top of page

చెరపకురా చెడేవు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Cherapakura Chedevu' New Telugu Story By Dr. Shahanaz Bathul

రచన : డా: షహనాజ్ బతుల్


పవన్ కుమార్ పెయింటింగ్ లెక్చరర్.

చాలా మంచి పైంటింగ్స్ వేశాడు. చిత్రాల ప్రదర్శన లో కొన్ని సార్లు బహుమతులు వచ్చాయి.

చాలా పేదరికం నుండి వచ్చాడు. వివాహమైంది. ముగ్గురు

పిల్లలు. జీతం సరిగ్గా సరిపోతుంది.

పవన్ కుమార్ భార్య కల్యాణి, అనుకూలవతీ. భర్తకి అన్నీ పనులలో చేదోడువాదోడు గా ఉండేది.


10వ తరగతి వరకు చదివింది. ఇల్లాలు. పనిమనిషి లేకుండా ఇంటి పనులన్నీ శ్రద్ధ గా చేస్తుంది. ఎప్పుడూ నోరువిప్పి ఏది అడుగదు. ఉన్న దానితోసర్డుకు పోయే, మనస్తత్వం. భర్త పనులన్నీ సమయానికి చేస్తుంది.


కాలేజీలో ఒక రోజు ప్రిన్సిపాల్ గారు లెక్చరర్స్ అందరిని పిలిచి, మీటింగ్ పెట్టారు.


"మన దేశ ప్రధాని, హైదరాబాద్ కి వస్తున్నారు. పెయింటింగ్ ప్రదర్శన ఒకటిపెట్ట బోతున్నారు. ఆ ప్రదర్శనను, స్వయముగా ప్రధాన మంత్రి గారు సందర్శిస్తారు. బహుమతి ఎవరికివ్వా లో ఆయనే నిర్ణయిస్తారు. అంతే కాదు బహుమతులు ఆయనే ఇస్తారు.పెయింటింగ్ లెక్చరర్స్ కాక వేరే లెక్చరర్స్ కూడా, మీలో ప్రతిభ ఉంటే ప్రదర్శన శాల లో పెట్టవచ్చు. బహుమతి కాకుండా అమ్మకానికి కూడా పెట్టవచ్చు. చూడ్డానికి వచ్చినవాళ్ళు కొనుక్కుంటారు. ప్రధాన మంత్రి గారికి నచ్చితే ఆయనే కొనవచ్చు. ఇది మీ లోని ప్రతిభను చాటుకునే అవకాశము. దీనిని పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వాళ్ళు సద్వినియోగం చేసుకోండి." ప్రిన్సిపాల్ గారు చెప్పారు.


"తప్పక పాల్గొంటాము" అని చెప్పారు కొంతమంది.

"పెయింటింగ్ చెయ్యని వాళ్ళు, చూడటానికి వెళ్లవచ్చా సార్." ఒక లెక్చరర్ అడిగారు.

"తప్పకుండా. కాకపోతే టికెట్ ఉంటుంది అనుకుంటాను."


"టికెట్ ఉన్నా మన కొలీగ్స్ వేసినవి చూడటానికి వెళతాం " అన్నారు కొంతమంది.

పవన్ కుమార్ సంతోషించే బదులు మనస్సు బాధగా మూలిగింది. కారణం తను చవి చూసిన చేదు అనుభవం.


ఇంటికి వెళుతున్నాడు. బస్సులో కూర్చున్నాడు. బస్సు ముందుకు వెళుతుంది. అతని మనస్సు గతం లోకి వెళ్ళింది.

****

దాదాపు పది సంవత్సరాల క్రితం. తను వేరే ఆర్కిటెక్చర్ కాలేజీలో పెయింటింగ్ లెక్చరర్. ఆ కాలేజీలో పెయింటింగ్ 5 సంవత్సరముల కోర్స్ ఉండింది. దానికి అర్హత పది. పదవ తరగతి పాసైన వాళ్ళు ఈ డిప్లొమా చదివితే వాళ్ళు వార పత్రికలో, టీవీ లలో ఆర్టిస్ట్ గా ఉద్యోగము చెయ్యవచ్చు. లేక పెయింటింగ్స్ వేసి, డబ్బులు సంపాదించవచ్చు.


చాలా మంచి పైంటర్ గా పేరు పొందాడు. విద్యార్థులతో స్నేహసంబంధం పెట్టుకునేవాడు. వ్యక్తిగా కూడా మంచి పేరుంది. విద్యార్థులు అందరూ చాలా అభిమానించే వారు.


ఒక సారి ముఖ్య మంత్రిగారు కాలేజీ లో పెట్టిన చిత్ర లేఖన ప్రదర్శన నికి చూడటానికి వచ్చారు.

తను ముఖ్యమంత్రి గారి బొమ్మను గీశాడు. ఫ్రేమ్ కట్టించారు. ముఖ్యమంత్రి గారికి ఇచ్చాడు.అది పెయింటింగ్ లా లేదు. ఫోటో తీసి నట్లుంది అన్నారు. తనకి చాలా సంతోషము కలిగింది.


ముఖ్య మంత్రి గారు చాలా సంతోషించి, లక్ష రూపాయలు గిఫ్ట్ గా ఇచ్చారు. తనకి డబ్బు అవసరం ఉంది. కావాలనుకుంటే ఖర్చు పెట్టుకోగలడు. కానీ తను అభిమానము తో స్వహస్తాలతో వేసిన బొమ్మ విలువ లేనిది. దానికి డబ్బు తీసుకోవడం ఇష్టం లేదు. అందుకే ఆ లక్ష రూపాయలు ఒక అనాధ శరణాలయానికి డొనేట్ చేసాడు.


ముఖ్యమంత్రికి తను ఆ పెయింటింగ్ ఇచ్చేటప్పుడు తీసిన ఫోటో పేపర్ లో పడింది. తన పేరు పడింది.పేపర్ వాళ్ళు బాగా పొగుడుతూ వ్రాసారు. పవన్ కుమార్ చిత్రం ఫోటో తీసినట్లు ఉందని, పెయింటింగ్ చాలా బాగా వేశారని, ముఖ్యమంత్రి గారు సంతోషముతో ఇచ్చిన లక్షరూపాయలు అనాధ శరణాలయానికి ఇచ్చిన, మంచి మనసున్న వ్యక్తి అని పొగిడారు.


రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కుమార్ పేరు మార్మోగిపోయింది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్, శేషగిరి గారు ఇది చూసి, సహించలేక పోయారు.


"అనాధ శరణాలయానికి ఇవ్వటం ఎందుకు. నాకు ఇస్తే, నేను కాలేజీ కొరకు వాడేవాడిని కదా?" అన్నారు.


"నాకు తీసుకోవడం ఇష్టం లేదు సార్. అందుకే అనాధ శరణాలయానికి ఇచ్చాను సార్. మన కాలేజీకి ఇస్తే, అందరూ అపార్థం చేసుకుంటారు." అని చెప్పాడు. కానీ ఆలోచిస్తే, ప్రిన్సిపాల్ కి తనకి మంచిపేరు రావడం, ఈర్ష్యగా ఉన్నట్లు అనిపించింది. ముందు నుండే, అతనికి నేనంటే ఇష్టం లేదు. ప్రతి ఫీల్డ్ లోనూ, ప్రతిభ గల వాళ్ళని, పైకి రానివ్వకుండా అడ్డుపడే వాళ్లున్నారు.


అర్థం చేసుకొని, ఊరుకున్నాడు. 'నన్ను చూసి, అసూయ చెందేవాళ్లు తామే తర్వాత నష్ట పోతారు. కానీ అర్ధం చేసుకోరు' అనుకున్నాడు.

***

ఒకరోజు సాయంత్రం కాలేజీ నుండి, ఇంటికి వెళుతున్నాడు. తనకి స్పృహ తప్పించి, తీసుకెళ్లారు. బాగా కొట్టారు. కొన్ని రోజులు బాహ్య ప్రపంచానికి దూరము గా ఉన్నాడు.


వార్తా పత్రికలు చెడు గా ప్రచారము చేశాయి, తన గురించి. ఎంత నరకాన్ని అనుభవించాడో, ఆ దేవునికి తెలుసు. చిన్న పిల్లలతో భర్త ఎందుకు ఇంటికి రాలేదో తెలియక, భార్య పడ్డ కష్టాలు, టెన్షన్, బాధ ఎలా మర్చిపోగలడు? ఆ రోజులు గుర్తుకు చేసుకుంటే, కన్నీళ్లు వస్తున్నాయి.


ఒక మనిషిలో ప్రతిభ ఉండటం నేరమా? ఆ పని చేయించింది, తన ప్రిన్సిపాల్ , శేషగిరి అని తెలుసు. కానీ ఎవ్వరితో చెప్పలేడు.బాగా కొట్టి మూడు రోజుల తర్వాత ఇంటిదగ్గర వదిలేసి, వెళ్ళారు. చాలా రోజుల వరకు బెడ్ మీద ఉన్నాడు.


అదృష్ట వశాత్తూ ఒక పాత విద్యార్థి, శేఖర్ , తనని చూడటానికి వచ్చాడు. అతని అన్నయ్య డాక్టర్. అతనికి చెప్పి ట్రీట్మెంట్ చేయించాడు.


డాక్టర్ గారు తీసుకోక పోయినా ఫిజియోథెరపిస్ట్, మందులకు చాలా డబ్బు ఖర్చు అయ్యింది. శేఖర్ ఇంకా కొంతమంది పాత విద్యార్థుల దగ్గర కొంత డబ్బు వసూలు చేసి చేయించాడు.


డబ్బులు తీసుకోవడం ఇష్టం లేక పోయినా, తీసుకోక తప్పలేదు. శేఖర్ కి రుణపడి ఉన్నాడు. భార్య తనకి చాలా సేవ చేసింది. వాళ్లందరి అభిమానము తో ప్రేమతో కోలుకో గలిగాడు. ఆ తర్వాత ఆ కాలేజీ లో రాజీనామా ఇచ్చాడు. కొంతకాలం ఉద్యోగము లేక అవస్థలు పడ్డాడు.

ఆ తర్వాత ఈ కాలేజీ లో లెక్చరర్ ఉద్యోగము ఇచ్చారు.


"సార్ మీ రెక్కడ దిగాలి?" కండక్టర్ పిలుపుతో వాస్తవం లోనికి వచ్చాడు.

చూస్తే తన స్టాప్ వచ్చేసింది.

***

ప్రధాన మంత్రి గారు చిత్ర ప్రదర్శనలో పవన్ కుమార్ కి మొదటి బహుమతి వచ్చింది. ప్రధాన మంత్రి చేతుల మీదుగా అందుకోవటం అదృష్టం గా భావించాడు. మాటల్లో చెప్ప లేని ఆనందం.


ప్రధాన మంత్రి చిత్రాన్ని, కూడా పెయింట్ చేసి, ఇచ్చాడు. ప్రధాన మంత్రి గారు చాలా సంతోషించి, ఢిల్లీ రమ్మని అక్కడ మంచి ఉద్యోగం ఇప్పిస్తానని విమానం లో రావటానికి చార్జీలు కూడా ఇస్తానన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ కూడా సంతోషముగా అభినందించారు.


"మీ లాంటి ప్రతిభగల లెక్చరర్ వెళ్ళిపోవటం, ఇష్టం లేకపోయినా, మీకు మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి సంతోషముగా పంపుతాను" అన్నారు.


ఇంటికి వచ్చి, తన భార్య తో సంతోషాన్ని పంచుకున్నాడు.


"మీరు పోటీలో పాల్గొన డానికి భయ పడ్డారు. మీరు ఇప్పుడు కాలేజీ మారారు . ఈ కాలేజీ ప్రిన్సిపాల్ చాలా మంచి వ్యక్తి. మంచి మనస్సు తో అభినందిస్తారు. మీకు మంచి జరుగుతుంది. అవకాశాన్ని జార విడుచుకోవద్దు. అని చెప్పాను కదా." అన్నది కళ్యాణి.

***

మరుసటి రోజు ఒక వార్త చదివాడు. అంతకుముందు పని చేసిన ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ శేషగిరి కి చాలా పెద్ద ప్రమాదము జరిగింది.


"పాపం ఒక సారి వెళ్లి చూసి రావాలి." అన్నాడు.


"బాగా అయ్యింది. దేవుడే అతనికి శిక్ష వేశాడు. అటువంటి వ్యక్తికి చూడటానికి వెళ్ళ వలసిన అవసరము లేదు" అన్నది కల్యాణి.


"నేను కొంత కాలం ఆ కాలేజీ లో పని చేశాను కదా. మానవత్వము దృష్ట్యా వెళ్లాలి."


ఆసుపత్రి నుండి రిలీవ్ అయ్యి ఇంటికి వచ్చాక వెళ్ళాడు.

వీల్ చైర్ లో ఉన్నాడు. నడవ లేడు.

కాస్సేపు కూర్చొని, పెయింటింగ్ ప్రదర్శన లో బహుమతి వచ్చిన విషయము చెప్పాడు.


శేషగిరి లో పశ్చాత్తాపం ఉంది. కానీ క్షమార్పణ అడగటానికి అహం అడ్డు వచ్చింది.

పవన్ భార్యా బిడ్డలతో ఢిల్లీకి బయలుదేరాడు.

&&&&&&&&&

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.రచయిత్రి పరిచయం : నా వివరములు:

నేనుబి.ఎస్సీ వరకు ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా) లో చదివాను. ఎం. ఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖ పట్నం లో చదివాను. గణితము లో రీసెర్చ్, ఐ.ఐ. టి (ఖరగ్ పూర్ ) లో చేసాను. జె. యెన్.టి.యు.హెచ్ (హైదరాబాద్) లో ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసాను.

1980 నవంబర్ దీపావళి సంచిక వనిత, మాస పత్రిక లో మొదటి వ్యాసం ప్రచురింప బడింది. వ్యాసాలూ, కుట్లు అల్లికలు, వాల్ డెకొరేషన్ పీసెస్, గ్రీటింగ్ కార్డ్స్, తయారు చేయడం, వంటలు, కవితలు, కథలు ప్రచురింప బడ్డాయి. 2000 తర్వాత చాలా కాలం వ్రాయలేదు. మళ్ళీ 2021 నుండి ప్రతిలిపిలో చాలా వ్రాసాను. 160 దాకా కథలు, చాలా వ్యాసాలూ, నాన్ ఫిక్షన్, కవితలు చాలా వ్రాసాను.

చాలా సార్లు ప్రశంసా పత్రాలు వచ్చాయి.

ఒక సాటి 10 భాగముల సీరియల్ కి బహుమతి వచ్చింది. ఒక సారి డైరీ కి బహుమతి వచ్చింది. ఒక సారి వేరే ఆన్లైన్ వీక్లీ లో ఒక కథ కు బహుమతి వచ్చింది.


షహనాజ్ బతుల్350 views8 comments
bottom of page