అపురూప వాలెంటైన్ డే
- Vangeepuram Shashirekha
- 4 hours ago
- 2 min read
#వంగీపురంశశిరేఖ, #VangeepuramShashirekha, #ApurupaValentineDay #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Apurupa Valentine Day - Telugu Inspirational Story | Vangeepuram Shashirekha
అపురూప వాలెంటైన్ డే - తెలుగు కథ | వంగీపురం శశిరేఖ
Publishes in manatelugukathalu.com on 15/03/2026
ఆ రోజు వాలెంటైన్ డే. ఇంట్లో హడావిడిగా పరిగెడుతున్నాను, ఇంటిని సర్దాలని. తను రాత్రి డిన్నర్ కి వస్తాను అని చెప్పాడు. సాయంత్రం నాలుగున్నర కల్లా ఇల్లు సర్దడం అయిపోతే, డిన్నర్ తయారీలో పడితే తనకోసం ఎక్కువ ఎదురుచూడక్కర్లేదని పనికి ఉపక్రమించాను.
రాత్రి డిన్నర్ కి తయారుచేయాల్సిన పదార్థాలన్నీ పట్టిక వేసుకొని, ఇంట్లో అన్నీ ఉన్నాయో లేదో అని చూసుకొని, ఇక ఇల్లు సర్దడానికి ఉపక్రమించాను. ఇల్లు సర్దడం అనేది ఒక సముద్ర పయనం; దాని తీరం చేరడం చాలా కష్టం.
అన్నీ తయారు చేసి, డైనింగ్ టేబుల్ సర్దేసి, నేను కూడా ఫ్రెష్ అయ్యి, సోఫాలో కూర్చున్నాను. పొద్దున్నుండి అలసిపోయి ఉన్నానేమో, కళ్లు మూతలు పడ్డాయి. అలా పడుకున్న నాకు, "సారీ! ఆలస్యం అయ్యిందా? ఏదో ఒక పనితోనే సరిపోయింది," అన్న మా అబ్బాయి మాటలు, "హాయ్ అత్తయ్యా" అనే కోడలి పలకరింపుతో మెలకువ వచ్చింది.
కళ్లు తెరిచి చూడగానే, ఎదురుగుండా నా చిన్ని వాలెంటైన్, నా మనవడు, నోరంతా తెరిచి నవ్వుతూ నావైపు పరిగెత్తుకు వస్తున్నాడు. వాళ్ళ వెనకాలే మా మేనకోడలు, ఆమె భర్త, వాళ్ళ రెండు నెలల బాబుతో లోపలికి వచ్చారు—వాలెంటైన్ డే నాడు బోనస్ లాగా.
వాలెంటైన్ డే నాడు మన ప్రియమైన వాళ్లతో కలిసి ఆనందంగా గడపడం నిజంగా అపురూపమే కదా! హాయిగా భోజనాల మధ్య కబుర్లతో సందడిగా గడిచిపోయింది.
జీవితం ఇంతవరకు ఎన్నో ఒడిదుడుకులతో గడిచి పోయింది. ఇద్దరం చురుగ్గానే గడుపుకొచ్చాము. పిలిస్తే పలికే పెద్దకొడుకు, కోడలు, ముద్దుల మనవడు, లండన్ లో ఉన్నా, "నువ్వు గట్టిగా విజిల్ వేస్తే వచ్చేస్తాననే" చిన్నకొడుకు... ఇంకేం కావాలి? అనడమే కాదు, ఏడాదికి రెండుసార్లు వచ్చి కనీసం ఒక నెల మాతో గడుపుతాడు.
వాలెంటైన్ డే అంటే ఆత్మీయులు అనే అర్థం కూడా ఉంది. ఇంతమంది మధ్యన గడిపే రోజు అపురూప వాలెంటైన్ డే నే కదా!
సమాప్తం
వంగీపురం శశిరేఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వంగీపురం శశిరేఖ
నేను ఆదాయపన్ను శాఖలో ఇనస్పెక్టర్ గా పని చేసి విశ్రాంత జీవనం
గడుపుతున్నాను,నాకు తెలుగు భాష అంటె ఎంతో మక్కువ.టీచింగ్ అంటే కూడా చాలా
ఇష్టం.నా విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నాను. మా మనవడు
ఆరుష్ వియాన్ మా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.




Comments