'High Tech Life' New Telugu Story
Written By A. Annapurna
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
''ఆకాష్! వాషింగ్ మెషిన్లో క్లోత్స్ వేయమని రెండురోజులుగా చెబుతున్నాను. వేయనేలేదు. నామాట అంటే ఇంత నిర్లక్ష్యమా..... పింకీ, అమర్ స్కూల్ కి వెళ్ళాలి. డ్రెస్ రెడీగా లేదు! ఇప్పుడు ఏమి చేయాలి? ”
విల్లా మూడో ఫ్లోర్ నుంచి పెద్ద గొంతుతో అరిచింది మేఘన..
''సారీ మేఘా, నేను వర్క్తో బిజీ. మర్చిపోయాను. ఇప్పుడే వెళ్లి కొని తెస్తా... అంటూ కారు బయటికి తీసాడు ఆకాష్.
''ఇదేమి విడ్డూరం! పనిమనిషి మాలిని వుంది. దానితో చెప్పకుండా ఆకాష్ తో చెబుతుంది ఏమిటి? పాపం వాడు రాత్రి అంతా మేలుకుని ఇప్పుడే పడుకున్నాడు. వాడి నిద్రా చెడగొట్టింది'' అంటూ జానకి బాధతో గొణుక్కుంది.
''మనకెందుకు? వాళ్ళయిష్టం. వీడు చేస్తాడు, ఆవిడ ఆర్డర్ వేస్తుంది.." అన్నాడు లాప్ టాప్లో న్యూస్ పేపర్ చదువుతున్న నిరంజన్.
''నేను రెడీ చేసిపెట్టాను. అవి వేయదు. ఐరన్ చేయలేదుట.. వొకరోజుకి ఏమవుతుంది? ''
పిల్లలు మరీ చిన్నవాళ్లు కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ వాళ్ళు చేయరు అంటే నేను ఐరన్ చేసాను. నచ్చలేదు. ఏం చేస్తాం.. ఆకాష్ కష్టపడుతుంటే చూడలేం. మనపని నచ్చదు. రోజూ ఉండేదే. పద అలా పార్కులో వాక్ చేసి వద్దాం...." అంటూ బయలుదేరాడు నిరంజన్.
''సరే పదండి. అందరూ బయటికి వెళ్ళేక ఇంటికి వద్దాం!” అని తన రూముకి లాక్ చేసి బయటికి వచ్చింది జానకి.
పిల్లలను రెడీచేసి కారులో కూర్చోబెట్టి, మేఘనకి కాఫీ చేసి బ్రేక్ ఫాస్ట్ టేబుల్ మీద పెట్టి కూర్చున్నాడు నిరంజన్.
''ఈరోజూ బ్రెడ్డేనా...." అంటూ విసుక్కుని పూర్తిచేసి.... కాఫీతాగి వెళ్ళిపొయిన్ది.
వాళ్లకి బై చెప్పి హాల్లో సోఫాలో వొరిగిపోయాడు ఆకాష్.
మేఘన ఈ మధ్య త్రీ లెవెల్స్ ఉన్న ఈ విల్లా చూసి మురిసిపోయి కొనేసింది. చుట్టుపక్కల ఇంకా ఎవరూ లేరు. యాభై విల్లాలు. సిటీకి దూరం. ధరా ఎక్కువే అని చాలామంది వెనక్కి వెళ్లిపోతున్నారు.
''మనకి కార్లు వున్నాయి. ఇంతకాలం త్రీ బెడ్ రూమ్ ఫ్లాటులో ఇరుక్కుని బతికేం. ఒక ప్రయివసీ లేదు. వెంటి లేషన్ లేదు. ఇరవై ఏళ్ళు నరకం చూసేను. నువ్వు ఎలాగైనా బతికేస్తావ్. నేను ఒక్క క్షణం ఇక్కడ ఉండను. వస్తావో లేదో నిర్నయిన్చుకో!'' అని వెంటనే డబ్బు కట్టేసింది మేఘన.
''అదికాదు మేఘా! ఇది నాన్నగారు కొనుక్కున్నది. వచ్చే ఏడు పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అవసరమా? బోలెడు ఖర్చు ముందువుంది. కొద్దికాలం అడ్జస్ట్ ఐతే తర్వాత కొనవచ్చు....” అని ఆకాష్ నచ్చ చెప్పాలని చూసినా మేఘన వినలేదు.
ఎప్పుడు కొలీగ్ చూపించిందో.. వెంటనే అడ్వాన్స్ కట్టేసి అప్పుడు ఆకాష్ కి చెప్పింది.
మేఘనకి అనుకున్నది సాధించే తత్వం. ఆకాష్ నిదానంగా ఆలోచించి అవసరానికి మాత్రమే ఖర్చు చేయాలనుకుంటాడు. కానీ ఎప్పుడూ మేఘనదే గెలుపు!
''ఆలా తొందర పడతావెందుకు? ఆలోచించు....” అంటే, 'నాకు నచ్చేదే చేస్తానని నీకు తెలుసు. అడ్డుపడితే ఏమి జరుగుతుందో కూడా తెలుసు.... 'మైండిట్' అంటుంది.
“అంతగా ఈ ఫ్లాటు వదలలేకపోతే నువ్వు మీ పేరెంట్స్ ఇక్కడే వుండండి. నేను నాపిల్లలు విల్లా కి వెళ్ళిపోతాం....” అంది.
దాంతో నలుగురు నవ్వుతారు అని భయపడి ఆమె వెంట నడిచాడు. అదీ కాకుండా ఈ ఫ్లాట్ రెంట్ కి ఇస్తే కొంత ఇంటి ఖర్చు కలిసివస్తుంది.
విల్లాలో ప్రవేశించాక తెలిసింది పనిమనిషికి జీతం పదివేలు. పవర్ వాటర్ మెయింటెనెన్స్ ఏభై వేలు. ఎవరు ఎక్కడ వున్నారో కనబడరు. పిల్లలు స్కూల్కి, భార్య - భర్తలు కంపెనీకి వెళ్ళిపోతారు.
మాలిని ఉదయం వచ్చి సాయంకాలం వెళ్ళిపోతుంది. జానకి -నిరంజన్ వాళ్ళ వంట వేరే వండుకుంటారు. జానకి అందరికి చేయగలదు. కానీ మేఘనకి, పిల్లలకు ఆమె వంట నచ్చదు.
మేఘన అత్తా మామలను ఏమి అనదు. పట్టించుకోదు. ఉండేది అందరూ ఒక ఇల్లే కానీ ఫోనులోనే మాటాడుకోవడం.. ఒకరికి మరొకరు ఎదురుపడరు.
మేఘన బయటికి వెళ్ళేక ఆకాష్ అమ్మ నాన్నలను పలకరించి ఏమికావాలన్నా ఆన్ లైన్లో ఆర్దర్ చేస్తాడు.అందుకే నైట్ జాబ్ చేస్తాడు. డే టైం ఇల్లు చూసుకుంటాడు.
ఏపని కావాలన్నా, రెండో వారితో మాటాడాలన్నా ఫోన్ వాడకం.
పని దినాల్లో ఐతే సరే.. వీకెండ్ కలవచ్చుగా..అందరూ కలిసి భోజనం చేయచ్చు గా.. అనుకుంటే, శని ఆదివారాలు బయటికి వెళ్లి తీరాలి. ఒకరోజు మూవీ, ఒకరోజు ఫన్ ఎంజాయ్ మెంట్.
''ఈరోజు అమ్మ బర్త్ డే. గుడికి తీసుకెళ్లడమో వాళ్లకి నచ్చిన చోటుకి తీసుకెళ్లడమో చేద్దాం…” అని ఆకాష్ అంటే
"నువ్వు తీసుకెళ్ళు. పిల్లలు నేను వేరే ప్లేస్ కి వెడతాం…” అంటుంది మేఘన.
''మీరు వెళ్ళండి. మాకోసం మానుకోవద్దు. మేము పార్కులో కూర్చుని ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటాం లే.." అంటారు జానకి, నిరంజన్.
వాళ్లకి ఆ విల్లాలో ఊపిరి ఆడటంలేదు. అందుకే రెండు పూటలా పార్క్ కి వెడుతూంటారు.
''కలిసే ఉండాలి. లేకపోతే మీ బంధువులు నన్ను అంటారు....” అంటుంది తప్ప అత్తమామల మొహం చూడదు మేఘన.
ఏ పెళ్ళో శుభ కార్యమో అని వెడతాం అంటే వాళ్ళతో ఎక్కడ నామీద నేరాలు చెబుతారో అని 'మీకు ఆ ఫుడ్, నీళ్లు పడవు. జబ్బుచేస్తే ఆకాష్ మీతో పడలేడు. వెడితే వెళ్ళండి. మీ ఇష్టం ' అంటుంది.
ఎందుకు వచ్చిన గొడవ! నిజంగా ఏదైనా జరిగితే... అని మానుకుంటారు.
విల్లా.. చూడటానికి ఎవరి కుటుంబంలో వారికీ ప్రయివసీ అని, అదొక గొప్పతనం అని అనిపించినా అందులో వుండే బాధలు ఎన్నో తెలిసినా ఆకాష్ నిస్సహాయుడు.
అదే అమెరికాలోనే మరో దేశంలోనో ఉంటే దూరమైనా ప్రేమలు పలకరించుకోడానికి కొంత టైము కేటాయిస్తారు కొందరు.
ఇండియాలో అందరూ ఓకే చోటు ఉన్నా మాటాడుకోరు చూసుకోరు.
ఇదీ ఇప్పటి కుటుంబాల తీరు.
***
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
Twitter Link
Podcast Link
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)
Comments