top of page

దక్షిణ దేశ యాత్ర మూడవ భాగం


'Dakshina Desa Yathra - 3' New Telugu Web Series

దక్షిణ దేశ యాత్ర మూడవ భాగం

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఇక మూడవ భాగం చదవండి...


ఫళని: ఈ క్షేత్రం దిండిగల్‌ జిల్లా లోని మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆరు స్వామి క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ స్వామి వారిని దండాయుదపాణి అనే నామంతో పిలుస్తారు. ఈయనను ఫళనిమురుగా యని కూడా పిలుస్తారు. జ్ఞానఫలాన్ని ఇచ్చే వాడు కనుక ఫళనిస్వామి అయ్యాడు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది.


స్వామి ఒక చేతిలో దండం పట్టుకుని, కౌపీనధారియై, వ్యుప్తకేశుడై నిలబడి, చిరునవ్వు లొలికిస్తూ ఉంటారు. దానికి అర్థం "నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో"- అని మనకి సందేశం ఇస్తున్నారు. అంటే ఫళని క్షేత్రం జ్ఞానము ను ఇచ్చే క్షేత్రము.


స్వామి వారు కొండ పైన ఉన్నారు. చేరుకోవాలంటే రెండు మార్గాలు. ఒకటి కాలినడకన మెట్లు ఎక్కడం. రెండు- రోప్‌వే మీద రైలు.

---------------

సుఛీంద్రము: నేరాన్ని ఋజువు చేసే శుచీంద్ర శివుడు.

కన్యాకుమారి కి కేవలం 13 కి. మీ. ల దూరంలో ఈ ఆలయం కలదు. స్వయంభూ వెలసిన లింగ స్వరూపుడు. లింగం అడుగున బ్రహ్మ, మధ్యన విష్ణువు, పైన శివుడు ఉంటారు. శుచీద్రం దత్తాత్రేయ క్షేత్రం గా ప్రసిద్ది చెందినది.


శంకర భగవత్పాదులు పరమశివుని తాండవ నృత్యాన్ని ప్రత్యక్షంగా ఇక్కడ చూశారట. పరమ శివులు ఆదిశంకరుల వారికి ప్రణవ మంత్రాన్ని ఉపదేశించిన స్థలం. దేవేంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుకే ' శుచీద్రం' అని పేరొచ్చింది.


రామేశ్వరము: ఈ దేవాలయం ద్వీపము లో కలదు. భారతదేశం లోని ఆలయాలన్నింటి కంటే విశాలమైన ఆవరణ కలిగియుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.

12 వ శతాబ్ది లో విస్తరించబడింది.


ఈ పట్టణం ప్రదాన భూబాగం నుండి పంబన్‌ కాలువ ద్వారా వేరుచేయబడింది. శ్రీరాముడు నిర్మంచిన సేతువు ఇక్కడ ఉంది. లంకకు సముద్రమార్గము ఇదే. రావణాసురుని నిహతుని చేశాక రామనాథేశ్వర లింగం ఇక్కడ శ్రీరాములవారు ప్రతిష్టించారు. ఈ ప్రదేశము ప్రఖ్యాత తీర్థస్థలి యే కాకుండా ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం.


కాశీ కి వెళ్ళిన వారు అక్కడి గంగను తీసుకు వచ్చి ఇక్కడ అభిషేకం చేస్తారు. మళ్ళీ ఇక్కడి ఇసుకను తీసుకు వెళ్ళి అక్కడ గంగ లో కలుపుతారు. ఇక్కడ శివ లింగం

సైకతం. ' ఇక్కడ సముద్ర కెరటాలు, పక్షులు, బంగారు రంగులో మెరిసిపోయే ఇసుక తిన్నెలు, చిన్నచిన్న అంగళ్ళు, గవ్వలతో చేసిన వస్తువులు, గుర్రపుబళ్ళు, నీలిరంగులో మైమరపించే సముద్రము.. ఎన్నాళ్ళు చూసినా తనివితీరని తీరదు. చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కోటితీర్థాలు, రామపాదాలు, దనుష్కోటి, విభీష

ణాలయం మొదలగునవి చాలా ఉన్నాయి.

ఈ ఆలయం లోని పెద్దభాగమైన నడవా లేక గర్భగుడి తరువాత ఉన్న ప్రాకారం 1219 అడుగులు 3. 6 మీటర్ల ఎత్తైన వైభవంగా అలంకరించబడి తగిన విధంగా

స్థాపించబడిన స్తంభాలతో నిర్మించిన నిర్మాణం.


ఈ నిర్మాణం ఏ అడ్డంకులూ లేని 230 మీటర్ల పొడవు వుంటుంది. చోళ, జాఫ్నా, పాండ్య, విజయనగర మరియు నాయక రాజులు పాలించిరి. అభివృద్ది పరిచిరి. ఇచ్చట స్వామి తన భార్య పర్వతవర్ధిని అమ్మన్‌ తో కలిసి మొదటి ప్రాకారము లో దర్శనమిస్తారు.


సేతుపురాణ గ్రంథ ప్రకారము, రామేశ్వరం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా 64 తీర్థాలు ఉన్నాయి. వాటిలో ఇరవై రెండు తీర్థాలు ఆలయం ప్రాంగణం లో ఉన్నాయి. ప్రస్తుతం

పదకొండు తీర్థాల్లోనే పవిత్ర స్నానము చేయు చున్నారు. వెళ్ళిన వాళ్ళలో దాదాపు అందరమూ చేశాము. చాలా చోట్ల దర్శనమునకే ప్రాధాన్యత నిచ్చాము. అభిషేకాలు కూడా అందరమూ స్వామి సన్నిధిలో చేయించుకున్నాము.

మావరకైతే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం, అభిషేకలతో సహితము మావి పూర్తి అయినవి.


గమనిక. చాలావరకూ దేవాసయాల గురించి క్లుప్తంగా, సంక్షిప్తంగా వివరిస్తున్నాను. అవగాహన గురించి.. చూసి తరించవలసినదే. చూస్తున కొద్దీ చూడాలనిపించే

దేవళాలు, ప్రసిద్దపర్యాటక ప్రదేశాలు.

------------

కన్యాకుమారి: ఇక్కడ చూడవలసినవి.

" సూర్యోదయ- సూర్యస్తమయ దృశ్యాలు, వివేకనందరాక్‌ మెమోరియల్‌ ఫోర్ట్‌, కన్యాకుమారి అమ్మవారి దేవాలయం.


కన్యాకుమారి సముద్రపు అందాలతో పర్యాటకులను కట్టి పడేస్తుంది. బంగాళా ఖాతం, అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రము.. ఈ మూడింటి సౌందర్యాలను ఒకే చేట చూడాలంటే ఇక్కడకు రావాలి. ఇక్కడ సాయం సంధ్యలో సముద్రపు అందాలు పర్యాటకులకు మధురానుభూతులు కలిగిస్తాయి. ఉదయం సూర్యుడు బంగాళాఖాతం నుండి ఉదయించడం, సాయంత్రం అరేబియా సముద్రము లో అస్తమించడం చూడటం ఒక అద్భుతమైన ఆనందం.


అమ్మవారి ఆలయం. ఆలయం లోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్టించారని అంటారు. మూడు సముద్రాల నీరు అమ్మ వారి పాదాలు కడుగుతాయని భక్తుల

నమ్మకం. అమ్మవారు పరమశివుని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని, ఆ వివరము శివునకు తెలుపగా ఆయన అందులకు అంగీకరించెను. కానీ ఒక కన్య వలన రాక్షస రాజు మరణస్తాజని తెలుసుకున్న నారదుడు ఆ పెళ్ళిని ఆపు చేయదలచి అర్దరాత్రి సమయమున కోడి కూసినట్ల కూసి తెల్లవారైపోయిందని భ్రమింప జేసెను. బ్రహ్మీ ముహూర్తములో పెళ్ళి ముహూర్తము దాటిపోయిందని పరమశివుడు వెళ్ళలేదు.


అప్పటినుంచి అమ్మవారు అన్నపానీయాలు వదిలివేసి సన్యాసిని గా మారిపోయింది. అందుకే కన్యాకుమారి అను పేరు వచ్చినది.


వివేకానందరాక్‌మెమోరియల్‌;;; ఇది ఒక స్మారకచిహ్నం. వావతురై ప్రధాన భూబాగంలో ఐదువందల మీటర్లున్న రెండురాళ్ళలో ఒకదానిపై స్మారకచిహ్నం ఉంది. ఇది1970 లోస్వామి వివేకానంద గౌరవార్థం నిర్మితమైంది. అతను రాతిపై జ్ఞానోదయం పొందారని చెబుతారు. కన్యాకుమారీదేవీ కూడా శివుని గురించి ఇచ్చటనే భక్తితో తపస్సు చేసింది.


ధ్యానం చేసుకోవడానికి మెమోరియల్‌ హాల్‌ ఒకటి

ఉంది. సుందరమైన దృశ్యం. మూడు సముద్రాలు కలిసే లక్షద్వీప్‌ సముద్రం చుట్టూ రాళ్ళు ఉన్నాయి.


"అస్సలు ఈ ప్రయాణంలో చాలా మందిమి సీనియర్‌ సిటిజన్స్‌ మే. కానీ అందరమూ వయస్సులు మరచి హాయిగా కేరింతలు కొడుతూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా

తిరిగాము. " బీపీ, కొల్లెస్ట్రాల్‌, మధుమేహము మా దరిదాపులలోకి రాలేదు. అందరూ యువకుల మాదిరి గంతులు వేశారు. పద్యాలు, పాటలు, ఇష్టాగోష్టి గా భగవత్‌ సంబందిత ప్రసంగాలతో కాలము తెలియకుండా సాగింది. అందుకు టీమ్ కుర్రాళ్ళు ఎంతో దగ్గరుండి అందరికీ సపర్యలు చేయడంలో మన కన్నపిల్లలు కూడా వాళ్ళ ముందు తీసికట్టే. ఆ విధంగా మా టీమ్‌ కో ఆర్డినేటర్‌ సాయిరామ్ గారు పిల్లలకు మంచి తర్ఫీదు ఇచ్చారు. "ఇప్పటికి ఎనిమిది రోజుల ప్రయాణం జరిగింది. ఆదివారం మధ్యాహ్నము కన్యాకుమారి నుంచి త్రివేండ్రము బయలుదేరాము. అనగా తమిళనాడు

వదిలి పెట్టి కేరళ వైపు పయనం. తొమ్మిదవ రోజు.

పద్మనాభపురము నకు బయలు దేరాము. అనంత పద్మనాభస్వామి దర్శనము నకు.

అనంత పద్మనాభస్వామి: ఈ ఆలయం తిరువనంతపురములో కలదు. అనంత

అనగా అనంతమైన, సర్పం పై ఉండే స్వామి కాబట్టి తిరువనంతపురము అనే పేరు వచ్చినది. 108 పవిత్ర విష్ణుదేవాలయీలలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ దేవా

లయం లో పూజలు అందుకునే స్వామి విష్ణుమూర్తి, పాము పడగలపై పవళిస్తూ ఉంటారు. ఈ దేవాలయం ప్రసిద్ద కోనేరు -పద్మపాదానికి దగ్గరలో ఉంటుంది.


విగ్రహం- ఈ స్వామి విగ్రహం యొక్క కూర్పు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలీ. ఇది 12008 సాలగ్రామాలతో రూపొందించబడినది. వీటిని నేపాల్‌లోని గంఢకీ నదీతీరం

నుంచి తీసుకొచ్చారు. గర్భగుడి ఒక రాతి పలకపై ఉంటుంది. ప్రధానవిగ్రహం 18 అడుగుల ఎత్తు ఉంటుంది. మూడు విభిన్న ద్వారాల ద్వారా స్వామిని వీక్షించాము.

తల మరియు ఛాతీని ప్రధాన ద్వారం ద్వారా చూడవచ్చు. తలను రెండో ద్వారం ద్వారా మరియు పాదాలని మూడో ద్వారం ద్వారా చూడవచ్చు. సంప్రదాయ దుస్తుల

తోనే ఆలయ ప్రవేశం. మగవారు దోవతీ, ఆడవారు చీరకట్టుకోవాలీ. ఈ ఆచారాన్నిచాలా కట్టుదిట్టంగా పాటిస్తారు.

దర్శనం దగ్గర మాత్రం చాలా చీకటిగా ఉంటుంది. తక్కువ వెలుతురు. వరుసక్రమాలు లేవు. అంతా మాబ్‌ క్రింద తయారవుతుంది. ఓ రెండువందల మందికి ఒకే సారి దర్శనం కు వస్తారు. స్వామి దర్శనం దగ్గర మాత్రం బాగా రద్దీగా ఉంటుంది. చాలా చాలా అసౌకర్యానికి గురి అయ్యాము. మన దగ్గరలా కాక దర్శన సమయాలు

చాలా విచిత్రంగా ఉంటాయి. దేవాలయం యెక్క ధ్వజస్తంభం 80 అడుగుల ఎత్తు ఉంటుంది.


ఇక్కడ భక్తుల మదిని దోచే అనేక నిర్మాణాలు, శిల్పాలు, దేవతా విగ్రహాలు కలవు. తూర్పువైపు నుంచి గర్భగుడిలోకి వెళ్ళే నడవా( కారిడార్‌) విశాలమైనది. అద్భుతముగా చెక్క

బడ్డ 365 కు పైగా గ్రానైట్‌ రాతి స్తంభాలుంటాయి.


ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయ నేలమాళిగళ్ళో ఆరు రహస్య గదులు ఉన్నాయి. వీటిలో రాశుల కొద్ది బంగారు, వజ్రవైఢూర్యాలు, స్వర్ణ

విగ్రహాలు కనుగొన్నారు. కొన్ని లక్షలకోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు. ఈ ఆలయ భాద్యత మళ్ళీ తిరిగి ట్రావెన్కూరు రాజ కుటుంబనికి అప్పగించమని

సుప్రీంకేర్టు ఆదేశించింది.


ఇక్కడ నుండి గురువయ్యూరు బయలుదేరాము. మార్గమధ్యములోనే ' కలాఢీ' కలదు. ఆదిశంకరులు జన్మించిన స్థలము. సనాతన ధర్మాన్ని సమున్నత స్థానాని

కి నిలిపిన మహానీయుడు.

కలాడీ: పూర్ణానదీ తీరమున ఈ గ్రామము కలదు.

ఒక దినము స్నానము నకు తల్లి పూర్ణానది కి బయలు దేరింది. కానీ మార్గము సుగమము గా లేక నడవ లేక పోయింది. అది చూచి శంకరులు తన యోగశక్తిచే ఆ నదిని తన ఇంటి కడకు తీసుకొని వచ్చెను. ఆ ఇంటిని, ఆ పరిసర ప్రదేశాలను, శంకరులు పూజించిన అమ్మవారు మొదలగు వాటిని చూశాము.


తల్లి చనిపోయిన నాటికి శంకరులు సన్యాసము స్వీకరించారు. అప్పుడు తన జ్ఞాన నేత్రమతో అగ్నిని పుట్టించి అంత్యక్రియలు నిర్వహించెను. ఒక బీదరాలి దుస్థితి చూసి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వర్షము కురిపించెను. ఆ స్తోత్రములే కనకధారాస్తవము. ఆయన రచించిన గ్రంథాలే నేటి మానవులకు దిక్సూచి అయ్యాయి. గణేశపంచరత్నం, భజగోవిందం, లక్ష్మీకరావలంబస్తోత్రం, శివానంద లహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఉపయుక్త మవుతున్నాయి.


శంకరులు ఇలా చాలా జ్ఞాన, వైరాగ్య, భక్తి గ్రంథాలు రచించిరి. ఆ సేతు హిమాచలపర్యంతము కాలి నడకన రెండు పర్యాములు చుట్టి వచ్చిరి. ఆయన తన ముప్పై రెండవ ఏట కైలాసనముకు ఏగిరి, పిన్న వయసు లోనే..

వారు తిరుగాడిన చోట మేము నాలుగు గంటలు గడిపితిమి.

కలాడీ నుంచి " గురువయ్యూరు" పయనం..


గురువయ్యూరు:

త్రిసూర్‌ జిల్లాలోని గురువయ్యూరు లో శ్రీకృష్ణదేవాలయం ఉంది. ఈ ఆలయం ఐదువేల ఏళ్ళ నాటిదని అంచనా. ప్రస్తుతం ఉన్న గర్భాలయం 1638 లో పునర్నిర్మానానికి నోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి.


సాక్షాత్తు పరమశివుడు మహావిష్ణువు గురించి ఇక్కడ ఘోర తపస్సు చేశారని ప్రతీతి. ఈ గుడిని భూలోక వైకుంఠం అందురు. ఈ దేవాలయం లో దేముడు బాలగోపాలన్‌

కృష్షుడు శిశువు గా దర్శనమిస్తాడు.


శ్రీగురువాయురప్పన్‌( శ్రీకృష్ణిడు) విగ్రహాన్ని బృహస్పతి ( దేవతల గురువు), వాయుదేవుడు కలిసి ప్రతిష్టించారని, ఆ కారణంగానే ' గురువాయ్యూరు' అనే పేరు వచ్చింది.


ఏనుగుల శిబిరం: మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సుమారు అరవై ఏనుగులకు ఈ శిబిరం ఆశ్రయమిస్తోంది. దేవాలయం నిర్వహించే పందేలలో ఈ ఏనుగులు

పాల్గొంటాయి. గెలిచిన ఏనుగును స్వామి వారి విగ్రహాన్ని మోయటానికి వినియోగిస్తారు. స్వామి వారి దర్శనం చేసుకుని శిబిరాన్ని కూడా చూసి అక్కడ నుండి బయలుదేరి భోజనాదికాలు ముగించుకుని " అరుణాచలం" పయనమైతిమి.

===============================================

ఇంకా ఉంది...

===============================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


72 views0 comments

Comments


bottom of page