top of page

కాలుష్య నియంత్రణ - నా పరిశోధన


'Kalushya Niyanthrana Na Parisodhana' New Telugu Article By Naga Srinidhi

రచయిత్రి: నాగ శ్రీనిధి




నా పేరు నాగ శ్రీనిధి. నేను తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల(T.T.W.U.R.J.C) లో 9 వ తరగతిలో చదువుతున్నాను. నాకు పరిశోధనలు చేయడం అంటే చాలా ఇష్టం. ఈ వ్యాసంలో నేను స్వయంగా గమనించిన విషయాలని ప్రస్తావించబోతున్నాను.ఈ వ్యాసం లో నేను కొన్ని సమస్యలకు పరిష్కారాలు చెప్పడానికి, కాలుష్యాన్ని నియంత్రించడానికి కొన్ని మార్గాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను.


సాధారణంగా కాలుష్యం ఎక్కువగా జనాలు నివసించే ప్రదేశాల్లో, వంటగదిలో, ఆ ప్రదేశానికి చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. అదే మనం నివసించే ప్రదేశాలు అయితే‌ మురికి కాలువల వల్ల, నీరు నిలువ ఉన్న చోట, బావులు, చెరువులు..... మొదలైన ప్రదేశాలలో (ఎక్కువగా వర్షాకాలంలో), జనాలు రద్దీగా ఉండే చోటు అయితే ప్లాస్టిక్ వస్తువులతో ఆ ప్రదేశం కాలుష్యంగా మారుతుంది. ఈ ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసిపోవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడతాయి.


అలా కలిసిపోయిన తర్వాత కూడా ఆ ప్లాస్టిక్ వ్యర్ధాలు జీవకోటికి, వృక్షాలకు హాని చేస్తాయి. మరికొన్ని ప్లాస్టిక్ వ్యర్ధాలు నీటిలో కొట్టుకుంటూ వెళ్లి సముద్రంలో కలుస్తాయి. దాని ద్వారా నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఆ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల అందులో ఉన్న జలచరాలకు నష్టం వాటిల్లుతుంది. ఆ జలచరాలను ఆహారంగా తీసుకున్న మానవుడు కూడా అనారోగ్యం పాలవుతాడు. మనం వాడే ప్లాస్టిక్ వ్యర్థాలు మనకే మళ్లీ నష్టాన్ని చేకూరుస్తాయి. దానివల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది, మరియు వాయు కాలుష్యం వల్ల మానవుల ఊపిరితిత్తులు పాడవుతాయి.


*వంట గది:- **సాధారణంగా వంట గదిలో ఎక్కువగా మనకు ఆహార వ్యర్ధాలు,కూరగాయల తొక్కలు, కుళ్ళిపోయిన కూరగాయలు ఎక్కువగా ఉంటాయి. కూరగాయల తొక్కలు, కుళ్ళిపోయిన కూరగాయలు, ఆహార వ్యర్ధాలు వీటన్నింటితో ప్రకృతికి మేలు జరిగే విధంగా ఎరువులను తయారు చేయవచ్చు. మరియు మనం తినగా మిగిలిన పదార్థాన్ని జంతువులకు గాని, ఆహారం లేని వారికి కానీ ఇవ్వవచ్చు.


*నీటి కాలుష్యం:- * నీటి కాలుష్యం వల్ల జలచర జంతువులకు చాలా హాని కలుగుతుంది. మరియు నీళ్లు ఎక్కువ రోజులు నిలువున్నచోట చాలా రకాల శిలీంద్రాలు ఏర్పడతాయి. ఈ శిలీంద్రాల వల్ల మనకు చాలా రకాల జబ్బులు వస్తాయి. కాబట్టి నీటిని ఎక్కువ రోజులు నిలువ ఉంచకూడదు. *(పారే నీరుకు వర్తించదు)*. మురికిగా ఉన్న నీటిని కొన్ని యంత్రాల ద్వారా శుద్ధమైన నీరుగా తయారు చేయవచ్చు. అలా తయారు చేసిన నీళ్లు మన అవసరానికి వినియోగించగలుగుతాం. ఇలా పాడైన నీటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు.


*ప్లాస్టిక్ వ్యర్ధాలు:- * ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మనకు చాలా రకాల నష్టాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వల్ల మనం నీటి కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ప్లాస్టిక్ వల్ల చాలా రకాల జీవజాలం మాయమైపోతుంది. మనం ఎక్కువగా పునర్వినియోగించడానికి వీలుగా ఉన్న ప్లాస్టిక్ ను ఉపయోగించడం మంచిది. మనం ప్లాస్టిక్ వస్తువులను తయారు చేయడం ఆపేసి ఇప్పుడు మనం ఉపయోగించిన ప్లాస్టిక్ నే పునర్వినియోగించే దానిలాగా చేసి వాడుకోవడం మంచిది. దానివల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలోకి వెళ్ళవు. ఇలా మనం ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించవచ్చు.


*వాయు కాలుష్యం:- * వాయు కాలుష్యం ఎక్కువగా వాహనాల వల్ల, మరియు కర్మాగారాల వల్ల ఏర్పడుతుంది. విద్యుత్తు వాహనాలు వాడడం ద్వారా మనం ఈ వాయు కాలుష్యాన్ని కొద్దిగా నివారించవచ్చు, (ఫ్యాక్టరీలు)కర్మాగారాల ద్వారా వచ్చిన కార్బన్డయాక్సైడ్ మనం పీల్చడం ద్వారా మనం చాలా రకాల అనారోగ్యాలకు గురవుతాం. ఇలా కాలుష్య పూరితమైన వాయువులను తగ్గించడానికి చెట్లు చాలా వరకు ఉపయోగపడతాయి, కానీ చెట్లను నరకడం ద్వారా ఈ వాయువు శుద్ధమవడం లేదు. మనం చెట్లను పెంచడం ద్వారా ఈ కాలుష్యమైన వాయువును మరియు చాలా రకాల అపరిశుద్ధ వాయువులు ప్రాణవాయువు లాగా మారతాయి, ఇదే కాకుండా మనకు చెట్లు ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే ఔషధాలను కూడా ఇస్తాయి.


*ఇది నేను నా పరిశోధన ద్వారా తెలుసుకున్న విషయం. కాబట్టి ప్రభుత్వం మరియు ప్రజలు అందరూ కలిసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెడితే మనం చాలావరకు కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. దీనిని వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా అందరూ కలిసి చేస్తేనే సరైన ఫలితం లభిస్తుంది. పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు భావితరాల వారికి కూడా మనము మేలు చేసిన వారిమి అవుతాము.*

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



రచయిత్రి పరిచయం :

నా పేరు నాగ శ్రీనిధి. నేను తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల(T.T.W.U.R.J.C) లో 9 వ తరగతిలో చదువుతున్నాను. నాకు పరిశోధనలు చేయడం అంటే చాలా ఇష్టం.

37 views0 comments
bottom of page