top of page

స్త్రీమూర్తి


'Sthreemurthi' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'స్త్రీమూర్తి' తెలుగు కథ

రచన: సుదర్శన రావు పోచంపల్లి


సృష్టిలో ఆడ మగ ఇంచుమించు సమానంగా ప్రతి జాతిలో సృష్టించ బడ్డాయి. అందులో స్త్రీ జాతి ప్రాధాన్యము అధికము. ఆ జాతి లేక సృష్టియే లేదనుటలో అతిశయోక్తికి తావు లేదు.


అందుకొరకే..


వినా స్త్రీయా జననం నాస్తి

వినా స్త్రీయా గమనం నాస్తి

వినా స్త్రీయా జీవం నాస్తి

వినా స్త్రీయా సృష్టియేవ నాస్తి


అంటే

స్త్రీ లేనిది పుట్టుక లేదు

స్త్రీ లేనిది కదలికే లేదు

స్త్రీ లేనిది జీవమే లేదు

స్త్రీ లేనిది సృష్టియే లేదు

అని అర్థము.


అటువంటి స్త్రీని సదా పూజించాలి, గౌరవించాలి.


యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతె తత్ర దేవతా

యత్ర నార్యస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాశురాః క్రియా


ఎక్కడ స్త్రీని పూజిస్తరో గౌరవిస్తరో అక్కడ దేవతలుంటారు

ఎక్కడ స్త్రీని పూజించరో గౌరవించరో అక్కడ రాక్షసత్వముంటుంది.


సాధారణంగా జనము ఈ సత్యము తెలువక తెలిసినా వక్రబుద్ధి కొందరు స్త్రీల పట్ల అసభ్యముగా ప్రవర్తించడము. తల్లి పట్ల గౌరవము లేక పోవడము. భార్యను హింసించడము చేస్తుంటారు. దానికి తోడు పూర్వీకులు సృష్టించిన కృష్ణాచారము {దురాచారము} నేటికి కొనసాగడము బాధాకరము. వ్యక్తులు ఎంత పెద్ద చదువులు చదివినా అలాంటి ఆచారాలను త్యజించక ఇంకా పట్టుకొని వ్రేలాడ పడడము శోచనీయము.


ఇక స్త్రీలకు నిర్బంధించిన ఆచారాలు కోకొల్లలు. అవి చూస్తుంటె వీళ్ళు మానవులేనా అను సందేహము కలుగకపోదు.


ప్రకృతి సిద్ధమైన నెలసరికి స్త్రీలను దూరము ఉంచడము- మూడు నాలుగు రోజులవరకు ముట్టక అంటక పోవడము ఒకేత్తైతె- గ్రహచారలోపముతో భర్తను కోల్పోయిన స్త్రీని ఒక హంతకురాలుగా చూసి వేధించడము వర్ణనాతీతం.


భర్త చనిపోయిన పదవ రోజు ఆమె బొట్టు, గాజులు, పుస్తె, మట్టెలు, సొమ్ములు తొలగించడము- తెల్ల చీర ధరింప జేయడము- ఎవరికీ ఎదురు రావద్దని శాసించడము.. మున్నగు దుష్ట సంప్రదాయాలను రుద్ది హింసించడము లాంటి విధానములు జుగుప్సాకరంగా తోస్తాయి. ఏ ఇతర మతములో, లేదా ఇతర దేశములో లేకున్నా పుణ్య భూమి, కర్మ భూమి అని చెప్పుకునే మన దేశములోనే ఈ నీచత్వము ఆచరించడము సిగ్గనిపిస్తుంటది.


స్త్రీకి అబల అని ఒక నామ కరణం. భర్తను కోల్పోయిన మగువను ముండ, రండ, విధవ, యతి, యతిని, విశ్వస్త, అపున్స్క, గంగాభాగీరథి. అనాథ, పూర్వసువాసిని అను పేర్లతో పిలుస్తుంటారు. ఎంత చిన్న వయసులో భర్తను కోల్పోయినా జన్మ మొత్తము పునర్వివాహము చేసుకోకుండా, ఏలాంటి అలంకరణలు లేకుండా రకరకాల ఆంక్షలు విధిస్తుంటారు. శుభకార్యాలకు పోకూడదని, ప్రయాణాలు చేసే వారికి ఎదురు రాకూడదని చెప్పుతూ పోతే ఆ ఘోష అనుభవించేవారికే తెలుసు.


పోనీ ఎవరో జనము అంటారంటె తల్లి, తండ్రి తోబుట్టువులకు కూడా అదే ఆచారము ఒంటబట్టి వ్యవహరిస్తారు.


ఇక పురుషుణి భార్య చనిపోతె ఏలాంటి ఆక్షలూ లేవు. ఎన్ని పెళ్ళిళ్ళు ఐనా, ఏ వయసయినా ఏలాంటి నిర్బంధము లేదు.


స్త్రీ అంటె అమ్మ, అక్క, చెల్లెలు, కూతురు అను ధ్యాసే ఉండదు. "తాతస్యకూపోయమితి ధృవాణాం కాపురుషాం క్షారం జలం పిబంతి" అంటె తాతలు త్రవ్వించిన బావి అని మూర్ఖుడు అవే తాగుతాడు కాని అవి ఉప్పు నీరైనా లక్షపెట్టడు.

వయసు వచ్చిన ఆడ వారు కనపడగానే జింకను చూసిన మృగములా పైబడ చూస్తారు. ఆ రసపిచ్చి తొలగాలి. తనకూ అక్క, చెల్లెలు, అమ్మ, కూతురు ఉన్నదను ఆలోచన ఉండాలి. చేసేవి పాపాలు, పెట్టేవి దీపాలు అన్నట్టు గుళ్ళకు కూడా పోతుంటారీ పాపిష్టి దుష్టులు మంచివారికి కళంకము తెచ్చేలా.


సమాజములో ఇంకా మార్పు రాలేదు. పల్లెటూళ్ళలో అధికము. ఇక అత్యంత విద్యాపరులైన జ్యోతీష పండితులే పై ఆచారాలన్ని సబబని వక్కాణిస్తుంటారు మందాక్షహీనులై.


స్త్రీ జాతి ఎంత మొత్తుకున్నా బధిర, మూగాంధులై ఇంకా ఈ పాడు సంప్రదాయము అడ్డుకోక పోవడము నీచ స్వభావము.


అందుకొరకే సమాజము మారాలె మారాలె మారాలె. స్త్రీ జాతిని గౌరవించాలె. అటువంటి పురుషుల అహంకారము, అవివేకము, దుష్ట చింతన, నీచ స్వభావము అంతరించాలి.

సమాప్తం.

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


35 views0 comments

Comentarios


bottom of page