విజ్ఞాన శాస్త్ర ప్రయోగాల ఆవశ్యకత

'Vijnana Sasthra Prayogala Avasyakatha'
New Telugu Article Written By Naga Srinidhi
రచయిత్రి: నాగ శ్రీనిధి
నా పేరు వి.నాగ శ్రీనిధి. నేను 9వ తరగతి చదువుతున్నాను.
నేను ఈ ఆర్టికల్‌లో ఇప్పుడు నేను చేసిన కొన్ని ప్రయోగాలు చెప్పబోతున్నాను.
మన ప్రపంచం (సైన్స్) విజ్ఞానం తో నిండి ఉన్నది. (సైన్స్) విజ్ఞానం అంటే మన పరిసరాల నుండి మనం పొందే జ్ఞానం. సైన్స్ అనే పదం లాటిన్ పదం సెన్షియా నుండి తీసుకోబడింది, సెన్షియ అంటే జ్ఞానం.
మనం ప్రయోగాలను ఆత్మకంగా చేస్తే వాటిని మరింత మెరుగ్గా తెలుసుకోవచ్చు. ఈ అనుభవాలు సైన్స్‌పై ఆసక్తిని పెంపొందిస్తాయి.
నా మొదటి ప్రయోగం ఆమ్లము మరియు క్షారము యొక్క ప్రతి చర్య.
*ప్రయోగం 1*
*పదార్థాలు*: డిటర్జెంట్ సోడా, పసుపు.
*విధానం*: డిటర్జెంట్ సోడాను తీసుకొని అందులో పసుపుని కలపడం ద్వారా మనకు ఆ మిశ్రమము ఎరుపు రంగులోకి మారుతుంది.
*ప్రయోగం 2*
*పదార్థాలు*: ఉల్లిపాయ, గ్లాసు నిండా నీరు.
*విధానం*: మనం ఒక ఉల్లిపాయను తీసుకోవాలి, ఆపై దానిని గ్లాసు నిండా నీళ్లలో వేయాలి
ఉల్లిపాయలో వేర్లు పెరగడాన్ని మనం ఒక వారంలో కనుగొనవచ్చు.
మనం (ఎపికల్ మెరిస్టెమాటిక్ టిష్యూ) అగ్ర విభాజ కణజాలాల గురించి తెలుసుకోవచ్చు.
*ప్రయోగం 3*
*పదార్థాలు*: వేడి నీరు, ఆకు.
*విధానం*: వేడి నీటిలో ఆకుని వేయడం ద్వారా మనకు ఆకుపైన బుడగలు వస్తాయి. ఇవి పత్ర రంధ్రాల గురించి మనకు తెలియజేయగలవు.
*ప్రయోగం 4*
*పదార్థాలు*: రెండు గ్లాసుల నిండా నీరు, దాదాపు ఒకే పరిమాణంలో ఉన్న రెండు నిమ్మకాయలు,ఉప్పు.
*విధానం*: రెండు గ్లాసుల నిండా నీరు తీసుకొని ఒక గ్లాసులో ఉప్పుని వేసి కరిగించాలి, ఆ రెండు గ్లాసులలో నిమ్మకాయలను వేస్తే ఉప్పు వేసిన నీటిలో నిమ్మకాయ తేలుతుంది ఈ ప్రయోగం ద్వారా మనం నీటిలో ఉప్పు వేయడం ద్వారా కలిగే సాంద్రత గురించి తెలుసుకోవచ్చు.
*ప్రయోగం 5*
*పదార్థాలు*: కూరగాయల వ్యర్ధాలు, బంక మట్టి, ఎండిపోయిన ఆకులు
*(మనం ఈ ప్రయోగం ద్వారా కృత్రిమ ఎరువులకు బదులుగా సహజ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.)*
*విధానం*: కుళ్లిపోయిన కూరగాయలు కూరగాయల వ్యర్ధాలు, ఎండు ఆకులు, బంక మట్టి వీటన్నింటినీ ఒక పాత్రలో వేసుకొని దానిని రోజు గమనించుకుంటూ నీటితో తడుపుతూ ఉండాలి, ఒక వారం తర్వాత ఆ వ్యర్థాలన్నీ మట్టితో కలిసిపోతాయి. ఈ ఎరువులు పంటలో వాడడం ద్వారా దిగుబడి ఎక్కువగా వస్తుంది పైగా భూమిలో సాంద్రత కూడా పెరుగుతుంది. దీని ద్వారా మనము భూమి కాలుష్యాన్ని కొంత నియంత్రించవచ్చు.
ఈ విషయాల గురించి మరింత తెలుసుకోవడానికి మనం చాలా ప్రయోగాలు చేయవచ్చు, ఈ రకమైన ప్రయోగాలతో మనం చాలా విషయాలను తెలుసుకోవచ్చు,ఈ ప్రయోగాలతో విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తితో పాటు జ్ఞానాన్ని కూడా పొందవచ్చు.
మన మస్తిష్కం విన్నదానికంటే కూడా ఎక్కువగా చూసిన దాన్ని ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకుంటుంది కాబట్టి మనం ఇలాంటి విషయాల గురించి వినడం ద్వారా కంటే చూడడం ద్వారా లేదా చేయడం ద్వారానే ఎక్కువ జ్ఞానాన్ని పొందగలము.
***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
https://linktr.ee/manatelugukathalu
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :
నా పేరు నాగ శ్రీనిధి. నేను తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల(T.T.W.U.R.J.C) లో 9 వ తరగతిలో చదువుతున్నాను. నాకు పరిశోధనలు చేయడం అంటే చాలా ఇష్టం.