top of page

నవయుగంలో నారి


'Navayugamlo Nari' New Telugu Story


Written By Sita Mandalika


రచన: సీత మండలీక

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)"అమ్మా, ఒకటి అడుగుతాను. ఒప్పు కుంటావా"

"ఈ మధ్య రోజుకొకటి అడుగుతున్నావు చిట్టీ"

"పో అమ్మా.. నిన్ను కాక ఇంకెవరిని అడుగుతాను చెప్పు”

"ఇంతకీ ఏమిటి ఆ కోరిక తల్లీ "


"ఏమీ లేదు. పరీక్షలు అయిపోయేయి కదా. రిజల్ట్స్ వచ్చేక అందరం విడిపోతాం. మా క్లాస్ లో ఒక పదిమంది స్నేహితులం గోదావరి అందాలు, దాని చుట్టూ ఉన్న ఊళ్లు వెళ్లి చూసివద్దామని ప్లాన్ వేసేం. అందరూ ఒప్పు కునట్టే నువ్వూ, నాన్న ఒప్పు కుంటే, ఇంక నాలుగు రోజుల్లో బయల్దేరతాం"


"చిట్టీ, ఏమిటేమాట్లాడుతున్నా వు?"


"అంత ఆశ్చర్యపోతావేమిటమ్మా. ఒక స్కూ ల్లో ఒక క్లాసులో ఆడ మొగా కలిసి చదవచ్చా. కలిసి ఊరు వెళ్తేతప్పా ? నాకేమి తప్పనిపించడం లేదు. అదీకాక మేమందరం మంచి స్నేహితులం"


"ఆడ పిల్లకికొన్ని హద్దులుంటాయి. అవి దాటకూడదు. అదిఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి".


“అమ్మా! అది నేను కూడా నమ్ముతానమ్మా. నువ్వు, నాన్న అసలేమీ వర్రీ అవద్దు" .


ఆ రాత్రి గీత తన భర్త హరితో సమీర ప్రయాణం గురించి చెప్పింది. ‘లెట్ హెర్ గో అండ్ ఎంజాయ్’ అని సులువుగా జవాబిచ్చేడు.


"ఏమిటో ఈరోజుల్లో పేపర్ తిరగేస్తే ఆడ పిల్లలు ఎన్ని అత్యా చారాలకిగురి అవుతున్నారో చదువుతూనే ఉన్నాము కదా"

"అయినా గీతా.. ఈ రోజుల్లో కూడా నీకెందుకంత భయం? నీకు సమీర సంగతి తెలియదా గీతా. తన మీద నమ్మకం తో హాయి గా తిరిగి రమ్మని పంపు”


హరితో చర్చించేక తనకి కూడా ఎటువంటి సంశయం లేకుండా సమీర కి తన సమ్మతి తెలిపింది. ఆ సాయంత్రం గోదావరి ఎక్స్ ప్రెస్ లో పదిమంది స్నేహితులు ఎంతో సరదాగా ప్రయాణం ఆరంభించేరు. ప్రయాణం లో టీ కాఫీ బిస్కేట్ లు తింటూ అంతాక్షరి ఆడుతూ రైలు ప్రయాణం ఆనందం గా సాగింది. వీటన్నిటితో అందరూ సందడిలో ఉంటే, హరీష్ మాత్రం తన వేపే దృష్టి పెట్టడం సమీరకి నచ్చలేదు. సరే.. సమయం వచ్చినప్పుడు చెప్పచ్చులే అని ఊరుకుంది.


సమీర చదువులో, అందంలో మంచి మార్కులే సంపాదించింది. అమ్మమ్మ కాకినాడ లో ఉండడం వల్ల గోదావరి అందాలు చాల సార్లు అనుభవించింది సమీర. అయినా తృప్తిలేదు. అమ్మమ్మ పోయేక మళ్ళీ గోదావరి చూడడం కుదరలేదు. అందరూ కాకినాడలో ఒక మంచి హోటల్ లో దిగి, కార్ బుక్ చేసుకుని ముందు అయినివిల్లి వినాయకుడిగుడి తో ప్రారంభించేరు.


వసంత ఋతువవడం తో చుట్టూ మామిడిపూతల తో నిండిన చెట్లు. కోయల కుహు కుహు, పంట పొలాలు చక్కని ఆకు పచ్చ చీర సింగారించుకున్నట్టు, వాటిమధ్య లో కాయలతో నిండుగా ఉన్న కొబ్బరిచెట్లు ముందుగా నడివయసు లో ఒక స్త్రీనడుస్తున్నట్లున్న గోదావరి, అందరూ మంత్రముగ్ధులైపోయేరు. ఆ రోజు సమీర అమ్మకిఒక చక్కని కవిత రాసి, మెయిల్ చేసింది. ఇలా మూడు రోజులు ఎలా గడిచి పోయాయో తెలియ లేదు.


మూడోరోజు బోట్ దిగి, అయ్యో వెళ్లి పోతున్నా మే.. ఈ అందాలు మరొక్క సారి అనుభవించాలి అన్నట్టు ఇసక లో ఒంటరిగా నడుస్తూ ఏదో ఆలోచిస్తూ కొబ్బరితోట లోంచి దగ్గరగా ఉన్న పంట పొలాల మధ్య ఉన్న ఒక పెద్ద మామిడిచెట్టు నీడకి చేరి, స్నేహితుల సంగతి గుర్తొచ్చి వెనక్కి తిరిగింది సమీర.


"ఆగు సమీరా! ఇక్కడ మనమిద్దరం కొంచెం సమయం గడుపుదాం" అంటూ వచ్చేడు హరీష్.


“హరీష్ నువ్వు ఒక్కడివే వచ్చేవేమిటి. మన స్నేహితులు అందరూ ఏరి?”

“సమీరా! మిగిలిన స్నేహితులంటే నాకు ఇంటరెస్ట్ లేదు”.


“అలా మాట్లాడుతున్నావేమిటి హరీష్..”


“నీకు తెలియదేమో సమీరా.. నేను కేవలం నీ కోసమే వచ్చేను”.

“నువ్వు నా కోసం రావడమేమిటి. నీ మాటలు నాకు నచ్చడం

లేదు. నువ్వు మా గ్రూప్ లో ఎలా కలిసేవో నాకు ఆశ్చర్యం గా ఉంది. గ్రూప్ లో ఉన్న మిగిలిన నలుగురు బాయ్స్ కి నీకు అసలు ఎక్కడా పోలికే లేదు.


నీతో కలిసి చదువుకుంటున్న స్నేహితురాలి పైనా నీ దాడి? దానికి ఇష్టం అని పేరు పెట్టకు. నీ కళ్ళలో నేను చూస్తున్నది కామం. నీ గతం నాకు తెలుసు. మా పిన్ని ఇంటికి గుంటూరు వెళ్ళినప్పు డు నీ సంగతి తెలిసిపోయింది. నువ్వు మా పిన్ని పక్కింట్లో రెంట్ కి ఉండేవాడివి. ఇంటివారమ్మాయి మెడిసిన్ పరీక్షకి చదువుకుంటుంటే ఆ అమ్మా యికి ప్రేమలేఖలు రాసి, ఆ అమ్మా యిని చదువుకోకుండా చేసేవు. ఆ విషయం తెలిసివాళ్ళు మర్నాడే నిన్ను ఇల్లు ఖాళీ చెయ్యమన్నారు. ఆ విషయం నాకు తెలుసు. ఈ కాలేజీ లో చేరి మళ్ళీ నీ ఆగడాలు ప్రారంభింద్దామనుకుంటున్నా వు.

కాలేజీ లో అమ్మా యిలని అల్లరిపెడుతున్నావన్న సంగతి నాకు తెలుస్తూనే ఉంది. అసలు నీతో మాట్లాడి వార్నింగ్ ఇద్దామనుకున్నాను హరీష్.. ఇప్పటికైనా నువ్వు మంచి తోవ లో నడుస్తే మంచిది”


“సమీరా, ఇంక ఆపు నీ మాటలు. నీకు అన్నీ తెలిసినా భయం లేదు. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. సన్నం గా ఉన్న నిన్ను, నేను ఒక చేత్తో ఎత్తేయగలను. కానీ నీమీద మక్కు వ తో అలా పవ్రర్తిచడం లేదు” అంటూ దగ్గరగా రాబోయేడు హరీష్.

"వద్దు హరీష్! మనం ఒకేక్లాస్ లో చదువుకున్నా మనం స్నేహితులం. ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకోవాలి గాని నేనంటే నీకీ కోరిక ఏమిటి" అని ఎంత చెప్పినా వినకుండా

"ఈ లెక్చర్లు నాకు చెప్పకు” అంటూ మీద మీదకి రాబోయేడు హరీష్.

“సరే.. నీ ఇష్టం” అని వెనక్కి వస్తూ హరీష్ దగ్గరవగానే చేతులు పైకెత్తి అంత పైకిలేచి ఒడుపుగా హరీష్ వీపు మీద చేతితో ఒక కరాటే షూటో దెబ్బ ఇచ్చేసరికి నిలువునా నేల మీద పడి, లేవలేక అవస్థ పడుతూ "నువ్వు మహాకాళివే తల్లీ "అని అరిచేడు.

"హరీష్! నువ్వు ఏమనుకుంటున్నావో నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ ని. లతలా ఉన్నా, అవసరం వచ్చినప్పుడు నీలాంటి మృగాల మధ్య ఉండాలంటే ఆడపిల్లలు నిజ సంరక్షణార్థం నేను నేర్చు కుంటున్న విద్య ఈ కరాటే” అని హుందాగా అక్కడినించి నడిచి వెళ్ళి పోయింది సమీర.

***సమాప్తం***


సీత మండలీక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link

Twitter Linkఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత్రి పరిచయం : సీత మండలీక

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


నేను హౌస్ మేకర్ ని. కొడుకులిద్దరూ అమెరికాలో పెళ్ళిళ్ళై స్థిరపడిపోయాక, భర్త ఎయిర్ ఇండియా లో రిటైర్ అయ్యేక ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది

కధలు చదవడం అలవాటున్నా రాయాలన్న కోరిక ఈ మధ్యనే తీరుతోంది.52 views0 comments

Comments


bottom of page