top of page

వీరి మధ్యన... ఎపిసోడ్ 3

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link


'Veeri Madhyana Episode 3' New Telugu Web Series


Written By BVD Prasada Rao


రచన: బివిడి ప్రసాదరావు




బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' మూడవ భాగం


గత ఎపిసోడ్ లో...

సామ్రాట్ ని కలిసిన రమేష్, సాహసి డిగ్రీలో తన క్లాస్మేట్ అని చెబుతాడు. ఆమె చాలాపొగరుబోతని కూడా చెబుతాడు. జ్వాల అనే అపరిచిత యువతి సామ్రాట్ కి కాల్ చేసి, మాట్లాడుతూ ఉంటుంది.


ఇక వీరి మధ్యన.. మూడవ భాగం చదవండి...


"గుడ్. నౌ. నువ్వు ఓకే గా." అంది జ్వాల.

"ఆ ఆ. హండ్రడ్ పర్సంట్. చెప్పు చెప్పు. చెప్పేయ్." అన్నాడు సామ్రాట్ గమ్మున.

"ఏమిటి చెప్పేది." అడిగింది జ్వాల.


"అదేమిటి. నువ్వు చెప్పింది చేస్తే, నీ గురించి చెప్తాను అన్నావుగా." అన్నాడు సామ్రాట్.

"నో." అంది జ్వాల.

"వాట్. ఈ తిరకాసేమిటి." అన్నాడు సామ్రాట్ గోలగా.


"తిరకాసు లేదు, సర్కాస్ లేదు. నేనేమన్నాను. నా ప్రశ్నకు జవాబు ఇస్తేనే, నా గురించి చెప్పుతాను అన్నాను. గుర్తు తెచ్చుకో." చెప్పింది జ్వాల.


"సరే తల్లీ. అలాగే తగలడు." అన్నాడు సామ్రాట్ విసురుగా.

"హేయ్. మళ్లీ టెన్షన్ అవుతున్నావు. మళ్లీ నేను చెప్పిన ప్రక్రియ చేయాలి." అంది జ్వాల.


"అమ్మో. తల్లీ. నేను కూల్ గానే ఉన్నా. ఆ ప్రశ్న ఏదో అడిగేయవా. ప్లీజ్." అన్నాడు సామ్రాట్ మెల్లి మెల్లిగా.

జ్వాల మాట్లాడలేదు.


సామ్రాట్ తన ఫోన్ ని చెవి దరి నుండి ముందుకు తెచ్చుకొని దానిలోకి చూశాడు. కాల్ టైం జరుగుతుంది.


వెంటనే తిరిగి చెవి దరిన ఫోన్ పెట్టుకొని, "ప్లీజ్." అన్నాడు.

"నన్ను ప్రేమిస్తావా." ప్రశ్నించేసింది జ్వాల.


సామ్రాట్ గతుక్కుమన్నాడు.

అర నిమిషం పిమ్మట, "బోలో జీ." అంది జ్వాల.

సామ్రాట్ మాట్లాడలేక పోతున్నాడు.

"స్పృహలో ఉన్నావా. పడ్డావా." అంది జ్వాల.


అప్పటికీ జవాబు లేక పోయే సరికి, "సామ్రాట్." అంది జ్వాల కాస్తా తికమకగా.

మూడు మార్లు జ్వాల తనని పిలవగా, తేరుకుంటూ, "ఏమిటీ నీ ధోరణి. నాకు బోధ పడుట లేదు." చెప్పాడు సామ్రాట్.


"ఏముంది. డొంక తిరుగుడు లేకుండా అడిగాగా." అంది జ్వాల.

"ఏమడిగావు." సామ్రాట్ అన్నాడు విసురుగా.

"నన్ను ప్రేమించమని." చెప్పింది జ్వాల నెమ్మదిగా.

"నేను నిన్ను ప్రేమంచడం ఏమిటి. కుదరని పని." చెప్పేశాడు సామ్రాట్.


"ఎందుకు కుదరదు. నాకు నీ గురించి అంతా తెలుసు. నువ్వు నౌ 'బేచిలర్' వే గా." అంది జ్వాల.

"ఐతే, ప్రేమించేయాలా." అడిగాడు సామ్రాట్ విసురుగా.

"ఆ. నువ్వు నన్ను చూస్తే, మరో మాట ఆడవు. క్షణం ఆగక, నువ్వే, నన్ను అడిగేస్తావ్, నిన్ను ప్రేమించమని." చెప్పింది జ్వాల.

"ఏం. అంత కాన్ఫిడెన్స్ ఏమిటో. నువ్వు ఏమైనా జిగేల్ రాణివా." అన్నాడు సామ్రాట్.


"పిచ్చోడా. నాకా పోలిక ఏమిట్రా. పోటీకి వెళ్లక కానీ, నేను మిస్ యూనివర్సల్ గా తప్పక ఎంపికయ్యేదాన్ని. తెలుసా." అంది జ్వాల.

"అబ్బో. ఇలా ఫోన్ లో కాదు బడాయి. రా. ఎదురుగా రా. చెప్తాను." అన్నాడు సామ్రాట్.


"అబ్బచ్ఛా. ఆశ దోశ వడ. చాల్లే. ముందు చెప్పవోయ్." అంది జ్వాల.

"ఏం చెప్పేది." చిరాకయ్యాడు సామ్రాట్.

"నన్ను ప్రేమిస్తావా. లేదా." అంది జ్వాల.

"నో వే." అనేశాడు సామ్రాట్.


"అవునా. ఐతే, మన మధ్య ఒక ఒప్పందం మాట్లాడుకుందామా." అంది జ్వాల.

"మళ్లీ ఇదేమిటి." అన్నాడు సామ్రాట్.

"చెప్తా. ఒప్పందం కుదుర్చుకుంటావా. కాల్ కట్ చేసేయమంటావా. చెప్పు." అంది జ్వాల.


"అయ్యో. చెప్పు. చెప్పు." అన్నాడు సామ్రాట్ టకటకా.

"థట్స్ గుడ్. అలా రా దార్లోకి." అంది జ్వాల.

"చెప్పేయ్ తల్లీ. ఓపిక లేదు." అన్నాడు సామ్రాట్.


"ఒప్పందం ఏమిటంటే, నీ ఎదురుగా నేను వస్తాను. నువ్వు నన్ను చూశాక, ప్రేమించమని నువ్వు నన్ను కోరుకోవడం తథ్యం. నో డవుట్. బట్, అలా కోరుకోవడం, నా కాళ్లు పట్టుకొని కోరుకోవాలి. లేదా, ఇప్పుడే, ఈ కాల్ లోనే, చెప్పేయ్, నన్ను ప్రేమిస్తున్నానని." చెప్పింది జ్వాల.


"కుదరదు." అనేశాడు సామ్రాట్.

"ఐతే, ఎదురయ్యాక, నువ్వు నా కాళ్లు పట్టుకొని చెప్పవలసి ఉంటుంది." అంది జ్వాల.


"పోవే. 'నువ్వు నాకు అక్కర లేదు' అంటే, ఇంకా ఈ ఒప్పందాలు ఏమిటి." చిరాగ్గా అన్నాడు సామ్రాట్.

"సరే ఐతే, బిడ్డా, ఈ ఫోన్ కాల్ టార్చర్ నీకు తప్పదులే. ఇక వేళా పాళా ఉండదు. కాసుకో." అనేసింది జ్వాల.


"అమ్మో. వద్దొద్దు. సరే. అలానే కానీ." అనేశాడు సామ్రాట్.

"ప్రామిస్." అంది జ్వాల.

"దేనికి ప్రామిస్." అడిగాడు సామ్రాట్.


"నా కాళ్లు పట్టుకొని అడగడానికి." చెప్పింది జ్వాల.

"అలానా. సరే తల్లీ. ముందు దర్శనం ఇవ్వు." చెప్పాడు సామ్రాట్.

"డీల్ డన్. డేట్, టైం, వెన్యూ నీకు త్వరలో చెప్తాను. గెట్ రడీ." చెప్పి వెంటనే ఆ కాల్ కట్ చేసేసింది జ్వాల. ఉసూరమన్నాడు సామ్రాట్.

***

ఆదివారం ఉదయం పదీ పది దాటుతుండగా, కవిత వచ్చింది సాహసి ఇంటికి. సాహసికి చనువై ఉన్న ఫ్రెండ్స్ లో కవిత ఒకరు. ఇద్దరూ గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.


"ఎకాఎకీ కావడంతో నిన్ను పిలవలేక పోయాను. సారీ." అంటూ, "నిన్న నాకు పెళ్లి సంబంధం ఒకటి వచ్చింది. చూపులకై వచ్చిన వాడు ఎవరో తెలుసా." అంది కవిత.

"ఎవరేంటి." అడిగింది సాహసి.


"మరే. మన డిగ్రీమేట్ రమేష్." చెప్పింది కవిత.

"రమేష్. వీడెవడే. వీడు ఇప్పుడు నా ఉడ్బి కోలీగ్ ట కూడా." అంది సాహసి.

"అవునా." అంది కవిత.


"అది సరే. సంబంధం కుదిరిందా." అడిగింది సాహసి.

"ఆ. వాడు తీరుకు ఒప్పుకున్నాక, సెట్ అయింది." చెప్పింది కవిత.

"తీరా. ఏంటది." అంది సాహసి ఆశ్చర్యపోతూ.


"వాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయినే చేసుకుంటాడట. ఇక్కడికి వచ్చేక చెప్పాడు." చెప్పుతుంది కవిత.

అప్పుడే అడ్డై, "ముందుగా నీ బయోడేటా పంప లేదా." అడిగింది సాహసి.

"లేదు." చెప్పింది కవిత.


"అవునా. ఐనా ఈ సంబంధం నీకు ఎలా వచ్చింది." అడిగింది సాహసి.

"మా డాడీ ఎప్పుడో తన ఫ్రెండ్ వద్ద నా సంబంధాలకై కదిపితే, ఆయన సడన్ గా కబురు పెట్టి, పెళ్లి వాళ్లను ఎకాఎకీన తోడ్చుకు వచ్చేశాడు." చెప్పింది కవిత.


"బాగుంది. ఇంతకీ ఎలా సంబంధం కుదిరింది. నీది టీచర్ జాబ్ గా మరి." అంది సాహసి.

"అది తెలిశాక, రమేష్ కాస్తా ఇబ్బంది పడ్డాడు. డిగ్రీ చేస్తున్న రోజుల్లో నేను తనకి బాగా నచ్చానని చెప్పుతూ, నన్ను కన్వెన్స్ చేసి ఒప్పించేశాడు." చెప్పింది కవిత.

"అదేంటే. ఎలా." మరింత ఆశ్చర్యపోతూ అడిగింది సాహసి.


"నీకు గుర్తు ఉందా, డిగ్రీ రోజుల్లో, డాడీ పోరు పడలేక, ఆయన ఫ్రెండ్ అల్లుడు కొత్తగా ఇన్స్టిట్యూట్ పెట్టాడని, నన్ను కంప్యూటర్స్ కోర్సులో చేర్పించారుగా. అప్పుడు వీడూ అక్కడే చేరి ఉండడంతో, అది గుర్తు చేసి, 'ఆ సర్టిఫికేట్స్ చాలు' అన్నాడు. వాటితో తనే నాకు జాబ్ చూసి పెడతానని చెప్పాడు. అంతే. మా వాళ్లు గమ్మున ఒప్పేసుకున్నారు." చెప్పడం ఆపింది కవిత.


"సరి సరి." అంది సాహసి.

"పైగా ఇక్కడ నేను చేస్తుంది ప్రయివేట్ స్కూలులో కదా. 'ఉఫ్ అంటే ఊడే ఈ జాబ్ మరియు కక్కుర్తిలా పొందే దాని జీతం ఎందుకు' అని కూడా చెప్పడంతో, మా వాళ్లు నా మీద ఒత్తిడి మోపారు. తప్పుతుందా. నేను సరే అనేశాను." చెప్పింది కవిత.

సాహసి మాట్లాడలేదు.


"ఏ మాటకు ఆ మాట కానీ, రమేష్ మాట తీరు బాగుందే. అప్పటిలో ఏమో అనుకున్నాను కానీ, పైగా నీ భయంతో కో బోయ్ స్టూడెంట్స్ ను పట్టించుకోలేదు కానీ, వీడు జమ్మే." చెప్పింది కవిత ఆనందపడిపోతూ.

"సరే కానీ, నాతో భయం ఏంటే." అడిగింది సాహసి.


"కాదా మరి. నువ్వా బోయ్స్ ను ఆమడ దూరం పెట్టే దానివి. నీతో తిరిగే నాకు ఎవరూ దరి చేరేదే లేదు." చెప్పింది కవిత.

సాహసి విస్మయమయ్యింది. కవితనే చూస్తూ ఉంది.

"ఏంటా చూపు. నేను చెప్పింది తప్పా." అంది కవిత.


"అప్పుడు నిన్ను నేనేమీ కట్టి పడేయలేదుగా. నిజానికి నా పద్ధతి నచ్చే నువ్వు నాతో తిరుగుతున్నావని భావించాను తెలుసా." సాహసి అనేసింది రోషంగా.


"కూల్ య. నీతో తిరగడం వల్లే, ముఖ్యంగా మా ఇంట్లో నాకు మంచి నేమ్ వచ్చింది. డోన్ట్ థింక్ అదర్వైజ్. సారీ. ప్లీజ్. యూ ఆర్ మై బెస్ట్ గైడ్." సాహసి చేతులు పట్టుకుంటూ చెప్పింది కవిత.


సాహసి ఏమీ మాట్లాడ లేదు. చిన్నగా నవ్వేసింది మాత్రం.

పిమ్మట ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అయ్యేక, కవిత తనింటికి బయలు దేరింది.

***

సోమవారం నాడు, టీ బ్రేక్ సమాయన, సామ్రాట్ ను కలిశాడు రమేష్.

ఇద్దరూ టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు.


"అన్నా. నేనూ వరంగల్ ఇంటి అల్లుడ్నే కాబోతున్నాను." చెప్పాడు రమేష్.

"ఈజిట్." అన్నాడు సామ్రాట్.

"య. మరో కోయిన్సైడ్ విషయం చెప్పనా. నీ ఉడ్బి ఫ్రెండే నా ఉడ్బి." చెప్పాడు రమేష్.


"వావా. నిజమా." అన్నాడు సామ్రాట్.

"మరే." అనేశాడు రమేష్,

"తను సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉందా." అడిగాడు సామ్రాట్.

"అబ్బే." అన్నాడు రమేష్.


"అవునా. నువ్వు కోరుకున్నది కాలేదన్న మాట. కాంప్రమైజ్ అయ్యి పోయావా." అడిగాడు సామ్రాట్ చిత్రంగా.

"లేదు లేదు." అన్నాడు రమేష్,

"మరి." అడిగాడు సామ్రాట్.


"నిజానికి తను టీచర్ జాబ్ లో ఉంది. బట్, లక్కీగా ఆమె నాతో పాటు డిగ్రీలో ఉండగా కంప్యూటర్ కోర్సులు చేసింది నాలా. సో, ప్రస్తుత తన జాబ్ ను వదిలేయ మన్నాను. నేను సాఫ్ట్వేర్ జాబ్ చూసి పెడతానన్నాను. తను సమ్మతించింది. సో, ఈ సంబంధం కుదిరి పోయింది." చెప్పాడు రమేష్,

"భలే. బాగుంది. కంగ్రాట్స్." అన్నాడు సామ్రాట్ చేయి చాస్తూ.


ఆ చెయ్యిను అందుకొని, "థాంక్స్." చెప్పి, "మన హెచ్ఆర్ ని కాకా పట్టి, తనని తొలుత నా టీం లోకి తెచ్చుకుంటాను." రమేష్ చెప్పాడు.

సామ్రాట్ చిన్నగా నవ్వేసి ఊరుకున్నాడు.


"ఇద్దరం ఒకే చోట ఉంటే, రెండు జీతాలే కాదు, ఉమ్మడి ఖర్చులతో వ్యయం కూడా తగ్గక పోదు. ఏమంటావన్నా." అన్నాడు రమేష్,

"అంతెంతే." అనేశాడు సామ్రాట్.


"అన్నట్టు, నా ఉడ్బి తో నేను, వాళ్లింటి పెరటిలో కూర్చుని మాట్లాడు తున్నప్పుడు, నీ ఉడ్బి ప్రస్తావన వచ్చింది." చెప్పాడు రమేష్.

'ఏంటి.' 'ఎందుకు.' 'ఎలా'. అన్నవి ఏమీ అడక్క, రమేష్ నే చూస్తూ ఉండి పోయాడు సామ్రాట్.


"సాహసి మూలగానే తను బోయ్స్ తో చనువుగా మెసల లేక పోయేదని నా ఉడ్బి వాపోయింది. అలా నన్ను కాదనుకుందట." చెప్పుతున్నాడు రమేష్,

అడ్డై, "నీ ఉడ్బి పేరు తెలుసుకోవచ్చా." అడిగాడు సామ్రాట్.


"కవిత." అంటూ, "సాహసి తను తినక, పక్క వాళ్లను కూడా తిననీయని పిండంలా ఉందన్నా. కాస్తా జాగ్రత్త." అనేశాడు రమేష్.

సామ్రాట్ తననే చూస్తుండడంతో, "తప్పుగా వ్యాఖ్యానించేశానా. నొచ్చుకుంటున్నావా." అడిగాడు రమేష్ జంకుగా.

"అబ్బే. ఏమీ లేదు." అనగలిగాడు సామ్రాట్.

ఇద్దరూ తిరిగి తమ తమ పనులకై కదిలి పోయారు.

***

రాత్రి తొమ్మిది దాటుతుంది. సామ్రాట్, సాహసిల ఫోన్ సంభాషణ కొనసాగుతుంది.

రమేష్ ముచ్చట్లు చెప్పి, "ఏంటి. నీ ఫ్రెండ్ కవితను కూడా నీలాగే మల్చేసుకున్నావట." అన్నాడు సామ్రాట్.

"ఎవరన్నారు." టక్కున అడిగింది సాహసి.


"రమేష్ తో కవితే సుమారుగా అలానే అందట." చెప్పాడు సామ్రాట్.

"బాగుంది. అదేం చిన్న పిల్లా. ఎందుకో ఇప్పుడు ఈ బడాయ్. సర్లే. నువ్వు ఏమన్నావు." అంది సాహసి.


"ఏమీ అనలేదు కానీ, నీ ఎటిట్యూడ్ నాకు నచ్చిందని ఈ సందర్భంన మరో మారు చెప్పుతున్నాను." చెప్పాడు సామ్రాట్.

"థాంక్యూ. నన్ను నువ్వు అర్థం చేసుకుంటున్నావు." అంది సాహసి.

"కుంటున్నావు ఏంటి. అల్రడీ చేసేసుకున్నాను." అన్నాడు సామ్రాట్.

సాహసి మరోసారి," థాంక్స్" చెప్పింది.


"వెల్కం డియర్. వాట్ నెక్స్ట్." అన్నాడు సామ్రాట్ సరదాగా.

"వాట్ నెక్స్ట్." సాహసి అంది.

ఇద్దరూ నవ్వుకున్నారు.


"అన్నట్టు, ఆ కవిత నిన్ను కలిస్తే, ఈ కబుర్లు ఏమీ అడక్కు." చెప్పాడు సామ్రాట్.

"అయ్యో. అది నన్ను కలవడం. ఇంచు మించుగా ఇలానే నాతో అనడం, దానికి దానిని నేను నిలతీయడం, దాంతో అది నాకు 'సారీ' చెప్పడం జరిగి పోయాయి. ఛ. అది ఇంత నంగిరిది అనుకోలేదు." చెప్పింది సాహసి.


"అవునా." అనేశాడు సామ్రాట్.

"చాల్లిద్దాం వీళ్ల కబుర్లు." అనేసింది సాహసి.

"ఓకే డార్లింగ్." అన్నాడు సామ్రాట్. అతడు నవ్వుకుంటున్నాడు.

"చెప్పు." అంది సాహసి.

"ఎందుకు." అడిగాడు సామ్రాట్.

"ఏంటి." అంది సాహసి.


"చెప్పు అడిగావుగా. అదే ఎందుకు అనడుగుతున్నాను." చెప్పాడు సామ్రాట్ హాస్యంగా.

"అబ్బో. నీలో ఈ యాంగిల్ ఉందా." అంది సాహసి. తనూ నవ్వుకుంటుంది.

"అబ్బే. ఏదో సరదాకి. సరసం." అన్నాడు సామ్రాట్.


"అఅ. ఏంటి బాబూ. సరసమా. అహా. రా. రా. అన్నీ బయటికి రానీ." అంది సాహసి చిత్రంగా.

తడబడ్డాడు సామ్రాట్.

సామ్రాట్ వైపు నుండి మాటలు రాకపోవడంతో, "నాకు హేఫీ అవుతుంది." చెప్పింది సాహసి.

***

(కొనసాగుతుంది..)

***

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


322 views0 comments
bottom of page