top of page
Writer's pictureMohana Krishna Tata

సుబ్బారావు సన్మానం


'Subbarao Sanmanam' - New Telugu Story Written By Mohana Krishna Tata

'సుబ్బారావు సన్మానం' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

"ఏమిటో ఈ ట్రాఫిక్! అర్ధం కావట్లేదు.. అన్నాడు సుబ్బారావు కార్ డ్రైవర్ తో.."


"ఏం చేస్తాం సార్.. పీక్ అవ‌ర్స్ లో హైదరాబాద్ ట్రాఫిక్ ఇంతే !"


"ఏం సార్! కంగారు పడుతున్నారా?"


"కొంచం కంగారు ఉంది మరి! ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సన్మానం కదా!.. నా సన్మానం.. నా కార్ రిపేర్ అవడం చేత ఇలా క్యాబ్ లో వెళ్తున్నాను."


"మరి మేడం రాలేదా సార్?"


"మా ఆవిడా తర్వాత వస్తుందని చెప్పింది.. దసరా టైం కదా!.. ఏవో పూజలవి ఉన్నాయంటే.. నేను ఈ సన్మానం కోసం, చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని.. తెలుసా?"


"ఏమో సార్! మీరు చాలా పెద్దోళ్ళు.. బాగా చదువుకున్నవారు. నేనేమో పదవ తరగతి వరకే చదువుకున్నాను!"


"ఏం పేరు నీది?"


"రాము సార్. మీకు దేనికి సన్మానం సార్!"

"నేను ఒక రచయితను.. కధలు, కవితలు.. అన్నీ రాస్తాను "


"ఇప్పటివరకు ఎన్ని రాసుంటారు సార్!"


"చాలానే రాసాను.. లెక్కపెట్టలేదనుకో. చాలా వరకు బహుమతులు వచ్చాయి.."


"మా క్యాబ్ డ్రైవర్ మీద ఏమైనా కథ రాశారా సార్?.."


"లేదయ్యా.. ఇంకా.. రాయమంటావా? చెప్పు.. అదెంత పని" అన్నాడు సుబ్బారావు ఎంతో గొప్పగా..


"ఈ ట్రాఫిక్ ఇప్పటికి కదిలే లాగా లేదు.. ఏమైనా తెమ్మంటారా సార్ తినడానికి.. ఎదురుగా.. ఎదో తినడానికి ఉన్నాయి.. ఏ టిఫిన్ తెమ్మంటారు సార్?"


"ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ పూరి తీసుకో.. నీ కోసం ఏమైనా తెచ్చుకో.. ఇదిగో ఈ 500 ఉంచు"


"ఉండండి సార్.. తీసుకుని వస్తాను.. "


"అలాగే"


ఈలోపు సుబ్బారావు కొంచం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాడు..


**********


"ఏమండీ! ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నారు"


"అవునోయ్! నా కథ ఒక ప్రముఖ పత్రికలో అచ్చయ్యింది.. ఏమిటనుకున్నావ్ మరి.. "


"నాకు పార్టీ ఇవ్వండి మరి!"


"ఏం కావాలో?"


"ఒక పట్టుచీర"


"పట్టుచీర మీద ఒక కథ రాసాను.. చదువు.. ఇంక పట్టుచీర అడగవు"


"మీరెప్పుడు ఇలాగే అంటారు"


"మీ కథ లింక్ నాకు పంపించండి.."


"ఎందుకు.. ?"


"నేను చదవాలి.. లింక్ అందరికి ఫార్వర్డ్ చెయ్యలి మరి.. మా అయన పెద్ద రచయితని అందరికి చెప్పుకోవద్దు?"


"ఇంకా.. పెద్ద పేరు వచ్చాక చేద్డు గాని.."


"ఊరుకోండి.. మీరు పెద్ద రచయత అవగానే.. చెప్పక పోయిన తెలుస్తుంది అందరికి అప్పుడు"


"ఈలోపు ఏదో ఫోన్ రావడం తో సుబ్బారావు బయటకు వెళ్ళిపోయాడు.."


సుబ్బారావు, రాజ్యం పెళ్ళై ఒక్క సంవత్సరం అవుతుంది. సుబ్బారావు చాలా మంచి మనిషి. చిన్నపటి నుంచి.. కధలు.. కవితలు.. రాసుకుంటూ ఉండేవాడు. చాలా వరకు పత్రికలలో అచ్చయ్యాయి కూడా. సుబ్బారావు ఫ్రెండ్స్ "నువ్వు ఎప్పటికైనా పెద్ద రచయితవి అవుతావు రా" అనేవారు. అది సుబ్బారావు కు కొండంత ప్రోత్సాహం ఇచ్చేది.


తర్వాత చదువు.. ఉద్యోగం.. లో పడి అసలు టైం ఉండేది కాదు సుబ్బారావు కు. కాకపోతే, కాలేజీ లో స్టేజి షోస్ కు స్కిట్స్ రాసాడు.. అలాగే కవితలు.. గేయాలు.. పార్టీ లో పాడి వినిపించేవాడు..


అందరు సుబ్బారావు కవితాలంటే చాలా ఇష్టపడేవారు.. అమ్మాయిలైతే వాళ్ళ మీద కవిత్వం చెప్పమని మరీ అడిగేవారు.. సుబ్బారావు కు అది చాలా గొప్పగా అనిపించేది..


ఇలా ఉండగా.. కాలేజీ లో ఒక అమ్మాయి.. సుబ్బారావు కవితలంటే.. పడి చచ్చేది..


ఎప్పుడూ వచ్చి.. "సుబ్బు! ఏమైనా కొత్త కవిత రాసావా?" అని అడిగేది.

ఆమె కోసమే చాలా కవితలు రాసి.. ఒక పుస్తకం గా చేసి పుట్టినరోజు నాడు గిఫ్ట్ చేసాడు.. సుబ్బారావు.


దానికి ఆ అమ్మాయి ఎంతో మెచ్చి.. సుబ్బు కు ప్రపోజ్ చేసింది.


ఆమె పేరు రాజ్యం.. మీరు ఊహించినది నిజమే.. ఆవిడే సుబ్బారావు ధర్మ పత్ని..


వాళ్ళ పెళ్ళి కోసం సుబ్బారావు చాలా తిప్పలు పడ్డాడు..


"నీకేమో ఇంకా ఉద్యోగం లేదు.. ఏదో కధలు.. కవితలు.. రాస్తావని అమ్మాయి చెప్పింది.. వాటితో ఏమిటి ఉపయోగం?” అంది కాబోయే అత్తగారు.


"అలాగనకే అమ్మా! నా ప్రోత్సాహం ఉంటే, అయన పెద్ద రచయిత అవుతారు.. ఏదో ఒక రోజు హైదరాబాద్.. రవీంద్రభారతి లో సన్మానం చేస్తారు.. చూస్తూ వుండు” అంది రాజ్యం.


"అదీ చూద్దాము లే! నేను ఈ పెళ్ళి కి ఒప్పుకోను గాక ఒప్పుకోను.. "


"అమ్మ! నువ్వు ఒప్పుకోకపోయినా.. నేను ఆయననే చేసుకుంటాను.. ఆయనంటే నాకు చాలా ఇష్టం"


"ఏమిటే.. ఈ అమ్మ మాటే కాదంటావా? అవునులే.. మీ నాన్నగారే ఉంటే.. నువ్వు ఇలాగ తెగించేదానివా చెప్పు?"


చేసేదేమి లేక.. ఇద్దరి మీద రెండు అక్షింతలు వేసింది రాజ్యం తల్లి..


**********

"సార్!సార్!” అని ఎవరో పిలుస్తున్నారు.


"నువ్వా రాము"


"ఏమిటి సార్, నిద్రపట్టిందా?"


"అలాంటిదే అనుకో.."


"వేడివేడిగా ఉన్నాయి.. ఇడ్లి, పూరి తినండి.. కాఫీ కూడా పార్సెల్ తెచ్చాను.."


"నువ్వు కూడా తిను రాము.."


ట్రాఫిక్ కొంచం కొంచం కదులుతుంది..


"ఏమిటి సార్! ఈ సన్మానం అంత స్పెషల్.."


"ప్రతి సంవత్సరం ఈ పత్రిక వారు కొంతమందికి సన్మానం చేస్తారు.. ఇక్కడ సన్మానం అయ్యిందనుకో.. నా జీవితం ఎక్కడికో వెళ్లిపోతుందనుకో.. !"

"అయితే నేనూ వస్తానండి అక్కడకు.. సన్మానం చూస్తాను..

"

"అలాగే"


"ట్రాఫిక్ క్లియర్ అయ్యింది సార్.. ఇంక మనం దూసుకుని వెళ్ళిపోదాం.."



ఈలోపు ఫోన్ మోగింది..


"చెప్పు రాజ్యం! ఎక్కడ ఉన్నావు.. "


"నేను వచ్చేసానండి.. సన్మాన సభకు.. మా అమ్మ ను కూడా తీసుకుని వచ్చాను.. మీ గొప్పతనం తెలియాలి కదా మరి!"


"నేను 5 నిముషాలలో అక్కడ ఉంటాను.." అన్నాడు సుబ్బారావు.


అనుకున్నట్టుగానే, సుబ్బారావు కు ఘనంగా సన్మానం జరిగింది.. రాజ్యం సంతోషానికి అవధులు లేవు. అత్తగారికి.. అల్లుడు గొప్పతనం తెలిసివొచ్చింది..


సుబ్బారావు.. ఇంకా ఎన్నో గొప్ప రచనలు చేస్తూ.. ప్రఖ్యాత రచయితగా పేరు పొందాడు..


*************************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


32 views0 comments

Comments


bottom of page