top of page

శభాష్ సంజీవి - ఎపిసోడ్ 2
'Sabhaash Sanjeevi - Episode 2' - New Telugu Web Series Written By Otra Prakash Rao Published In manatelugukathalu.com On 08/01/2024

'శభాష్ సంజీవి - ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక

రచన : ఓట్ర ప్రకాష్ రావు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


‘గుడ్దిగోలా’ బ్రాండ్ కూల్ డ్రింక్ తాగడంవల్ల వచ్చే నష్టం గురించి స్కూల్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు తొమ్మిదవ తరగతి స్టూడెంట్ సంజీవి. 

దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు, డీలర్ చండుడు. ఇక శభాష్ సంజీవి - ఎపిసోడ్ 2 చదవండి.. 


వార్డెన్విశ్వనాథం ఉదయాన్నే మార్కెట్ వెళ్ళాడు. 

 "విశ్వనాథం" అంటూ కొత్తమనిషి పిలవడం చూసి ఎవరాని చూసాడు.

 

 " నా పేరు ఉష్ణకుడు. మీ అనాథ హాస్టల్ నందుంటున్న ఆ సంజీవి వలన ఒకసమస్య ఏర్పడింది. "


" సంజీవి వలనా, ఏమిటి సార్ " అడిగాడు విశ్వనాథం. 


 " నేను మద్యం మత్తులో బండి నడుపుతూ వస్తూ అక్కడ పడితే, నన్ను, నా వయసును చూడకుండా నన్ను అవమానపరిచేలా మాట్లాడాడు. నేను మా ఊరిలో పెద్ద ధనవంతుడిని. వాడ్ని అవమాన పరచాలి. నా పగ తీరాలంటే నీవే సరయిన వ్యక్తిగా తోచింది. " అన్నాడు  ఉష్ణకుడు. 


" అందుకు నేనేమి చేయాలి " అడిగాడు విశ్వనాథం. 


 " ఆ సంజీవి పైన ఎలాగైనా దొంగతనం అంటగట్టి చెడ్డ పేరు తెప్పించాలి "


 " అందువలన మీకేమిటి లాభం. "


"అందువలననా మనసు చల్లపడుతుంది. నేను చెప్పిన పని చేయడంవలన నీకు లాభం వుంది. అందరిముందూ వాడొక దొంగని చెబితే చాలు. నీకు పదివేల రూపాయలు ఇస్తాను తీసుకో. " అంటూ పది వేల రూపాయలు చేతిలోపెట్టాడు. 


సంజీవి పై ఎలాగైనా దొంగతనం అంటగడితే  పదివేల రూపాయలు ఇస్తానంటూ ఇచ్చేసాడు. హాస్టల్ వార్డెనుగా సంజీవిపై దొంగతనం అంటకట్టడం చాలా సులభమైన పని. వంద రూపాయలు చూడటమే కష్టమవుతున్న ఈ రోజుల్లో ఒకే సారి పదివేల రూపాయలు చేతిలో పెట్టగానే వార్డెన్ విశ్వనాథం కొన్ని క్షణాలు ఆలోచించాడు. ధనవంతులలో ఇలాంటి తిక్క ధనవంతులు వున్నారని ఇప్పుడు తెలుసుకున్నాను. ఆ తిక్క ధనవంతుడు చెప్పింది చెయ్యాలన్న నిర్ణయానికి వచ్చాడు. 

"మొన్న ఒక అబ్బాయి దొంగతనం చేస్తే అందరిముందూ తిట్టాను. అంతేకాని నేను ఆ అబ్బాయిని శిక్షించలేదు. పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేదు. అలాగే సంజీవిని దొంగగా చెబుతాను, కానీ వేరెక్కడా ఫిర్యాదు చేయను. " 


"నేను చెప్పింది చేస్తే చాలు. మీ మనసుకు బాధ అనిపిస్తే మరుసటి రోజే జరిగింది చెప్పినా నాకేమి అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను ఈ రోజే మా ఊరెళ్ళిపోతున్నాను. "


 "అయినా చిన్న కుర్రాడిపైన ఎందుకంత పగ"


"అదినీకనవసరం. చెప్పింది చేయండి. నేను మీ హాస్టల్ గేట్ ముందు మీ కోసం ఎదురు చూస్తుంటాను. నేను చెప్పిన పని పూర్తి చేయగానే  హాస్టల్ బయటకు వచ్చి నాకు చెప్పండి. నేను సంతోషముతో ఇంటికి వెళ్తాను. " అంటూ ఏమి చేయాలో వివరించి చెప్పాక " విశ్వనాథం, ఈ కవరు కూడా వాడి సంచిలో పెడితే నీకు ఎటువంటి ఆపద కలగదు. " ఒక కవరు అతని చేతిలో పెట్టి వెళ్ళాడు.


'వీడెవడో పిచ్చి ధనవంతుడు. అయినా పదివేల రూపాయలు ఇచ్చాక ఆ మాత్రం అయినా చేయకుంటే ఎలాగ' అని మనసులో విశ్వనాథం అనుకొన్నాడు. 


కూరగాయలు తీసుకొని హాస్టల్ కు రాగానే గంట కొట్టాడు. 

టిఫన్ టైం ఉండగా ఇప్పుడే   ఎందుకు గంటకొట్టారా అని ఆలోచిస్తూ హాస్టల్ పిల్లలందరూ గది దాటి బయటకు వచ్చి వరుసలో నిలబడ్డారు. 


“ ఈ రోజు ఎవరోఆఫీస్ గదిలో ప్రవేశించి, ఐదువేల రూపాయలు దొంగలించారు. మర్యాదగా ఆ దొంగ ఎవరో ముందుకు వచ్చి ఆ డబ్బులు తిరిగి ఇస్తే ఇప్పటితో ఈ సంగతి మరచిపోదాం. లేదంటే మీ భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుంది. " అన్నాడు. అందరూ మౌనంగా వున్నారు. 

” ఒక్కొక్కరి గదిలోనికి వెళ్లి నేను చూస్తాను. అందరూ ఇక్కడే వుండండి. “ అని చెప్పాడు విశ్వనాథం. 


ప్రతి ఒక్కరి గదికెళ్లి పుస్తకాలన్నీ తీసి పరిశీలించసాగాడు విశ్వనాథం. 

సంజీవి గదికెళ్లి, ఐదువేల రూపాయలతో పాటు, ఉష్ణకుడు ఇచ్చిన కవరుకూడా పుస్తకాల సంచిలో ఉంచిన తరువాత "సంజీవి" అంటూ కోపంగా పిలిచాడు. సంజీవితో పాటు అతని గదిలో వుంటున్న ఇంకో విద్యార్ధి వెళ్ళాడు. 


"ఈ డబ్బులు ఎక్కడివిరా " అంటూ సంచిలోంచి ఐదువేల రూపాయలు తీసాడు విశ్వనాథం. 

“నాకు తెలీదు సార్ “ ఏడుపు గొంతుతో అన్నాడు. 


గది బయటకు లాక్కుని వెళ్లి "ఎరా నీకేమి లోటు చేసానురా.. నీమీద ఆవగింజంత నమ్మకం లేకున్నా అందరి గదులలో పరీక్షించడంవలన నీ గది చూసాను. ఇక మంచివాళ్లను కూడా నమ్మకూడదని తెలుసుకున్నాను. " అంటూ పుస్తకాల సంచిని విసిరివేసాడు. 


పుస్తకాల మధ్యలోంచిఒక కవరు. “అదేంట్రా ఆ కవరు”అంటూ ఆ కవరు తీసుకొన్నాడు విశ్వనాథం. 


"నిజంగా ఆ కవర్ నా పుస్తకాల మధ్యలో ఎలా వచ్చిందో తెలీదు సార్ " అన్నాడు సంజీవి. 

ఆ కవరులోవున్న తెల్లపేపర్ తీసాడు. 


సంజీవికి జరిగినదంతా అయోమయంగా తోచింది. హెడ్ మాష్టర్ వెంకటరమణ ఇంటికెళ్లి జరిగింది చెప్పాలనుకొంటూ అవమానంతో తలవంచుకొని మెల్లగా నడవసాగాడు. 

 " సార్ వాడు వెళ్తున్నాడు. " అన్నాడు ఒక విద్యార్థి 


 " ఈ వయసులోనే దొంగతనం చేసింది కాక పొగరు వేరే.. "అంటూ వెళ్ళాడు విశ్వనాథం. 

బయట బైక్ మీదున్న ఉష్ణకుడిని చూసి, పని  అయిపోయిందన్నట్టుగా బొటనవ్రేలు పైకెత్తి చూపించాడు. 


 "సార్! మీరు చెప్పిన ఆ సంజీవి అవమానంతో ఎక్కడికో వెళ్తున్నాడు " ఉష్ణకుడు దగ్గరకు వచ్చి చెప్పిన తరువాత హాస్టల్ లోనికి వెళ్ళాడు విశ్వనాథం. 


 ‘ నేననుకొన్నట్లే జరిగింది. బాధతో తలవంచుకొని వెళ్తున్న వాడిని మరింత సులభముగా కిడ్నాప్ చేయవచ్చు’ అని మనసులో సంతోషంతో అనుకొంటూ తన వారికి ఫోన్ చేసి రమ్మన్నాడు. 

*** ******

సంజీవి ప్రక్కనే ఒక కారు ఆగింది. 

 "సంజీవి.. ఆ ఐదువేల రూపాయలు ఏం చేసావు " అంటూ ఒక వ్యక్తి దిగి అడిగాడు. 

 "ఐదువేల రూపాయలా.. ఎమిటి మీరంటున్నది " అనుమానంగా అడిగాడు..

 

సంజీవి ముక్కుకు మత్తుమందున్న జేబురుమాలు గట్టిగా అదిమి పెట్టగానే స్పృహతప్పాడు. 

*********

నీళ్లు తీసుకొని వచ్చి సంజీవి ముఖంపైన బాలు చల్లగానే కళ్లుతెరచి చూచాడు. 

 "నీవూ నాలాగే వీళ్ళ వలలో తగులుకొన్నావా. " అన్నాడు బాలు. 


సంజీవి తన కథ చెప్పాడు 

 "నీవు ఆ గుడ్డి గోలా గురించి ఆ ప్రదర్శన ఇవ్వడం వలన ఈ కష్టాలు తెచ్చుకున్నావు. "


 "ఇంతకూ వీళ్ళెవరూ "" గుడ్డి గోలా పానీయము తయారు చేసే కంపెనీకి చెందినవారు. నీ ప్రదర్శన వారి వ్యాపారానికి ఎక్కడ భంగం కలిగిస్తుందోనన్న భయంతో నిన్ను ఇక్కడకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనమున్న స్థలం భారతంలో పద్మవ్యూహం లాంటిది. లోనికి వెళ్లడమే గానే బయటకు వెళ్లడం కుదరదు. "


 "అన్నా నీ పేరు ఏమి.. నీవు ఇక్కడకు ఎలా వచ్చావు" 


" నా పేరు బాలు. నేనిపుడు ఇంటర్ చదువుతూ వుండవలసినవాడిని. మా అమ్మానాన్నలతో చిన్నవిషయానికి గొడవపడి కోపంతో  ఇల్లువదిలి ఒక పట్టణంలోని ఒక స్టార్ హోటల్లో పనికి కుదిరాను. ” 


 "అన్నా ఇక్కడకు ఎలా.. "


" ఆ హోటల్ నందు నేనే చిన్న పిల్లవాడిని. పనివాళ్ళందరూ నాదగ్గరే పని చేయించుకొనేవారు. ఎవడు పిలిచి ఏమి చెప్పినా చేయవలసిందే. ” 


"మరి ఇక్కడకు ఎలా.. " 


 “ఒక రోజు రూమ్ బాయ్నన్ను పిలిచి 'రేయ్ బాలు, స్టూడెంట్స్ దిగిన ఆ గదిలో వాంతి ఎత్తారట వెళ్లి శుభ్రం చేసిరా  అంటూ చెప్పాడు. నేను అక్కడకు వెళ్ళాను. అక్కడ చూస్తుంటే భయం వేసింది. అప్పటికే ఇద్దరు చనిపోయి వున్నారు. చివరిదశలో వున్న ఆ విద్యార్ధి దగ్గరకు వెళ్లి ఏం జరిగింది సార్ అనడిగాను. " 


 “ఏం చెప్పాడు” 


“ ‘వీళ్ళిచ్చిన గుడ్డి గోలాలో ఏదో కలిసింది. ఎవరితోనైనా చెప్పు’ అన్నాడు. ఆ పానీయముల ఏజెంట్ చండుడు రాగానే జరిగింది చెప్పాను. నేను వేరెవరికైనా చెబుతానన్న భయంతో నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడకు తీసుకొనివచ్చారు. నేనిక్కడకు వచ్చి మూడు నెలలు గడిచింది. నాకు ఇక్కడ వంట పని అప్పగించారు. "


 " ఇక్కడ వాళ్లకు ఏంపని అన్నా " సంజీవి అడిగాడు. 


"గుడ్డి గోలాపానీయం ప్లాస్టిక్ కేన్లలో వస్తుంది. మత్తుమందు యేవో కలిపి బాటిల్ నందు పాక్ చేస్తున్నారు. "అన్నాడు.


“ఇక్కడ పనిచేసే వారికి ఈ విషయం తెలుసా” 


“బాగా తెలుసు. వాళ్ళు మందు కలుపుతున్నప్పుడు మనం యముడికి బాగా సహాయం చేస్తున్నయమకింకరులు అని సరదాగా చెప్పు కోవడం విన్నాను. “


“ఇక్కడ ఎంతమంది వున్నారు “


 “మొత్తం పదిమంది వున్నారు. వారు తప్ప కొత్తవారు ఎవరూ ఇంతవరకు రాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వంట గది దాటకూడదట, వాళ్ళు పిలిస్తేనే వంటగది దాటి వెళ్ళాలంట. పొరపాటున వచ్చావంటే ఆ రోజు మేము రాక్షసుల్లా ప్రవర్తిస్తాము అంటూ మొదటిరోజే హెచ్చరించారు. " అన్నాడు బాలు.


 “అన్నా, వాళ్లకు ఇండ్లు లేవా” 


“వున్నాయి. ప్రతివారం ఒకరు సెలవుమీద వెళ్తాడు. ఎవరూ మనతో మనసు విప్పి ప్రేమతో మాట్లాడారు. గత మూడు రోజులుగా నలుగురు సెలవు పెట్టారు. “


 “అన్నా, నీకెలా తెలుసు “


 “తొమ్మిదిమందికి చేసే వంటను ఆరుమందికి చేయమంటూ చెప్పారు”


“ మనం ఎలాగైనా బయటకు వెళ్లి పోలీసులకు పట్టించాలి " అన్నాడు సంజీవి. 


“ బయటకు వెళ్తేనేగా "  నిరుత్సాహంగా అన్నాడు బాలు 

********* 

గుడ్డి గోలా పానీయం  సంస్థ యజమాని అయిన కాలకేయుడికి ఎప్పటికప్పుడు జరుగుతున్నదంతా ఫోన్ ద్వారా చండుడు తెలుపుతున్నాడు. సంజీవిని కిడ్నాప్ చేసిన సంగతి మాత్రం చెప్పలేదు. 

"సంజీవి చెప్పిన సంగతి అందరూ మరచిపోవాలి. ఆ పిల్లవాడు చెప్పింది మరచిపోవాలంటే ఏం చెయ్యాలో అది చెయ్యి, ఎంత డబ్బైనా నేను బరిస్తాను. ఆ ఊరిలోప్రతి ఒక్కరూ  మన కంపెనీ పానీయం కొని త్రాగాలి " అన్నాడు కాలకేయుడు. 


'కాలకేయుడు ఇచ్చే సొమ్ములో సగం ఖర్చుపెట్టి మిగతా సగం నేనే తీసుకొంటాను' అని మనసులో సంతోషంగా అనుకొన్నాడు చండుడు.  చండుడు బాగా అలోచించి ఒక నిర్ణయాన్నికి వచ్చాడు. 

ఉదయాన్నే జడ్డు అంగడికి వచ్చాడు. 

" సార్, మూడురోజులుగా ఇంత వరకు ఒక్క కూల్ డ్రింక్ అమ్ముడు పోలేదు. " బాధగా అన్నాడు. 

 " ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. ఆ సంజీవి మెజీషియన్ లాగా ఫోజు కొట్టి వ్యాపారానికి దెబ్బతీశాడు. మనమూ ఒకమెజీషియన్ ను పిలిపించి ఈ పిల్లలను మార్చాలి. " అన్నాడు చండుడు. 


 "అంటే ఏం చెయ్యాలి సార్ "  "మీ అంగడి ముందు సాయంత్రం ఉచిత మేజిక్ ప్రదర్శన ఏర్పాటవుతుంది. సాయంత్రం బడి వదలగానే నేను పంపిన మెజీషియన్ ప్రదర్శన ప్రారంభిస్తాడు. " అంటూ ఏమేమి చేయాలో వివరించి చెప్పాడు. 

========================================================================

ఇంకా వుంది..

శభాష్ సంజీవి - ఎపిసోడ్ 3 త్వరలో

========================================================================

ఓట్ర ప్రకాష్ రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1. పేరు:  ఓట్ర ప్రకాష్ రావు

https://www.manatelugukathalu.com/profile/oprao/profile2. నా గురించి   : 2017న జనవరి నెలలో రాణిపేట బి.హెచ్.ఈ.ఎల్. నందు పదవీ విరమణ పొందిన తరువాత తమిళ నాడు లోని తిరుత్తణి లో స్థిరపడ్డా ను. ”Free Yoga” పేరు మీద తిరుత్తణి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితముగా యోగాసనములు నేర్పుతున్నాను. తీరిక సమయంలో కథలు వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను 2020 సంవత్సరం మార్చ్ మాసం నుండి లాక్ డౌన్ కారణంగా బడులు తెరవకపోవడంతో పిల్లలకు ఉచిత యోగ తరగతులకు వెళ్ళలేక పోయాను 3. విద్య : ఐ టీ ఐ 4. సాహిత్య ప్రపంచంలోని తీపి జ్ఞాపకాలు  :  1988 న ఆంధ్రప్రభ వారు నిర్వహించిన తెలుగు మినీ కథల పోటీలో మొదటి బహుమతి,  2015 నందు రాయగడ రచయితల సంఘం నిర్వహించిన కథల పోటీలో కన్సోలేషన్ బహుమతి,    2017 ,2018,2019,2020 నందు కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందా ను.   2018 న కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కవితల పోటీలో బహుమతి పొందాను               2018 అక్టోబర్ నెలలో Mytales.in నిర్వహించిన చిట్టినీతి కథల పోటీలో నా కథను ఉత్తమ కథగా ఎన్నిక               2020 ప్రతిలిపి వారు నిర్వహించిన మాండలిక కథల పోటీలో మొదటి బహుమతి లభించింది             2021 శ్రీ శ్రీ కళావేదిక వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో మొదటి బహుమతి           2021 మనతెలుగుకథలు.కామ్ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ప్రత్యేక బహుమతి 6. ఇంతవరకు ప్రచురించినవి  ఆంధ్రప్రభ ,ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, గోతెలుగు ,హాస్యానందం, జాగృతి, కెనడా తెలుగుతల్లి, ప్రజాశక్తి ,ప్రతిలిపి ,ప్రియదత్త, రచన, వార్త, విపుల ,శ్రీ శ్రీ కళావేదిక, మనతెలుగుకథలు.కామ్ - పత్రికలలోమొత్తం మీద ఇంతవరకు 70 కథలు ప్రచురించబడింది       ఆంధ్ర ప్రభ , బాల భారతo ,ఈనాడు హాయ్ బుజ్జి , మనతెలంగాణ , నవతెలంగాణ , ప్రభాత వెలుగు దర్వాజా , ప్రజాశక్తి , సాక్షి, వార్త , విశాలాంధ్ర - పత్రికలలో 130 బాలసాహిత్యపు కథలు


38 views0 comments

Kommentare


bottom of page