top of page
Original.png

భగవంతుని భరోసా!

#TeluguKavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #BhagavanthuniBharosa, #భగవంతునిభరోసా, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 76


Bhagavanthuni Bharosa - Somanna Gari Kavithalu Part 76 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 16/05/2025

భగవంతుని భరోసా - సోమన్న గారి కవితలు పార్ట్ 76 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


భగవంతుని భరోసా

----------------------------------------

నమ్మకాన్ని పెంచుకో

దేవునిపై ఆనుకో

మేలు కాదు ఏమాత్రం

వ్యతిరేకత మానుకో


మహోన్నతుడు భగవంతుడు

గుణంలోన శ్రీమంతుడు

శరణన్న వారికైతే

మహిని అపద్భాంధవుడు


మనసారగ వేడుకో

ఆశ్రయంగా చేసుకో

దైవమే తోడుంటే!

అభయమే నీ వెంటే!


భగవంతుని సేవలో

స్వచ్ఛమైన ప్రేమలో

దీపంలా వెలిగిపో"

స్ఫూర్తిగా నిలిచిపో!


భగవంతుని భరోసా!

కోరుకో అమేషా!

భక్తి మార్గాన్ని ఎప్పుడు

చేయొద్దు తమాషా!

ree










అమ్మ సూక్తి ముక్తావళి

----------------------------------------

నమ్మకాన్ని నిండుగా

మనసులో నింపుకో!

ఆనందం మెండుగా

అందరితో పంచుకో!


జ్ఞానంలో గొప్పగా

లోకంలో వెలిగిపో!

స్వయం కృషితో మిన్నగా

బ్రతుకులో ఎదిగిపో!


పదిమందికి మంచిగా

హృదయాల్లో నిలిచిపో!

విజయమే శ్వాసగా

గురి యొద్దకు సాగిపో!


కన్నోళ్లు ముఖ్యంగా

జీవితాన చాటుకో!

దైవమే ప్రాణంగా

ప్రథమంగా కోరుకో!

ree
















మహోన్నతుడు భగవంతుడు

----------------------------------------

సంతృప్తి చెందని వాడు

సృష్టిలోన మానవుడు

మనసారగ వేడగా

వరములిచ్చు మాధవుడు


భయభక్తులు చూపితే

కరిగిపోవును దైవం

మనశ్శాంతి దొరికితే

అదే మనిషికి స్వర్గం


భగవంతునికి మహిలోన

భక్తులే బహు ఇష్టం

దేవున్ని గుండెలోన

నిలువుకున్న సంతోషం


పరిశుద్ధత ఆశించును

హృదయాల్లో భగవంతుడు

అమితంగా దీవించును

విశ్వసిస్తే దేవుడు

ree




















కన్నతల్లి కల్పవల్లి

----------------------------------------

నవ మాసాలు ముద్దుగా

గర్భంలో మోస్తుంది

కనురెప్పలా శ్రద్ధగా

కన్నతల్లి చూస్తుంది


పూలలాంటి తన ఒడిలో

పిల్లలను ఆడిస్తుంది

సదనమనె బడి గుడిలో

భవిత తీర్చుదిద్దుతుంది


చంకలోన ఎత్తుకుని

చేతిలోన పట్టుకుని

గోరుముద్దలు పెడుతుంది

క్షుధ బాధ తీర్చుతుంది


అమ్మ అనురాగదేవత

పరిమళించు సిరిమల్లి

పూజించుము అంచేత

ఆమె ఇంట కల్పవల్లి

ree







సాధనతో ఛేదన

----------------------------------------

ఆత్మవిశ్వాసమే

గెలుగుకగును వంతెన

నమ్ముకున్న వారిని

చేయరాదు వంచన


విజయాలకవసరం

అహర్నిశలు సాధన

ఆదిలో మానాలి

పనికిరాని వాదన


తగ్గించుకోవాలి

గుండెల్లో వేదన

పెద్దల మాట వినాలి

జీవితాన దీవెన


ఏకాగ్రత ఉండాలి

మేలు లక్ష్య ఛేదన

మంచితనం పండాలి

హృదయాలకు సాంత్వన


-గద్వాల సోమన్న


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page