top of page

త్యాగమూర్తి సైనికుడు

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ThyagamurthiSainikudu, #త్యాగమూర్తిసైనికుడు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 75


Thyagamurthi Sainikudu - Somanna Gari Kavithalu Part 75 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 14/05/2025

త్యాగమూర్తి సైనికుడు - సోమన్న గారి కవితలు పార్ట్ 75 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


త్యాగమూర్తి సైనికుడు

----------------------------------------

నిండు నూరేళ్ళ జీవితాన్ని

భారతి సేవలో ఖర్చుపెట్టు

కరిగిపోతూ కాంతినిచ్చే

త్యాగమయ క్రొవ్వొత్తి సైనికుడు


తన సుఖాలన్నీ వదులుకున్న

తనలోని స్వార్ధాన్ని మానుకున్న

నిలువెత్తు త్యాగానికి చిహ్నం

గుండె ధైర్యంలో సింహం


అతడే! అతడే!ఘన సైనికుడు

భారతమ్మ అసలు వారసుడు

పరికింప నిస్వార్ధ సేవకుడు

మాతృభూమి నిజ ప్రేమికుడు


నిదురలేని రాత్రులెన్నో!

వసతి లేని రోజులెన్నో!

గడిపిన త్యాగమూర్తి సైనికుడు

గౌరవింపదగిన మగధీరుడు



















చైతన్య గీతి

----------------------------------------

చేయి చేయి కలుపుదాం

సమైక్యత చాటుదాం

దేశకీర్తి నలుదిశలా

గళమెత్తి పాడుదాం


భుజం భుజం తట్టుదాం

ప్రేమతోడ లేపుదాం

యువశక్తి గుండెల్లో

దేశభక్తి రేపుదాం


పదం పదం పేర్చుదాం

దేశ గీతి అల్లుదాం

ధరణి దద్దరిల్లేలా

హరిణిలాగ సాగుదాం


మాతృభూమి గొప్పదోయ్!

అక్షరాల సత్యమోయ్!

బద్దకాన్ని వదిలేసి

శ్రద్ధగా ఉండవోయ్!


సైనికులను తలచుకో!

చైతన్యం నింపుకో!

జన్మభూమి కోసమే

జయగీతం పాడుకో!

















అంతులేని బంధం

----------------------------------------

తరువుకు ఆకులతో

గురువుకు శిష్యులతో

అంతులేని బంధం

కొలనుకు కలువలతో


మింటికి చుక్కలతో

పుడమికి మొక్కలతో

అంతులేని బంధం

ఇంటికి ఇంతులతో


మాలకు దారంతో

పూలకు తావులతో

అంతులేని బంధం

పాలకు మీగడతో


ఎన్నెన్నో బంధాలు

సృష్టికే అందాలు

నిలువుకోవాలి హృదిని

ఘన సత్సంబంధాలు






















చిరస్మరణీయుడు సైనికుడు

----------------------------------------

దేశానికి రక్షకులు

మన ప్రియతమ సైనికులు

దేశ సరిహద్దుల్లో

భారతమ్మ కనురెప్పలు


జీవితమంతా త్యాగం

అదే వారికి సొంతం

అడుగడుగునా అవుతుంది

ఆదర్శమే జీవితం


వీర మరణమొందినా

అమరులే లోకంలో

జీవించే ఉంటారు

భారతమ్మ గుండెలో


వారి సమర్పణ గొప్పది

గౌరవింపదగినది

ఆచరింపదగినది

బహు అమూల్యమైనది


సైనికుడా! ధన్యుడవు

అందరికి స్ఫూర్తి దాతవు

భువిని చిరస్మరణీయుడవు

సైనికుడా! ఆరాధ్యుడా!












వర్ణింప సాధ్యమా!

----------------------------------------

అమ్మలాంటి వ్యక్తిని

అంతులేని శక్తిని

వర్ణింప సాధ్యమా!

ఆమెలోని యుక్తిని


తరిగిపోని ప్రేమను

అమ్మలో త్యాగమును

వర్ణింప సాధ్యమా!

ఆమె చేయు సేవను


దండలో దారంలా

నాసికలో శ్వాసలా

సృష్టికి ఆధారం

అమ్మే సింగారం


మల్లె తీగ మాదిరి

తల్లి మనసు మెత్తన

ఇంటిలోన దీవెన

ఎదుగుదలకు నిచ్చెన


అమ్మ లేక సదనం

వాడిపోయిన వనం

ఆమె ఉంటే కళకళ

తారల్లా మిలమిల


-గద్వాల సోమన్న


bottom of page