top of page

కైలాస శిఖరం పై శివుని నాట్యం


'Kailasa Sikharam Pai Sivuni Natyam' New Telugu Story

Written By Nallabati Raghavendra Rao

'కైలాస శిఖరం పై శివుని నాట్యం' తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

అతని పేరు కైలాస శిఖరం. తన ఇంట్లో గదిలో మౌనంగా కూర్చుని తదేకంగా ఏదో ఆలోచిస్తున్నాడు.

కాసేపట్లో అతను తన ఫ్రెండ్ జగన్నాథం ఇంటికి ఒక ఫంక్షన్కు వెళ్లవలసి ఉంది. టాయిలెట్ అయి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎందుకనో తన తలలో కొన్ని నరాలు ప్రయాణానికి అడ్డు చెబుతున్నాయి. అతను ప్రయాణమై అక్కడికి వెళ్లవలసిందిగా చెప్పే సిగ్నల్స్ పాజిటివ్ గా లేవు. జగన్నాధం ఇంట్లో ఆ కార్యక్రమం అయిన వెంటనే ఏదో జరగరాని ఘోరం జరుగుతుంది అన్నట్టుగా కైలాస శిఖరం మస్తిష్కానికి ఎవరో తట్టి లేపి చెబుతున్నట్టుగా అనిపిస్తుంది.


ఒకసారి బుర్ర విదిలించాడు. ప్రశాంతంగా కాసేపు అలాగే కూర్చున్నాడు. బెల్లం గడ్డమీద వాలిన ఈగలను చేతితో కొడితే పారిపోయి మళ్లీ అక్కడికే వచ్చి ఎలా వాలతాయో అదేవిధంగా అతని ఆలోచన మీద ఆ నెగిటివ్ వైబ్రేషన్ అలా అలా అలా ముసిరేస్తుంది.


''నాన్న ఏమిటి అలా మౌనంగా కూర్చుండి పోయావు ఒంట్లో ఎలా ఉంది?.. ఈరోజు టాబ్లెట్లు అన్ని వేసుకు న్నావు కదా. పోనీ జగన్నాథం గారి ఇంటి వరకు బండి మీద నన్ను డ్రాప్ చేయమంటావా. ఫంక్షన్ మధ్యాహ్నం 12 గంటలకు కదా అప్పుడే 10:00 అయింది. నువ్వు బయలుదేరావో లేదో అని అతను నాకు ఫోన్ చేశాడు నాన్న?'' అంటూ కైలాస శిఖరం కొడుకు కృష్ణ మురళి తండ్రి దగ్గరకు వచ్చి అన్నాడు.


''వద్దురా చిన్నబండి మీద నేను వెళ్లగలను. కృష్ణ మురళి ఇలా రా కూర్చో.. నీకు ఒక విషయం చెప్పాలి. జగన్నాథం గారి రెండో అబ్బాయి ఎక్కడ ఉన్నాడు బెంగళూరులోనే కదా.'''


''అవును నాన్నా ఎందుకలా అడిగావు''' ప్రశ్నించాడు కృష్ణ మురళి.


''వాళ్ళింట్లో ఈరోజు ఫంక్షన్ కి ఆ అబ్బాయి రావడం లేదని వాళ్ళ నాన్న నిన్ననే నాకు చెప్పాడు. కానీ రేపైనా రావలసి ఉంటుంది రా.''


''అదేంటి నాన్న అలా చిత్రంగా మాట్లాడతావు'' అంటూ ఆతృతగా అడిగాడు కృష్ణ మురళి తండ్రి ని.


''చిత్రం కాదురా నా సిక్స్త్ సెన్స్ చెబుతుంది. జగ న్నాథం ఇంట్లో ఫంక్షన్ అయిపోయాక ఈరోజు రెండు గంటలకి.. అతను ప్రాణం వదిలేస్తాడు రా.'''


''ఊరుకో నాన్న ఇంకా నయం గుండు పిక్కలాగ ఉన్నాడు అతనికి ఏం పర్వాలేదు. ఈ విషయం నువ్వు ఫంక్షన్ కి వెళ్లి అక్కడ ఎవరికన్నా చెప్పేలాగా ఉన్నావు. సరే నువ్వు వెళ్ళవద్దు నీ బదులు నేను వెళ్తాను.నువ్వు పడుకుని హాయిగా రెస్ట్ తీసుకో నీ మనసు బాగుండ లేనట్టుంది. '' అన్నాడు కొడుకు కృష్ణ మురళి.


“నా సిక్స్త్ సెన్స్ కరెక్టే రా. గతంలో కూడా చాలాసార్లు ఏవో విషయాల మీద ఇలా నాకు సిక్స్త్ సెన్స్ చెబు తుండేది. నేను మీరందరూ నమ్మరని మీకు చెబు తుండేవాడిని కాదు అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం మీకు ఒక విషయం చెప్పాను గుర్తుందా. ఒక గంటలో ఎండంతా తగ్గిపోయి వర్షం వస్తుంది రా అని.. నువ్వు ఏమన్నావు మే నెలలో వర్షాలు ఏమిటి నాన్న అంటూ నవ్వావు..గుర్తుందా ఓ 10సంవత్సరాల క్రితం విష యం ఇది. అప్పుడు నేను అన్నట్టు జరిగింది కదా. ఏదో కాకతాళియంగా చెప్పానులే అని మీరందరూ సరి పెట్టేసారు. ఆ తర్వాత తర్వాత నా సిక్స్త్ సెన్స్ చాలా సార్లు చాలా విషయాలు చెప్పింది రా.. మంచి చెడువిషయాలు.

అవన్నీ మీకు చెబితే నన్ను ఓ పిచ్చి వాడు కింద జమ కడతారని చెప్పేవాడిని కాదు.


అలా ఆ గ్రహణ శక్తి ద్వారా గ్రహించిన వాటిలో నూటి కి 99 సక్సెస్ అయ్యాయి అంటే జరిగాయి అన్నమాట. సరే ఇప్పుడు ఈ విషయం నీకు ఎందుకు చెబుతు న్నాను అంటే.. ముందుగానే వాళ్ళ అబ్బాయిని రప్పించే ప్లాను నువ్వు ఏదైనా వేస్తావేమోనని.''... కొంచెం బాధ మిళితమైన కంఠంతో అన్నాడు కైలాస శిఖరం.


''చాల్లే నాన్న.. మొన్న పెద్ద డాక్టర్ గారు ఏమన్నారు.. ఒంట్లో కొంచెం నరాలు వీక్నెస్ ఉన్నప్పుడు కూడా రకరకాల ఊహలు రావడం సహజం అన్నారు కదా.. ఒకసారి మన పక్కింట్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ గారిని తీసుకొస్తా.'' అంటూ బయటకు వెళ్ళాడు.


కాసేపట్లో ఆర్ఎంపీ డాక్టర్గారి తో వచ్చాడు ఆయన పరిశీలించి రాత్రి సరిగా నిద్ర పోయారా అని అడిగాడు.


తల ఆడించాడు కైలాస శిఖరం. డాక్టర్ బిపి షుగర్ విషయాలు పరిశీలించి తన దగ్గర ఉన్న ఇంజక్షన్ చేసి సీటు మీద టాబ్లెట్స్ రాసి ఈ టాబ్లెట్లు కూడా వేస్తుండండి.'' అంటూ చెప్పి వెళ్లి పోయాడు.


కైలాస శిఖరాన్ని అతని కొడుకు ఫంక్షన్ కు వెళ్లనివ్వ లేదు. అతని బదులు కృష్ణమురళి వెళ్లి భోజనం చేసి తిరిగి వచ్చేసాడు.


రెండు గంటలు అయింది జగన్నాథం ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. అతనికి హార్ట్ ఎటాక్ వచ్చిందని క్రింద పడిపోయాడని హాస్పిటల్ కి తీసుకువెళ్లే లోపులోనే అంత అయిపోయిందని ఆవార్త.


ఆశ్చర్యపోయాడు కృష్ణ మురళి నీరసంగా పడుకున్న తండ్రికి ప్రస్తుతానికి విషయం చెప్పలేదు.ఇదంతా ఆ వీధి చివరలోనే ఉన్న కైలాసశిఖరం అన్నగారి కొడుకు వివేకానందం వచ్చి తన బాబాయి దగ్గర ఉంటుండ గానే జరిగింది. అప్పుడప్పుడు వివేకానందం తన బాబాయ్ ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటాడు.

***

నెల గడిచింది. అసెంబ్లీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. కైలాస శిఖరం అన్న గారి కొడుకు వివేకానందం ఆ ఎలక్షన్లలో పోటీ చేయడానికి సీటు వచ్చింది.

అయితే అప్పటికే జగన్నాథం విషయంలో తన తండ్రి చెప్పిన మాట ఎలా నిజమైందో సందర్భాను సారంగా ఒకరిద్దరూ ఆప్తులైన స్నేహితులకు చెప్పాడు కైలాస శిఖరం కొడుకు కృష్ణమురళి. ఎలాంటి విషయాలు ఆగిన ఇలాంటి అద్భుత మహిమాన్వితమైన విష యాలు ఆగవు కదా వరద గోదారిలా ఈ విషయం ఆ ఊరంతా వ్యాపించింది. చిన్నపిల్లలు పెద్దవాళ్లుముసలి వాళ్లు విచిత్రంగా చెప్పుకోవడం మొదలుపెట్టారు.


అప్పటికే వివేకానందం ఒక ఆలోచనతో ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎలక్షన్లలో తనకు ఎంత మెజారిటీ వస్తుందో తెలుసుకోవాలని తన బాబాయ్ దగ్గరకు వచ్చి అతని సిక్స్త్ సెన్స్ ను అడిగి తెలుసుకుని చెప్పమని కోరదా మని వచ్చేసాడు.


విషయం తెలుసుకున్న కైలాస శిఖరం తన అన్నగారి కొడుకు వివేకానందం వైపు చూసి నవ్వాడు.


''ఒరేయ్ ఆనందం సిక్స్త్ సెన్స్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు చెప్పదు రా. అదంతా ఒక రకమైన అద్భుత శక్తి. అందరికీ కూడా అది సాధ్యం కాదు. మీ నాన్నకు పెళ్లి అవని క్రితం కాకినాడ సంబంధం అవుతుంది అని నాకు మీ నాన్న విషయంలో ఆ చిన్న వయసులోనే నా సిక్స్త్ సెన్స్ చెప్పింది. ఇంట్లో వాళ్లకి చెప్పాను కూడా. అందరూ ఈజీగా తీసుకున్నారు. నీ విషయంలో కూడా నీకు ముందుగా అబ్బాయి పుడతాడని నా సెన్సు చెప్పింది. నమ్మరు అని నేను ఎవరికీ చెప్పలేదు. చివ రికి నీకు అబ్బాయి పుట్టాడు కదా. కొన్ని కొన్ని నక్షత్రా లలో పుట్టిన వాళ్లకు కొంత దైవ బలం కూడా కలిగి ఉంటే అటువంటి వాళ్లకు మాత్రమే అది సాధ్యం అవు తుంది. అంతేకానీ వీధిలో వెళ్ళిపోయే కూరగాయలను పిలిచి కేజీ వంకాయలు ఎంత అంటూ రేటు అడిగినట్లు అడిగితే కుదరదు రా. ఇదిగో నువ్వు ఇంటికి వెళ్ళిపో. నా మెదడులోని నరాలు నీ విషయంలో అటువంటి శక్తి ఏదైనా గ్రహించగలిగితే తప్పకుండా కబురు పెట్టి చెబుతానులే అంటూ పంపించేశాడు.


అదే రోజు రాత్రి వివేకానంద భార్య కృష్ణకుమారి కూడా తన చిన్న మామగారు కైలాస శిఖరం ఇంటికి వచ్చి వెళ్ళింది ఎప్పటిలాగే. కానీ ఎందుకో ఆమె వెళ్లేటప్పుడు కళ్ళల్లో ఏదో నలకబడినట్లు కళ్ళనీళ్లు తుడుచుకుంటూ వెళ్ళింది.

***

రెండు రోజులు పోయాక కైలాస శిఖరం అన్నగారి కొడుకు వివేకానందం కు ఫోన్ చేయడం అతను రావడం జరిగాయి.


''వివేకానందం..ఈ తెల్లవారుజామున మగత నిద్రలో నాకు ఒక విషయం నా గ్రహణశక్తి లోకి వచ్చింది రా. నువ్వు కంగారు పడకు. నువ్వు ఈ ఎలక్షన్లో ఘోరంగా ఊడిపోతావ్ రా'' అంటూ చెప్పాడు.


వివేకానందం ఉగ్రుడైపోయి పైకి లేచి నిలబడ్డాడు. పక్కనే ఉన్న కైలాస శిఖరం కొడుకు కృష్ణమురళి కూడా వివేకానందాన్ని కంగారు పడవద్దని చెప్పాడు. అయినా కంగారుతో వివేకానందం తన బాబాయ్ అని చూడ కుండా నోటికి వచ్చినట్లు తిట్టాడు. వీధిలోకి వెళ్ళిపోయి అరవడం మొదలు పెట్టాడు. తను ఇప్పటికీ 30 లక్షలు ఖర్చు పెట్టానని అలాంటి తను నెగ్గకపోవటం ఏమి టని... నోటికొచ్చినట్లు వాగితే ఊరుకోనని సొంత బాబాయి ని దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. ఆ వీధి జనం అందరూ పోగుపడ్డారు. వివేకానందం చేసే హడావిడికి ఊరు ఊరంతా పోగు పడిపోయినట్లు అయిపోయింది వాతావరణం కాసేపటికి. కైలాస శిఖరం అతని కొడుకు మౌనంగా తలలు వంచి నిలబడ్డారు వాళ్ల ఇంటి గుమ్మం దగ్గర. ఆ వీధిలో వారు ఎవరో ఫోన్ చేస్తే వివేకానంద మీద పోలీసులకు వచ్చి న్యూసెన్స్ కేసు పెట్టారు. అప్పటికి ఆ గొడవ సద్దుమణిగింది. వివేకానందం దౌర్జన్యకారుడు అని ఊరు ఊరంతా పక్క ఊర్లలో కూడా మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యూఎన్సీ అంతా చెడుగా ప్రచారం మొదలైపోయింది.


పార్టీ అధిష్టానం దగ్గర నుండి కూడా కబురు వచ్చింది ప్రస్తుత రిపోర్టు వ్యతిరేకంగా మారిపోయింది కనుక జాగ్రత్తగా ఉండాలి అంటూ.. హెచ్చరించారు కూడా.


అనుకున్నట్లే అయ్యింది వివేకానందం చిత్తుగా ఓడిపోయాడు. ఈ విషయంలో కూడా కైలాస శిఖరం ముందుగా చెప్పినది నిజమైందని అతడిని అప్పటి నుండి ఓ కొత్త దేవుడిగా పూజించడం మొదలు పెట్టారు ప్రజలంతా.

**

మూడు నెలలు గడిచింది. వివేకానందం ఇంట్లో సెల్ఫోన్ మోగింది. అది తన బాబాయ్ కైలాస శిఖరం నుండి. బాబాయ్ కుటుంబం మీద కోపంతో రగిలి పోతున్న వివేకానందం సెల్ ఆన్ చేయలేదు కానీ అదే పనిగా రింగ్ అవ్వటంతో ఆన్ చేసి చెవి దగ్గర పెట్టు కున్నాడు.


“ఒరేయ్ బాబు వివేకానందం. నేను రా నీ బాబాయ్ కైలాస శిఖరాన్ని. నా మీద కోపమా. మనమంతా రక్తసంబంధికులం నామీద కోపగించుకు. నేనిప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే నీ జీవితంలో ఒక అత్యద్భు తమైన మార్పు రాబోతుంది. నాకు ఈ రోజు ఉదయమే సిక్స్త్ సెన్స్ చెప్పింది. పైగా మూడు సార్లు చెప్పింది. అందుకని నూటికి వెయ్యిపాళ్లు జరుగుతుంది.నువ్వు వెంటనే మా ఇంటికి రా ''అంటూ సెల్ పెట్టేసాడు.


తన బాబాయ్ ఎలక్షన్ల విషయంలో తనకు చెప్పిన మాట నిజం కావడం వల్ల వివేకానందం తన కోపం కొంచెం తగ్గించుకుని వెంటనే విషయం తెలుసుకో వడానికి బాబాయి ఇంటికి వెళ్ళాడు.


''ఒరేయ్ వివేకానందం అద్భుతం జరగబోతుంది రా. ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందట. ఆతర్వాత నువ్వు ఏ పార్టీ తరపున పోటీ చేసిన రెండు లక్షల ఓటులు మెజారిటీతో ఎమ్మెల్యే అవుతావట. కానీ ఆ సిక్స్త్ సెన్స్ చిన్న మెలిక పెట్టింది రా. ఈ ఆరు నెలలు నువ్వు మహా భక్తుడిగా మారిపోవాలట. మౌనం పాటిం చాలట. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలట, ముఖ్యం గా యోగా క్రమం తప్పకుండా చేసి నీ ఇంద్రియాలు అదుపులో పెట్టుకుంటేనే ఇది సాధ్యపడుతుందట. నాకు కొంచెం అనుమానం వేసింది. ఇదంతా బోగస్ లాగా ఉంది ఏమిటి అని కొట్టి పారేసి పడుకున్నాను.

ఆ గ్రహణశక్తి నన్ను మళ్లీ తట్టి లేపి ఇదంతా నిజమే రా బాబు వివేకానందానికి చెప్పు అని మళ్ళీ చెప్పింది. ఇవన్నీ నువ్వు పాటించగలిగితే మాత్రం ఫిక్స్ రా నువ్వు ఎమ్మెల్యే అవడం కాయం'' అంటూ వివేకానందం భుజం మీద తట్టి చెప్పాడు బాబాయ్ కైలాస శిఖరం.


ఆనందపడిపోయాడు వివేకానందం. బాబాయ్ కాళ్లకు నమస్కరించి..


'''ఆరు నెలలే కదా బాబాయ్ ఈ క్షణం నుండే ఆ విధంగా మార్పు చెందుతాను. నీ సిక్స్త్ సెన్స్ భగవం వంతుని వరం లాంటిది నాకు తెలుసు కదా'' అంటూ ఆనందంగా నమస్కరించి వెళ్ళిపోయాడు.


ఆ మర్నాడు నుండి వివేకానందం జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ప్రతిరోజు క్రమం తప్పకుండా గంటల సమయం యోగా చేస్తూ.. తద్వారా కలిగిన మానసిక ప్రశాంత మనసుతో గుడులు గోపురాలు దైవ ప్రార్థనలు పూజలు చేయడం. మంచి మనస్తత్వంతో నిరుపేద లను ఆదుకోవడం, అనాధలను అక్కునచేర్చుకోవడం, వృద్ధులను చేరదీయడం, అందరి పట్ల గౌరవంగా ప్రవ ర్తించడం లా మారి పోయాడు.


అలా అలా మహా భక్తునిగా మారిపోయాడు వివేకా నందం. అధికారం, ధనదాహం అతని చేరువలో కనిపించడం లేదు. ప్రభుత్వం మాత్రం కొంచెం అస్తిరత్వంలోకి వెళ్ళింది. ఆరు నెలల తర్వాత ఓ సాయంత్రం బాబాయి ఇంటికి వచ్చాడు వివేకానందం.


''బాబాయ్ నీవల్ల నేను ఇప్పుడు కుటుంబంతో చాలా ఆనందంగా ఉన్నాను. రాజకీయాలంటే నాకు ఇప్పుడు చిరాకుగా అనిపిస్తుంది.. ప్రభుత్వం ఏమైనాప్పటికీ ఎలక్షన్లు మళ్లీ వచ్చినప్పటికీ నేను రాజకీయాలలోకి వెళ్ళను బాబాయ్.. అవంటే ఇప్పుడు నాకు అసహ్యం గా అనిపిస్తుంది.ఈ విషయమే చెబుదామనే వచ్చాను '' అంటూ బాబాయ్ పాదాలకు నమస్క రించి తను కూడా తెచ్చిన పళ్ళు ఇచ్చి వెళ్ళిపోయాడు.

***

అదే రోజు రాత్రి వివేకానందం భార్య కృష్ణకుమారి వచ్చి చాలాసేపు తన చిన్న మామగారు అయిన కైలాస శిఖరం తో మాట్లాడి ఈసారి తిరిగి వెళ్లేటప్పుడు ఆనం దంగా నవ్వుకుంటూ తిరిగి వెళ్ళిపోతుంది.

***

కైలాస శిఖరానికి ఎలక్షన్ల ముందు రోజులు గుర్తు వచ్చాయి.


ఆరోజు ఇలాగే కృష్ణకుమారి వచ్చి తన అందమైన కుటుంబం ఇప్పుడిప్పుడే పెరుగుతుందని.. భర్త బిడ్డలతో కుటుంబ ఆనందం పొందాలి కానీ ఈ రాజకీయాలు తనకు వద్దని.. తన చిన్న మామగారి దగ్గర ఏడ్చి ఏడ్చి.. వివేకానందాన్ని ఎలాగైనా ఒప్పించి రాజకీయాల నుంచి తప్పించమని అలా చేయకపోతే తను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఏడుస్తూ వెళ్లిపోవడం గుర్తుకు వచ్చింది... కైలాస శిఖరానికి.

మామూలుగా చెబితే వివేకానందం వినడని కైలాస శిఖరానికి తెలుసు. అందుకనే.. అప్పుడప్పుడు తన బుర్రను ఆవహించే సిక్స్త్ సెన్స్ ను ముడి పెట్టడం.. ఎలక్షన్లలో ఓడిపోతాడని అబద్ధం చెప్పటం..అలాగే భక్తుడుగా మారాలని మరోఅబద్ధం చెప్పటం జరిగింది.


వివేకానందం మనసు మార్చడానికి ప్రయత్నించి తన అన్న గారి కోడలు కృష్ణకుమారి కుటుంబానికి సంతో షం కలగడం కోసం ప్రయత్నించి విజయం సాధించ డంతో కైలాసశిఖరం కూడా ఆనందంగా ఉన్నాడు ఇప్పుడు.... కైలాస శిఖరం మీద నాట్యం చేస్తున్న శివుని లా.


****

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు








34 views0 comments

Comentarios


bottom of page