top of page

సెలక్షన్'Selection' - New Telugu Story Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 13/05/2024  

'సెలక్షన్తెలుగు కథ

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్''గుడ్ మార్కింగ్ మేడం! మీరు రోజూ వస్తారు.. ఏమిచేస్తూ వుంటారు?” అన్నాడు.. పార్క్ బెంచీమీద కూర్చుని ఉన్న దేవసేనను చూసి, అక్కడ ఎక్సర్సైజ్ చేసే ఒక యువకుడు. 


''నేను.. ఇంతకు ముందు ఒక ఉద్యమ సంస్థలో 25 ఏళ్ళు పనిచేసాను. ఇప్పుడు కూడా డబ్బుతో సంబంధం లేని మంచిపనులు చేస్తున్న" అంది దేవసేన. 


''అంటే?”


''సోషల్ సర్వీస్ ''అంది నవ్వుతూ ఆమె. 


అలా పరిచయమై రోజూ పలకరించుకుంటూ వున్నప్పుడు అతని పేరు అశోక్ అని చదువు పూర్తి చేసి జాబుకోసం చూస్తున్నాను అని చెప్పి “మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా..” అన్నాడు. 


ఇంజనీరింగ్ -ఎం టెక్ - ఎం బీ ఏ చేసాను అంటూ ఊరూ పేరు వివరాలు చెప్పేడు. “ప్రస్తుతం చిన్న జాబ్ చేస్తున్న కానీ సరి ఐనా జాబ్ దొరకడం లేదు'' అన్నాడు. 


''నాకు తెలిసినవారే వున్నారు. నా మెయిల్ ఐ డీ కి, నీ రెస్యూమ్ పంపి నన్ను ఈ ఆఫీసులో కలుసుకో.. ''అంది సేన తన మెయిల్ I D ఇచ్చి. 


ఒకరోజు అతడి ఫామిలీ గురించి అడిగి తెలుసుకుంది. 


ఇంకోరోజు “నువ్వు ఓవర్ వెయిట్ వున్నావు.. నేను చెప్పినట్టు కొన్ని ఎక్సర్ సైజులు చేస్తూ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోమని కొన్ని సలహాలు చెప్పింది. 


అశోక్ కి జాబ్ వచ్చింది.. ఆమె చెప్పిన కంపెనీలో. దానితో దేవసేన అంటే గౌరవం కలిగినది అతడికి. 


“మా ఇంటికి రండి మా పేరెంట్స్ని కలుద్దురుగాని” అన్నాడు.. !

''ఇప్పుడుకాదు. వీలుచూసుకుని వస్తాను. నీకు నామీద నమ్మకం వుంది కదా ! నేను చెప్పినట్టు వింటావా” అంది సేన. 


''చెప్పండి. తప్పకుండా వింటాను. నా బాగుకోరి చెబుతారు కనుక.. ''అన్నాడు వినయంగా. 


''నీ పద్ధతులు కొంచెం మార్చుకోవాలి. నువ్వు పనిచేసే కంపెనీలో ఎలావుంటారో గమనించు. సూటుబూటు వేసుకోడం వొక్కటేకాదు. నడక, మాటతీరు, విష్ చేసే పధ్ధతి గమనించు. మీటింగ్ జరిగినపుడు అది పేస్టైం

జూమ్ మీటింగ్ ఐనా నీట్గా డ్రెస్ చేసుకోవాలి. ఎప్పుడూ ఫ్రెష్గా కనిపించాలి. నిద్రమొహంతో ఆవులిస్తూ అలిసినట్టు కనిపించకూడదు. నీకు అంతా కొత్త కనుక చెబుతున్నాను. '' అంది దేవసేన. 


''అలాగే మేమ్! మీ సలహా పాటిస్తాను” అన్నాడు అశోక్,

ఈ విడకు ఇన్ని విషయాలు ఎలా తెలుసును అని అనుకుంటు. 


''గుడ్ ! తెలియకపోడం తప్పుకాదు. తెలుసుకోడం విజ్ఞత.. '' అంటూ మెచ్చుకుంది. 


అశోక్ పార్క్ కి వస్తూనే వున్నాడు.. దేవసేనను కలుసుకోడానికి. , వాకింగ్కి. !


ఒకరోజు దేవసేన చెప్పింది “ఈ పార్క్లో జనం బాగా పెరిగిపోయారు. వేరే పార్క్ లోకి వెడతాను నేను.. !”


''నేను అక్కడికి వస్తాను. ఈరోజు ఆ పార్క్ ఎక్కడో చూపించండి..” అంటూ ఆమెతోబాటు వచ్చాడు. 


అది కొంచెం దూరంలోవుంది. జనం ఒకరిద్దరు వున్నారు అంతే! చాలా చెట్లు వున్నాయి, పెద్దపార్క్. 


''చాలా బాగుంది మేడం..” అంటూ జాగింగ్ చేయడం మొదలుపెట్టేడు. 

''గుడ్. నీలో నచ్చిన విషయం ఏమనంటే.. చెప్పగానే గ్రహిస్తావ్. ఆచరణలోపెడతావ్. గుడ్జాబ్” అంది.. భుజం తట్టి ప్రోత్సహిస్తూ. 


దారిలో ఎవరో పెద్దావిడ అడ్డుగా వస్తే ''ఎమ్ ముసల్దానా.. కనిపించడం లేదా” అని విసుక్కున్నాడు. 


అశోక్ ఇంటికి వెడుతుంటే చెప్పింది దేవసేన.. 

''అశోక్, నువ్వు జాగింగ్ చేస్తుంటే ఎదురుగా వచ్చినావిడను తప్పుగా మాటాడేవు..” అంది. 


''ఏమన్నాను మేడం.. !”


''ముసలిదానా.. అన్నావ్. నీ సంస్కారం ఏమైంది?”


''పెద్దావిడ. అన్నాను. తప్పా?” అయోమయంగా అన్నాడు అశోక్. 


''తప్పే. ఆవిడకు జుట్టు తెల్లబడింది కానీ నా కంటే చిన్న. కలర్ వేసుకోలేదు. ఆవిడ బ్యాంకు మానేజర్. నా ఫ్రెండ్. ముసలి ఏమిటి.. నన్ను మేడం అంటున్నావ్, ఆవిడను మేడం అనే గౌరవించాలి. మైండ్ ఇట్! అంతేకాదు ఏ వయసువారైనా మంచిగా మాటాడాలి '' అంది కోపంగా. 


''సారీ మేమ్ ! ఇకనుంచి అలాగే పిలుస్తాను. నా తప్పు దిద్దుకుంటాను. ''

''మీ ఇంటినుంచి పార్క్ కిలోమీటర్ దూరంగా ఉందని చెప్పేవు. కార్లో వస్తావెందుకు? అసలే రోడ్మీద ట్రాఫిక్

ఎక్కువ. అపార్టుమెంట్ల వాళ్ళే ఎదురుగా రోడ్డు ఆక్రమించేశారు. మళ్ళీ  పార్క్ కి వచ్చేవారి కార్లు కూడా పెడితే రోడ్డుమీద జనం ఎలా నడుస్తారు? కామన్ సెన్స్ ఉండాలి. చదువున్న నువ్వు ఇలా చేస్తే ఎలా?”


 ''అదికాదు..” ఏదో చెప్పబోతే సగంలో వారించింది దేవసేన. 

''మీ ఇంటినుంచి సైకిలుమీద పార్క్ కిరా.. ఎవరో తప్పు చేశారు. నువ్వూ అదే తప్పు చేయకు. మళ్ళీ వారానికి రోడ్డుమీద ఈ కార్లు పెట్టినవారికి నోటీస్ వస్తుంది. కారు పెట్టినందుకు పే చేయాలి.. గంటకి ఇంత అని. అలా

 గడువులోగా కారు తీయకపోతే కార్పొరేషన్ వాళ్ళు కారు తీసుకుపోతారు. ఫైన్ కట్టి కారు తెచ్చుకోవాలి. ''

సీరియ్సగా చెప్పింది దేవసేన. 


'అయ్యబాబోయి ఈవిడ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్లా మాటాడుతోంది..” అనుకుని ''అలాగే మేమ్ !తప్పుచేసాను. 

రేపటినుంచి సైకిలుమీద వస్తాను ''. అన్నాడు భయంగా. 


''నైస్ మాన్ ! సి యు టుమారో.. బాయ్..” అని వెళ్ళిపొయిన్ది ఇంటికి. 


సరిగ్గా వారంనాటికి ఒక్క కారు లేదు రోడ్ మీద, పార్కుల దగ్గిర. 


సందేహంలేదు. దేవసేన మేడం కి చాలా మంది పెద్దవాళ్ళు తెలుసును. ఈవిడ ఏది చెబితే అది జరుగుతోంది. 

ఆవిడకి నచ్చని పద్ధతులను మార్చివేయగలదు. అనుకున్నాడు అశోక్ మనసులో.. !

***


''అమ్ము ! నువ్వు ఇక పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. రెండేళ్లుగా జాబ్ చేస్తున్నావ్. ''అంది కూతురుతో

దేవసేన. 


''సరిగ్గా నేనూ అదే అనుకున్నా. నువ్వు కనిపెట్టేశావ్ మమ్మి..” అంది ఆమ్రపాలి. 


''అలా మమ్మీలు కనిపెడుతూవుంటారు లే. ఎవరినైనా సెలక్ట్ చేసుకున్నవా నన్ను చూడమంటావా?''


''సెలక్షన్ అంటూ ఏమి లేదుకానీ డాడ్ ఒకసారి పరిచయం చేశారు చంద్రను. నేను ఆయన కంపెనీకి వెళ్ళినపుడు. 

అతను క్లోజ్ అయ్యాడు. ఫామిలీ డీటెయిల్స్ నాకు తెలియవు. ఎప్పుడూ కలవనూలేదు వాళ్ళని. 

మీ ఇద్దరూ ఓకే చేస్తే నాకూ ఒకే !’


''ఆ మాత్రం ఛాన్స్ ఇచ్చావు కదా ! డాడీని అడుగుతాను. '' అంది దేవసేన. 


రానా ప్రతాప్ ఖాళీగా ఉన్న సమయంలో '' ఎవరొయి రానా, నీ కూతురికి పరిచయం చేసిన చంద్ర /? నాకు ఎప్పుడూ చెప్పలేదు. మంచివాడేనా? నీ కూతురు వలచిందిట. మనకు నచ్చితే పెళ్లి చేయమంటోంది. ''


''చంద్రా.. నాకు గుర్తేలేదు ఆపేరు గలవాడు. రేపు కంపెనీలో అడిగి తెలుసుకుంటాను. పెళ్లి అంటె ఫ్యామిలీ

డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి” అన్నాడు రానా. 


''రిచ్ ఆర్ పూర్ నో ప్రాబ్లెమ్. మంచి మోరల్ వాల్యూఊస్ ఉన్న ఫామిలీ ఐతే చాలు. మనం రిచ్ కాదు

అలా అని పూర్ కాదు. మనలో కలిసిపోయే వారు కావాలి. 

సాధారణంగా అమ్మాయిలు రూపు హోదా చూసి ఇష్టపడతారు.. మన అమ్ము ఏమిచూసిందో అబ్బాయిని చూసి తెలుసుకోవాలి '' అంది దేవసేన. 


రానాకీ సాధారణంగా ఏపని గుర్తు ఉండదు. ఆఫీసుకి వెళ్ళగానే దేవసేన చెప్పిన విషయంమరిచిపోయాడు. 

కానీ చంద్ర ఆయనతో మాటాడే పనివుండి వచ్చినపుడు గుర్తుకువచ్చింది. 


''ఏమోయి చంద్ర.. కంపెనీ విషయాలు తర్వాత, ముందు మీ తల్లి తండ్రుల వూరు వివరాలు చెప్పు ''అన్నాడు. 


ఎప్పుడూ పర్సొనల్ మేటర్ అడగని బాస్ ఈరోజు ఎందుకు అడుగుతున్నాడో అర్ధం కాలేదు. 

అడిగినపుడు చెప్పాలికనుక చెప్పేడు. 


 ఆతర్వాత కంపెనీ విషయం మాటాడుతూ.. “మన కంపెనీ షార్జా లో పెట్టాలని ఆఫర్ వచ్చింది సార్.. మీరు ఏమంటారో అడగాలని వచ్చాను..” అన్నాడు చంద్ర. 


 ''ప్రస్తుతానికి పోస్టుపోన్ చేద్దాం. వచ్చే ఏడాదికి కలవమని చెప్పు. మీ ఫాదర్ ఫోన్ నెంబర్ ఇవ్వు. మాటాడుతాను. మా అమ్మాయి ఆమ్రపాలి గుర్తు ఉందా ? ఒకసారి వచ్చినపుడు నీకు పరిచయం చేసినట్టు వున్నాను కదూ ? ''


''అవునండి. చూసాను. మాటాడుతూ ఉంటాం కూడా..” అన్నాడు చంద్ర. 


''బాగుంది.. అలాగే కలుస్తూ వుండండి. నువ్వెళ్లు.. నాకు అర్జెంట్ పనిఉంది..” అన్నాడు హడావుడిగా. 


‘భలేవారు బాస్.. మా అమ్మ నాన్నలు మా కుటుంబం గురించి అడిగారూ అంటె.. ఆయన కూతురును

పెళ్లి చేసుకోమని అడగటానికా.. అంత అదృష్టమా.. వొళ్ళు దగ్గిర పెట్టుకుని ఉండటం మంచిది.. 

పెళ్లిమాట దేవుడెరుగు. వుద్యోగం పీకి పొమ్మనకుండా చూసుకోవాలి’ అనుకున్నాడు చంద్ర. 


''దేవసేన.. ఇదిగో అతడి వివరాలు..” అంటూ చంద్రను పంపేసి దేవసేనకు ఫోన్ చేసి చెప్పేడు. 


 ''వచ్చే వారం వాళ్ళని మన ఇంటికి రమ్మని చెప్పు రానా. లేదంటే మనమే వస్తామని చెప్పు. ''

''కుదరదు. వచ్చేవారం నేను సింగపూర్ వెళ్ళాలి. ''


''వెడితేవేళ్ళు. నేను అమ్ము ఉంటాంగా ! ''


''సరే నీ ఇష్టం. అలాగే చేయి. నువ్వు అమ్మాయి ఆలోచించుకుని ప్లాన్ చేసుకోండి. '' అన్నాడు రానా. 


కానీ రానా సింగపూర్ ఫ్లయిట్ కేన్సిల్ అవడం వలన రానా ట్రిప్ కూడా తర్వాత వారానికి క్యాన్సిల్ అయినది. 

దానితో చంద్ర అమ్మ నాన్నలను సండే లంచికి పిలిచింది దేవసేన. 


చంద్ర అమ్మ నాన్నలను ముందుగా పంపి చంద్ర కొంత ఆలస్యంగా వచ్చాడు. 

అన్ని మాటాడుకుని పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయిఇంచారు. 


''మేడం, నమ్మలేకపోతున్నాను. నాకు మీ అల్లుడు అయే అదృషటం పట్టిందా అని” అన్నాడు అశోక్చంద్ర. 


''నమ్మాలి మరి. నేను మా అమ్ము నిన్నే సెలక్ట్ చేయడం.. నువ్వు మా రానా కంపెనీలోనే చేరడం.. నిన్ను మాకు తగినట్టు తీర్చి దిద్దుకోడం.. అంతా అనుకోనివి జరగడమే జీవితం !” అంది దేవసేన సంతోషంగా.


''కానీ.. మా అమ్మ కూలి పనులు చేస్తుంది పంట చేల్లో. నాన్న కూరగాయలు తెచ్చి పట్నంలో అమ్ముతాడు. 

తమ్ముడు డిగ్రీ చదువుతున్నాడు మా ఊరిలోనే. మేము మీకు సరి తూగలేము మేడం. ''


''ఇకనుంచి మీ అమ్మా నాన్నలు ఈ ఊరుకి వచ్చి ఏదైనా చేసుకోమను వాళ్ళిష్టం. నీ తమ్ముడు ఎలాగా ఇక్కడే కాలేజీలో చేరాలి. నాకు లేని అభ్యంతరం నీకేమిటోయి. మా అమ్మాయి నచ్చలేదు.. అంటే చెప్పు. మానేద్దాం'' అంది దేవసేన. 


''నచ్చకపోడానికి నేను పెద్ద అందగాడినా ? మీ అమ్మాయి గారిముందు చాలా తక్కువ. అదికాదండి.. ఏమైనా విబేధాలు వస్తాయేమో అని !''


''ఏమిరావు. నేను చూసుకుంటాను. మా అమ్ము కూడా గొప్పకు పొయి నిన్ను ఇబ్బంది పెట్టె రకంకాదు. నువ్వు మా ముగ్గురికి నచ్ఛావు అంటే నువ్వు చాలా బుద్ధి మంతుడివి. ''


''వాళ్లకి మా వూరు అంటే చాలా ఇష్టం. ఇక్కడికి రారండి''.

 

''పోనీ అప్పుడప్పుడు వెళ్లి చూసిరావచ్చు. వాళ్లకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తారు. ఇక ఏమి అడ్డు చెప్పకు. '' అంది దేవసేన. 


అశోక్ చంద్రకి అనుకోకుండా దక్కిన ఈ అదృష్టం ఏమిటో నమ్మలేకపోతున్నాడు. అతడి తల్లి తండ్రుల ఐతే మరీను. ఇంతమంచివాళ్ళు వుంటారా.. గొప్పింటి అమ్మాయి ఏరి కోరి మాకు కోడలుగా రావడం ఏమిటి?

తల్లి తండ్రులు ఇష్టపడటం ఏమిటి? అహంకారానికి పోయి ప్రాణాలు తీసేస్తుంటే వీరు మాత్రం సంతోషంగా

ఒప్పుకున్నారు. బిడ్డకి మంచి జరిగితే వొద్దని అంటామా.. ! అనుకున్నారు. 


''ఆమ్రపాలి గారూ, మరోసారి ఆలోచించండి. మీరు కోరితే ఎలాంటి వాడైనా వస్తారు. నేను మీకు సరిపోను.. ''

అని ఆమెతో అన్నాడు. 


''చంద్రా ! ఎందుకు నేను అంటే భయపడుతున్నావు? నీకు చదువు వినయం మంచి మనసు వున్నాయి. నువ్వు కంపెనీ వృద్ధిలోకి తీసుకుని రాగలవని మాడాడీ గ్రహించారు. ఆయనకు నేను కంపెనీ ఒకటే. అలాగే మమ్మి కూడా నీలో మంచి లక్షణాలను కనిపెట్టింది. నాకు నీమీద ఇష్టం ఏర్పడింది. ఇలా మా ముగ్గురి మనసును గెలిచావు. 


నిన్ను చిన్న చూపు చూస్తామేమో నీ తల్లి తండ్రులు దూరంగా అవుతారేమో అనుకుంటున్నావా ! ఎన్నటికీ అలా జరగదు. నేను ప్రేమ పెళ్లి అంటే ఇష్టపడను. అమ్మ నాన్నలకు నువ్వు నచ్చడమే కోరుకున్నాను '' అంది ఆమ్రపాలి. 


''సరే! ఇంతటి గొప్ప మనసున్న మీ ముగ్గురూ నాలో ఏమి చూసారో నాకు తెలియదు. జీవితకాలం మీ నమ్మకాన్ని నిలబెడతాను'' అన్నాడు ఆమెను దగ్గిరగా హత్తుకుంటూ అశోక్చంద్ర. 

***************

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)


28 views0 comments

Comments


bottom of page