top of page

వానొచ్చింది

#NandyalaVijayaLakshmi, #నంద్యాలవిజయలక్ష్మి, #Vanochhindi, #మాతృభాష,  #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Vanochhindi - New Telugu Poem Written By  - Nandyala Vijaya Lakshmi

Published in manatelugukathalu.com on 17/05/2025 

వానొచ్చింది - తెలుగు కవిత

రచన: నంద్యాల విజయలక్ష్మి


వానొచ్చింది

పిలవని చుట్టములా

అనుకోని అతిథిలా

గుంటలు చెరువులు వాగులు

స్వాగతించాయి

నదులు పొంగిపొరలాయి

సముద్రము పరవళ్ళు తొక్కింది


తడిసిన పుడమితల్లి రైతులకు ఆశాజ్యోతిలా

సాక్షాత్కరించింది

తరువులు అన్నీ తడిసి 

గాలికి ఊగుతున్న ఆకులనుండీ పూలవాన కురిసింది 

రాలిన పారిజాతాలు వెన్నెల పానుపులా 

ఇంటి చూరునుండీ రాలుతున్న నీటిబొట్లు సరికొత్త తాళముతో ఆలపించిన జోలపాటలా

సడిచేసాయి 

వానా వానా వల్లప్ప అంటూ చిన్నారుల చిందులు 

హృద్యంగా

 మానస వీణ తీ గలను కదిలించింది 

వానొచ్చింది

నీటితో పాటు ముంపుప్రాంతాల జనులలో కన్నీటిని జతపరిచింది

వరదబాధితులు 

వలసదారిపట్టారు 

వానొచ్చింది














మాతృభాష

------------------

నా భాష తెలుగు 

నా వేదనలో 

మోదములో 

నాలోని స్పందనలు

అనుభూతులు

స్వచ్చంధంగా 

ప్రకటనచేసే వీలైన భాష 

మాధుర్యాన్ని

వైవిధ్యమైన శబ్దాలను

ప్రాసలు అలంకారాలు వివిధసాహితీ ప్రక్రియలకనుగుణంగా తీర్చుదిద్దుకునే రీతి పొందుపరచబడిన భాష 

నా మాతౄభాష 

వర్ణమాలతో ఎన్నో చమ త్కృతులు 

విన్యాసాలు 

పద్యమైనా గద్యమైనా 

కావ్యాలైనా 

ఇతిహాసాలైనా 

రమ్యంగా రసవత్తరంగా వర్ణించడానికి అనువైన సుసంపన్నమైన భాష నా మాతృభాష 

అలతిపదాలతోనైనా

కఠినపదాలతో నైనా

భావాన్ని ప్రస్ఫుటం చేయడనికి ఉపకరణమై మనసు రంజిల్లచేసే మహత్తరభాష 

నా మాతృభాష 

పరభాషా మత్తులో తెరమరుగు అవకుండా పరిరక్షించుకోవలిసిన విజ్ణానఖని 

సుందరమైన సున్నితమైన గొప్పదైన భాషను 

మరింత నూత్నముగా తీర్చిదిద్ది ఉన్నతశిఖరాన నిలుపుకోవలిసిన నైతికభాధ్య త

తెలుగు వారందరిదీ 

మాతృభాషను ప్రేమిద్దాము 

కొత్తతరానికి రుచిచూపించి ఇదీ తెలుగు గొప్పతనం అని చాటిచెపుదాము


నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి

ఊరు. హైదరాబాదు

నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి

చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .

రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను

యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .

పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .

విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .

1 Comment


వాన పడుతోంది. ఈ కవితలో అందం వాస్తవం గా తెలిసింది. మాతృ భాష గొప్పతనం ఎవరు చెప్పినా మధురమే! రచయిత్రికి అభినందనలు

Like
bottom of page