top of page

మహోన్నతరావు మనోగతం'Mahonnatharao Manogatham' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 05/07/2024 

'మహోన్నతరావు మనోగతంతెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్నమస్కారమండి 

నా పేరు మహోన్నతరావండి


ఈ పేరు 30 సంవత్సరాల క్రితమే నాకు నా తల్లి దండ్రులు పెట్టినప్పుడు మా అమ్మానాన్నలు ఎంత గొప్పవాళ్లు అని.. ఆ ఊహ తెలియని మూడు నెలల పసికందుగా నా మనసు ఉప్పొంగిపోయి ఉంటుంది. 


ఏమో ఆ విషయం నాకు తెలియదు కానీ.. ప్రస్తుతం ఆ పేరు నాకు ఎందుకు పెట్టారు రా భగవంతుడా, హలో లక్ష్మణ అంటూ నా మనసు మాత్రం ఆక్రోసిస్తుంది. అంటే సాధారణ భాషలో చెప్పాలంటే నేను బాధపడు తున్నాను అన్నమాట. 


మరి అంతే కదండీ మరి నా జీవితంలో మహోన్నత శిఖరాలు ఏమీ లేవు. 


పోనీ సమాజంలో మహోన్నత శిఖరాలు చూసి నేను ఆనంద పడదామంటే అవి కూడా మృగ్యంగా ఉన్నా యి. 


అన్ని విషయాలు చెప్పాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది కానీ ప్రస్తుతం మన తెలుగుభాష కుంటిదై పోయి అవసాన దశలో ఉన్నట్టు మీకు ఎవరికీ అనిపించటం లేదూ?


 మరి ఎందుకు స్పందించరు. కనీసం ఆ విషయంలో నా మనోవేదన విన్నాక అయినా ఒక్కసారి పైకి లేచి నడుము కట్టుకొని ముందు అడుగు వేస్తారని ఆశిస్తున్నాను. 


***


తెలుగు భాష.. తెలుగు భాష.. తెలుగు భాష.. 


ఈ అంశం మాట్లాడే విషయంలో మన తెలుగు భాష ఎప్పుడు పుట్టింది, దానిని గౌరవిస్తూ ఆదరించిన మహామహులు ఎవరెవరు?.. అసలు తెలుగు భాష లో రచించిన గ్రంథాలు ఏమిటి?.. ప్రపంచంలో ఎన్ని దేశాలలో తెలుగుభాషను మాట్లాడేవారు ఉన్నారు.. గతంలోనూ ప్రస్తుతంలోనూ తెలుగుభాషలో గ్రంథా లు రచించి అత్యున్నత స్థానంలో ఉన్న మహామహు లు ఎవరు?..


ఈ విషయాలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంటే ఉండవచ్చునేమో కానీ ప్రస్తుతం మనం మన తెలుగుభాషను కాపాడవలసిన రక్షించవలసిన ఆవశ్యకత విషయంలో స్వర్ణయుగము లాంటి ఆ గతస్మృతులను గుర్తుకు చేసుకొని కించిత్తు బాధపడటం తప్పించి మనం చేయగలిగింది ఏమీ ఉండదు. 


ప్రస్తుత విషయం గురించి మాట్లాడుకోవలసి వస్తే చాలా సంఘటనలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ విషయాలు చర్చించుకుంటూ పరిష్కారం గురించి వీలైనంత చర్చించుకోవడం ఉత్తమం. 


నేను గతంలో నివాసం ఉండే ప్రదేశంలో ప్రజా పరి పాలన విభాగం ఉండేది. ఆ విభాగం అభివృద్ధి చేసే ప్రాతిపదికలో రహదారి పక్కన ప్రహరీ గోడ మరమ్మత్తు చేసి రంగులు వేసి చక్కగా కొన్ని మంచి మంచి నీతివాక్యాలు రాయించారు. చూడడానికి అద్భుతంగా ఉంది. ఆ నీతి వాక్యాలు నిలబడి చదువుతూ ఆహా ఓహో బ్రహ్మాండంగా ఉంది అను కుంటూ వెళ్లిపోతున్నారు జనం. 


నేను ఒకరోజు నిలబడి అన్నీ చదివాను. గోడ మీద రాసిన 20 నీతి వాక్యాలులో పది తప్పు అక్షరాలు దొర్లాయి. అక్కడికి నేను మాత్రమే తెలివైన వాడిని అని కాదు. భాష మీద కొద్దిగా పట్టు ఉంది నాకు. 


వెంటనే కార్యాలయం లోపలకు వెళ్లి అవి ఎవరు రాయించారో కనుక్కున్నాను. 


ఆయన దగ్గరికి వెళ్లి ఎక్కడ ఎక్కడ తప్పులు పడ్డాయో నేను రాసిన కాగితం చూపించాను. వెంటనే ఆ కార్యాలయంలో మరో ఇద్దరు పోగుపడిపోయారు. ఆ ముగ్గురు కలిసి మాటలతో నామీద దాడి చేశారు. ఘర్షణ పెరిగి చివరికి నన్ను కొట్టినంత పని చేశారు. 


''నువ్వే తెలివైన వాడివా.. ఈ కార్యాలయంలో ఉన్న మేము అందరం తెలివి తక్కువ వాళ్లమా?''.. 


అంటూ నేను చెప్పిన మాట వినలేదు. అక్షరాలు సరిదిద్దలేదు. ఇప్పటి వరకు అలాగే ఉంది వాతావరణం. 


అహంభావం.. 


ఒకడి మాట వినడం ఏమిటి అన్న అహంభావం. 


ఇలాగైతే సంస్కృతి పరంగా ఎంతో పేరెన్నికైన తెలుగు రాష్ట్రాల సామాజిక పరిస్థితులు ఎంత కుంచించుకుపోతాయో ఆలోచించండి. 


నామీద కోపం భాష మీద చూపిస్తే ఎట్లా. 

అక్కడికీ నేను చెప్పాను.. ఈ దారి వెంబడి వాహనాల మీద వెళ్లే జనం ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతరదేశాల వాళ్లు కూడా కావచ్చు.. వాళ్లు ఆ నీతి వాక్యాలు చదివి తప్పులు గుర్తించి మన ఊరు వారందరినీ తెలివి తక్కువ వాళ్లుగా భావించే అవకాశం ఉంది. అక్షరాలు సరిదిద్దమని మొత్తుకున్నాను. కానీ ఫలితం దక్కలేదు. అదిగది.. అలా ఉందన్నమాట పరిస్థితి. 


విషయం ఏమిటంటే గోడల మీద వాక్యాలు రాసే పనివాళ్ళు చాలా మంది చదువు తక్కువ అయిన వాళ్లు అయి ఉంటారు. వాళ్లలో చాలామంది బ్రతుకుతెరువు కోసం గోడలకు రంగులు వేసుకుంటూ బ్రతికే ఆర్టిస్టులు. స్వతహాగా అక్షర జ్ఞానం తక్కువ అయిన ఒక వర్గం కష్టజీవులు వాళ్లు. అలాంటప్పుడు అది వాళ్ళ తప్పు కాదు. కార్యాలయంలో ఉన్న కాస్తంత తెలివైన వాళ్లు ముందుగానే అక్షరాలు సరి దిద్ది చెప్పే ప్రయత్నం చేయవచ్చు కదా.. అబ్బే మన కెందుకులే అని మాట్లాడకు ఊరుకునే స్వభావం. 


మరో విషయం.. నగరాల్లో వ్యాపార సంస్థల దగ్గర సంస్థల పేర్లు చూడండి. పరమ తప్పుల మయంగా ఉంటాయి. 


మాతృభాషను ఇష్టం వచ్చినట్టు మార్చి రాయడం అంటే మన కన్న తల్లిని అనుమానించి అవమానించడం లాంటిదే అవుతుంది.. !


అసలు మన పిల్లలకు అమ్మానాన్న అనే మాతృభాష అక్షరాలు వదిలిపెట్టి ఆంగ్ల భాష అక్షరాలు నేర్పించడం అనే సాంప్రదాయం మొదలయిందే.. అక్కడ నుండే బిందెడు నీళ్లలో విషపు బొట్టు పడ్డట్టు అయింది. 


ఇక్కడ ఇతర భాషను విమర్శించడం కాదు కానీ అదే సమయంలో మన మాతృభాషకు అన్యాయం చేయకూడదు అనేటటువంటి స్పృహ లేక పోవడం విచారించ తగిన విషయం. 


ఆ మధ్యన నేను ఒకరి ఇంటికి వెళ్లాను. వాళ్ళ అమ్మాయి చేత ఆంగ్ల భాషలో మాట్లాడించి తెగ మురిసి పోతున్నారు ఆ దంపతులు. తప్పు.. అని నేను అనడం లేదు. సంస్కృతి మారాలి. అంత మాత్రాన మనం ముందుగా నేల మీద నిలబడ్డా కనే ఆకాశంలో విమానంలో ఎగరడం నేర్చుకున్నాం అన్న విషయం మర్చిపోతే ఎట్లా??


ఒకసారి నేను ఒక సభలో ప్రసంగించడానికి వెళ్లాను. 

ఆ సభ తెలుగుభాష అభివృద్ధికి సంబంధించింది. 

కానీ ఆ సభలో ప్రసంగించే వారందరూ ఆంగ్ల ముక్క లు చేర్చే మాట్లాడుతున్నారు. 


నేను ఇదేమిటి అని అడిగాను. ఆంగ్ల ముక్కలు మధ్య మధ్యలో కలపకుండా మాట్లాడలేరా అని ప్రశ్నించాను. 


''కుదరదు గురువుగారు మీరు కూడా మాట్లాడలేరు" అన్నారు వాళ్ళు. 


కానీ నేను ఏకధాటిగా ఒక్క ఆంగ్ల అక్షరం పడకుండా 40 నిమిషాలు మాట్లాడి చూపించాను. వాళ్లు ఆనందించలేదు.. చప్పట్లు కొట్టలేదు.. ఆ సభ జరిగినంత సేపు నన్ను ప్రత్యేక జీవాన్ని చూసినట్టు చూశారు. అహంభావం అన్నమాట! అదే మనుషుల జీవన విధానాన్ని నాశనం చేస్తుంది. దాంతోపాటు మనం మాతృభాష కూడా నాశనం అవుతుంది. ఇటువంటి విధానాలు వల్ల సమాజంలో సంక్షోభం తలెత్తుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. 


ఈ సంఘటనలు అన్నీ విన్న మీదట మన మాతృ భాష అభివృద్ధి చెందాలి అంటే.. మన భాష శిఖరం అంత ఎత్తు ఎదగకపోయిన మామూలు జీవన విధానంగా మనగలగాలి అంటే ముందుగా మనుషుల మనస్తత్వాలు మారితే చాలు. అన్నీ సర్దుకుం టాయి. 


మరొక విషయం ఏమిటంటే.. 


ఈ మధ్యన కుప్పలు తెప్పలుగా ఏర్పాటు అవు తున్న సామాజిక మాధ్యమాల గుంపులు గురించి తప్పకుండా చెప్పి తీరాలి. ఎవరికి కోపం వచ్చినా పర్వాలేదు కానీ ఇక్కడ విష సంస్కృతి మొదలయ్యింది. 


ఈ సామాజిక మాధ్యమాలు కొన్నింటిలో కథలు కవిత్వాలు స్వీయప్రచురణ చేసుకోవచ్చు. ఈ విధానం హర్షించతగిన పరిణామమే. కానీ అదే సమయంలో కవులు రచయితలు వేలాదిగా బయలు దేరారు. ఇదీ సంతోషించదగిన పరిణామమే. 


కానీ ఏమైంది.. కనీసపు పర్యవేక్షణ లేకపోవడంతో కథలు కవిత్వాలు ఎవరు ఇష్టమొచ్చినట్టు వాళ్ళు రాసి స్వీయ ప్రచురణ చేసేసుకుంటున్నారు. నేను పెద్ద రచయితను, కవిని అనుకుంటూ.. ఆహా ఓహో.. అనుకుంటూ పైకి ఎగిరి గంతులు వేస్తున్నారు. నేను 300 కవిత్వాలు రాశాను.. 400 కథలు రాశాను అంటూ.. వార్తాపత్రికలలో వేయించుకొని తెగ సంబర పడిపోతున్నారు. 


ఇప్పుడు ఏమైంది? అందుబాటులో ఉన్న గ్రూపుల సాహిత్యాన్ని, ఈ మ్యాగజైన్ల సాహిత్యాన్ని చాలా మంది చదివి తప్పులను గుర్తించకుండా అదే నిజమైన భాష అనుకుంటూ ఆ దారిని పయనిస్తున్నారు. దాంతో తెలుగు భాష మరింత దిగజారిపోక తప్పలేదు. 


ఏతా వాత ఇప్పుడు మాతృభాషను వెంటనే బ్రతికించుకోవలసిన అవసరం నూటికి నూరుపాళ్ళు ఖచ్చితంగా ఉంది. 


అందుకోసం ముందు చెప్పుకున్నట్టుగా మనుషుల మనస్తత్వాలు మారాలి. 


తర్వాత కన్న తల్లికన్న మిన్నగా మాతృభాషను ప్రతి మనిషి ప్రేమించి తీరాలి. 


ఏ విషయమైనా తెలుసున్న వాళ్లు చెబితే తెలియని వాళ్ళు విని ఆచరించగలిగే మంచి సాంప్రదాయానికి బద్ధులై ఉండాలి. 


చెప్పేది పూర్తిగా విన్నాక అప్పుడు మాట్లాడే మనస్తత్వం నేర్చుకోవాలి. 


నాకు మాత్రమే తెలుసు నేనే గొప్పవాడిని అన్న.. ఆ మూర్ఖపు బుద్ధికి చుక్క పెట్టాలి. 


ఆంగ్ల పదాలను వీలైనంత తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం సాహితీ సంస్థలు ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి.. అంటే ప్రజానీకం మధ్య ఆంగ్ల పదాలు లేకుండా మాట్లాడగలిగే వివిధ పోటీలు నిర్వహించి వాళ్ళను ఉత్తేజపరచాలి. 


కార్యాలయాలలోనూ, న్యాయస్థానాలలోనూ, రక్షణ రక్షక విభాగాలలోను తెలుగు మాత్రమే అనుమతించాలి. 


ఒక చదువు రాని వ్యక్తి ధైర్యంగా ఎక్కడికైనా వెళ్లి మీరు ఇతర భాషలలో మాట్లాడకండి.. నాకు సమాధానం తెలుగులోనే చెప్పండి అని ధైర్యంగా మాట్లాడ గలిగేలాగున రాజ్యాంగ విధానాలు ఉండాలి. 


చిట్ట చివరగా.. నేను సైతం సిగ్గు పడకుండా నాకు సైతము జరిగిన ఒక చిత్రవిచిత్రమైన సంఘటన చెప్తాను. 


ఒకసారి ఒక ఆఫీస్ కు ఒక పని విషయములో నేను వెళ్ళాను. అక్కడ ఒక అప్లికేషన్ పూర్తిచేయవలసి వచ్చింది. ఆ అప్లికేషన్లు ఇచ్చే వ్యక్తికి తెలుగు రాదు. వచ్చిన జనం లైన్లో నిలబడి ఖాళీ అప్లికేషన్ తీసు కొని కంగారుగా అతను ఇంగ్లీషులో ఏదో చెబుతు న్నది విని అర్థం అయినట్లు ఒక్కొక్కళ్ళు అప్లికేషన్ పూరించడానికి పక్కకు వెళ్ళిపోతున్నారు. సరే నేను కూడా ఒక అప్లికేషన్ తీసుకున్నాను అతని ఏదో చెప్పాడు నాకు బొత్తిగా అర్థం కాలేదు. అందరూ అర్థమయ్యే కదా మాట్లాడకుండా ఖాళీ అప్లికేషన్ తీసుకుని పూరించడానికి పక్కకు వెళ్లిపోయారు. 


నేను అర్థం కానట్లు.. ఏమిటి.. అని అతడిని అడిగితే ఎలా? అన్న గిల్టీ ఫీల్ అయ్యాను. 10మంది నవ్వు తారేమోనని నా వైపు చులకన భావంతో చూస్తా రేమోనని అతను చెప్పింది అర్థం కాకపోయినా ఏమిటండి అని అడగలేదు. సరే పూరించే వాళ్ళని అడుగుదాములే అని పక్కకు వచ్చేసాను. పక్కన అప్లికేషన్ పూరిస్తున్న వాళ్లను నలుగురు ఐదు గురుని అడిగాను అతను ఏమి చెప్పాడు అని.. వాళ్లంతా మాకు కూడా తెలియదండి గురువుగారు అతను చెప్పింది అర్థం కాలేదు.. అనేశారు. 


ఇప్పుడు చెప్పండి అర్థం కాని భాష మనుషులను ఎంత గజబిజి చేస్తుందో. అదే ఆఫీసుల్లో స్వచ్ఛంగా తెలుగు మాట్లాడే వాళ్ళ చేత పనులన్నీ చేయించారు అనుకోండి.. సమాజం ఎంత ఆరోగ్యంగా ఉం టుందో ఆలోచించండి. సమాజంలో సంక్షోభం రాకూడదు ఏ విషయంలోను అంటారు కానీ అందుకు తగిన కృషి కనీసం కూడా ఎవ్వరూ చేయరు. ఇది దుర్భరం ఈ పరిస్థితి పూర్తిగా మాసిపోవాలి. 


అప్పుడే మన మాతృభాష తల ఎత్తుకొని గర్వంగా బ్రతకగలిగే సుదినం.. ఆరోజు రావాలని మన మందరం ఎదురు చూడటం కాదు మన శక్తి మేరకు ప్రయత్నం చేద్దాం. 


ప్రయత్నిస్తే ఫలితం సిద్ధించడం తథ్యం. 


ప్రయత్నించండి.. ప్రయత్నించండి.. ప్రయత్నించండి. 


కృషితో నాస్తి దుర్భిక్షo. 


నమస్కారమండి ఇదేనoడి నా మనోగతం నా బాధ. 

విన్నారు కదా. కనీసం ఇప్పుడైనా పైకి లేచి నడుము కట్టుకొని ముందడుగు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశిస్తున్నాను. 


 మీ మహోన్నతరావు


@@@@@@@@@@@@ 


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు
32 views0 comments

コメント


bottom of page