top of page
Writer's pictureSabbani Lakshminarayana

మెత్తనైన మనసు


'Metthanaina Manasu' - New Telugu Story Written By Lakshmi Narayana Sabbani

Published In manatelugukathalu.com On 09/10/2023

'మెత్తనైన మనసు' తెలుగు కథ

రచన: లక్ష్మీ నారాయణ సబ్బని


అనుభవాలు చాలా విచిత్రంగా ఉంటాయి కథల్లోంచి కథలు పుట్టుకొచ్చినట్లుగా. నేను రెండు వేల పదిహేడు సంవత్సరంలో అమెరికా వెళ్లాను. అక్కడ మా కొడుకు, కోడలు ఉంటారు కాబట్టి. వెళ్ళినప్పుడు అమెరికా లోని ముఖ్య ప్రదేశాలు సందర్శించాను. అమెరికాపై ఒక యాత్రా చరిత్ర పుస్తకం రాశాను, ఒక చిరు కవితల పుస్తకం కూడా రాశాను నానీలు అని. ఇంకా తృప్తి తీర లేదన్నట్లుగా ఒక పద్యకావ్యం కూడా రాశాను ‘ఆటవెలదిలోన అమెరికా‘ అని.


పదునాలుగు నెలల వ్యవధి లోనే నేను మళ్ళీ అమెరికా వెళ్ళవలసి వచ్చింది మా మనుమడి మొదటి పుట్టిన రోజు పండుగ ఉంది కాబట్టి రెండు వేల పందొమ్మిది సంవత్సరంలో. నేను వెళ్ళేటప్పుడు పద్య కావ్యంను ముద్రించి వంద కాపీలు కూడా తీసుక వెళ్లాను అక్కడే విడుదల చేస్తానని. ఆ పుస్తకాన్ని అమెరికా లోని నాకు పరిచయం ఉన్న ఒక పెద్ద మనిషికి అంకితం ఇస్తూ విడుదల చెయ్యాలని అనుకొనే వెళ్లాను. ఆ పెద్దమనిషి మంచి కథకులు, నలుపై యేండ్ల కింద ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లి స్థిరపడ్డవారు. అమెరికాలో తొలినాటి నుండి తెలుగు సాహితీ, సాంస్కృతిక కార్యక్రమములు చక్కగా నడిపిస్తున్నవారు.


గత సంవత్సరం అమెరికా వెళ్ళినపుడు నన్ను వాళ్ళ నగరానికి ఆహ్వానించి నాతో ఒక ప్రసంగం ఇప్పించారు, సన్మానం కూడా చేశారు వాళ్ళ ఊరిలో. ఎందుకైనా గాని అతను నాకు నచ్చినాడు. ఏదో ఆశపడి నేను ఎవ్వరికైనా పుస్తకాలు అంకితాలు అని ఇవ్వలేదు ఎప్పుడూ. అతడు నిగర్వి, సహృదయుడు, మంచివాడు కాబట్టి అతనికి నా పద్య కావ్యాన్ని అంకితం ఇవ్వాలని నిర్ణయించుకొని ఆ విషయం అతనికి తెలియ చేశాను.


అందుకు అతను ‘నేను దానికి అర్హుడినా?‘ అన్నారు. అది వారి సంస్కారం. నా ఇష్టం మేరకు అంగీకరించారు. నవంబర్ మాసంలో నేను అమెరికా చేరుకున్నాను. ఆ విషయాన్ని వారికి తెలియ చేశాను. నవంబర్ మాసంలో బిజీగా ఉన్నానని చెప్పి డిసెంబర్ లో గాని జనవరిలో గాని ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తాను అన్నారు.


అప్పటికి రాసుకున్న ఆ ఆటవెలది పద్యాలను నేను ఏ పత్రికకు పంపలేదు. అన్నీ పద్యాలు నేనే యూనికోడ్ లో టైపు చేసినవే. ఒకనాడు అమెరికా లో ఉన్న మూడు ఆన్లైన్ వెబ్ పత్రికలకు ఎనిమిది కవితల చొప్పున పంపించాను. దానికి తోడుగా రెండు దిన పత్రికలకు, ఒక మాస పత్రికకు కూడా పంపించాను.


ఒక దిన పత్రిక వాళ్ళైతే రెండు రోజుల్లోనే వాళ్ళ పత్రికలో ప్రచురించి నాకు మెయిల్ లో పత్రికను పంపించారు. ఇక అమెరికా లోని ఒక వెబ్ పత్రిక సంపాదకుడి నుండి నాకు మెయిల్ వచ్చింది ఇలా. “ఈ పద్యాలు కొత్తగా ఏమీ లేవండీ. వీటిని ప్రచురించడం వల్ల పత్రికకూ, మీకూ కూడా ఏమీ అదనపు విలువ ఉండదని అనుకుంటున్నా. ఈ సారికి వీటిని వదిలేద్దాం.” అని.


ఎందుకో గాని నా మనసుకు బాధ అనిపించింది. ఆ సంపాదకుడికి పద్యమంటే నచ్చలేదా, అమెరికాపై పద్యాలు నచ్చలేదా అనే విషయం అర్థం కాలేదు. సరే నేను అంగీకరిస్తున్నాను అని జవాబు ఇచ్చాను. ఆ పత్రికకు పంపిన పద్యాలు ఇవి.


మట్టి మనుషులు ఇచట మానవాళి ఇచట

అన్ని దేశములును అమరినట్టు

వివిధ జాతులిచట వివిధ మతములును

విశ్వ జనుల భూమి విశదముగను !


ప్రజల స్వామ్య మదియు ప్రజల సౌకర్యమై

విశ్వ వేదికగను వినుతి గాంచె

అవని లోన ఇదియె అలరారు చున్నట్టి

అన్ని ఉన్న దేశ మమెరికాను !


కళ్ళు మెరియునిచట కాంచినంతయు తోడ

డాలరంటె నెంతొ డాబుసరియు

రూపమెంతో చూడు రూపాయి పాపాయి

పోల్చి చూడబోకు పొద్దు పోక !


సిరులు గల్ల సీమ సిరి చక్ర మటులుండి

అద్భుతమ్ము అదియు అమెరికాను

సిరుల యంత్ర మదియ సిరులున్న దేశము

అమరి యుండె నచట అన్ని సిరులు !


కారు ఉంటె బతుకు కాలి నడుక కాదు

కారు లేక బతుకు కష్ట మవును

ఇంటి కొక్క కారు ఇంతికైనను కారు

మనిషి మనిషికినియు మరియు కారు


ఆడ మగయు ననెడు తేడ లేకుండగా

ప్రీతిగ సిగరెట్లు పీల్చు చుంద్రు

బీరు విస్కి వైను జోరుగా త్రాగేరు

వింత అయిన దేశ మెంతగానొ.


త్రాగి కారు నడుప తప్పగు నచ్చట

నడుప రాదు వేగ మతిశయించి

హద్దు దాట నేమి పద్దు కట్ట వలెను

తప్పు చేస్తె శిక్ష తప్పదట్లు !


కారు వెనుక కారు కనిపించు నచటను

రోడ్డు పైన మనిషి జాడ కరువు

ఆటో రిక్ష చూడ అసలు కనపడదు

దారు లన్ని చూడు దర్పముండు


ఈ పద్యాలను మళ్ళీ చదివి చూసుకున్నాను, ఏమయినా తప్పుగా రాశానా అని ఆ పత్రికకు పంపేముందు. భావంలో అయితే తప్పు లేదు, ఛందస్సులో కూడా లేదు. కాని ఆ సంపాదకుడు మాత్రం “ఈ పద్యాలు కొత్తగా ఏమీ లేవండీ“ అన్నారు. కొత్తదనం ఏంటో అర్ధం కాలేదు నాకు. ఆయన అమెరికాలో ఉంటుడు కాబట్టి అతనికి కొత్తదనం ఏది కనిపించక పోవచ్చు, నాకైతే కొత్తవే, అమెరికా గురించి తెలియని వారికి కొత్తవే ఆ పద్యాలు.


పాత కొత్త అనేవి సాపేక్షాలు. ఎందుకో గాని మనస్సు చివుక్కుమంది. పద్యమంటే చిన్నచూపా ఈ పత్రికలకు అనిపించింది. నేను వచన కవితాప్రియున్ని, వచన కవిత అంటే మక్కువతో పన్నెండు పుస్తకాలు వెలువరించిన వాన్ని. అయినా పద్యమంటే మక్కువనే నాకు. రామాయణ, మహాభారత, భాగవతాలు చదివాను, ప్రబంధ సాహిత్యం చదివాను ఇష్టంగా. వేమన, సుమతి పద్యాలైనా, ఆధునిక విశ్వనాధ, జాషువ పద్యాలయినా ఇష్టంగా చదివాను.’ తినగ తినగ వేమ తియ్య గుండు’ నన్నట్లు నేను కూడా ఆట ఆటవెలదిలో పద్యాలు రాశాను.


‘పలుకనేలనయ్య పద్యంబు వద్దని

తెలుగు పద్య కవిత వెలుగు నిచ్చు

సంప్రదాయమైన సరసమౌ పద్యాలు

సబ్బని కవి పల్కు సత్య మెపుడు !’


అని ఒక చక్కటి ఆటవెలది పద్యకావ్యం రాసినాను మొదటి సారి గత డిశంబర్ లో. మళ్ళీ అమెరికా వచ్చే ముందు ‘ఆటవెలదిలోన అమెరికా’ అని నూట ఎనిమిది పద్యాలు రాశాను. పుస్తకంగా కూడా ప్రచురించి వంద పుస్తకాలు కూడా తీసుక వచ్చాను అమెరికాకు. నిజంగా వచన కవిత రాయడం కంటే నాకు పద్యం రాయడమే తృప్తి అనిపించింది. పద్యం రాయడం మెదడుకు మేత, వ్యాయామం అనిపించింది. అందుకే పద్యం రాసిన వాడే, అందులో కందం రాసిన వాడే కవి అన్నారేమో ! నేను అంత మక్కువతో పద్యాలు రాస్తే


‘ఈ పద్యాలు కొత్తగా ఏమీ లేవండీ’ వద్దు అని ఆ ఎడిటర్ అనడం నా మనసుకు బాధ అనిపించింది. ఎప్పుడెప్పుడు బాధ బాధపడ్డానో, ఎప్పుడైనా కావాలనో, అప్రయత్నంగానో ఎవరైనా నా మనసును నొప్పిస్తే ఆ బాధ తొలగించుకోవడానికి కవితలనే ఆశ్రయించిన నేను. ఇప్పుడు కూడా జల జల కన్నీటి చుక్కలు రాలంగ ఒక కవిత పెల్లుబికి వచ్చింది హృదయం లోంచి ఇలా.

"మనసు మెత్తనిది

మాట అనే చురకత్తితో పరపరా కోసేయచ్చు ఎవరైనా ! ఎవరికి నచ్చుతుంది నీ మనసు, మాట?

నచ్చడాలు అనేది మనిషిని బట్టి ఉంటుంది

మాట నచ్చాలంటే ముందుగా మనిషి నచ్చాలె

ఎక్కడి వాడు మనిషి?

ఏ ప్రాంతం వాడు, ఏ దేశం వాడు, ఏ మతం వాడు,

ఏ కులం వాడు, ఏ రంగు వాడు, ఏ జాతివాడు

అని చూసి పలుకరించే లోకంలో

బహుశా మనిషి ఒంటరి వాడే !

ఎవరో కావాలని విసిరే మాట అనే చుర కత్తి

మనసును తీరని గాయం చేస్తుంది

గాయాలకు మందు నాకు బహుశా కన్నీళ్ల్లు, కవితలే


అప్ప్పుడప్పుడు అనిపిస్తోంది ఎందుకు ఈ బాధ అని? తెలియదు ! ఆశ పడడం అనే ఒక్క కోర్కె లేకుంటే బహుశా ఈ బాధ ఉండదు కదా !

కాని వెర్రి మనసు ఆశ పడుతుంది కదా !

అందుకే ఈ బాధనా?

జలజల కురిసే వానను

ఆర్తితో కనుకొలుకుల్లోంచి జారే కన్నీళ్లను

ఏ పేరుతో పిలుద్దాం?

ఏ బుద్ధుడో, భర్తృహరో, వేమననో, తుకారామో స్ఫురణకు వచ్చి మనసును నింపుకుంటే

బహుశా బాధ దూది పింజెలా తేలిపోతుందేమో ! పరిమళించే పువ్వే కావాలా?

గడ్డి పువ్వైనా ఒకోసారి శోభిస్తుంది !

మనుషులం ఉట్టి పాత్రదారులం ప్రపంచ నాటక రంగం మీద మంచి చెడులు సాపేక్షాలు ఐనిస్టీన్ సిద్ధాంతంలా !

ఎవరి గోల వారిదే ఈ ప్రపంచంలో తెలియక కొందరు, తెలిసి కొందరు

నటిస్తూ బతుకుతారు, బతుకుతూ నటిస్తారు

రాయడానికి ఏమీ ఉండవు ఒకోసారి ఉట్టి ఖాళీ అయినా మనసు తప్ప !

మనసు మెత్తనైతే కన్నీళ్లు, కవితలు

మనసు రాయిలా అయితే బహుశా ఏమీ ఉండవు."

ఈ కవిత రాసి మనసు భారాన్ని, బాధను దింపుకున్నాను.

మరి ఈ కవితని ఎవరికి పంపించాలి అని ఆలోచించి ఆ కవిత రాయడానికి కారణమైన ఆ ఆన్లైన్ వెబ్ పత్రిక సంపాదకుడికే పంపించాను. రెండు రోజుల తరువాత ఆ సంపాదకుడి నుండి మెయిల్ వచ్చింది ఇలా.


‘మొత్తంగా కవిత బావుంది కానీ , ఈ క్రింది లైన్లకి వచ్చేసరికి కొంచెం తేలిపోయి, మరీ సంభాషణా వచనం లా ఉంది...

ఈ పంక్తులనేమైనా మార్చగలరా? అని

---

అప్ప్పుడప్పుడు అనిపిస్తోంది ఎందుకు ఈ బాధ అని?


తెలియదు ఆశ పడడం అనే ఒక్క కోర్కె లేకుంటే


బహుశా ఈ బాధ ఉండదు కదా !


, కాని వెర్రి మనసు ఆశ పడుతుంది కదా !’ అని. ‘


అక్కడికి సంతోషం , వేస్తడో, వెయ్యడో అనుకున్నాను, కొద్దిగా మార్చమన్నాడు కవిత్వంగా చేస్తూ. మళ్ళీ ఒకసారి మొత్తం కవిత చదివాను. నా బాధను వ్యక్తం చేయడానికే

ఆ నాలుగు లైన్లు ఉన్నాయనిపించింది. ఆ నాలుగు లైన్లు

లేకున్నా భావం ఏమి తగ్గడం లేదు అనిపించింది.


వచనములా ఉన్న ఆ నాలుగు లైన్లు తొలగించి తీసుకొమ్మన్నాను. కవితను ఎడిట్ చేసి పంపించాను. వారి నిశిత పరిశీలనకు కృతజ్ఞతలు కూడా చెప్పాను. మరుసటి నెల కొత్త సంవత్సరం లో ఆ కవిత ఆ ఆన్లైను వెబ్ పత్రికలో ప్రచురితం అవుతుందని ఆశ పడ్డాను. కాని అది ఆ పత్రికలో ఆ నెలలో ప్రచురితం కాలేదు. అది ఆ పత్రిక ఎడిటర్ ఇష్టం.


ఆ ఎడిటర్ కు పద్యాలు అంటే ఇష్టం కాలేదు కావచ్చు, అలా ఆ పద్యాల నేపథ్యంగా వచ్చిన కవిత కూడ నచ్చక పోవచ్చు. ఇంకా అతను వేసుకోక పోవడానికి కారణం నేను అతనికి బాగా తెలిసి ఉండక పోవచ్చు, నేను అతడు ఆశించినంత ప్రసిద్ధుడిని కూడా కాక పోవచ్చు, బహుశా అతడు ప్రసిద్దుల గురించే రాస్తాడు, వేస్తాడు కావచ్చు అనిపించింది లేక ఆ నెలలో అవకాశం లేకుంటే తర్వాత నెలల్లో వేస్తాడు కావచ్చు అనిపించింది. అయినా నేను ఎప్పుడైనా నా తృప్తి కోసమే రాశాను, ఎవరో వేస్తారని ఆనుకొని రాసుకోలేదు.


ఆ తృప్తి చాలు నాకు అనిపించింది.

***

లక్ష్మీ నారాయణ సబ్బని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: లక్ష్మీ నారాయణ సబ్బని

సబ్బని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా లోని కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామములో 1-4-1960 నాడు జన్మించారు. పాఠశాల మరియు ఇంటర్మీడియట్ విద్యాశాఖలో మూడు దశాబ్దాలు అధ్యాపక వృత్తిలో పని చేసి ఆంగ్ల ఉపన్యాసకులుగా 2015లో ఉద్యోగ విరమణ పొంది ఉన్నారు. M.A.( English); M.A. ( Hindi); M.Sc.(Psychology), M.A.(Astrology), M.Ed; PGDTE (CIEFL).

మొదలగు విద్యార్హతలు కలిగి ఉన్నారు . తెలుగులో వచన కవిత, కథ, నవల, వ్యాసం, సాహిత్య విమర్శ, సమీక్ష, జీవిత చరిత్ర, పద్యం, పేరడీ మొదలగు వివిధ ప్రక్రియలలో 40 వరకు సాహిత్య రచనలు ప్రచురించి ఉన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో రాయగలరు. మూడు దశాబ్దాల విద్యా జీవితం మరియు నాలుగు దశాబ్దాల సాహిత్య సేవకు గుర్తింపుగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండింటిలోనూ మరియు జాతీయ స్థాయిలో కూడా అనేక అవార్డులు మరియు సన్మానాలు అందుకున్నారు. సబ్బని పొందిన బహుమతులు, అవార్డులు మరియు సన్మానాలు :

1) "బెస్ట్ పోయెట్ ఆఫ్ ది ఇయర్ 2003 అవార్డు" "పోయెట్స్ ఇంటర్నేషనల్" వార్షిక అవార్డులు 2003, బెంగళూరు

2) "పులికంటి సాహితీ సత్కృతి" తిరుపతి కథా బహుమతి 2004, ఎ.పి.

3) "సాహితీ మిత్రులు" సిల్వర్ జూబ్లీ ఫెస్టివల్ అవార్డు, 2005, మచిలీ పట్నం. ఎ.పి.

4) "సమతా సాహితీ కరీంనగర్" పార్థివ ఉగాది సన్మానం 2005.

5) "ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం" డాక్టర్ జైశెట్టి రమణయ్య ట్రస్ట్, జగిత్యాల 2005. తెలంగాణ

6) “సాహిత్య భూషణ్” అవార్డు, సారస్వత జ్యోతి మిత్ర మండలి, కరీంనగర్, 2005

7) “మే డే-2013” కవితల బహుమతి మరియు ‘ఉగాది కథ బహుమతి-2013” నేతి నిజం’ డైలీ హైదరాబాద్.

8) “సాహితీ కిరణం” మాసపత్రిక కథా బహుమతి -2013, హైదరాబాద్

9) జిల్లా నుండి "బెస్ట్ NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ అవార్డు". కలెక్టర్, కరీంనగర్-2010.

10) రాష్ట్ర స్థాయి “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు”, ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్, 2013 కొరకు.

11) కలహంస పురస్కారం -2014, నెలవంక- నెమలీక పత్రిక, హైదరాబాద్.

12) మహాకవి శేషేంద్ర అవార్డు (హైదరాబాద్) - 2015.

13) ఉమ్మడిశెట్టి లిటరరీ ఎక్సలెన్స్ అవార్డు , అనంతపురం(A.P) – నవంబర్-2015

14) మళ్ళా జగన్నాధం స్మారక కవితా పురస్కారం, అనకాపల్లి (ఎ.పి.) -2015

15) అవార్డు “సాహిత్య శ్రీ”, కాఫ్లా అంతర్జాతీయ సంస్థ, చండీగఢ్, భారతదేశం .OCT. 2016.

16) “అద్దేపల్లి కవిత సృజన ప్రతిభా పురస్కారం” , విజయవాడ, A.P. నవంబర్.2016.

17) “నానో కవితా ప్రక్రియా పురస్కారం” , ఆంధ్ర సారస్వత సమితి గోల్డెన్ జూబ్లీ సమావేశాలు, మచిలీపట్నం -2016.

18) కవిత్వంలో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం -2018.

19. D.Litt. సెయింట్ మదర్ తెరెసా వర్చువల్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ నుండి సాహిత్యంలో గౌరవ డాక్టరేట్. 2019 బెంగళూరు.

20. "నవ సృజన్ కళా ప్రవీణ్ అవార్డు" కాన్పూర్ , U.P. 2020

21. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ దేశ్ భక్తి గీత్ రాష్ట్ర స్థాయి రెండవ బహుమతి (T.S.)-2022.

22.ఉత్తమ రచయిత అవార్డు.తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్- హైదరాబాద్, 2023.


70 views0 comments

Comentarios


bottom of page