top of page

కథలు వ్రాయాలంటే..


'Kathalu Vrayalante' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'కథలు వ్రాయాలంటే' తెలుగు కథ

రచన: సుదర్శన రావు పోచంపల్లి


మానవ సమాజంలో చదువు, ఉద్యోగము, వ్యవహారము, వ్యవసాయము తోడుగ సమయము లేకున్న కల్పించుకొని కథలను వ్రాయడము, చదువడము పట్ల ఆసక్తి కలవారెందరో.


నగధర్ కథలు అప్పుడప్పుడు చదువుతుంటాడు- కథలే కాక పురాణాలు చదువుతూ బాదరాయణుడు భారత ఇతిహాసము తాను చెప్పుచూ గణపతితో వ్రాయించాడని చదివి బాదరాయణుడు అంటె అర్థము తెలియక నిఘంటువు శోధిస్తాడు. ఆ నిఘంటువులో పర్యాయ పదాలు బోలెడు.

అందులో బాదరాయణుడు అంటె ఉన్మత్తుడు, ఉన్మదితుడు, ఉన్మదిష్ణువు, ఉన్మాదకుడు, ఉన్మాది, కార్యపుటుడు, పాగలుడు, బాదరాయణుడు, మనోహతుడు, వాతరాయణుడు, వాతూలుడు, వెఱ్ఱివాడు, సురాసువు, సోన్మాదుడు.


మరియు పిచ్చి వాడు, అంబేద, అలంజుడు, అసమర్థుడు, ఈబరి, ఈబరిగొట్టు, కింజుడు, కిగ్గాడి, కిగ్గాడికాడు, చూపుగుఱ్ఱము, నామర్దా, నిరర్థకుడు, నిర్గ్రంథకుడు, నిర్దటుడు, నిష్ప్రయోజకుడు, పెఱగాయ, బాదరాయణుడు, బికారి, మూసినమురికి, లేకివాడు, వ్యర్థుడు.

ఇన్ని పేర్లు వ్రాసి ఉండి చివరకు వ్యాసుడు, కృష్ణద్వైపాయనుడు, గంధవతిపట్టి, దీవిపుట్టువు, ద్వైపాయనుడు, నునుమీనుమనుమడు, పారాశరి, పారాశరుడు, బాదరాయణుడు, మాఠరుడు, శాశ్వతుడు, సత్యరతుడు

వ్రాసి ఉన్నది చూసి అప్పుడు అనుకుంటాడు వ్యాసుడని-


అయినా అనుమానము వదులక భార్గవశర్మ అనే పండితుని అడుగుతాడు.. దానికి ఆ పండితుడు నాయనా సహజంగా ఒక్క పదానికి పర్యాయ పదాలు, నానార్థాలు ఎన్నో ఉంటాయి- సందర్భానుసారము వాడుకునేవి అని చెబుతాడు పండితుడు భార్గవ శర్మ.


స్వామీ నేను ఎన్నో కథలు చదువుతాను- కాలక్షేపానికి. నాకూ కథలు వ్రాయాలని ఉన్నది- రోజూ ఎన్నో కాగితాలు వ్రాసి కథ కుదురక చింపేస్తుంటాను. దానికి ఏమన్న విశేష పద్ధతి ఉన్నదా అని అడుగుతాడు భార్గవ శర్మను నగధర్.


భార్గవశర్మ అంటాడు కథలు వ్రాయాలంటె అంత సులువు కాదు- వివరంగా చెబుతా విను అనుకుంటు ఆ కథా వస్తువు, కథాంశం, మొదట నీ ఆలోచనకు తట్టాలి. సమాజానికి నీ కథ వల్ల ఏదైనా ప్రయోజనము ఉండాలి.


నీవు త్రి మూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశరు ల పాత్ర పోషించ వలసి వస్తుంది కథననుసరించి.


ఎందుకంటె కథలో ఒక పాత్ర సృష్టించడము, పోషించడము ముగింపు ఇవన్ని ఆ కథలో చోటు చేసుకుంటాయి కాబట్టి-

శైలి అందరికీ సులువుగా అర్థమయ్యేటట్టు ఉండాలి. అసభ్య పదాలు దొర్ల కూడదు. పాఠకుడు నీ కథను అప్పుడే చదివి అప్పుడే మరచి పోయేటట్టు ఉండ కూడదు. ఇంకొకటి.. పాఠకులు నీ కథలోని సారాంశాన్ని గ్రహించ గలగాలి. ఒక పాటం నేర్చుకోవాలి. పాఠకులు కథ చదువుతుంటె ఇంకా చదువాలను ఉత్సుకత కలుగాలి. ఈ పదం వృద్ధుడనైన నేను నా అభిరుచి ననుసరించే చెబుతున్నాను. తరువాత నీ ఇష్టం. నీ భావన నీది.


ముగింపు కూడా పాఠకులకు నిరుత్సాహ పరిచే విధంగా ఉండకూడదు.


కథ వ్రాసేవానికి కొంత లోక జ్ఞానము ఉండాలి. ప్రపంచాన్ని చదువాలి. రవిగాంచని చోటు కవి గాంచును అను ఒక సామెత ఉన్నది. భాష పట్ల పట్టు ఉండాలి. అని చెబుతూ భార్గవ శర్మ అంటాడు-


ఈ కాలములో కథలు వ్రాసే వారు మన తెలుగు భాషను కలుషితము పట్టిస్తూ అధిక శాతము ఆంగ్ల పదాలనే జొప్పిస్తున్నారు తెలుగులో పదాలే లేనట్టు. చాలా మందికి కథలు చదువాలె అని ఆసక్తి ఉన్నా ఆంగ్ల భాష రాని వారికి అర్థము కాక నిరుత్సాహముతో కథలు చదువడమే మానుకునే పరిస్థితి ఏర్పడుచున్నది. అని చెబుతుంటాడు భార్గవ శర్మ-


అన్నా! ఈ కథ వ్రాయుటలో ఇన్ని కథలున్నయా అని ఆశ్చర్య పోతాడు నగధర్.


దానికి భార్గవశర్మ అంటాడు “ముందు నీవు చిన్న చిన్న కథలు అంటె చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాలు చదువుతుండు. అందులో ఒక నడక ఉంటుంది, నీతి ఉంటుంది. భాషలో కలుషితము కనబడదు” అని చెబుతాడు భార్గవశర్మ నగధర్ వైపు చూస్తూ.


“రచయితకు ప్రపంచ పరిస్థితులు, కాల విశేషము మున్నగునవి అన్ని తెలిసుండాలి. అమవాశ్య అర్థరాత్రి మండు టెండలో లేదా హైదరాబాదు లో బీచ్ దగ్గర లాంటి పొరపాట్లు దొర్ల కూడదు. ఏ కాలములో ఏ పండ్లు దొరుకుతాయో తెలుసి ఉండాలి- ఇంకొకటి నీ కథలో నెమలి నృత్యము చేయుచున్నది అనుటలో తప్పులేదు కాని మయూరి నృత్యము చేయుచున్నది అని వ్రాయ కూడదు-


ఎందుకంటె మయూరి అనగా ఆడ నెమలి- ఆడ నెమలి నృత్యము చేయదు- మగ నెమలే నృత్యము చేయును కావున అటువంటి సందర్భము వచ్చినప్పుడు మయూరము అని వ్రాయాలి- ఇలాంటి సత్యాలెన్నొ రచయిత తెలసి ఉండుట ముఖ్యము అంటాడు భార్గవ శర్మ.


పాఠకులు కథలో తప్పు బట్టే తీరు ఉండకూడదు. ఇంకొకటి కులాల, మతాల ప్రసక్తి నీవు వ్రాయ బోయే కథలలో తేగూడదు- కాలానుగుణ్యంగ నడుచు కోవడము విజ్ఞత అనుపించుకుంటది” అంటాడు భార్గవ శర్మ.


“ప్రయాణానికి గమ్యము ఎట్లనో కథ వ్రాయాలంటె భావము కూడా ముఖ్యము. మన దేశములో బాగా చదువుకున్నవారు- పుస్తకాలు చదివే వారు కూడ చాలా మందే ఉన్నారు కాని అందరూ కథలు వ్రాయ లేరు ఎందుకంటే కథా వస్తువు అందుకు తగిన భావం స్ఫురణకు రావాలి.

ఒకరు వ్రాసిన కథలోని అంశాలను నీ కథలో ఇముడ్చ కూడదు దాన్ని గ్రంథ చౌర్యము అంటారు అలాంటి పొరపాటు ఎన్నడూ చేయకూడదు. కథలు వ్రాయుటలో చాలా జాగ్రతలు పాటించ వలసి ఉంటుంది. కథలో పాత్రల పేర్లు మార కూడదు. వాస్తవంగా జరిగిన విషయాలకు కథలో చోటీయ కూడదు. కథ అంటేనే ఇంచుక సత్యమైన కల్పిత ప్రబంధము. ఇక ఉపమానాలు చెప్ప దల్చు కుంటె ఫలానా వ్యక్తి అనినట్టు అని ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ‘మాహిషంచ శరత్ చంద్ర ధవళ ధధి యుక్త’ భోజనము పెట్టాడు అనుకుంటె కాళి దాసు చెప్పినట్టు అని వ్రాయాలే కాని ఆ ఘనత మనమే చేసినట్టు తలువగూడదు.


అసలు దాని అర్థమేమిటంటె ఒకతను ఇంకొక వ్యక్తికి శరత్ కాల చంద్రుని వోలె తెల్లగా ఉన్న బర్రె పెరుగుతో భోజనము పెట్టాడు అని అర్థము. ఈ సూక్ష్మాలన్ని తెలిసుండాలి సుమా” అని అంటాడు భాస్కర శర్మ చివరగా.


“ఇంకా చాలా విషయాలున్నయి నాయన నేను తరువాత చెబుతాను. ఇప్పటికి ఇవైతె పాటించ ప్రయత్నించు” అంటాడు భార్గవ శర్మ.


“నీ ఉత్సాహాన్ని తగ్గించమని చెప్పడము లేదు. నువ్వు మంచి రచయిత కావాలనే చెబుతున్న” అంటాడు భార్గవ శర్మ.


భార్గవ శర్మకు ధన్యవాదాలు చెప్పి వెడలి పోతాడు నగధర్.


సమాప్తం.

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

https://www.manatelugukathalu.com/profile/psr

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.
41 views1 comment
bottom of page