'Rheumatoid Arthritis' New Telugu Article
Written By A. Annapurna
రచన: ఏ. అన్నపూర్ణ
కీళ్ల నొప్పులలో రెండు రకాలు సాధారణంగా ఉంటాయి. సామాన్యంగా అందరికి వచ్చేది ''ఆస్టియో అర్థ రైటిస్ ''. కొందరికి వంశ పారంపరగా వచ్చే ''రుమాటాయిడ్ అర్థ రైటిస్''.
ఇది చాల బాధాకరం . చేతి వేళ్ళలో ప్రారంభమై శరీరంలోని జాయిన్ట్స్కి పాకుతుంది - మోకాళ్ళు, హిప్స్, భుజాలు ఇలా.
ఖరీదైన ఇంజక్షన్స్, సర్జరీ, జీవితకాలం మందులు ఫిజియో తెరఫి.. తప్పవు.
నిర్లక్ష్యం చేస్తే హార్ట్ దెబ్బతింటుంది. ఇది ఖరీదైన ''నివారణ కాని జబ్బు.!
సామాన్యులకు బాధ కలిగించేది. ఖర్చు చేయలేని స్థితి. వివాహం చేసుకుంటే భర్తకి కూడా నరకమే.
కాబట్టి దయచేసి అలాటి వారికి వివాహం చేయవద్దు .
నేను డాక్టర్ను కాను. కానీ నేను చెబుతున్న జబ్బులు గలవారిని చాలా మందిని చూసాను. వైద్య సదుపాయం వున్నవారు, లేనివారు, డబ్బు గలవారు, లేనివారు.. ఇలా వీరి కష్టాలు దగ్గిరగా చూసాను.
అదీ కాకుండా మా అమ్మాయి అమెరికాలో డాక్టర్. అక్కడ పదేళ్లు ఉండి చూసాను పేషంట్లని.
ఆ అనుభవమే అందరికి చెప్పాలని అనిపించింది. మా తమ్ముడి భార్యకి ఈ ప్రాబ్లెమ్ వుంది. వాళ్ళు చెప్పకుండా దాచిపెట్టారు. దానితో పెళ్లి ఐనప్పటి నుంచి ఆపరేషన్స్ ట్రీట్మెంట్స్తో 25 లక్షలు ఖర్చు.
కాకుండా బెడ్ రీడింగ్.. 15 సం. నరక బాధ పడ్డారు ఇద్దరూ కూడా.
మరొకరు డబ్బు వున్నవాళ్లు కనుక ఖర్చు పెడుతున్నారు. కానీ గాజు బొమ్మలా చూసుకోవాలి.
పెళ్లి చేయలేదు డాక్టర్ సలహా మీద.
మరొక బంధువుల అమ్మాయికి ఇలాగే నాలుగు ఆపరేషన్లు చేశారు. వర్క్ ఫ్రొం హోమ్ కనుక వుద్యోగం చేస్తూ తన ట్రీట్మెంట్కి తానే ఖర్చు పెట్టుకుంటుంది.పెళ్లి చేసుకోలేదు. మంచి మనసుతో.
ఇలా స్నేహితులు కూడా వున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకుని ఖర్చులు భరిస్తూ ఇంటికి పరిమితం అయ్యారు. తెలిసి తల్లి తండ్రులు ఖర్చు భరించలేక కూతురు జబ్బును దాచిపెట్టి వదిలించుకున్న కేసులు కూడా వున్నాయి.
పెళ్ళికంటే ఆరోగ్యం ముఖ్యం. అది లేనప్పుడు మరొకరిని మోసం చేయకండి.....!
వారి పిల్లలు కూడా రోగాలబారిన పడతారు. సుఖ సంతోషాలు వుండవు.
కనుక జాగ్రత్త వహించండి.
***
గమనిక: రచయిత్రి తనకు తెలిసిన విషయాలు వివరించారు.
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన వైద్యుల్ని సంప్రదించండి.
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
Comments