top of page
Writer's pictureMohana Krishna Tata

తెలివైన కోడలు


'Thelivaina Kodalu - New Telugu Story Written By Mohana Krishna Tata

'తెలివైన కోడలు' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

చాలా రోజుల కిందట, ఒక ఊరిలో రాజేష్ తన అమ్మ తో కలిసి ఉండేవాడు. రాజేష్ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. రాజేష్ చాలా మంచి వాడు. పెద్దగా చదువుకోక పోయిన, మంచి తెలివితేటలు కలవాడు. తాతలనాటి పొలం లో వ్యవసాయం చేసుకొని అమ్మ ను బాగా చూసుకునేవాడు.


రాజేష్ అమ్మ కమల కు కొంచం చాదస్తం ఎక్కువ. ప్రతీది తాను అనుకున్నట్టే జరగాలని మొండితనం కలిగిన మనిషి. ఇలా ఉండగా, రాజేష్ కు యుక్త వయసు వచ్చింది. కమల తన కొడుకు పెళ్ళి గురించి ఆలోచనలో పడింది.


ఎలాంటి కోడలు వస్తే బాగుంటుంది? అమ్మాయి చదువుకోవాలి? ఇవన్నీ ఆలోచిస్తుంది. కట్నం మీద బాగా ఆశ తో ఉంది కమల.


ఆ ఊళ్ళో, కొంచం ఎక్కువ పొలం ఉన్నది రాజేష్ కు. కష్టపడి, పొలం పెంచుకుంటూ, వచ్చాడు. ఒక రోజూ, కొంత మంది కాలేజీ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ కోసం రాజేష్ వాళ్ళ ఊరు వచ్చారు. అందులో ఒక అమ్మాయి రాజేష్ ను కలిసి వ్యవసాయం గురించి తెలుసుకుందామని వచ్చింది.


రాజేష్ ను పొలం లో కలిసింది ఆ అమ్మాయి.


ఎవరు మీరు? ఇక్కడకు ఎందుకు వచ్చారు" అన్నాడు రాజేష్


"ప్రాజెక్ట్ వర్క్ కోసం మీ ఊరు వచ్చాం, మీరు వ్యవసాయం గురించి చెప్పండి. మీ అనుభవాల్ని చెప్పండి అంది."


"మీ పేరు ఏమిటి" అన్నాడు రాజేష్

"పల్లవి" అంది ఆ అమ్మాయి

"చాలా మంచి పేరు" అన్నాడు రాజేష్


రోజూ, రాజేష్ తన పొలం గురించి, వ్యవసాయం ఎలా చేస్తారు, అన్నీ ఆ అమ్మాయి కు చెప్పాడు. ఆ అమ్మాయి నోట్స్ వ్రాసుకుంది. ఇలా ఉండగా, రోజు రోజుకు పల్లవి కి రాజేష్ అంటే, ఇష్టం మొదలైంది. అతని, కష్టపడే గుణం, పొదుపు, అందం, అన్నీ నచ్చాయి పల్లవి కి.


ఒక రోజు పల్లవి " ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోరు కదా!" అంది రాజేష్ తో...

"చెప్పండి"

"మీరు ఎవర్నైనా ప్రేమిస్తున్నారా?"

"లేదు"

"మీకు ఎలాంటి అమ్మాయి కావాలి"


"మా ఇంట్లో నేను, మా అమ్మ ఉంటాం. నాకైతే ఎలాంటి అమ్మాయి అయినా పర్వాలేదు. అందం, ఆణుకువ, ఓర్పు, తెలివైన అమ్మాయి కావాలి. నేను పెద్దగా చదువుకోలేదు. చదువు, తెలివైన పెళ్ళాం వస్తే, నాకు అన్ని విధాలా సహాయంగా ఉంటుంది. నేను కూడా, త్వరలో రైస్ మిల్ పెట్టాలనుకుంటున్నాను. మా అమ్మ కు మాత్రం 'డబ్బున్న అమ్మాయి, మంచి కట్నం తెచ్చే అమ్మాయి' కోడలి గా రావాలని అంటుంది. చదువుకున్న అమ్మాయి అయితే మాట వినదని అమ్మ నమ్మకం"


"ఒక మాట చెప్పనా" అంది. "ఏమి అనుకోరు కదా! నేను మీ లాంటి అబ్బాయి కోసమే చూస్తున్నాను. మీరు నాకు చాలా బాగా నచ్చారు. మీరు ఒప్పుకుంటే మిమల్ని పెళ్ళి చేసుకుంటాను. మీ జవాబు కోసం ఎదురు చూస్తుంటాను. రేవు కలసినప్పుడు చెప్పండి." అంది పల్లవి.


మర్నాడు పల్లవి ఎంతో ఆశగా రాజేష్ పొలం దగ్గరకు వచ్చింది. అందంగా ముస్తాబై, లక్షణంగా చీర కట్టుకుని వచ్చింది. రాజేష్ మనసులో మొదటి నుంచి పల్లవి అంటే ఇష్టమే, కానీ చదువుకున్న అమ్మాయి అని సంశయించాడు.


"నన్ను పెళ్లి చేసుకుంటారా" అని అడిగింది పల్లవి.

"ఇన్ని రోజుల మన పరిచయం లో, మీరు నాకు చాలా నచ్చారు. మిమల్ని పెళ్ళి చేసుకుంటాను. కానీ, మీరు మా అమ్మ ను ఒప్పించాలి"


"అలాగే"


ఆ రోజు రాత్రి పల్లవి 'అత్తా, కోడళ్ళు' ఉన్న సీరియల్స్, సినిమాలు తెగ చూసింది. ఎదో ఒక ఐడియా కోసం.


మర్నాడు పల్లవి, కమల ఇంటికి వెళ్ళింది. కమల తలుపు తీసింది.


"ఎవరమ్మా నువ్వు" అన్నది కమల.


"నేను పక్క ఊళ్ళో ఉంటాను" ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చాను. మీ అబ్బాయి రాజేష్ ను కూడా కలిసాను"


"ఎవరు అమ్మాయివో!?"


"మా నాన్నగారికి మంచి పేరుందండి ఊళ్ళో" అంటూ... "ఒక గ్లాస్ మంచి నీళ్లు ఇస్తారా" అని అడిగింది.


"అలాగే, ఉండు" అని లోపలికి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చింది ఇద్దరకు.


"ఇలా కూర్చో అమ్మాయి. కాఫీ తీసుకో"


"మంచినీళ్లు అడిగావు కదా! మర్చిపోయాను, తెస్తాను" అని లోపలికి వెళ్ళింది.


రాత్రి చూసిన సీరియల్ గుర్తొచ్చింది పల్లవికి.


వెంటనే తన వెంట తెచ్చుకున్న, విరోచన మాత్రలు, డోస్ ఎక్కువ కాకుండా కాఫీ లో కలిపింది.


"ఇదిగో అమ్మ, మంచినీళ్లు"


"థాంక్స్ ఆంటీ"


"కాఫీ తాగండి ఆంటీ మీరు. ఊళ్ళో కలరా వ్యాధి ఎక్కువ ఉందంట, జాగ్రత్తగా ఉండండి ఆంటీ" అని చెప్పి వెళ్ళిపోయింది.


మర్నాడు, రాజేష్ పల్లవి తో " మా అమ్మకు విరోచనాలు అవుతున్నాయి. నాకు భయంగా ఉంది. సమయానికి ఊళ్ళో డాక్టర్ కూడా లేరు"


"కంగారు పడకండి. నేను చూసుకుంటాను. సిటీ నుంచి వచ్చాను కదా!" అంది పల్లవి


రాజేష్ తనంతో పాటు పల్లవి ని ఇంటికి తీసుకుని వెళ్ళాడు.


"నువ్వా అమ్మాయి, నాకు వొంట్లో బాగోలేదు."

"మీరు మాములు మనిషి అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను ఆంటీ."


పల్లవి, తనతో పాటు తెచ్చిన మందులు వేసి, ద్రవ పదార్థాలు గంట గంటకు తాగించేది.

రెండు రోజుల్లో, కమల మళ్ళీ మాములు మనిషి అయ్యింది.


"చూసారా ఆంటీ! మిమల్ని చూడడానికి ఎవరూ రాలేదు"


డబ్బు ఉన్నా, ఓర్పు, మంచితనం లేక పొతే ప్రయోజనం లేదు అని కమలకు అర్ధమైంది. ఈ వయసులో, తనను చూసుకోవడానికి మంచి అమ్మాయి కోడలు గా వస్తే చాలనుకుంది.


"పల్లవి! నీకు పెళ్లయిందా?"

"కూతురు లాగా చూసుకునే అత్తగారు కు కోడలి గా పంపాలని మా ఇంట్లో చూస్తున్నారు"


"నేను నిన్ను నా కూతురిలా చూసుకుంటాను" అంది కమల.


"అది నా అదృష్టం. మీ అబ్బాయి కు ఇష్టమైతే నాకూ ఇష్టమే" అంది ఆ ఇంటికి కాబోయే తెలివైన కోడలు.


***

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


93 views0 comments

Comments


bottom of page