top of page

వజ్రంలాంటి మాటలు

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #VajramLantiMatalu, #వజ్రంలాంటి మాటలు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 48

Vajram Lanti Matalu - Somanna Gari Kavithalu Part 48 New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 29/03/2025

వజ్రంలాంటి మాటలు - సోమన్న గారి కవితలు పార్ట్ 48 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


వజ్రంలాంటి మాటలు

----------------------------------------

మార్చుకో! ప్రవర్తన

తెచ్చుకో!పరివర్తన

లోకమే హర్షించును

నాకమే ప్రవహించును


పెంచుకో! సద్భావన

దిద్దుకో! ఆలోచన

సుఖమయమే జీవితము

మనసులో ఆనందము


వదులుకో! ఆవేదన

అణచుకో! ఆందోళన

జీవితాన పండుగే!

మనశ్శాంతి దండిగే!


మానుకో! ఆక్షేపణ

ఎదుర్కో! ఆరోపణ

కోరుకో! జన క్షేమము

నింపుకో! విజ్ఞానము




















ఏనాడు మరవరాదు!

----------------------------------------

సాయపడిన వ్యక్తులను

కడుపు నింపు రైతులను

ఏనాడు మరవరాదు!

చదువు నేర్పు గురువులను


బుద్ధి చెప్పు పెద్దలను

అండ నిలుచు మిత్రులను

ఏనాడు మరవరాదు!

బ్రతుకు దిద్దు మాన్యులను


ఉపకరించు తరువులను

నీరునిచ్చు చెరువులను

ఏనాడు మరవరాదు!

మహిలో మహనీయులను


ప్రేమ పంచు మనుషులను

ఆదరించు చేతులను

ఏనాడు మరవరాదు!

భువిని జన్మ దాతలను














పెద్దయ్య సలహాలు

----------------------------------------

ఉంటేనే మనశ్శాంతి

లేమిలోను ఆనందము

తొలగిపోతే భ్రాంతి

బ్రతుకంతా నవకాంతి


మానుకుంటే వ్యసనాలు

జీవితమగును హరివిల్లు

అగునోయి కుటుంబాలు

గుబాళించే విరిజల్లు


కలుపుకుంటే బంధాలు

విరబూయును అందాలు

బలపడును ఖచ్చితంగా

మానవ సంబంధాలు


పెంచుకుంటే వాదాలు

ఎక్కువగును కలహాలు

సద్దుమణిగితే గనక

వర్ధిల్లును స్నేహాలు










పంతులమ్మ పసిడి పలుకులు

----------------------------------------

కష్టాలు, కన్నీళ్లు

నేర్పునోయ్! పాఠాలు

బ్రతుకున అపజయాలు

విజయాలకు వంతెనలు


ఆపదలో ఆప్తులు

నిజమైన స్నేహితులు

పెట్టుకో! గుండెలో

మరచిపోకు బ్రతుకులో


వెన్నుపోటు దారులు

ముంచుతారు కొంపలు

జాగ్రత్త అవసరము

లేకుంటే నాశనము


మానితే వ్యసనాలు

క్షేమము జీవితాలు

క్రమశిక్షణ ముఖ్యము

క్షీణిస్తే నష్టము



















అక్షర సత్యాలు

----------------------------------------

మానవ జీవితాన

కష్టాలే సహజము

వాటిని అధిగమించ

ఉండాలోయ్! సహనము


అవి చుట్టాల్లాంటివి

పలకరించిపోతాయి

శక్తిసామర్ధ్యాలను

పరీక్షించిపోతాయి


కష్టాలకు భయపడి

లక్ష్యాన్ని మరువొద్దు

ఓటమికి క్రుంగి క్రుంగి

హైరానా పడవద్దు


ఎద నిండా ధైర్యము

ముఖమంతా తేజము

నింపుకొని బ్రతకాలి

విజయాలు పొందాలి


పుస్తకం పట్టుకుని

జ్ఞానాన్ని పొందుకుని

విజేతగా నిలవాలి

జీవితాన్ని గెలవాలి


-గద్వాల సోమన్న


Comments


bottom of page