ట్రాఫిక్ పెరిగింది. ట్రాఫిక్ చాలా మెల్లగా కదులుతుంది. ట్రైన్ కి ఇంకో గంట సమయం మాత్రమే ఉంది. మనసులో నాకూ టెన్షన్ మొదలైంది.. 


అప్పుడే, ఒక విషయం నా దృష్టిని ఆకర్షించింది. క్యాబ్ వెనుక సీట్ లో కూర్చున్న నేను.. కిటికీ లోంచి పక్కన ఉన్న కార్ లో ఒక అందమైన అమ్మాయిని చూసాను. అందానికి అందం.. ఆ అమ్మాయి. అప్పటివరకూ నేను పడుతున్న టెన్షన్ కాస్త మరచిపోయాను. ఆమె వైపే చూస్తూ ఉండిపోయాను. కొంత సేపటికి మా కార్.. ఆ కార్ ని ఓవర్ టేక్ చేసింది. కానీ, ఆ అమ్మాయిని చూడగానే నా గతం గుర్తుకు వచ్చింది.. 


********

అప్పట్లో.. అనగా కొన్ని సంవత్సరాల కిందట.. నేను కాలేజీ లో చదువుతున్నప్పుడు మాట.. 


"ఒసేయ్.. ! పద్మ.. ! తొందరగా రావే.. బస్సు వస్తోంది.. " అని ఎవరో అనడం బస్ స్టాప్ లో ఉన్న నేను విన్నాను. 


"వస్తున్నానే.. !" అంటూ బదులుగా ఒక అందమైన గొంతు వినిపించింది.. కొంతసేపటికి అంతకన్నా అందమైన రూపం కనిపించింది..

 

"ఎందుకే.. అంత గట్టిగా అరుస్తావు.. ఎవరైనా వింటే ఏమనుకుంటారు.. ?" అంది పద్మ.

 

"బస్సు వెళ్ళిపోతే, ఇంకో గంట వరకు మళ్ళీలేదు.. తెలుసా.. "


"అలాగే లేవే పల్లవి.. ! పద.. బస్సు వస్తోంది ఎక్కుదాము.. "


నేను కూడా రోజూ కాలేజీ కోసం అదే బస్సు ఎక్కుతాను. కానీ, ఈ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు. వెళ్లి అడిగితే తప్పేముంది అనిపించి.. వెళ్లి ఆ అమ్మాయి ముందర నిల్చున్నాను.. 


గుండ్రటి ముఖము.. 

విశాలమైన నుదురు.. 

అందమైన కళ్ళు.. 

అంతకన్నా అందమైన చిరునవ్వు.. 


"హలో.. పద్మగారు.. !" అని అనేశాను.. 


"ఎవరు మీరు.. నా పేరు మీకు ఎలా తెలుసు.. ?"


"ఇంతకు ముందు మీ ఫ్రెండ్ మిమల్ని పిలవడం విన్నాను.. అందుకే తెలిసింది. మీరు ఏమీ అనుకోకపోతే.. మీరు ఏ కాలేజీనో తెల్సుకోవచ్చా.. ?"


"మీకెందుకు చెప్పాలి.. " అంది పద్మ.


"అదీ నిజమే అనుకోండి.. ! కానీ.. ఇద్దరమూ కాలేజీ స్టూడెంట్స్.. అందుకే అడిగాను.. "


"చూడడానికి మంచివారు లాగ ఉన్నారు.. అందుకే చెబుతున్నాను. నేను కొత్తగా 'ఫేమస్' కాలేజీ లో జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ కోసం చూసి.. ఇక్కడ జాయిన్ అవడం లేట్ అయ్యింది అంతే.. !"


"నేను కూడా అదే కాలేజీ లో చదువుతున్నాను. చూస్తుంటే, మనది జన్మ జన్మల స్నేహం లాగ ఉంది పద్మగారు. లేకపోతే, ఇలా ఒకే కాలేజీ లో కలుస్తామా చెప్పండి.. ?"


"మీరు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారే.. ! మీలాగా మాట్లాడేవారంటే.. నాకు చాలా ఇష్టం.. " అంది పద్మ 


"హమ్మయ్యా.. !.. మొదటి మార్కులు బాగానే పడిపోయాయి" అని మనసులో తెగ సంబర పడిపోయాను.


"ఇద్దరమూ.. ఫ్రెండ్స్.. ? మీతో నాకు ఫ్రెండ్షిప్ చెయ్యాలని ఉంది.. " అని షేక్ హ్యాండ్ ఇచ్చింది పద్మ.


"మీలాంటి వారు నా ఫ్రెండ్ అవడం నా అదృష్టం పద్మగారు.. " అని అన్నాను. 


"పద్మగారు ఏమిటి.. ? నేను మీకన్నా చిన్న దానిని కదా.. ! పద్మ అని పిలవండి.. ఇంతకీ మీ పేరు ఏమిటో.. ?"


"చెప్పనే లేదు కదా.. ! నా పేరు బాలసుబ్రహ్మణ్యం.. దగ్గర వారంతా 'బాలు' అని పిలుస్తారు.. "


"నిజమా.. ? ఇది నా ఫ్రెండ్ పల్లవి.. " అని తన ఫ్రెండ్ ని పరిచయం చేసింది పద్మ.


"హాయ్ పల్లవి.. " అని ఒక నవ్వు పడేసాను. 


"మా ఫ్రెండ్ కి దగ్గర వారంతా తనని 'పద్దు' అంటారు.. " అని అంది పల్లవి. 


అలా.. రోజూ బస్ స్టాప్ లో నేను పద్మ ని కలిసాను.. అలా మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా డెవలప్ అయ్యింది. ఒక రోజు.. నాకు 'బై బాలు' అని చెప్పింది పద్మ. నన్ను పద్మ ఇష్టపడుతుందని అనిపించింది. 


ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి.. పద్మ కు ప్రపోజ్ చేద్దామని ఆ రోజు వెళ్లి " ఐ లవ్ యు పద్దు.. " అని చెప్పాను. 


పద్మ నుంచి సమాధానం లేదు. అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రి మా తాతయ్యకు సీరియస్ గా ఉందంటే.. ఊరు బయల్దేరి వెళ్ళిపోయాను.. ఆ తర్వాత నేను పద్మ ను ఇంక కలవలేదు. 


********


కార్ హార్న్ తో మళ్ళీ ఈ లోకం లోకి వచ్చాను. రైల్వేస్టేషన్ కూడా వచ్చింది. క్యాబ్ దిగి నడుస్తున్నాడు. ఆ రోజులే వేరు.. మళ్ళీ ఆ కాలేజీ రోజులు రావు కదా.. ! అనుకుంటూ ఉండగా.. నా ట్రైన్ వెళ్ళిపోయిందని అక్కడ చెప్పారు. చేసేది ఏమీ లేక అక్కడే కూర్చొని ఉన్నాను. 


ఈ లోపు ఎవరో 'పద్మ'అని పిలిస్తే.. వెంటనే తిరిగి చూసాను. ఎవరూ కనిపించలేదు. ఒక్కోసారి అంతే.. కొన్ని విషయాలు గతాన్ని మళ్ళీ ప్రస్తుతంలోకి తీసుకొస్తాయి అనుకున్నాను. 


ఈసారి.. 'బాలు' అని ఎవరో పిలిచారు. ఎవరినో అనుకున్నాను.. కానీ.. అది అదే గొంతు.. వెంటనే తిరిగి చూసాను. ఎదురుగా నా పద్మ. ట్రైన్ మిస్ అవడం మంచిదే అనుకుని ఆ దేవుడికి, కార్ లో కనిపించిన అమ్మాయికి, వర్షానికి థాంక్స్ చెప్పుకున్నాను. 


"పద్దు.. ! నేను గుర్తున్నానా.. ?" అని ఆత్రుతగా అడిగాను


"మరచిపోతే కదా బాలు.. ?" అంది పద్మ 


"ఆ రోజు నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత.. నేను మర్నాడు నీ కోసం కాలేజీ లో చూసాను. కానీ నువ్వు రాలేదు. ఏదో సరగాకి ఎప్పుడూ మాట్లాడినట్టే.. అన్నావని నేను నిన్ను కలిసే ప్రయత్నం కుడా చెయ్యలేదు. ఆ తర్వాత నేను వేరే ఊరిలో పీజీ లో జాయిన్ అయ్యాను. 


ఈ రెండు సంవత్సరాలు నువ్వు చాలా గుర్తుకు వచ్చావు బాలు. ఆ రోజు నువ్వు నాతో చెప్పిన విషయం నిజం అయితే చాలా బాగుండేది అని ఎంతో అనుకున్నాను.. కానీ నాకు అంత అదృష్టమా.. ?" అని నాకు సర్ది చెప్పుకున్నాను.. 


"ఆ రోజు నేను నీతో అన్న మాటలు అక్షరాల నిజమే..  నిన్ను మొదటి సారి చూసినప్పుడే.. నాకు చాలా నచ్చేసావు. ఇప్పుడు ఆఫీస్ లో ఎంత మంది అమ్మాయిలు నా ప్రేమ కోసం వెంట పడుతున్నా.. నీకు తప్ప ఎవరికీ నా మనసులో స్టానం లేదు పద్మ.. " అని అన్నాను. 


"ఐ యాం సో లక్కీ.. " అని నా గుండెల మీద వాలిపోయింది పద్మ.. 


*************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


105 views0 comments

Comments


bottom of page