దారి తప్పని ప్రేమ

'Dari Thappani Prema' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'దారి తప్పని ప్రేమ' తెలుగు కథ
రచన: సుదర్శన రావు పోచంపల్లి
రత్నాకర్ - సంధ్యలకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు- వరుసగా కొడుకులు విభాకర్, కపిల్, కేశవ్ - కూతురు ధిషణి.
కుటుంబములో మనసున్న మనిషి అంటె విభాకరె.
తమ్ములు అన్న మార్గములో నడిచేవారే కాని వారిలో అంత సౌశీల్యము కనబడదు- ధిషణి అందరికంటె చిన్నది-అందరి గారాబముతో పెరుగుచున్నది కనుక గుణగణములు బేరీజు వేయబడే అంత వయసు పెరుగ లేదు.
ప్రేమంటె అభిమానము, అనురాగము, అభిమతి, అనురతి లాంటి పదాలు నిర్వచిస్తుంటాడు విభాకర్.
విభాకర్ వచించేది ప్రేమంటె తల్లిని ప్రేమించు, తండ్రిని ప్రేమించు, తోబుట్టువుల. స్నేహితుల, పక్షులు, పశువులు, చెట్లు, పూలు అసలు ప్రకృతినే ప్రేమించేటటువంటి సద్గుణ ముండాలె అనే ప్రకృతి అతనిది.
“ప్రేమంటె ఒక అందమైన అమ్మాయిని ఆమె అంగాంగము వర్ణించుకుంటూ వెంటబడే మనస్తత్వము ప్రేమ అనిపించుకోబడదు” అంటాడు విభాకర్.
“ఇక భార్యను ప్రేమించుట అంటె అవసరానికి మాత్రమే అనక జీవితాంతము మన శరీరాన్ని మనము ఎట్లు ప్రేమించుతమో భార్యకూడా మన జీవిత భాగస్వామి, అర్ధాంగి అని తలచి వ్యవహరించాలి” అని నుడువుతాడు విభాకర్.
సౌదామిని అనే పక్కింటి అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు విభాకర్- అతని భాషలో ప్రేమించుడు కంటె ఇష్టపడుడు అనే పదమే సరియైనది అంటాడు. అతడు జనానికి చేప్పే మాట ఏమిటంటె ప్రేమ అనేది వాళ్ళలో ఒక ఆకర్షణ మాత్రమె.
సౌదామినిని ఇష్టపడినా ముందు ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకో గోరుతాడే కాని నేరుగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని అనబోడు విభాకర్. ఏమాత్రము ఆమె అయిష్తత చూపినా మళ్ళీ ఆమెను తలువబోనంటాడే కాని వెంటబడ పూనుకోడు.
సౌదామిని విభాకర్ ఇంటి ప్రక్కనే ఉండుట చే తరచు ఏ నోముకో పేరంటానికో వచ్చి పోతూ ఉంటుంది- ఆ తీరుగ ఒకరినొకరు చూసుకోవడము తటస్తించింది.
తన మనసులోని మాట సౌదామినికి వ్యక్తపరిచే మార్గము కనబడదు విభాకర్ కు.
ఒకనాడు సౌదామిని వాళ్ళ ఇంటికి చాలా బంధువులు రావడము చే విభాకర్ అనుకుంటాడు సౌదమిని పెళ్ళి చూపులు కావచ్చు అని.
మొత్తము మీద విభాకర్ అనుకున్నదే నిజమౌతది- సౌదామిని పెళ్ళి కుదురుతుంది.
సౌదామిని పెళ్ళి పిలుపుకు విభాకర్ కుటుంబమంతా పోయి అక్షింతలేసి భోజనము చేసి వస్తారు. ఆ రోజు రాత్రే
సౌదామిని అత్తగారింటికి వెళ్ళి పోతుంది.
విభాకర్ కొంత నిరాశకు గురైనా అదే ధ్యాసలో ఉండక తన పనేమో తాను చూసుకుంటూ తమ్ముళ్ళు చెల్లెలుతో సంతోషంగా ఉంటూ ఉంటాడు.
తల్లి దండ్రి విభాకర్ పెళ్ళి ప్రస్తావన చేసినప్పుడు ఇప్పుడు తొందర ఏమిటి అని దాట వేస్తుంటాడు.
సౌదామిని పెళ్ళి అయి మూడు నెలలు దాటి పోతుంది. సౌందర్యానికి ఏమీ తీసి పోని సౌదామినిని ఆమె భర్త వినోద్ ఒక భార్యగా వ్యవహరించక ప్రతి రోజు తిట్టడము, కొట్టడము వేధించుడే పనిగా పెట్టుకుంటాడు.
ఆ బాధలు భరించ లేక చెప్పకుండా తల్లిగారి ఇంటికి వచ్చేస్తుంది సౌదామిని. తలిదండ్రులు బిడ్డ వంటిమీద దెబ్బలు చూసి మూర్ఛ పోయినంత పని చేస్తారు.
“ఏదో ఉపాయము ఆలోచన చేస్తాము కాని బాధ పడకు” అని ఊరడిస్తారు తలిదండ్రులు జానకిరాం సత్య.
మరునాడు తలిదండ్రులు జానకిరాం, సత్య- సౌదామిని అత్తగారింటికి పోయి తమ కూతురు తప్పేమిటి ఎందుకు హింసిస్తున్నారు అని అడుగుతారు -
“కట్ణం సరిపోలేదని మా వాడంటె - కట్ణమెందుకీయాలని మావాణ్ణి నిలదీసేది. వానికి కోపమొచ్చి రెండు కొట్టిండో ఏమో.. ఇంత మాత్రానికి అంత రాద్ధాంత మెందుకు?” అంటారు పిల్లవాని తలిదండ్రులు నారాయణ - శ్యామల.
పైగా “మీ ఇష్టమండి! మీ అమ్మాయిని మీదగ్గరే ఉంచుకొండి - మావానికి మీ సౌదామిని ఇష్టము లేదట” అని నిస్సిగ్గుగా అంటారు.
ఇంకా “మావాడు విడాకులు ఈయడానికి సిద్ధముగా ఉన్నాడు” అంటుంటే “తల్లిదండ్రులే ఈ మాటంటె ఇక అడగడానికేముంది? ఆ విడాకుల పత్రము మేమే వ్రాసి పంపుతము, సంతకాలు చేసి పంపమనండి మీ కొడుకును” అని - “అయిన మీతో రాజీ పడినా మా అమ్మాయి ప్రాణానికి ఎన్నడైనా ముప్పే- అన్యోన్యత లేని కాపురము పులిమీద స్వారీ అంటిది” అని వెళ్ళొస్తారు జానకిరాం సత్య.
ఇంటికొచ్చి ఈ విషయము సౌదామినికి తెలియ జేస్తారు తలిదండ్రులు జానకిరాం సత్య -
“మంచిపని నాన్నా! ఆ రాక్షసుల నడుమ బ్రతుకలేను- మీ పరువెక్కడ పోతుందో అని మూడు నెలలు భరించిన.. ఇక నా శక్తి సరి పోదు” అని విలపిస్తుంది సౌదామిని.
సౌదామినిని ఊరడించి విభాకర్ ఇంటికొచ్చి తండ్రి రత్నాకర్ తో జరిగిన సంగతంతా వివరిస్తూ కన్నీరు కారుస్తాడు- సౌదామిని తండ్రి జానకిరాం.
అదంతా వింటున్న విభాకర్ “మంచి పని చేశారు మామయ్యా - ఆ విడాకులేమిటో త్వరగా ఇచ్చేసి మీ అమ్మాయికి వెంటనే మరో పెళ్ళి చేసెయ్యండి” అంటాడు విభాకర్.
“ఎంగిలి కూడుకు ఎవరు ఆశపడుతారు నాయనా” అనుకునంటూ మరోసారి కన్నీరు కారుస్తాడు సౌదామిని తండ్రి జానకిరాం.
“లోకములో అందరూ దుర్మార్గులుండరు- అది మీ భ్రమ” అనుకుంటూ లోనికి పోతాడు విభాకర్- “ఐదు నిమిషాలు కూర్చొండి మామయ్యా” అనుకుంటు.
తండ్రిని తల్లిని పిలిచి నేరుగా అంటాడు “సౌదామినిని నేను ఇష్టపడుతున్న.. మీకు అభ్యంతరము లేకుంటె ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను” అని, “ముందు ఆ అమ్మాయి మనస్పూర్తిగా సరే అంటెనే సుమా” అంటాడు విభాకర్.
“నాయనా! నీ విశాల హృదయానికి మాకూ సంతోషమే- మన ఇంట్లో ఇంకా ఇద్దరు మగపిల్లలూ ఒక ఆడపిల్ల ఉందికద.. అన్ని విధాల ఆలోచించుకో. తొందర పడి ఉద్రేకానికి పోయి నిర్ణయాలు మంచివికావు” అంటారు తలిదండ్రులు రత్నాకర్ - సంధ్య.
“లేదమ్మా! నేను రాత్రి నుండి ఆలోచన చేస్తున్న- ఇంకొకటి బాగుగా ఆలోచించండి. ఆ మామయ్య ఆత్మీయతా భావముతో మనదగ్గరికొచ్చి బాధ తెలియ జేస్తున్నాడు” అంటాడు విభాకర్.
“సరె నాయనా నీ ఇష్టము. మంచైనా చెడైనా రేపు బరువు మోసేది నీవే కద” అంటారు తలిదండ్రులు.
రత్నాకర్, సౌదామిని తండ్రి జానకిరాం దగ్గరికి పోయి లోపలి వాళ్ళ సంభాషణ తెలియపరుస్తాడు.
సౌదామిని తండ్రి జానకిరాం రెండు చేతులు జోడించి “దేవుడు ఏది చేసినా మన మేలుకొరకే అంటారు. ఈ రోజే మా సౌదామినితో సంప్రదించి ఆ విడాకుల తతంగము ముగించుకునే ఏర్పాటు చేస్తాను” అని ఆత్రత పట్టలేక తన యింటికి వెళ్ళిపోతాడు.
విభాకర్ మనసులో అనుకుంటాడు “నేను తెంపబోయే పండు రాలి మట్టిలో పడ్డది - కడుక్కుని తింటె దాని తీపి ఎటూ పోదుకదా” అని.
తండ్రి చెప్పిన సమాచారానికి సౌదామిని ఎంతో సంతోషపడుతది. విడాకులు ఎప్పుడా అని ఎదురు చూపులతో ఉంటుంది.
మూడు నెలల లోపల విడాకులు కాగానే సౌదామిని - విభాకర్ వివాహం జరిగిపోతుంది.
దారి తప్పని ప్రేమతో విభాకర్ పేరుకు తగ్గట్టు వ్యవహరిస్తుంటాడు.
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
https://www.manatelugukathalu.com/profile/psr
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.