కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Doctor Purnima' New Telugu Story By Dr. Shahanaz Bathul
రచన : డా: షహనాజ్ బతుల్
“సుమతీ! ఇలా రా..” తన మనవ రాలిని పిలిచింది డాక్టర్. పూర్ణిమ.
పలుకకుండా లోపలకు వెళ్ళిపోతుంది సుమతి.
మనవరాలికి మంచి మార్కులు వచ్చాయని, బాగా చదువుతుంది అని కౌగిలించుకొని, అభినందన తెలుపుదామనుకుంది. కానీ మనవరాలు ఎప్పుడూ తన దగ్గరకు రాదు.
స్వాతి గమనిస్తుంది.
"మా అమ్మను ఏమనుకుంటున్నావు? అమ్మను అసహ్యిచుకుంటున్నావు. పిలిస్తే రావు. నీకు క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తే అభినందనలు చెప్పాలని నిరీక్షిస్తోంది."
తన తల్లి కథ కూతురికి చెప్పుతుంది స్వాతి.
***
కమలమ్మ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే, గోపి వచ్చి చూసాడు.
“అమ్మా! అక్క ఫోన్ చేసింది” అని చెప్పి ఎత్తాడు.
అవతల ఫోన్ లో పూర్ణిమ ఏడుస్తుంది.
“అక్కా! నేను గోపీని. ఎందుకు ఏడుస్తున్నావు?”
"మీ బావగారు.." అని ఊరుకుంది.
“ఏది ఇటువ్వు” అని కమలమ్మ ఫోన్ తీసుకుంది.
"పూర్ణిమా! ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు తల్లి. సరే.. నేను, గోపి వస్తున్నాం." అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
"గోపీ! పద.. పూర్ణిమ దగ్గరకు వెళదాం. క్యాబ్ బుక్ చెయ్యి."
గోపి బాబు బంటి నీ చూసుకోమని, పని మనిషికి చెప్పి, కమలమ్మ గోపి, పూర్ణిమ ఇంటికి బయలు దేరారు..
వాళ్లకు కారు ఉంది కానీ, కమలమ్మ భర్త ఆఫీస్ కి వెళ్ళారు.
కమలమ్మ కు ఇద్దరు పిల్లలు. పూర్ణిమ, గోపి.
కమలమ్మ భర్త సుధీర్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నారు.
పూర్ణిమ డాక్టర్. అల్లుడు, కిరణ్ కూడా డాక్టర్.
గోపి ఇంజినీర్. గోపి భార్య జయ కూడా ఇంజినీర్.
పూర్ణిమ కి ఇద్దరు కూతుర్లు. ఆరవ తరగతి, నాలుగవ తరగతి చదువుతున్నారు.
గోపి కి ఇద్దరు పిల్లలు. యు కే జి లో పాప, బాబు 2 సంవత్సరములు.
కమలమ్మ, ఇంటికి కొద్ది దూరం లోనే కూతురు పూర్ణిమ ఇల్లు ఉంది.
తను రావడం గానీ, వీళ్లు వెళ్ళటం గానీ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కమలమ్మ ఏదైనా వండినా, కూతురి ఇంటికి పంపిస్తూ ఉంటుంది.
కొన్ని రోజుల క్రితమే అల్లుడి కి కిడ్నీ ఆపరేషన్ అయ్యింది. బాగా అయ్యింది. సక్సెస్ అన్నది. కోలుకున్నారు. అని కూడా చెప్పింది.
ఇప్పుడు ఏదో జరిగింది. లేకపోతే కూతురు ఏమీ మాట్లాడకుండా ఎందుకు ఏడుస్తుంది?
‘దేవుడా! అల్లుడికి ఏమీ కలుగ కూడదు. కూతురు పసుపు కుంకుమలు కాపాడు..’ అంటూ దేవుడ్ని ప్రార్ధించింది.
పూర్ణిమ గైనకాలజిస్ట్. కిరణ్ పిడియాట్రస్ట్. పూర్ణిమ ఒస్మానియా ఆసుపత్రి లో చేస్తుంది. కిరణ్ ప్రైవేట్ ఆసుపత్రి లో చేస్తున్నాడు.
***
పూర్ణిమ ఇంటి దగ్గర దిగి ఇంటిలోకి వెళ్ళారు.
కిరణ్ మంచం మీద అచేతనం గా పడి ఉన్నాడు. మంచం ప్రక్కనే క్రింద కూర్చొని, అయోమయంగా చూస్తుంది.
గోపి, కిరణ్ నాడి పట్టుకొని చూసాడు.
“అమ్మా! నాడి దొరకటం లేదు” అన్నాడు.
పూర్ణిమని పిలిచినా జవాబు లేదు.
గోపి వాళ్ళ కుటుంబ డాక్టర్, పూర్ణిమ క్లాస్మేట్ అయిన డాక్టర్ స్నేహ కి పూర్ణిమ మొబైల్ నుండి ఫోన్ చేసాడు.
“మీరేమీ బాధ పడకండి. నేను ఇప్పుడే బయలు దేరి వస్తాను.” అందామె.
పూర్ణిమ తో ఎం. డి చదివిన ఐదుగురిలో కొంతమంది హైదరాబాద్ లోనే ఉన్నారు.
వాళ్ళు చాలా స్నేహంగా ఉంటారు. మొబైల్ లో సమయము దొరికినప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటారు.
అప్పుడప్పుడూ పిక్నిక్ కి వెళుతూ ఉంటారు. ఒకళ్ళకి ఆరోగ్య సమస్య వస్తే, ఒకళ్ళు చికిత్స ఉచితంగా చేస్తూ ఉంటారు. ఐదుగురిలో ఇద్దరు గవర్నమెంట్ ఆసుపత్రులలో ఉంటే, ముగ్గురూ ప్రైవేట్ ఆసుపత్రులలో చేస్తున్నారు.
ఆ ఐదుగురి లో ఒక డాక్టర్ స్నేహ.
కాస్సేపటి లో స్నేహ వచ్చింది.
“డాక్టర్! మా బావగారి నాడి అందడం లేదు. అక్క మాట్లాడటం లేదు. నా కేదో భయంగా ఉంది. చూడండి.”
స్నేహ చూసి చెప్పిన విషయం..
కిరణ్ చనిపోయాడు. పూర్ణిమ కోమా లోకి వెళ్ళింది.
వెంఠనే గోపి తండ్రికి, భార్య సుధకి తెలిపాడు.
కమలమ్మ కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది.
గోపికి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి.
పూర్ణిమ డ్రైవర్ రాము వచ్చాడు.
పూర్ణిమ అంతకు ముందు ఫోన్ చేసి, పిలిచిందిట.
శవాన్ని మంచం మీద నుండి క్రిందకు దింపారు. సుధీర్, జయ కూడా వచ్చారు.
పూర్ణిమ స్పృహ లో లేదు కాబట్టి తనని లోపల మంచం మీద పడుకోబెట్టారు.
పిల్లలు సాయంత్రం పాఠశాల నుండి వస్తారు. వాళ్ళ వచ్చే లోపల దహన సంస్కారాలు చేయాలనుకున్నారు.
రాము, గోపి లు కలిసి, దహన సంస్కారాలు చూసుకున్నారు.
దహన సంస్కారాలు అయ్యాక పూర్ణిమ ను తీసుకొని కారు లో ఇంటికి తీసుకొచ్చారు.
సాయంత్రం పూర్ణిమ కూతుళ్లు స్వాతి, శ్వేతలను గోపి వెళ్లి, ఇంటికి తీసుకు వచ్చాడు. కారులోనే పిల్లలు అమ్మ నాన్నల గురించి, అడిగారు.
వాళ్లకు ఏమి జవాబు చెప్పాలి.. తండ్రి చనిపోయాడు. తల్లి కోమా లోకి వెళ్ళింది. ఆ పిల్లలు తట్టుకోగలరా? కూతురు డాక్టర్ అయ్యి ఉండి కూడా రక్షించు కోలేక పోయింది… అయినా చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు.
పిల్లలకు చనిపోవడం అంటే ఏమిటో తెలుసో తెలియదో.
పిల్లల మీద ఎటువంటి ప్రభావము చూపుతుందో?
‘దేవుడా.. నా కూతురు కి ఇటువంటి కష్టం ఇచ్చావేమిటయ్యా..’
కమలమ్మ ఆలోచిస్తోంది.
“అమ్మమ్మా! అమ్మ ఏది?”
"మీ అమ్మ నిద్దుర పోతోంది . డిస్టర్బ్ చెయ్యకండి. వెళ్ళి ఆడుకోండి." అని చెప్పి పంపింది కమలమ్మ
స్నేహ కి ఫోన్ చేసింది.
"హాల్లో చెప్పండి ఆంటీ! పూర్ణిమ ఎలా ఉంది?"
"నిద్ర పోతోంది . తనకు నయమవుతుందా? కోమాలోంచి బయటికి వస్తుందా?
నా మనవ రాళ్లు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చారు.
వాళ్ళను ఆడుకోడానికి పంపాను. వాళ్ళ ముందు నేను ఎమోషనల్ అవుతానేమో నని భయంగా ఉంది.
పూర్ణిమ ముందు పెళ్లి చేసుకోను అన్నది. డాక్టర్ కిరణ్, పూర్ణిమ ను ఎవరింట్లో నో చూశాడట.
మా ఇంటికి వచ్చి, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అని డైరెక్ట్ గా అడిగాడు.
పూర్ణిమ లో ఏమి నచ్చింది. అని ఆయన అడిగారు.
మంచి మనస్సు, దయార్ద్ర హృదయము, వృత్తి పట్ల అంకిత భావం.
ఒస్మానియా ఆసుపత్రి లో ఉన్నప్పుడు, వెళ్లి, చూసి, దూరం నుండి గమనించి
అప్పుడు నిర్ణయానికి వచ్చాడట.
మాకు నో అని చెప్పటానికి కారణం కనిపించలేదు. అతని సంస్కారము నచ్చింది. పెళ్లి చేసేసాము."
"భయ పడకండి ఆంటీ! ఏమీ కాదు. పూర్ణిమ లేచి నడుస్తుంది. తను పూర్తిగా కోమా లోకి వెళ్ళదు. కానీ కొంచెం సమయము పడ్తుంది. పూర్ణిమ మీకు కూతురు.. నాకు ప్రాణ స్నేహితురాలు. నా ప్రాణాన్ని దూరం అవ్వ నివ్వను. మీరు జాగ్రత్తగా చూసుకోండి. రేపు నేను వచ్చి ఒక సారి చెక్ చేస్తాను. పిల్లలను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి." ఫోన్ పెట్టేసింది.
"అత్తయ్యా ఏడుస్తూ కూర్చోకండి. వదిన కి ఏమీకాదు. స్పృహ లోకి వస్తుంది అని డాక్టర్ చెప్పారు కదా" అన్నది జయ.
"పిల్లలకు ఏమి చెప్పాలి?"
"వదిన పిల్లలు కూడా నా పిల్లల లాంటి వారే. నేను చూసుకుంటాను. బాధ పడకండి."
పిల్లలు ఇద్దరూ ఆడుకొని వచ్చారు.
"వేడి నీళ్లు పెట్టాను. ఇద్దరూ స్నానం చేసి, రండి".అన్నది జయ.
"అత్తయ్యా! అమ్మ మాట్లాడటం లేదు. అమ్మకి ఏమైంది” అడిగింది స్వాతి.
మీ అమ్మకి జ్వరం వచ్చింది. పడుకుంది.
డిస్టర్బ్ చెయ్యవద్దు. స్నానము చేసి, రండి.
స్వాతి, శ్వేత లకు అర్థం కాక పోయినా ఏదో జరిగింది అనుకుంటున్నారు.
‘ఎందుకు అమ్మ అలా పడుకుంది? నాన్న ఎక్కడి కెళ్ళారు? మా ఇంటికి వదిలి, అమ్మమ్మ ఇంటికి ఎందుకు వచ్చాము..?’ అన్నీ సందేహాలే.
ఏమీ అర్ధం కావడం లేదు.
స్వాతి, శ్వేత లకు, తన కూతురు తులసికి ముగ్గురికి అన్నం పెట్టింది జయ.
ముగ్గురి చేత హోం వర్క్ చేయించింది.
బాబు చిన్నవాడు కాబట్టి తనే తినిపించింది. రాత్రి పిల్లలు పడుకున్నారు.
రెండు రోజుల తర్వాత పిల్లలకు అర్థమైంది. తండ్రి దేవుని దగ్గరకు వెళ్లిపోయాడని.
అమ్మ కోమాలో ఉందని.
“అమ్మమ్మా! కోమా అంటే ఏమిటి?” అడిగింది, స్వాతి.
"కొన్ని రోజులు నిద్ర పోతారు, అంతే. మళ్లీ మీ అమ్మ లేచి తిరుగుతుంది. మీరు అల్లరి చెయ్యకుండా చదువుకోండి."
***
పూర్ణిమ పని చేసే ఆసుపత్రి లో నర్స్ లు మాట్లాడుకుంటున్నారు.
"డాక్టర్ పూర్ణిమ శలవు పెట్టలేదు. ఆసుపత్రి కి రావడము లేదు. మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉన్నదట. లాండ్ లైన్ కి చేస్తే ఎత్తడం లేదట. వార్డ్ బాయ్ వెళితే
ఇంటికి తాళం వేసి ఉందట." ఒక నర్స్అన్నది.
"ఎవ్వరితో చెప్పా పెట్టకుండా అమెరికా వెళ్లి పోయిందట."మరో నర్స్..
"ఎవరు చెప్పారు".
"అందరూ అనుకుంటున్నారు."
"అందరి తో బాగా మాట్లాడుతుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. అలా చెప్పకుండా వెళ్లిందంటే నమ్మ బుద్ధి కావడం లేదు. ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది."
డాక్టర్ సాగర్ అటు వెళుతూ ఈ మాటలు విన్నాడు.
"మీ పనులు మీరు చూసుకోండి. ఒకళ్ల గురించి ఎందుకో?" అన్నాడు.
‘చాలా మంది అలాగే అనుకుంటున్నారు. డాక్టర్ పూర్ణిమ అలా ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళదు. ఏదో జరిగింది’ అనుకున్నాడు.
***
రెండు నెలల తర్వాత పూర్ణిమ స్పృహ లోకి వచ్చింది.
ఆ తర్వాత అమ్మ ఉద్యోగము చేస్తూ, మమ్మల్ని పెంచింది. ప్రైవేట్ క్లినిక్ కూడా పెట్టుకుంది.
నాన్న లేక పోయిన సాయంత్రం డ్యూటీ నుండి వచ్చి ఆరు గంటలకు క్లినిక్ కి వెళ్ళేది. ఇంటికి తిరిగి వచ్చేసరికి 10 అయ్యేది. మమ్మల్ని ఏ లోటూ లేకుండా పెంచింది. నేను డాక్టర్ అయ్యాను. శ్వేత ఇంజినీర్ అయ్యింది.
నాకు, శ్వేత కి మంచి సంబంధాలు చూసి, పెళ్లి చేసింది.
అమ్మను చులకన చేసి, మాట్లాడితే నేను సహించలేను. మేమే తర్వాత అమ్మచేత క్లినిక్ బంద్ చేయించాము.
అమ్మ చాలా మంచిది. ఇప్పుడు అమ్మ ముసలి దైంది.
అమ్మమ్మ ను అసహ్యించుకుంటున్నావు.
అమ్మమ్మ ప్రేమతో పిలిస్తే వెళ్ళటం లేదు.
నేను పెళ్లి తర్వాత అమ్మను నా దగ్గరే పెట్టుకున్నాను.
అమ్మమ్మకు సారీ చెప్పు” అన్నది స్వాతి.
పూర్ణిమ ప్రక్క రూం లో ఉంది.
స్వాతి చెప్పింది విన్నది. కళ్ళవెంట నీళ్ళు వస్తున్నాయి.
స్వాతి కూతురు సుమతి పదవ తరగతి చదువుతోంది.
అమ్మమ్మ దగ్గరకు వచ్చి "అమ్మమ్మా.. సారీ! ఇంకెపు డూ నిన్ను అసహ్యించుకోను. నిన్ను బాధ పెట్టే మాటలు మాట్లాడను. నిన్ను ‘ముసలి’ అనను." అంది.
పూర్ణిమ, సుమతిని కౌగిలించుకుంది.
“నువ్వు నాకు సారి అడగటం ఏమిటి?” అంటూ సుమతి
ముఖము మీద, నుదుటిన ముద్దులు పెట్టింది.
సుమతి తమ్ముడు సూర్య కూడా అమ్మమ్మ దగ్గరికి వచ్చాడు వచ్చాడు.
ఇద్దరినీ అక్కున చేర్చుకుంది, డాక్టర్.పూర్ణిమ.
&&&&&&&&&&&
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నా వివరములు:
నేనుబి.ఎస్సీ వరకు ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా) లో చదివాను. ఎం. ఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖ పట్నం లో చదివాను. గణితము లో రీసెర్చ్, ఐ.ఐ. టి (ఖరగ్ పూర్ ) లో చేసాను. జె. యెన్.టి.యు.హెచ్ (హైదరాబాద్) లో ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసాను.
1980 నవంబర్ దీపావళి సంచిక వనిత, మాస పత్రిక లో మొదటి వ్యాసం ప్రచురింప బడింది. వ్యాసాలూ, కుట్లు అల్లికలు, వాల్ డెకొరేషన్ పీసెస్, గ్రీటింగ్ కార్డ్స్, తయారు చేయడం, వంటలు, కవితలు, కథలు ప్రచురింప బడ్డాయి. 2000 తర్వాత చాలా కాలం వ్రాయలేదు. మళ్ళీ 2021 నుండి ప్రతిలిపిలో చాలా వ్రాసాను. 160 దాకా కథలు, చాలా వ్యాసాలూ, నాన్ ఫిక్షన్, కవితలు చాలా వ్రాసాను.
చాలా సార్లు ప్రశంసా పత్రాలు వచ్చాయి.
ఒక సాటి 10 భాగముల సీరియల్ కి బహుమతి వచ్చింది. ఒక సారి డైరీ కి బహుమతి వచ్చింది. ఒక సారి వేరే ఆన్లైన్ వీక్లీ లో ఒక కథ కు బహుమతి వచ్చింది.
షహనాజ్ బతుల్
ఈనాటి తరం వారికి పెద్దల త్యాగాలు, వారు పడ్డ కష్టాలు చెప్తూ ఉండాలి.. వాళ్ళు కష్టం తెలియకుండా పెరుగుతున్నారు
ఈ నాటి యువతరానికి మంచి సందేశం ఇచ్చే కథ వ్రాశారు. కథ చాలా బాగుంది.
ఈనాటి పిల్లలకు తల్లిదండ్రుల, అమ్మమ్మల, నాయనమ్మల త్యాగాలు అర్ధం కావు. అదృష్టవశాత్తు కథలో మనవరాలు డాక్టర్ పూర్ణిమను అర్ధం చేసుకుంది. మంచి కథ వ్రాశారు. అభినందనలు.🌷🙏