'Dakshina Desa Yathra - 2' New Telugu Web Series
Written By Ayyala Somayajula Subrahmanyam
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
దక్షిణ దేశ యాత్ర రెండవ భాగం చదవండి
ఐదవరోజు కుంబకోణం నుంచి ఉదయం 6. 30కి బయలుదేరాము. మధురై కి పయనం.
జంబుకేశ్వరలింగం- (జల లింగం): జంబుకేశ్వరఆలయం, తిరువానైకల్
భారత దేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి ( తిరుచ్చి) జిల్లాలో ఉన్న ప్రసిద్ద శివాలయం. తొలిచోళులలో ఒకరైన కోచెంగల్ చోళన్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీరంగం ద్వీపంలో ఉంది. మహాదేవుని ఆజ్ఞ మేరకు అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరి గా జన్మించారు.
సాక్షాత్తు అమ్మ వారు పూజ చేసిన లింగం. జంబు( నేరేడు) వృక్షాలు అధికంగా ఉండటం వలన జంబుకేశ్వరుడనే పేరు వచ్చింది. పంచభూత క్షేత్రాలలో రెండవది.
ఇక్కడ పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. తిరుచ్చికి 11 కి. మీ. దూరంలో ఉంటుంది ఈ ఆలయం.
----------
అలగర్ కోయిల్ :
మధురై కి ఓ ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన చెట్లనడుమ ఓ కొండ ప్రక్కన ఉన్న ఆలయమే అళగర్ కోయిల్. 108 వైష్ణవ క్షేత్రాలలో ప్రముఖమైనది. ఈ క్షేత్రాన్ని
దక్షిణ తిరుపతి గా అభివర్ణిస్తారు. మధుర లోని మీనాక్షి అమ్మవారికి సోదరునిగా భావిస్తారు. అమ్మవారి కళ్యాణము సుందరేశునితో ఈ స్వామి వారే జరిపించారని కథనం.
అందుకే అమ్మ వారి కళ్యాణ ఉత్సవాలప్పుడు స్వామి వారి ఉత్సవ విగ్రహం ఇక్కడ నుంచి తీసుకెళతారు. ఈ ఆలయాన్ని నమ్ముకుని వందల ఏళ్ళుగా జీవిస్తున్న
వేలాది మంది ఉన్నారు.
స్వామి వారితో పాటుగా వారి సతీమణి సుందరవల్లీ తాయారు వారి ఆలయం కూడా ఉంది. వివాహం కాని స్త్రీలు ఈ అమ్మవారిని దర్శిస్తే ఫలితం దక్కుతుందని చెబుతారు. అందుకే ఈమెకు కళ్యాణవల్లీ తాయారు అన్న పేరు కూడా వచ్చింది.
----------------
పళమూడిర్చోలై: అలగర్‌కోయిల్ కొండలలోని, బాగా లోపల ఉన్న ఈ ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆరు దివ్య క్షేత్రలలో ఒకటి- ఆఖరిది.
ఇక్కడ స్వామివారు చిన్నపిల్లవాని రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారు చిన్నతనంలో ఆడుకునేవారని చెబుతూంటారు. ఇక్క వల్లీ మాత కూడా ఉంది. ఇది స్వామివారు భక్తురాలిని పరీక్షించిన ప్రాంతము. భక్తురాలికి జ్ఞానబిక్ష ప్రసాదించిన క్షేత్రం.
ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఏవనగా పళని, తిరుత్తణి, స్వామిమలై, పళముదిర్చోలై, తిరుప్పరంకుండ్రం,
తిరుచెందూర్.
-------------------
మధురమీనాక్షి ఆలయం :
మీనాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడులో ఉంది. ఈ దేవాలయం వేగై నది ఒడ్డున ఉంది. మధురై పట్టణం తమిళనాడులో రెండవపెద్ద పట్టణం. తమిళనాడు రాష్ట్ర సంస్కృతి, కళలు, సాంప్రదాయం వారసత్వాలు మొదలైన వాటికి నిలయం గా ఉంటుంది. ప్రపంచం లోని అతి పురాతనమైన నగరాలలో మధురై ఒకటి.
అనేక రాజ వంశాల పాలన చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు.. ఎంతో మంది ఈ నగరాన్ని అభివృద్ది పరిచారు. అనేక స్మారకాలు, దేవాలయాలు, భారతదేశ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతలలో ప్రధానపాత్ర వహించే నగరాలలో మధురై పట్టణం ఒకటి.
2500 ఏళ్ళ క్రితమే సుందరేశ్వర్ ఆలయం ( మీనాక్షి అమ్మవారి ఆలయం) నిర్మించారని చారిత్రక ఆనవాళ్ళు తెలుపుతున్నాయి. ఈ గుడి ఆ కాలపు జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. అద్భుతమైన శిల్ప, చిత్ర కళారీతులతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం. ఈ ఆలయం గురించి తమిళ సాహిత్యంలో పురాతన కాలం నుంచి ప్రస్తావిస్తున్నారు.
మధురై పాలకుడు మలయద్వజ పాండ్యరాజు చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతీదేవి చిన్నపాప రూపంలో భూమ్మీదకు వచ్చింది. ఆమెను పెళ్ళాడటానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరించాడు. అమ్మవారు పెరిగి పెద్దదై ఆ నగరాన్ని పాలించ సాగింది. విష్ణుమూర్తి తన చెల్లి పెళ్ళి చేయడానికి వైకుంఠం నుంచి బయలు దేరుతాడు. అయితే సమయానికి రాలేకపోతాడు. స్థానిక దేవుడు పవలాకనైవాల్ పెరుమాళ్ ఈ వివాహం జరిపిస్తాడు. ఈ వివాహాన్నే ప్రతీ ఏటా ' చిత్తిరై తిరువళ' వేడుకగా నిర్వహిస్తారు.
ఈ ఆలయం 15 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయంలో ఎనిమిది గోపురాలు ఉన్నాయి. సుందర పాండ్యన్, పరాక్రమ పాండ్యన్ లు 13, 14 వ శతాబ్దాలలో తూర్పుపశ్చిమ గోపురాలను, 16 వశతాబ్దంలో శివ్వంది చెట్టియార్ దక్షిణ గోపురాన్ని కట్టించారు. ఇక్కడ మొత్తం 16 గోపురాలు ఉన్నాయి. తూర్పుగోపుర సమీపంలో అష్టలక్ష్మీ మండపం ఉన్నది.
-----------
తిరువయ్యూరు: తంజావూరు జిల్లా లోని పట్టణం. పురాతన చోళరాజ్య పట్టణం.
శ్రీ త్యాగరాజస్వామి ఆలయానికి ఏప్రిల్ నెలలో జరిగే రథోత్సవానికి ప్రసిద్ది. ఇది తంజావూరు పట్టణానికి 11 కి. మీ. ఉత్తరాన కావేరి నది ఒడ్డున ఉంది. తిరువయ్యూరు అంటే ఐదు నదుల సంగమ పవిత్ర స్థలం అని అర్థం. ‘వడవార్, వెన్నార్ వెట్టార్, జూడుమూరుత్తి, కావేరి అనే ఐదు నదుల మీదుగా ఈ పట్టణానికి పేరు వచ్చింది.
కర్ణాటక త్రయం లో ఒకరైన త్యాగయ్య గారు తిరువయ్యూరులో జన్మించారు. ఇక్కడ ప్రతీ పుష్య బహుళపంచమి నాడు ఆరాధనోత్సవాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న సంగీత విద్వాంసులు పాల్గొని త్యాగరాజస్వామి వారి " పంచరత్న కీర్తనలు" గానం చేస్తారు. వారి వంశస్తులు 6వ, 7 వ తరం వారు కూడా సంగీత విద్వాంసులు, మరియు నిత్యము స్వామి వారి నిత్యకృత్య పూజలన్నీ జరుపుతారు.
మరొక్క ముఖ్య విషయమేమిటంటే త్యాగయ్య గారు పూజించిన శ్రీసీతారామ లక్ష్మణుల విగ్రహాలు కూడా ఆ ఆలయమందు కలవు.
---------
బృహధీశ్వరాలయం: తంజావూరులో 74 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా అద్భుతమైనది శ్రీ బృహధీశ్వరాలయం. ఈ ఆలయం తమిళనాడు లోని పురాతన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం తంజావూరు లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ప్రముఖమైనది.
చోళ శక్తి చిహ్నం గల ఈ అతి పెద్ద ఆలయం 1, 30, 000 టన్నుల గ్రానైట్ తో నిర్మించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం. భారతదేశం లోనే అత్యంత
అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటి. ఈ ఆలయ గోపురం 66 మీటర్ల ఎత్తు, 80 టన్నుల భారీ రాతిని కలిగి ఉంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే గోపురం యొక్క నీడ ఎప్పుడూ నేల మీద పడదు. మధ్యాహ్న సమయం లో కూడా ఇక్కడ నీడ కనిపించదు. ఆలయ గోడలపై భరతనాట్యం భంగిమలో 108 శిల్పాలు, ప్రాంగణంలో 250 లింగాలు ఉన్నాయి.
ఈ నగరం ఒకఫుడు చోళుల యెక్క బురుజుగా ఉండేది. అంతే కాదు. ఇది చోళులు, మరాఠాలకు రాజధానిగా సేవలందించింది. అప్పటినుండి తంజావూరు
దక్షిణ భారత దేశంలోని ముఖ్యమైన రాజకీయ, సాంస్కృతిక కేంద్రాలలో ఒకటిగా మారింది.
క్రీ. శ. 1010 లో రాజరాజు చోళ చక్రవర్తి నిర్మించినది బృహధీశ్వరాలయం. ఈ అతిపెద్ద ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. పర్యాటక రంగం లో ఈ ఆలయానికి ప్రాముఖ్యత కలదు. ఎక్కడా సిమెంట్, ఉక్కు అన్న మాటకు తావు లేకుండా నిర్మించిన ఆలయం.
ఇండియా లోనే అతి పెద్ద ఆకాశ హార్మ్యం, 13 అంతస్తులు కలిగి ఉంది. శివలింగం ఎత్తు 3. 7 మీటర్లు. శివుని వాహనం నంది కూడా తక్కువేమి కాదు. ఇదొక ఏకశిలా విగ్రహం. 20 టన్నుల బరువు, 2 మీటర్ల ఎత్తు, కలిగి ఉంటుంది. రాతి తోరణాలు, సొరంగాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ
మనం మాట్లాడుకునే మాటలు ప్రతిధ్వనించవు.
-------------------------
చాలావరకూ ప్రయాణం ఎక్కడికక్కడ ఏయే దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ముందే అన్నీ తెలుసుకుని దాని ప్రకారము, మా తీర్థయాత్ర జరిగింది. ఇప్పుడు శ్రీరంగం పట్టణానికి వచ్చాము.
శ్రీరంగం: తిరుచిరాపల్లి లేదా తిరుచ్చికి కేవలం ఎనిమిది కి. మీ. దూరంలో కలదు. దేవాలయం కావేరీ- కొల్లిదం ( కావేరి నగికి ఉపనది) నదుల మధ్య కొలువై ఉన్నది.
ఈ క్షేత్రం నిత్యం శ్రీరంగనాథుని నామస్మరణలతో మారుమ్రోగుతూ ఉంటుంది. విష్ణు భగవానుని దివ్యక్షేత్రాలలో ఇదే మొదటిది మరియు స్వయంభూ క్షేత్రము కూడా. శ్రీమహావిష్ణువు పాలసముద్రము నుండి ఇక్కడే ఉద్భవించెను. ప్రపంచంలో అతి పెద్ద విష్ణు దేవాలయం కూడా ఇదే. భూలోక వైకుంఠం. ఈ ఆలయాన్ని ఇండియన్ వాటికన్ గా కూడా పిలుస్తారు.
సుమారు ఇక్కడ 157 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ దేవాలయం, అతి పెద్ద రంగనాథస్వామి విగ్రహం సేద తీరు తున్నట్లుగా కనబడతాడు. నాలుగు కిలోమీటర్ల చుట్టు కొలత కలిగి ఉన్నది. ఏభై వరకూ వివిధ దేవతా మూర్తుల ఆలయాలు కూడా కలవు. నాలుగు రోజులలో ఈ దేవాలయాలన్నింటినీ దర్శించుకున్నాము.
---------------
తిరుప్పర కుండ్రం: శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారి యొక్క ఆరు దివ్యక్షేత్రాలలో రెండవది.
ఈ క్షేత్రములో స్వామివారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవసేన తో కళ్యాణం జరుగుతుంది. మధురైకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఈ క్షేత్రం లో స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు.
మిగతా అన్ని చోట్ల స్వామివారు నిలబడిన మూర్తి నే చూస్తాం.
ఇంకో విశేషమేమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే ఒక కొండరాతిని చెక్కి మలచినది. ఆలయం లోకి ప్రవేశించగానే ఇక్కడ నలభై ఎనిమిది స్తంభాలు, ఒక్కో స్తంభం మీదా ఒక భగవన్నూర్తి ఉంటుంది. ఇక్కడ స్వామి వారికి అభిషేకం జరగదు. కేవలం ఆయన శక్తి శూలమునకు అభిషేకం చేస్తారు.
===============================================
ఇంకా ఉంది...
===============================================
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ความคิดเห็น