top of page

అందం కాదు గుణం ముఖ్యం


'Andam Kadu Gunam Mukhyam' - New Telugu Story Written By Penumaka Vasantha Published In manatelugukathalu.com On 11/10/2023

'అందం కాదు గుణం ముఖ్యం' తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత

"అమ్మా! నాతోపాటు, చదువుకున్న, దివ్యను పెళ్లి చేసుకుంటా”నన్న వినయ్ తో "వద్దురా!" అంది విజయ.

"అదేంటి! ఎందుకనీ!" అన్న వినయ్ తో,

"వద్దూ అన్నా, అంతే! తల్లితండ్రులకు, మాకు తెల్సులే కానీ మేము చెప్పినట్లు వినీ, మేము చెప్పిన అమ్మాయిని చేసుకో!? సుఖపడతావు. "

"అమ్మా! దివ్య మనసు చాలా మంచిదమ్మా! ప్లీజ్, కాదనకు."

"వినయ్! ఆ దివ్యను నేను చూశాలేరా! ఆ డ్రెస్సులు ఏంటి? ఆ జుట్టు విరబోసుకోవటం ఏంటి? నాకు నచ్చలేదు. "

“అక్క కూడా! వేసుకుంటుందిగా అమ్మా! డ్రస్సులు. "

"అక్కకూ దానికీ పోలికరా? అక్కను ఇపుడు చూడూ పో, అత్తవారింట్లో, చీరకట్టుకునీ ఎంత పద్దతి గా ఉందో!? ఇంకేమి మాట్లాడకు”, రమేష్, మాలతిల, ఒక్కగానొక్క కూతురు, చీర కట్టుకున్న మనీషా ఫోటో చూపించి, “అందముగా కళకళలాడుతు ఈ పిల్ల లక్ష్మీదేవి లాగా ఉంది కదూ!" అంది.

అమ్మకూచిగా పెరిగిన, వినయ్, అమ్మ సెలక్షన్ ఎపుడూ బావుంటుందనే అభిప్రాయంలో ఉండే వినయ్, మనీషాను పెళ్లి చేసుకుంటాడు.


బాగా డబ్బున్నపిల్ల కావటం వల్ల, మనీషాకూ చాలా, పొగరు. అత్తవారింట్లో మొదట్లో చీరలు, సొమ్ములు పెట్టుకుని తిరుగుతుంటే, "లక్ష్మీ దేవి లాగా కళకళలాడి పోతున్నది... నా కోడ”లంటూ రోజూ దిష్టి తీసేది కోడలుకు, విజయ.


కొన్నాళ్ళు అత్తగారింట్లో బాగానే ఉంది.


వినయ్ తో, మనీషా. "మనం మీ ఇంట్లో వద్దూ! మా ఇంటికి వెళ్దాము. ఇక్కడ పెద్దగా సౌకర్యాలేమి లేవూ ప్లీజ్ వినయ్”.


"సరే! కొన్నిరోజులు, ఉండి వస్తే పోతుందనీ! కొత్తమోజులో "సరే! నీ ఇష్ట”మన్నాడు వినయ్.


విజయ కూడా "కొన్నాల్లుండి రండ”నీ!పంపింది, కొడుకు, కొడల్నీ, వియ్యలవారింటికి.

నెలయిన తర్వాత, వర్క్ ఫ్రం హోం చేస్తున్న వినయ్, “ఇక మనింటికి వెళ్దామా? ఆఫీసుకు రమ్మన్నారు, నన్నూ!" అన్నాడు, మనీషాతో!


"నో, డాడీ ఇక్కడ, నీకు ఉద్యోగం చూడమంటే చూస్తారు. ఇక్కడే ఉండొచ్చుగా మనమూ”.

"నో! నేను చేసే కంపెనీ, మంచిది. దాన్ని వదలను. నువ్వు, కావాలంటే కొన్నాళ్ళు ఉండిరా !" అన్నాడు వినయ్.


ఎందుకో మనీషా వాళ్ల ఇంట్లో అందరూ మేము చాలా, ఉన్నవాళ్ళమన్న ఫీలింగ్లో ఒక పద్దతి, పాడు లేకుండా ఉన్నారనిపించింది వినయ్ కు.

విజయ, తెల్లవారేటప్పటికి, పూజా, టిఫిన్, సిస్టమాటిక్, గా ఉంటుంది. ప్రతి నిముషం, తిన్నారా, లేదా! అనీ! పట్టించుకుంటుంది. ఇవేమి, మాలతి వాళ్ళింట్లో లేవూ, లేటుగా లేవటం, ఏదో తింటం, షాపింగ్లు సినిమాలకి, తిరగటం.


విజయకూ మనీషా అలవాట్లు చెప్పాడు.


"ఫస్ట్ లో ఆడపిల్లలు, అలానే ఉంటారు. తర్వాత పిల్లలు పుడితే, వాళ్ళే మారుతారులే!”అంది విజయ.


"నో అమ్మా! మనీషానీ, చూస్తే మారేది లాగా లేదు. "

"అయ్యో! ఇలా, జరుగుతుందని కలలో కూడా, అనుకోలేదురా" అంది విజయ.

"అందుకే, అమ్మా! డ్రెస్సుల బట్టి, మనుషుల్నీ అంచనా, వేయకూడ”దన్నాడు వినయ్.


వినయ్, కాల్ చేసాడు, మనీషాకు, "చాలా రోజు లున్నావు కదా ఇక ఇంటికి రా!" అని.


"లేదు వినయ్, నువ్వే రావచ్చుగా! నేనిక్కడ జిమ్ లో జాయినయ్యాను. నువ్వొస్తే, కపుల్సుకు డిస్కౌంట్ ఇస్తామన్నారు, ప్లీజ్ రావొచ్చుగా! నువ్వే!" అంది.


"నేను ఇక్కడ ఆఫీసుకు రెగ్యులరుగా వెళ్తున్నా నిన్నటినుండి, నువ్వే రా!" అని ఫోన్, పెట్టేసాడు.


మనీషా, వచ్చినా ఇంట్లో ఈ రెగ్యులర్ పనులు చేయాలంటే, బద్దకముగా ఉండేది. రోజు, వినయ్ ఆఫీసుకు వెళ్లేప్పుడు, లేస్తుంది.


"కొంచం ముందు, లేవొచ్చుగా!” అంటే, "నాకలవాటు లేదూ వినయ్!" ముద్దుగా అనేసరికి, "తర్వాతయినా అమ్మకు కొంచం పనిలో హెల్ప్ చేయి" అన్న వినయ్ తో సరేనని తలవూపింది మనీషా.


రోజులు గడుస్తున్నా, మనీషా, వినయ్ ఇంటి వాతా వరణానికి అలవాటు, పడటం లేదు. పండగకు, ఇద్దరూ మనీషా ఇంటికి వస్తారు. "ఇక్కడ జాబ్ చూస్తాను, మీరు ఇక్కడే వుండొచ్చుగా! ఉండలేకపోతే, అమెరికా, వెళ్ళండి" అన్నాడు మనీషా నాన్న రమేష్.

"పుట్టి పెరిగిన మా ఊరిలో జాబ్ చేస్తూ, మా ఇంటిలో వుండటం నాకు ఇష్ట”మన్నాడు వినయ్.


పండుగయిపోయి, వినయ్, లీవ్ లేదని బయలుదేరుతుంటే, "మనీషా! నువ్వు రావటం లేదా!" అంటే, "నేను ఇంకొన్ని రోజులు ఉండి వస్తా”నంది మనీషా.


వినయ్, ఇంటికొచ్చి, విజయతో అన్నాడు "అమ్మా! మనీషా, మనకు సూటు కాదనుకుంటున్నా. "


"అదేంటి రా పెళ్లయి... ఏడాది కూడా అవ్వలేదు, అపుడే, అలా అనుకోకురా! నాకు పెళ్ళైన, కొత్తలో, అత్తవారింట్లో, అలాగే, ఉండేది. వస్తుందిలే, మనీషా, లేదా, అక్కడికి కొన్నాళ్ళు, నువ్వెళ్లు" అంది, విజయ.


"లేదమ్మా! అక్కడి వాతావరణంలో నేను ఇమడలేను, టైం కి ఏవి జరగవు, నేవెళ్ళను. "


ఆ తర్వాత, విజయకు, ఒంట్లో, బాగాలేక, హాస్పిటల్లో జాయిన్ చేశారు. షుగరెక్కువై, కళ్ళు తిరిగి పడిపోయింది.


వినయ్, మనీషాకు, కాల్ చేసాడు, అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేసాము, ఇంటికి రమ్మని.


"నో వినయ్, , ఇక్కడ, మా అమ్మకు కూడా నిన్నటినుండి జ్వరం, తగ్గగానే వస్తా”నని పెట్టేసింది.


ఇంట్లో, శుభకార్యాలకు వచ్చి వంటచేసే లక్ష్మి వచ్చి, వంటచేసి వెళ్తుంది. నీరసంగా వుండటంవల్ల, నాల్గు రోజులు హాస్పిటల్లో వుంచి, విజయను, ఇంటికి తెచ్చారు. వినయ్, ఈ నెల లక్ష్మిని వచ్చి వంటచేసి పెట్టమన్నాడు. లక్ష్మికి ఇంకేవో గుళ్ళో వంటలు, వుండటం వల్ల, వాళ్ల అమ్మాయి, మమత, వచ్చి, వంటచేసేది.


మమత డిగ్రీ, ప్రైవేటుగా చదువుతుంది. పొద్దున వచ్చి వంట చేసి, వెళ్తుంది. మంచి అమ్మాయి. వినయ అక్క సుజిత, తన డ్రెస్సులు ఇస్తూవుంటుంది మమతకు. అలా వాళ్ళింట్లో, కలిసిపోయి, తిరుగుతుంటుంది. ఇక అప్పటినుండి, విజయ వద్దంటున్నా వంటకు రమ్మని లక్ష్మికి చెప్పాడు వినయ్.


ఒక వారం అగి కాల్ చేసింద, మనీషా, "అత్తయ్య గారికి, ఎలా ఉంది. నేను ఇవాళ బయలుదేరి వస్తున్నా”నంది.


"అయ్యో! పర్లేదు, మీకేవో, కిట్టీ, పార్టీలున్నాయిగా! అవి చూసుకో” కోపంగా, ఫోన్ కట్చేసాడు వినయ్.


'ఫేస్బుకులో చూసినట్లున్నాడు, మా కిట్టిపార్టి, ఫొటో’సనుకుని ఆరోజు బయలుదేరి వచ్చింది మనీషా, వినయ్ దగ్గరికి.


వచ్చినా, ముభావంగా వున్నాడు వినయ్, మనిషాతో.


"ఏంటి వినయ్, నామీద కోపమా! మా డాడీ, నువ్వు ఆఫీస్ కెళ్ళటానికి, కారు బుక్ చేసారు. వచ్చేవారం, ఇక్కడికే, డెలివరీ వస్తుం”దని చెప్పింది.

"సారీ! నాకు కారుంది. మళ్ళీ, ఇపుడు నాకు కారు అవసరం, లేదు. మీ నాన్నగారికి చెప్పు, నాకు కారు వద్దని" అన్నాడు.



"ఏంటి వినయ్, ఎవరైనా మా అత్తగారు వాళ్ళు నాకు కారు ఇచ్చారని, గర్వంగా చెప్పుకుంటారు. నీకేంటి వాళ్ళు ఇస్తున్నా తీసుకోవటానికి, ఇంత ఇగో” అంది కోపముగా మనీషా.


"నాకు కారు, మీ, ఇల్లు, ఇవేమి అక్కరలేదు, నా కవసరానికి, అన్నివిధాల తోడ్పడే భార్య, కావాలనుకున్నా, కానీ! మీఆస్తి, చూసికాదు నిన్ను, పెళ్లి చేసుకుం”దన్నాడు.


ఇలా! ఏదొకదానికి, ఇద్దరు గొడవపడతున్నారు, వినయ్, మనీషాలు.


“మానాన్న, నీకు బాడ్ హ్యాబిట్స్, లేవు, మంచి ఫ్యామిలనీ నేను వద్దంటున్నా, ఇచ్చి చేసాడు. కానీ దేనికి, కల్సిపోలేని, నువ్వూ నాకొద్దు. నువ్వూ!, నేను కావాలంటే, మా ఇంటికి రా ! నేను వెళ్తున్నా”నని వెళ్ళింది మనీషా, విజయ ఎంత వద్దంటున్నా వినకుండా.


విజయ, మనీషాను వెళ్లి తీసుకుని రమ్మంది వినయ్ ను.

"సారీ అమ్మా, కాపురం కావాలనుకుంటే అదే వస్తుంది. లేదా ఈ విషయం ఇక్కడితో వదిలేయనీ" విసుగ్గా అన్నాడు వినయ్.


మనీషా రాలేదు, డివోర్స్ కావాలని, అడిగితే వినయ్ అందుకు, ఒప్పుకున్నాడు. విజయ, ఎంత చెప్పినా, ! వినయ్, ఒప్పుకోలేదు మనీషాతో, కలిసి వుండేందుకు.


రెండేళ్లు, గడుస్తున్నా, వినయ్ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. రోజూ వినయ్ కు బాక్స్ ఇచ్చి, వంట చేసి, కూరలు బల్ల మీద, సర్ది వెళ్తుంది, మమత.


ఆరోజు, ఈవెనింగ్ వంటచేసి వెళ్తున్న మమతను, లేటైందని ఇంటి దగ్గర దింపి రమ్మని, పంపుతుంది, విజయ.


కారులో కూర్చున్నాక! "వినయ్ గారు, మీఆఫీసులో ఏదన్నా!? జాబుంటే, చెప్పరూ! అప్లయ్ చేస్తా”నంది మమత.


"ప్రస్తుతం ఖాళీలు, లేవూ! ఉంటే చెపుతా”నన్నాడు వినయ్. లక్ష్మి ఒకరోజు, మమతకు సంబంధాలు చూస్తున్నా, పెళ్లి చెయ్యటానికనీ, విజయతో చెప్పింది.

విజయ వెంటెనే, వినయ్ కు ఎట్లా వుంటుందని, వాళ్ల ఆయన్ను, అడిగింది.


"మమతకేం, బంగారం, ఈసారి నువ్వు, వాడికీ, నచ్చితేనే చెయ్యి. పోయినసారిలాగా, వాడికిష్టం లేకుండా చేయవా”కన్నాడు శివరావు.


వినయ్ కు చెప్పింది, మమత గురించి విజయ.

"ఇంకా, కొన్నాళ్ళు, ఆగుదామనుకుంటున్నాను", అన్నాడు.

"లేదురా! లక్ష్మి, మమతకు, పెళ్లి చేయాలని చూస్తుంది, నీకు, ఇష్టమైతే, మాట్లాడుతా" అంది విజయ.


"సరేకానీ, నేనొకసారి! మమతతో మాట్లాడాలి" అన్నాడు.


విజయ, లక్ష్మి తో, “నువ్వు కాణి, కట్నం ఇవ్వకుండా, మీ మమతను మా వినయ్ కు ఇస్తే, చేసుకుంటాము. పెళ్లి ఖర్చులు కూడా మావే” అంది.


ఉన్న ఇల్లు అమ్మి మమత, పెళ్లి చేద్దామనుకున్న లక్ష్మికి, విజయ, ఇలా అడగటంతో ఆనంద పడింది. "మిమ్ముల్ని ఎన్నో యేళ్ల నుండి, చూస్తున్నాను, మీలాంటివారు, మా మమతను ఇవ్వమని అడగటం మా అదృష్టం" అంది.


మమతను కలిసి, మాట్లాడాడు, వినయ్.


“నాకిది రెండో పెళ్లి, పర్లేదా” అంటే, “నాకిష్టమే, మిమ్మలని, పెళ్లి చేసుకోవటం, కానీ" అంది.

"ఏమిటి" అడిగిన వినయ్ తో, "మా తమ్ముడికి ఉద్యోగం వచ్చేవరకు, నేను జాబ్ చేస్తానంది.


"మీ తమ్ముడికి ఉద్యోగం వచ్చేవరకు, మిమ్మలని చూసుకునే, బాధ్యత, నాది. నాదగ్గర, నువ్వు ఉద్యోగం చేస్త, చాల”న్నాడు, వినయ్.


"ఏ! ఉద్యోగమది" అన్న మమతతో, "భార్య, అనే పోస్ట”న్నాడు. నవ్వుతూ, తలూపింది మమత.


మమత, తమ్ముడికి ఉద్యోగం చూసే మమతను, పెళ్లి చేసుకున్నాడు వినయ్. మమత, వినయ్, లు సంతోషంగా ఉండటం చూసి, విజయ, శివరావులు, ఆనందపడ్డారు.

***

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

https://www.manatelugukathalu.com/profile/vasantha/profile

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.



59 views0 comments
bottom of page