మన తెలుగుభాష
- Chilakamarri Rajeswari
- May 29
- 2 min read
#ChilakamarriRajeswari, #చిలకమర్రిరాజేశ్వరి, #ManaTeluguBhasha, #మనతెలుగుభాష, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Mana Telugu Bhasha - New Telugu Poem Written By - Chilakamarri Rajeswari
Published in manatelugukathalu.com on 29/05/2025
మన తెలుగుభాష - తెలుగు కవిత
రచన: చిలకమర్రి రాజేశ్వరి
అమ్మ అనే పిలుపులో మాధుర్యం
నాన్న అనే పిలుపులో ఆత్మీయం
తెలుగుతనంలో ఉన్న అందం
తెలిసి పలుకుతుంటే బాగుంటుందే బాలా!
పంచమవేదంగా పేరొందిన మహాభారతం
కవిత్రయం మనకందించిన గొప్ప వరం
దేశభాషలందు లెస్స మన తెలుగు వాజ్మయం
ఎందరో మహనీయులు కూర్చిన
వచన, పద్య, గద్య రచనల మణిహారం
తెలిసినవి కొన్నే, తెలియనివి ఎన్నెన్నో,
చదివి తెలుసుకుంటే బాగుంటుందే బాలా!
సులభతరమైన భాష, సిరులు వెదజల్లు భాష
తేనెలొలుకు పదాలతో అలరించు మధుర భాష
మదిని మురిపించు భాష, మన తెలుగుభాష
మరువక కాపాడుకుంటే బాగుంటుందే బాలా!
చిలకమర్రి రాజేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి
నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.
మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.
నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.
పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని, నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.
అమ్మ భాష ఎన్నటికీ కమ్మనిదే. విభిన్న సాహితీ ప్రక్రియలతో అలరారే భాష తెలుగు భాష