top of page

మహిళలు మారుతున్నారా?

'Mahilalu Maruthunnara' - New Telugu Story Written By A. Annapurna

Published in manatelugukathalu.com on 07/12/2023

'మహిళలు మారుతున్నారా?' తెలుగు కథ

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)

గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా మధురానగర్ కమ్యూనిటీ హాల్లో ‘బుక్ ఫెయిర్’ జరుగుతోంది... అనే కబురు తెలిసిన సుజాత వెంటనే చూడటానికి వెళ్ళింది.

అన్నీ చదివిన బుక్స్. రీప్రింట్ అయ్యాయి అంతే! ఫ్రెండ్ రమ దగ్గిర నాలుగు బీరువాలనిణ్డా వున్నాయి. కావాలంటే తెచ్చుకుని మళ్ళీ చదవచ్చు... అనుకున్న సుజాత కాస్సేపు అటూ ఇటూ తిరిగి చూసిన పుస్తకాలే మళ్ళీ తిరగేసి ఇంటికి రాబోతుంటే ఎవరో పలకరించారు.

''ఇలా రండి. కాసేపు కూర్చుని మాటాడుకోవచ్చు…” అంటూ!

ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.

''నాపేరు మీనాక్షి. మీపేరు ఏమిటి? ఎక్కడ వుంటారు?” అని అడిగింది ఆవిడ.

''నా పేరు సుజాత. మీకు ఈ ఏరియా అంతా తెలుసా?” పార్క్ కి వెళ్లే దారిలో వున్న అపార్ట్మెంట్స్ పేరు చెప్పింది సుజాత.

''ఆ.. తెలుసును. అక్కడ ప్రతివారం ఒకరి ఇంట్లో భజనలు చేస్తారు. నేను వెడుతూ వుంటాను. కానీ మీరు ఎప్పుడూ కనబడలేదు'' అంది.

''ఆ.. నాకు అంత శ్రద్ధ లేదు లెండి. నేను భజనలు చేయను. ఇంట్లో పూజలూ చేయను.... '' చెప్పింది సుజాత.

''అయ్యో! ఆడవాళ్లు అన్నాక పూజలు చేయకుండా ఉంటామ? ఆశ్చర్యంగా వుంది !''

''ఏమో నాకు వాటిమీద అంత నమ్మకంలేదు. మీరు ఎక్కడవుంటారు?” అడిగింది సుజాత.

''అదిగో ఈ లైబ్రెరీ ఎదురుగా వున్నా రాజ్ టవర్స్ అపార్టుమెంట్లో ఉంటాము. మా వారు విశాఖ షిప్యార్డ్లో, నేను స్కూల్ టీచరుగా రిటైర్ ఐ ఈ హైదరాబాద్ వచ్చాం. మా అబ్బాయి బ్యాంకు ఆఫీసర్ గా ఇక్కడ పనిచేస్తున్నాడు. '' అంది మీనాక్షి.

''మీరు రోజూ లైబ్రెరీకి వస్తారా.... ఎవరి బుక్స్ చదువుతారు?” అడిగింది సుజాత.

''వస్తాను. న్యూస్ పేపర్స్ చదవడానికి. బుక్స్ చదవను. మీరు చదువుతారా?” అడిగింది మీనాక్షి.

సుజాతకి ఎక్కడలేని వుత్సాహం వచ్చి ఆమెకు నచ్చిన రచయితలు, రచయిత్రుల గురించి, వాళ్ళు రాసిన బుక్స్ గురించి గడా గడా చెప్పింది.

''ఆబ్బె.. నాకంత తెలీదు. కొంతమంది రైటర్స్ పేరు విన్నాను... అంతే! ఎదో దేవుడి పుస్తకాలు చదువుతూ గడిపేస్తాను. ''

''ఎవరి ఇంట్రస్టు వారిది. రంగనాయకమ్మ గారంటే చెప్పలేని అభిమానం నాకు. మీరు ఏ బుక్స్ చదవను అంటే ఆశ్చర్యంగావుంది. తెలుగు టీచర్గా కూడా వర్క్ చేశారు. !''

ఆవిడ మాట మార్చి, “ఈ లైబ్రెరీకి వచ్చేవారు మీకు తెలుసా? ఎంతకాలంగా ఈ హైదరాబాద్ లో వుంటున్నారు? జాబ్ చేశారా!” అంది.

''తెలీదు. ౩౦ ఏళ్లుగా ఉంటున్నాం. జాబ్ అంటూలేదు కానీ ఒక స్వచ్ఛంద సంస్థలో వాలంటీరుగా పనిచేసాను. '' అంది సుజాత.

''ఎవరో వస్తారు... వెడుతూవుంటారు.. కానీ అక్కడ ఫోను మాట్టాడుతున్న ఆవిడ పరిచయం అయ్యారు. '' అంటూ దూరంగా వున్నా ఆవిడను చూపించింది మీనాక్షి.

''ఆ.. సుమిత్ర! మేము వుండే అపార్ట్మెంట్లోనే ఉండేవారు. బాగా తెలుసు. వాళ్ళ మామయ్యగారు జర్నలిస్ట్,పెద్దరచయిత. '' అంటూ చెప్పింది సుజాత.

''అవునా? ఆవిడ భర్త ఏమి చేస్తారు? ''

''అదేమిటి నన్ను అడుగుతారు, పరిచయం అయినది అన్నారుగా !''

''ఇప్పుడే పరిచయం. ఎక్కువగా మాటాడుకోలేదు. ''

''భర్త లేరు. క్రితం ఏడాది చనిపోయారు. ''

''అదేమిటీ మరి పట్టుచీర కట్టుకుంది, చేతికి గాజులున్నాయి తల్లో పూలుపెట్టుకుంది....” హేళనగా అంది మీనాక్షి.

''ఎం మాటాడుతున్నారు మీరు? విశాఖ నగరంలో టీచర్గా రిటైర్ అయ్యారు.. గ్రామాలలో సైతం చైతన్యం వచ్చింది. కానీ మీలాంటివారు ఇంకా పాత సాంప్రదాయాలను పట్టుకుని మాటాడుతున్నారు. ఈరోజుల్లో తోటి మహిళగురించి కామెంట్ చేయడం అస్సలు బాగాలేదు. '' కోపంగా అంది సుజాత.

''ఓ మీరు... ఆధునిక భావాలున్న మనిషి అని అనుకోలేదు. మళ్ళి కలుద్దాం. వెళతాను. '' అంటూ లేచి వెళ్ళింది.

''నేను మిమ్మల్ని ఇక కలవను. నాకు మీతో సరిపడదు.... బై '' అంది సుజాత.

మీనాక్షి వేసుకున్నది సల్వార్ కమీజు. ఆలోచనలు మాత్రం పాతకాలం! దుస్తులు మార్చినా ఆలోచనలు మూఢ నమ్మకాలు వదిలిపెట్టరు కొందరు... అని సుజాతకి అర్ధం ఐన్ది.

ఇంటికివచ్చి రమతో మీనాక్షి గురించి చెప్పింది.

''అవును సుజాతా. ఇలాంటివాళ్ళు చాలామంది వున్నారు. నువ్వు అమెరికాలోవుండి చాలా రోజులకు వచ్చావు. అందుకని ఆశ్చర్యంగా వుంది నీకు.

మా బంధువు ఒకరు 50 ఏళ్ల మారుతి సడన్గా హార్ట్ ఎటాక్తో చనిపోయాడు. అతడిభార్య కి 45 ఏళ్ళు. చిన్నదికదా పాపం, వాళ్ళ అత్తగారు కోడలిని సతా ఇంచింది.... అన్ని సాంప్రదాయంగా చేయాలని.

మారుతి కి మూఢనమ్మకాలు లేవు, కమ్యూనిస్ట్ భావాలు.. అతడి స్నేహితులతో కలిసి అందరిలోనూ అవేర్నెస్ తెస్తూ ఉంటాడు. మనిషి చనిపోతే బాడీని డొనేట్ చేయాలని అందువలన ఎందరికో ప్రాణ దానం చేయచ్చు. వారి ఆర్గాన్స్ తో అని నచ్చచెప్పేవాడు.

కొడుకు పధ్ధతి తల్లికి నచ్చదు. అలిగి రావడం మానేసింది. ఇప్పుడు పోయాకవచ్చి ఆవిడ పెత్తనం చేస్తే మనవడు ఎదిరించి తండ్రి మారుతి ఇష్టప్రకారం కార్యక్రమాలు చేయిన్చాడు.

ఇంతకీ ఆవిడ భర్త పొతే ''నేను సుమంగళిగా వుండాలని మా ఆయన అనేవాడు. ఆయనమాట శిరసా వహిస్తాను ''అంటూ వ్యతిరేకంగా పోరాడింది. అలాంటిమనిషి ఇప్పుడు చూడు.... ! కొందరు అంటే వాళ్ళకో న్యాయం ఎదుటివారికో న్యాయం.... అని ప్రవర్తిస్తారు”.

''నాకు ఆశ్చర్యంగా లేదులే రమా, అమెరికాలో కూడా మన వాళ్ళు ఇలాగేఉన్నారు. ఇంకా ఎక్కువగా!

అలా అని పూర్తిగా మారిపోవాలి, అమెరికన్లా ఉండాలి.. అనను. కానీ. , మరీ ఘోరంగా వుండకూడదు.

వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది. పేంటు షార్ట్ వేసుకుంటారు. నుదుట బొట్టుతో జడవేసుకుని కాలి మట్టెలు పెట్టుకుంటారు. కాళ్లకు హవాయి చెప్పులు వేసుకుంటారు. వేసుకున్న డ్రెస్సునుబట్టి అలంకరణ ఉండాలి.

నాకు బాగా తెలిసిన అమ్మయికి మోడరన్ గా వుండాలని సరదా.... కానీ భర్తకు అలా ఉండటం నచ్చదు. వాళ్ళ ఆమ్మగారిలా పాతపద్ధతిలో ఉండాలి అంటాడు. అతడిని నువ్వు అనకూడదు. ఆమెకూ ఇష్టాలు సరదాలు వుండకూడదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా. కొందరు అలా వున్నారు. '' అంది సుజాత.

''అదేమరి ! మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లి విషయంలో స్వంత నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ అసలు మారవలసిన పద్ధతుల్లో మార్పు రావడంలేదు. మనం ఏమి చేయగలం? విచారించడం తప్ప !” అంది రమ.

మహిళలు మారుతున్నారా? ఏ. అన్నపూర్ణ

_____________________________________________________________________

గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా మధురానగర్ కమ్యూనిటీ హాల్లో ''బుక్ ఫెయిర్ జరుగుతోంది... ''అనే కబురు తెలిసిన సుజాత వెంటనే చూడటానికి వెళ్ళింది.

అన్ని చదివిన బుక్స్. రీప్రింట్ అయ్యాయి అంతే! ఫ్రెండ్ రమ దగ్గిర నాలుగు బీరువాలనిణ్డా వున్నాయి.

కావాలంటే తెచ్చుకుని మళ్ళీ చదవచ్చు... అనుకున్న సుజాత కాస్సేపు అటూ ఇటూ తిరిగి చూసిన పుస్తకాలే మళ్ళీ తిరగేసి ఇంటికి రాబోతుంటే ఎవరో పలకరించారు.

''ఇలా రండి. కాసేపు కూర్చుని మాటాడుకోవచ్చు... అంటూ!

ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.

''నాపేరు మీనాక్షి. మీపేరు ఏమిటి? ఎక్కడవుంటారు? అని అడిగింది ఆవిడ.

''నా పేరు సుజాత. మీకు ఈ ఏరియా అంతా తెలుసా? పార్క్ కి వెళ్లే దారిలో వున్న అపార్ట్మెంట్స్ పేరు. చెప్పింది సుజాత.

'' ఆతెలుసును. అక్కడ ప్రతివారం ఒకరి ఇంట్లో భజనలు చేస్తారు. నేను వెడుతూ వుంటాను. కానీ మీరు

ఎప్పుడూ కనబడలేదు'' అంది

''ఆ నాకు అంత శ్రద్ధ లేదు లెండి. నేను భజనలు చేయను. ఇంట్లో పూజలూ చేయను.... ''చెప్పింది సుజాత.

''అయ్యో ఆడవాళ్లు అన్నాక పూజలు చేయకుండా ఉంటామ? ఆశ్చర్యంగా వుంది !''

''ఏమో నాకు వాటిమీద అంత నమ్మకంలేదు. మీరు ఎక్కడవుంటారు? అడిగింది సుజాత.

''అదిగో ఈ లైబ్రెరీ ఎదురుగా వున్నా రాజ్ టవర్స్ అపార్టుమెంట్లో ఉంటాము. మా వారు విశాఖ షిప్యార్డ్లో,

నేను స్కూల్ టీచరుగా రిటైర్ ఐ ఈ హైదరాబాద్ వచ్చాం. మా అబ్బాయి బ్యాంకు ఆఫీసర్ గా ఇక్కడ పనిచేస్తున్నాడు. ''అంది మీనాక్షి.

''మీరు రోజూ లైబ్రెరీకి వస్తారా.... ఎవరి బుక్స్ చదువుతారు?అడిగింది సుజాత.

''వస్తాను. న్యూస్ పేపర్స్ చదవడానికి. బుక్స్ చదవను. మీరు చదువుతారా? అడిగింది మీనాక్షి.

సుజాతకి ఎక్కడాలేని వుత్సాహం వచ్చి ఆమెకు నచ్చిన రచయితలు రచయిత్రులు గురించి వాళ్ళు రాసిన

బుక్స్ గురించి గడా గడా చెప్పింది.

''ఆబ్బె నాకంత తెలీదు. కొంతమంది రైటర్స్ పేరు విన్నాను... అంతే !ఎదో దేవుడి పుస్తకాలు చదువుతూ గడిపేస్తాను. ''

''ఎవరి ఇంట్రస్టు వారిది. రాంగనాయకమ్మ గారంటే చెప్పలేని అభిమానంనాకు. మీరు ఏ బుక్స్ చదవను అంటే ఆశ్చర్యంగావుంది. తెలుగు టీచర్గా కూడా వర్క్ చేశారు. !''

ఆవిడ మాట మార్చి, ఈ లైబ్రెరీకి వచ్చేవారు మీకు తెలుసా? ఎంతకాలంగా ఈ హైదరాబాడ్ లో వుంటున్నారు? జాబ్ చేశారా! అంది.

''తెలీదు. ౩౦ ఏళ్లుగా ఉంటున్నాం. జాబ్ అంటూలేదు కానీ ఒక స్వచ్ఛంద సంస్థలో వాలంటీరుగా పనిచేసాను. ''అంది సుజాత.

''ఎవరో వస్తారు... వెడుతూవుంటారు కానీ అక్కడ ఫోను మాట్టాడుతున్న ఆవిడ పరిచయం అయ్యారు. ''

అంటూ దూరంగా వున్నా ఆవిడను చూపించింది మీనాక్షి.

''ఆ సుమిత్ర. మేము వుండే అపార్ట్మెంట్లోనే ఉండేవారు. బాగాతెలుసు. వాళ్ళ మామయ్యగారు జర్నలిస్ట్

పెద్దరచయిత. '' అంటూ చెప్పింది సుజాత.

''అవునా? ఆవిడ భర్త ఏమిచేస్తారు? ''

''అదేమిటి నన్ను అడుగుతారు, పరిచయం అయినది అన్నారుగా !''

''ఇప్పుడే పరిచయం. ఎక్కువగా మాటాడుకోలేదు. ''

''భర్త లేరు. క్రితం ఏడాది చనిపోయారు. ''

''అదేమిటీ మరి పట్టుచీరకట్టుకుంది, చేతికి గాజులున్నాయి తల్లోపూలుపెట్టుకుంది.... హేళనగా అంది మీనాక్షి.

''ఎం మాటాడుతున్నారు మీరు? విశాఖ నగరంలో టీచర్గా రిటైర్ అయ్యారు.. గ్రామాలలో సైతం చైతన్యం వచ్చింది. కానీ మీలాంటివారు ఇంకా పాత సాంప్రదాయాలను పట్టుకుని మాటాడుతున్నారు. ఈరోజుల్లో తోటి మహిళగురించి కామెంట్ చేయడం అస్సలు బాగాలేదు. ''కోపంగా అంది సుజాత.

''ఓ మీరు... ఆధునిక భావాలున్న మనిషి అని అనుకోలేదు. మళ్ళి కలుద్దాం. వెళతాను. ''అంటూలేచివెళ్ళింది.

''నేను మిమ్మల్ని ఇక కలవను. నాకు మీతో సరిపడదు.... బై ''అంది సుజాత.

మీనాక్షి వేసుకున్నది సల్వార్ కమీజు. ఆలోచనలు మాత్రం పాతకాలం! దుస్తులు మార్చినా ఆలోచనలు మూఢ నమ్మకాలు వదిలిపెట్టరు కొందరు... అని సుజాతకి అర్ధం ఐన్ది.

ఇంటికివచ్చి రమతో మీనాక్షి గురించి చెప్పింది.

''అవును సుజాతా. ఇలాంటివాళ్ళు చాలామంది వున్నారు. నువ్వు అమెరికాలోవుండి చాలా రోజులకు

వచ్చావు. అందుకని ఆశ్చర్యంగా వుంది నీకు.

మా బంధువు ఒకరు 50 ఏళ్ల మారుతి సడన్గా హార్ట్ ఎటాక్తో చనిపోయాడు. అతడిభార్య కి 45 ఏళ్ళు.

చిన్నదికదా పాపం, వాళ్ళ అత్తగారు కోడలిని సతా ఇంచింది.... అన్ని సాంప్రదాయంగా చేయాలని.

మారుతి కి మూఢనమ్మకాలు లేవు కమ్యూనిస్ట్ భావాలు.. అతడి స్నేహితులతో కలిసి అందరిలోనూ అవేర్నెస్

తెస్తూ ఉంటాడు. మనిషి చనిపోతే బాడీని డొనేట్ చేయాలని అందువలన ఎందరికో ప్రాణ దానం చేయచ్చు

వారి ఆర్గాన్స్ తో అని నచ్చచెప్పేవాడు.

కొడుకు పధ్ధతి తల్లికి నచ్చదు. అలిగి రావడం మానేసింది. ఇప్పుడు పోయాకవచ్చి ఆవిడ పెత్తనం చేస్తే మనవడు ఎదిరించి తండ్రి మారుతి ఇష్టప్రకారం కార్యక్రమాలు చేయిన్చాడు.

ఇంతకీ ఆవిడ భర్త పొతే ''నేను సుమంగళిగా వుండాలని మా ఆయన అనేవాడు. ఆయనమాట శిరసా వహిస్తాను ''అంటూ వ్యతిరేకంగా పోరాడింది. అలాంటిమనిషి ఇప్పుడు చూడు.... !

కొందరు అంటే వాళ్ళకో న్యాయం ఎదుటివారికో న్యాయం.... అని ప్రవర్తిస్తారు.

''నాకు ఆశ్చర్యంగా లేదులే రమా, అమెరికాలో కూడా మన వాళ్ళు ఇలాగేఉన్నారు.

ఇంకా ఎక్కువగా !

అలా అని పూర్తిగా మారిపోవాలి అమెరికన్లా ఉండాలి అనను. కానీ. , మరీ ఘోరంగా వుండకూడదు.

వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది. పేంటు షార్ట్ వేసుకుంటారు. నుదుట బొట్టుతో జడవేసుకుని కాలి మట్టెలు పెట్టుకుంటారు.

కాళ్లకు హవాయి చెప్పులు వేసుకుంటారు. వేసుకున్న డ్రెస్సునుబట్టి అలంకరణ ఉండాలి.

నాకు బాగా తెలిసిన అమ్మయికి మోడరన్ గా వుండాలని సరదా.... కానీ భర్తకు అలా ఉండటం నచ్చదు.

వాళ్ళ ఆమ్మగారిలా పాతపద్ధతిలో ఉండాలి అంటాడు. అతడిని నువ్వు అనకూడదు.

ఆమెకూ ఇష్టాలు సరదాలు వుండకూడదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా కొందరు అలా వున్నారు. ''

అంది సుజాత.

''అదేమరి ! మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లి విషయంలో స్వంత నిర్ణయం తీసుకుంటున్నారు.

కానీ అసలు మారవలసిన పద్ధతుల్లో మార్పు రావడంలేదు. మనం ఏమి చేయగలం?

vichaarinchadam తప్ప ! అంది రామ

విచారించడం తప్ప !" అంది రమ.

********

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)

44 views0 comments
bottom of page