top of page

జోక్స్ - 3


Telugu - Jokes - Navvulu - Navvandi - navvinchandi - saradaga - Navvukondi - Telugu - Comedy



1). ప్రదీప్ : అక్కా! అమ్మా, నాన్న అంత గట్టిగా గొడవ పడి వాళ్ళ మొబైల్స్ లో ఏవో నోటిఫికేషన్లు రాగానే వాటిని చూస్తూ నవ్వుకుంటూ గొడవ సంగతే మర్చిపోయారు కదా...

అలాగే ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఆగిపోవాలంటే, అమెరికా వాళ్ళు ఉక్రెయిన్కు ఆయుధాల బదులు అక్కడ మోహరించిన ఇరు దేశాల సైనికులకందరికీ అన్ని యాప్లతో సహా, వై-ఫై, 4జీ ఫెసిలిటీలతో వున్న మొబైల్స్ ను అందిస్తే సరిపోతుందేమో.

అక్క: ������ అవున్రా తమ్ముడూ! భలే చెప్పావు... తమాషాగున్నా, ఓ మంచి మొబైల్ ఉపయోగం చెప్పావురా��.

-------------------------------------------------------------------------------------------------------------------------------

2). భర్త : టీవీలో న్యూస్ చూస్తూ ఈ చైనీయులు మన ఎల్.ఓ.సీ. దాటటానికి రోజుకో ప్రయత్నం చేస్తూ మన సైనికులను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏం చేస్తే వీళ్ళు ఎల్.ఓ.సీ. దాటడమనే ఆలోచన మానుకుంటారో, ఏంటో? అని మనసులో అనుకోబోయి గట్టిగానే అనేసాడు.


ప్రక్కనే కూర్చున్న భార్య : ఎల్.ఓ.సీ. అంటే ఏంటండీ అంది?


భర్త : ఎల్.ఓ.సీ. (లైన్ ఆఫ్ కంట్రోల్ ) అంటే లైన్ లా మార్క్ చేయబడ్డ దేశ సరిహద్దన్న మాట.


భార్య : దానికి అంతలా ఆలోచించాలా, ఆ లైన్ కనపడకుండా ఏమైనా అడ్డంగా కప్పేసినట్టు పెడ్తే సరి, చైనీయులు తమ చీమకళ్ళతో ఎక్కడుందో వెతుక్కోటానికే సరిపోతుంది, ఇంకెక్కడ దాట్తారు.

-------------------------------------------------------------------------------------------------------------------------------


3). సోషల్ మాష్టారు హైస్కూలు విద్యార్థులతో "మన దేశ జనాభా రోజు, రోజుకూ పెరిగిపోతోంది, కంట్రోల్ ఎలా చేయవచ్చో సలహాలేమైనా ఇవ్వగలరా?" అని అడిగాడు.


ఒక విద్యార్థి : సార్! ఒక జంటకు ఒక సంతానం మాత్రమే అనే రూల్ పెడితేనే జనాభా తగ్గుతుంది. కానీ చాలామంది ఒక్కరే పిల్లలంటే, వారికేమైనా అయితే.. అన్న ఆలోచనతో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. డెమోక్రటిక్ కంట్రీ అయిన మన దేశంలో దాన్ని బలవంతంగా ఆచరింపచేయలేము. కాబట్టి, దానికి బదులుగా పూర్వకాలంలో బహుభార్యత్వం వున్నట్లు, ఒకరికి ఇద్దరు భార్యలు, ఒక్కో భార్యకు కచ్చితంగా ఒక్క సంతానమే అని పెడితే కనీసం కొంతైనా జనాభా తగ్గుతుంది.


మాష్టారు : మహిళలు మాకూ సమాన హక్కు అన్నారంటే ఏడ్చి చస్తామురా, కూర్చో...


తర్వాత... ఇంకో విద్యార్థి : సార్! ఒక్క సంతానాన్ని మాత్రమే కన్న వారి పిల్లల చేత టిక్-టాక్ లాంటి వీడియోలు చేయించి, ఇండియాస్ టిక్- టాక్ లో అప్లోడ్ చేస్తామంటే చాలు దెబ్బకు జనాభా కంట్రోల్ అయిపోద్ది.


మాష్టారు : నిజమేరా, ఇప్పట్లో పాపులారిటీ వస్తుందంటే ఏదైనా వింటారు.

-------------------------------------------------------------------------------------------------------------------------------

4). టీచర్ : ఏంటిరా చింటూ! సెలవులు పూర్తయ్యి వచ్చినప్పటి నుండి హోంవర్క్ చేసుకు రావటం లేదు. రేపు మీ పేరెంట్స్ ను తీసుకురా, మాట్లాడాలి...


చింటూ : వాళ్ళొచ్చినా, హోంవర్క్ చేయడనే చెప్తారు టీచర్.


టీచర్ : అదేంటలా???


చింటూ : సెలవుల్లో మేము కాశీకి వెళ్ళినప్పుడు, అక్కడ అందరినీ ఏదో ఒకటి వదిలేయమంటే, నేను హోంవర్క్ వదిలేసాను, అందుకే చేయొద్దనే చెప్తారు.


టీచర్ : ఈ వెధవ తెలివితేటలకేమీ తక్కువ లేదు కానీ... అయితే నీకిచ్చిన హోంవర్క్ స్కూల్ అయ్యాక ఇక్కడే వుండి పూర్తి చేసి వెళ్ళు, అదప్పుడు హోంవర్క్ కాకుండా స్కూల్ వర్కే అవుతుంది.


అంతే పాపం చింటూ ముఖంలో చుక్క ఆనందం లేకుండా పోయింది����.

-------------------------------------------------------------------------------------------------------------------------------

5). చింటూ : బంటూ! కాటికి కాళ్ళు జాపడమంటే ఏంటిరా?


బంటూ : అంటే కాట్ చేత కాళ్ళు జాపించటమనుకుంటారా����.

-------------------------------------------------------------------------------------------------------------------------------

6). ఒకరోజు ఒక మంచి వక్త కొంతమంది సీనియర్ సిటిజన్స్ ముందు ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్ళాడు. వాళ్ళకిచ్చే ఉపన్యాసంలో కొత్తగా వస్తున్న టెక్నాలజీల గురించి చెప్తూ... "ఇప్పటి టెక్నాలజీకి సంబంధించి మీరు సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ అన్న పదాలను విరివిగా వింటూనే వుంటారు కదా... ఏమీలేదు... సాఫ్ట్వేర్ అనేది మనిషిలోని మెదడు మనిషికిచ్చే సూచనల లాంటిదైతే దానికి మనిషి శరీరమే హార్డ్వేర్ లాంటిదన్న మాట" అని ఉదహరించాడు.


అదే వక్త మరుసటి రోజు కొంత మంది చిన్న పిల్లలకు ధ్యానం గురించి ఉపన్యసించటానికి వెళ్ళాడు. అక్కడ పిల్లలకు మనిషి మెదడు, శరీరాలనెలా సమన్వయించుకోవాలో చెప్తూ... "పిల్లలూ! ధ్యానంలో మనం మన మెదడు నుండి శరీరానికి సూచనలు పంపుతూ శరీరాన్ని మన ఆధీనంలో వుంచుకుంటాము. అదెలా అంటే మనం వ్రాసిన సాఫ్ట్వేర్ సూచనలతో హార్డ్వేర్ని కంట్రోల్ చేసినట్టన్న మాట" అని చెప్పుకొచ్చాడు.


ఆ రెండు ఉపన్యాసాలు విన్న వ్యక్తి అనుకున్నాడు... 'ఔరా! ఇది కదా నిజమైన వక్త లక్షణము, ఒకే ఉదాహరణను ఎవరికెలా చెప్పాలో అలా చెప్పాడ'నుకుంటూ చప్పట్లు కొట్టాడు.

-------------------------------------------------------------------------------------------------------------------------------

7). విజయ్ : ఒరేయ్ పార్థూ! ఏంట్రా అంత బాధగా మొహం పెట్టి ఏంటో ఆలోచిస్తున్నావు?

పార్థు : ఏంలేదురా! నాకు ఈ యుగంలో కాకుండా, ద్వాపరంలోనో, త్రేతాయుగంలోనో పుట్టింటే బాగుండనిపిస్తుందిరా.


విజయ్ : అవునురా, నిజమే ఆ యుగాలలో అంతో, ఇంతో ధర్మమున్నిందిరా!.


పార్థు : అదికాదురా!!


విజయ్ : మరెందుకు?


పార్థు : ఇందాక లలితకు నా ప్రేమ తెలిపితే... పోరా నల్లోడా!! అని వెళ్ళిపోయిందిరా... అదే ఆ యుగాలలో నల్లని రాముడిని, కృష్ణులను దేవతలలా కొలిచేవారు కదా, అలాగే నన్నూ దేవుడిలా చూసుండటమే కాక కోరి మరీ పెళ్ళి చేస్కునే వారు కదా అని������.


విజయ్: ������������

-------------------------------------------------------------------------------------------------------------------------------

8). వినాయకుడు : మూషికా! ఎక్కడున్నావు?.. మనం నా పుట్టినరోజైన వినాయకచవితి నాటికి భూలోకం వెళ్ళొద్దా!! బయలుదేరు.


మూషికుడు : స్వామీ! ఈసారి నేను భూలోకంకి రావడంలేదు, నీవు వేరే మోటరు వాహనంలో వెళ్ళండి.


వినాయకుడు : ఏంటీ? ఎందుకు రావు?!!


మూషికుడు : రెండేళ్ళ నుండి ఈ మాస్కులతో భూలోకంకి వెళ్ళటం, మళ్ళీ భూలోకం నుండి వచ్చినప్పటి నుండి క్వారెంటైన్లో వుండటం, ఇంక నా వల్ల కాదు స్వామీ����.

-------------------------------------------------------------------------------------------------------------------------------

9). సిటీలోని ఒక పాప్యులర్ స్కూలులో... క్లాసులోని టీచర్, చిన్న పిల్లలతో పేరెంట్స్ ను విసిగించకుండా వుండాలి అని చెప్తూ ఇలా అడిగింది.


టీచర్ : పిల్లలూ! మీ ఇంట్లో మీ అమ్మను ఎప్పుడూ విసిగించకుండా ఎవరుంటారు?


వెంటనే పిల్లలు కోరస్గా 'అలెక్సా' అన్నారు.


టీచర్ : ��������

-------------------------------------------------------------------------------------------------------------------------------

10). నితీష్ : ఏంటి నాన్నా! ఐదు రోజుల క్రిందటే కదా నేను ఇంట్లో మీతో, అమ్మతో హాయిగా గడిపి ఊరెళ్ళింది. అప్పుడంతా బాగున్న అమ్మకు ఇంతలో పిచ్చి పట్టటమేంటి, హాస్పిటల్లో చేర్పించి అర్జెంటుగా రమ్మనటమేంటి?


నితీష్ తండ్రి: వెధవా! నీ వల్లేరా ఇదంతా జరిగింది...


నితీష్ : నేనేం చేసాను నాన్నా, నన్నంటున్నావు?


నితీష్ తండ్రి : ఏం చేసావా!.. ఇంతకు ముందు మీ అమ్మ టైం పాస్కు ఏదో నేను ఆఫీసుకు వెళ్ళాక సీరియల్సు చూస్తూ నగలు, చీరల గురించి మాత్రమే ఆలోచించేదిరా. మొన్న నీవొచ్చి అప్డేట్, అప్డేట్ అంటూ, యూట్యూబ్ వీడియోలు, యూట్యూబ్ షార్ట్స్ చూడటం నేర్పించి, ఇవైతే ఎప్పుడైనా చూడొచ్చని చెప్పెళ్ళావుగా. అంతే కంటిన్యూయస్గా అవి వస్తూనే వున్నాయి, మీ అమ్మ చూస్తూనే వుంది. చూసి ఊరుకుందా అంటే వాళ్ళు చెప్పిన ప్రతిదీ చేసి, ఇంట్లోని ప్రతి వస్తువును పాడు చేయటమే కాక, అవి చేయటానికి రాక పిచ్చెక్కి పోయిందిరా... డాక్టర్ దానికి రివర్స్గా వీడియోలు తయారు చేయించి చూపిస్తే కానీ మామూలుగా కాదంటున్నాడురా... ఏం చేయాలో, ఏంటో!!! ��������


నితీష్ : ������

-------------------------------------------------------------------------------------------------------------------------------

11). వినాయకుడు : ఏంటి మూషికా? ఎక్కడికెళ్ళి ఏమి చేసొచ్చావు?.. అలా దేబ్యం మొహం వేసుకొని వగరుస్తూ వస్తున్నావు, ఏంటి విషయం?


మూషికం : ఏమీ లేదు స్వామీ! ఇక్కడ నైవేద్యం పెట్టేసుంటారని పరుగెత్తు కొచ్చానంతే.


వినాయకుడు : అహ్హహ్హహ్హ! నీవు చెప్పకపోతే నాకు తెలియదా, నీవెక్కడికెళ్ళావో.


మూషికం : అక్కడ కూర్చున్న అమ్మాయిలు ఏదో చేతులో పట్టుకుని చూస్తూ... అబ్బో! అన్నితాయారమ్మత్త అప్పుడే నైవేద్యం పెట్టేసింది, వంటకాలు చక్కటి అలంకరణతో ఎంత బాగున్నాయో... చూస్తుంటేనే నోరూరి పోతోందని మాట్లాడుకుంటుంటే విని కక్కుర్తితో మీకు చెప్పకుండానే ఆ తాయారమ్మ ఇంటికి వెళ్ళాను. చూడటానికి చాలా అందంగా వున్న ఆ నైవేద్యాన్ని చూసి మీ కోసం కూడా ఆగలేక పోయి నోట్లో పెట్టుకున్నానే గానీ ఒక్కటి కూడా రుచిగా లేక దేబ్యం మొహం వేసుకొనొచ్చా అన్నాడు.


వినాయకుడు :: ఓఁ! ఆ అమ్మాయిలు పట్టుకున్నవాటిని స్మార్ఠ్ ఫోన్లంటారు. ఎక్కడెక్కడవీ ఆ ఫోన్లో చూసి తెలుసుకోవచ్చు. అందుకేగా అన్నపూర్ణమ్మ ī చేసిన వంటలే తినాలని ఇక్కడే కాపు కాస్తున్నాను. సరేనా!

పంపిన వారు : లావణ్య కుమారి పెండేకంటి,

ప్రచురించిన తేదీ: 17/10/2022.

-------------------------------------------------------------------------------------------------------------------------------

12). జోక్స్: టి.వి చూస్తున్న నాని కంగారుగా "అమ్మా టి.వి లో అంకుల్ నంబర్స్ తప్పు చెబుతున్నాడు 1, తర్వాత 4,6 ,9 ,11 ,15 అంటున్నాడు " అన్నాడు.


అది చూసి తల్లి " అయ్యో! అవి నంబర్స్ కాదు,ర్యాంకులు " అంది.


పంపిన వారు : కనుమ ఎల్లారెడ్డి, తాడిపత్రి

ప్రచురించిన తేదీ: 17/10/2022.

-------------------------------------------------------------------------------------------------------------------------------

13). ఇద్దరు తాగుబోతులు ఇలా మాట్లాడు కుంటున్నారు.

మొదటి వాడు:నాకు కాజల్, అనుష్క , కనిపిస్తున్నారు అన్నాడు

రెండవ వాడు: నాకు అట్ల కాడ పట్టుకుని మా ఆవిడ కనిపిస్తోంది

అన్నాడు.


పంపిన వారు : కనుమ ఎల్లారెడ్డి, తాడిపత్రి

ప్రచురించిన తేదీ: 18/10/2022.

-------------------------------------------------------------------------------------------------------------------------------

14). భార్య: ఏమండీ ఆ ముష్టి వాడిని మన వీధిలో రాకుండా చూడండి.

భర్త: ఏమైంది, వాడేం చేశాడు?

భార్య; మొన్న మధ్యాహ్నం బిక్షమడిగితే అన్నం, కూర వేశాను.

భర్త: ఐతే ఏమైందేమిటి?

భార్య: నిన్న మళ్ళీ వచ్చి, వంటల పుస్తకం ఇచ్చి, ఇది చదివి వంట నేర్చుకుని మరల బిక్షం వేయమన్నాడండి.

భర్త: శభాష్ నేను చేయలేని పని వాడు చేశాడన్న మాట....

అంతే భర్త ఐసీయూలో ఉన్నాడు.

పంపిన వారు : శ్రీనివాసులు.ఓట్ర, తిరుపతి

ప్రచురించిన తేదీ: 18/10/2022.

-------------------------------------------------------------------------------------------------------------------------------

15) .బిచ్చగాడు: "అమ్మా వేడి వేడిగా ఏమైనా ఉంటే వేయండమ్మ "

ఇంటాయన: "ఏం.. చద్దివి తీసుకోవా?" అన్నాడు

బిచ్చగాడు: "అవి వద్దన్నారండి"

ఇంటాయన: "ఎవరు చెప్పారు బాబు"

బిచ్చగాడు: " మా ఫామిలీ డాక్టర్ అండీ!"

ఇంటాయన: ???!!!


16). పేపర్ బాయ్: సార్! ఈ నెల నుంచి మా పేపర్ వేసుకోండి.

ఇంటాయన: ఏ పేపర్ మీది?

పేపర్ బాయ్: ముప్పై రోజులలో ఇంగ్లీష్ వచ్చే పేపర్ అండీ.

ఇంటాయన: రాకపోతే!



పంపిన వారు : కనుమ ఎల్లారెడ్డి, తాడిపత్రి

ప్రచురించిన తేదీ: 19/10/2022.

-------------------------------------------------------------------------------------------------------------------------------

17) " ఆ ఇంటి వారు కుక్క పిల్లని తన పిల్లల్లాగే పెంచుతున్నారా. ఎలాగా "


"ఆ కుక్క పిల్ల ముందు సెల్ ఫోన్ వీడియో గేమ్ పెట్టి ఆహారం పెడతారంట .ఆ కుక్క పిల్ల వీడియో చూస్తూ తింటుందట. "

*** *** ***

18) “ పోయిన సంవత్సరం మీ ఉద్యోగులకు పండుగ కానుకగా రక్షణ కొసం హెల్మెట్ ఇచ్చారుగా .ఈ సంవత్సరం ఏమిచ్చారు "


" వర్క్ అట్ హోమ్ పని ఇంటిలో చేస్తుండటంవలన రక్షణ కొసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇచ్చారు.”

** *** ***

19 "దురద పోవడానికి ఆ వైద్యుడి దగ్గరకు వెళ్ళాక తగ్గిందన్నావు.ఇప్పుడు బుర్ర గోక్కుంటున్నావు "


“ ఆ వైద్యం కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలా అని అర్థంకాక బుర్రగోక్కుంటున్నాను "

*** *** ***

20) " మన నాయకుడికి ఎన్నికలలో చంద్రుడి గుర్తు ఇచ్చారని ఎన్నికల ప్రచారానికి వేదిక మీద చంద్రుడిపై వెళ్లే దుస్తులు వేసుకొని ప్రసంగించారా ...మంచి హ్యూమర్ "


"హ్యూమర్ కాదు ఎవరైనా రాళ్లు వేస్తారన్న భయంతో "

*** *** ***

21) "వంద కిలోమీటర్ల దూరంలో నున్న సముద్రాన్ని ఈ ఊరికి తెప్పిస్తాను అంటూ మద్యం మత్తులో మంత్రిగారు అంటే అందరూ చప్పట్లు కొట్టి, ఈలలు వేసారా... ఎందుకలా "


" మంత్రి ఏమి ప్రసంగించినా చెప్ప్పట్లు, ఈలలు వేయాలన్న షరతుమీద మద్యం పంచారు , మద్యం తాగిన మత్తులో మన మంత్రి ఏమి చెప్పినా చప్పట్లు కొడుతూ, ఈలలు వేయసాగారు " *** *** ***

22) "ఈ మధ్య మీ అయన మన ఊరిలో జరిగే రాజకీయా పార్టీల మీటింగులకు వెళ్లి బాగా చెడిపోయాడా ...అంటే అక్కడ పార్టీ వారు ఇచ్చే మద్యం త్రాగడం వలన ఇప్పుడు రోజూ త్రాగుతున్నాడా "


" త్రాగడం అలవాటు కాలేదు. కానీ బూతులు తిట్టడం ఎక్కువయింది" *** *** ***

23) "మీ వీధిలో ఏం బీ బీ ఎస్ చదవని డాక్టరా, అతని పేరుకు ముందు ఏమని వ్రాసుకొన్నాడు"


" గొప్ప హస్త వాసి ' అని పేరుకు ముందు వ్రాసాడు "

*** *** ***

24) "శనివారం రోజున వేదికపైన ఎన్నికల ప్రచారం జరగదా. ఎందుకూ "


" రాజకీయ పార్టీ వారు ఇచ్చే బిరియానీ శనివారం రోజు మా ఊరివారు తినరు "

*** *** ***

25) “ మా ఆసుపత్రిలో ఒక్క రోగి కూడా మరణించలేదు’ అని బోర్డు పెట్టారు ,అంత గొప్ప డాక్టరా "


" ప్రాణం పోవడానికి ముందు ఈ వీధిలోనున్న ప్రభుత్వ ఆసుపత్రికి పంపుతారు " *** *** ***

26) "మన పార్టీ నాయకుడికి హోటల్ నందు పేపర్ దోసె ఆర్డర్ ఇచ్చినందుకు నిన్నుకొట్టారా ..ఎందుకూ."


"నాకు చదువురాదని తెలిసీ పేపర్ దోసె ఎందుకు చెప్పావు అంటూ ...."అన్నాడు మంత్రి సెక్రటరీ

*** *** ***

27) " పెళ్లి చూపుల కార్యక్రమం అంటూ నాలుగు గంటలకు వెళ్లవు, ఇప్పుడు ఆరుగంటలు కావస్తుంది ఇంకా అక్కడ ఏమి చేస్తున్నావు" మెసేజ్ వచ్చింది


" ఆన్ లైనులో బజ్జీ, టీ ఆర్డర్ చేసారంట,వచ్చేంతవరకు వెళ్ళవద్దని బలవంతం చెయ్యడం వలన అందరం సెల్ ఫోన్ చూసుకొంటున్నాము " మెసేజ్ పంపాడు

*** *** ***

28) బిచ్చగాడిమీద దయదలచి రెండురూపాయల బిళ్ళ వేయబోతుంటే "అమ్మా పదిరూపాయలు తక్కువ లేకుండా వేస్తె తీసుకొంటాను." అన్నాడు


"పే ఫోన్ నంబరు చెప్పు. నీవడిగిన పదిరూపాయలు కన్నా ఎక్కువగానే పంపుతాను " ఎగతాళిగా అంది


"పే ఫోన్ నందు తీసుకొంటే ఇన్కమ్ టాక్స్ వారికి లెక్కలు చూపించాలి. వద్దమ్మా "అన్నాడు.


పంపిన వారు : ఓట్ర ప్రకాష్ రావు, తిరుత్తణి

ప్రచురించిన తేదీ: 28/10/2022.

-------------------------------------------------------------------------------------------------------------------------------

29) “డాక్టర్ మా వారికీ ఇప్పుడు ఎలా వుంది”

“జనరల్ వార్డ్ నుండి ఐ సి వార్డుకు పంపాక ఇంప్రూవ్ మెంట్ కనిపించింది “

“ అంటే ఇంటికి ఎప్పుడు పంపుతారు”

“ ఐ సి వార్డునుండి జనరల్ వార్డు పంపాక చెప్తాను”

*** *** ***

30) "మీ అత్తయ్య ఉండగా పనిమనిషిని ఎందుకు పెట్టావు"

"ఇంటి పనిచేయడానికి కాదు. ఇరుగు ఒరుగు విషయాలు వీధి విషయాలు తెలియాలంటే పనిమనిషి ఉండాలి "

*** *** ***

31) "రేపు మీ వారిని డిశ్చార్జ్ చేస్తానని డాక్టరు చెబితే, రేపు మంచి రోజు కాదండీ ఎల్లుండి తీసుకెళ్తానని చెప్పడం పొరపాటయింది"

"ఎలాగా "

"మరుసటిరోజు మా వారికి వ్యాధి తిరగబడింది అంటూ వారిని ఎమర్జెన్సీ వార్డ్ నందు చేర్పించారు"

*** *** ***

32) "మీరు ఆ ట్యూషన్ మాస్టర్ దగ్గరకు మీ పిల్లలను ఎందుకు పంపుతున్నారు. అయన ఏమీ చెప్పడం లేదు "

" ఏమీ చెప్పరని తెలిసే పంపుతున్నాము. "

" ఎందుకు "

" పిల్లలు ఇంట్లో ఉంటే వీడియో గేమ్స్ చూస్తారు ,అందువలన ఆరోగ్యం దెబ్బతింటుంది.అక్కడైతే సెల్ ఫోన్ చూడకుండా పిల్లలతో వుంటారు" *** *** ***

33) "మన రాజ్యంలో జరిగే ఎన్నికలలో ఆయనను రాజు గా గెలిపిస్తే అయితే GST ఎక్కడా లేకుండా చేస్తానన్నారు కదా ఎలాగ "

" ఇరవై ఆరు ఆంగ్ల అక్షరాలలో GST అన్న మూడు అక్షరాలు తీసివేసి ఆంగ్లంలో ఇరవై మూడు అక్షరాలూ ఉండేలా చేస్తాడు ."

*** *** ***

34) సినిమా టికెట్ కోసం వరుసలో నిలబడింది సుబ్బులక్ష్మి

ఆ వీధి భిక్షగాడు వరుసలో నిలబడకుండా ముందుకు పోవడం చూసి "వరుసలో నిలబడు " కోపంతో అంది

“అమ్మా నేను ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకొన్నాను” సమాధానమిచ్చాడు.

పంపిన వారు : ఓట్ర ప్రకాష్ రావు, తిరుత్తణి

ప్రచురించిన తేదీ: 10/02/2023.

-------------------------------------------------------------------------------------------------------------------------------

35) మంచి టీచర్ కావాలంటే ఏం చెయ్యాలో కాస్త చెబుతారా ?” విమ్రతతో అడిగాడు ఆ రోజే ఉద్యోగం లో చేరిన అప్పారావు.

“ అంతే ఏమిటయ్యా నీ ఉద్దేశ్యం ? చెడ్డ టీచర్లు కూడా వుంటారా ? “ కోపం గా అడిగాడు సీనియర్ టీచర్ అయిన రామారావు.

“ మీరు ఉన్నారు కదా సార్. నా ఉద్దేశ్యం లో నేను మీలా కాకూడదనే ముందు జాగ్రత్త కోసం అడుగుతున్నాను సార్” అసలు సంగతి చెప్పాడు అప్పారావు

***

36) అమ్మాయికి, అబ్బాయికీ మధ్య వుండే ఒక తేడా చెప్పు?" కొంటెగా అడిగాడు కిరణ్ తన ప్రేయసి భానుని

"అబ్బాయి అమ్మాయిల ముందు ఇంప్రెషన్ కొట్టెయ్యడానికి ఒక రూపాయి వస్తువును రెండు రూపాయలి ఇచ్చి కాలర్ ఎగరేస్తాడు. అదే అమ్మాయి అయితే అబ్బాయి ముందు అదే ఇంప్రేషన్ కొట్టెయ్యడానికి రెండు రూపాయల వస్తువుకు గంటలకు గంటలు బేరం చేసి ఒక రూపాయికి కొంటుంది" చెప్పింది భాను.

పంపిన వారు : Ch. ప్రతాప్, ముంబై

ప్రచురించిన తేదీ: 10/02/2023.

-------------------------------------------------------------------------------------------------------------------------------

37) బి ఎ ఫిలాసఫీ క్లాసులో నాస్తికుడైన ఒక ఫ్రొఫెసరు దేవుడి గురించి ఈ విధంగా మాట్లాడసాగాడు. “ మీలో ఎవరైనా దేవుడిని చూసారా చెప్పండి?” అడిగాడు. “లేదు” క్లాసంతా ముక్త కంఠంతో చెప్పారు. “పోనీ మీలో ఎవరైనా కనీసం దేవుడిని ముట్టుకున్నారా?" అడిగాడు ఫ్రొఫెసరు. “లేదు” మళ్ళీ క్లాసంతా ఒకే సమాధానం చెప్పారు. ఫ్రొఫెసరు గారిలో ఉత్సాహం ద్విగుణీకృతమయ్యింది. “ఇక చివరగా మీలో ఎవరైనా దేవుడితో మాట్లాడారా?” అడిగాడు. “లేదు సార్” అని మళ్ళీ అందరూ అన్నారు. “సో! దీనిని బట్టి మనకు అర్ధం అయ్యేదేమిటంటే ఎవ్వరూ చూడని, ముట్టుకోని కనీసం మాట్లాడని దేవుడు అసలు లేడని మనకు లాజికల్ గా తెలుస్తోంది కదా, అందుకే ఈ రోజు నుండి అందరూ దేవుడిని నమ్మడం మానెయ్యండి” అని గర్వంగా చెప్పాడు. సదరు ఫ్రొఫెసరు గారి పద్ధతి నచ్చని ఒక విద్యార్ధి తనకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వవలసిందిగా ఫ్రొఫెసరు గారిని కోరాడు. “సోదర సోదరీమణులారా, మీలో ఎవరైనా మన ఫ్రొఫెసరు గారి మెదడును చూసారా చెప్పండి” అని అడిగాడు ఆ విద్యార్ధి. “లేదు” కోరస్ గా చెప్పారు విద్యార్ధులందరూ. “పోనీ మీలో ఎవరైనా మన ఫ్రొఫెసరు గారి మెదడును ముట్టుకున్నారా? “ అడిగాడు విద్యార్ధి. “లేదు” మళ్ళీ రాగయుక్తంగా చెప్పారు అందరూ. “ ఇక ఆఖరుసారిగా మీలో ఎవరైనా మన ఫ్రొఫెసరు గారి మెదడుతో మాట్లడడం చేసారా?” అడిగాడు. ‘లేదు..లేదు” అందరూ చెప్పారు. “అయితే మన ఫ్రొఫెసరు గారి లాజిక్ బట్టి ముట్టుకోలేని, మాట్లాడలేని, కనీసం చూడలేని మన గురువు గారి మెదడు అసలు లేదని అర్ధమౌతోంది కదా! “ అని గబ గబ వెళ్ళిపోయి తన బెంచ్ లో కూర్చున్నాడు ఆ తెలివైన విధ్యార్ధి. సదరు ప్రొఫెసరు గారి ముఖం లో కత్తివాటుకు నెత్తురు చుక్క లేదు.

*** *** *** 38) "రేఖా, మా స్నేహితుడిని ఈ పూట డిన్నర్ కు పిలిచాను. త్వరగా ఏర్పాట్లు చెయ్యు” అంటూ హడావిడిగా లోపలికి వస్తూ అన్నాడు లోకేష్. భర్త మాటలకు కోపం నషాలానికి అంటగా “నీకేమైనా బుద్ధుందట్రా, ఇల్లంతా ఇంత చిందర వందరగా వుంది, సర్ధడానికి మూడు రోజులైనా పట్టేట్లు వుంది, పైగా ఈ పూట బయట ఫ్రెండ్స్ తో తాగి, తిని వస్తానని వెధవ వాగుడు పొద్దున్న వాగావు కదా, ఇంతలోనే ఈ దరిద్రపు ప్రపోజల్ ఏమిటి? నాతో మాట మాత్రమైనా చెప్పకుండా అడ్డమైన వారిని ఇంటికి పిలవవద్దని ఎన్ని సార్లు నేను చెప్పి చావాలిరా వెధవా.” అంటూ విరుచుకు పడింది రేఖ. “అదంతా నాకు తెలుసే రాక్షసి“ చెవులు బద్దలైపోతుండగా నిస్సత్తువగా అన్నాడు లోకేష్. “ ఒరేయి లోకిగా,మరి అలాంటప్పుడు ఆ వెధవను ఎందుకు పిలిచావు, పైత్యం కాకపోతే? పట్టపగలే తాగొచ్చావా లేక నీ పక్క టేబుల్ దగ్గర కూర్చునే ఆ జాస్మిన్ తో అడ్డమైన తిరుగుళ్ళు తిరిగొచ్చావా ? ” రుస రుస లాడింది రేఖ. “వాడు మనలాగే ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్నాడు. ప్రేమ పెళ్ళిళ్ళు ఎంత భయంకరంగా వుంటాయో వాడికి రుచి చూపిద్దామని తీసుకు వస్తున్నాను. కనీసం వాడైనా మనలా ఈ ట్రాప్ లో పడకుండా వుండడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఫర్ యువర్ ఇన్ ఫర్ మేషన్, వాడు మన ప్లాట్ బయటే ఇప్పుడు నిలబడి వున్నాడు. మనిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాడు.” కూల్ గా అసలు సంగతి చెప్పాడు లోకేష్. ప్రేమించి పెళ్ళి చేసుకున్నాక, అదీ ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా తెలుగు సినిమాల ఇంఫ్లూయెన్స్ తో హీరోయిజం చూపించి లేచి పోయి పెళ్ళిచేసుకుంటే ఆనక భవిష్యత్తు ఎలా వుండబోతోందో కళ్ళారా చూసిన లోకేష్ స్నేహితుడు కళ్ళు తిరిగి ఢామ్మని కింద పడిపోయాడు.

పంపిన వారు : Ch. ప్రతాప్, ముంబై

ప్రచురించిన తేదీ: 16/02/2023.

-------------------------------------------------------------------------------------------------------------------------------

39) " మా ఆయన నెత్తికి అరవై ఏళ్ళొచ్చినా ఒక్క తెల్ల వెంట్రుక కూడా లేదు తెలుసా" గొప్పలు చెప్పుకుంది ఆండాళ్ళు. " అబ్బా ! అంత వయసు వచ్చినా జుత్తు తెల్లబడకుండా అలా నల్లగా ఎలా వుంది? ఆ చిట్కా ఏదో కొంచెం చెబితే మా ఆయనపై నేను కూడా ప్రయోగిస్తాను" ఆసక్తిగా అడిగింది మీనాక్షమ్మ. " జుత్తు నల్లగా వుందని నేనెప్పుడు అన్నాను ? ఆయన నెత్తిపై ఒక్క వెంట్రుక కూడా లేకపోతేను" అసలు సంగతి నెమ్మదిగా చెప్పింది ఆండాళ్ళు.

***

40) "క్లాసులోసన్నాసిదద్దమ్మఎంకమ్మగాళ్ళుఎవరైనావుంటేలేచినిలబడండి" వెటకారంగాఅడిగాడుతెలుగుఫ్రొఫెసరుఅయోమయం.

క్లాసులో చాలా సేపు నిశ్శబ్దం రాజ్యమేలిన తర్వాత లేచి నిలబడ్డాడు విక్రం.

" యు ఆర్ రియల్లీ గ్రేట్. ఇప్పుడు నిన్ను ఒక సన్నాసి దద్దమ్మ అని ఎందుకనుకుంటున్నావో క్లాసుకు వివరించి చెప్పు" అడిగాడు అయోమయం.

"నేను అనుకోవడం కాదు సార్, క్లాసులో మీరొక్కరే చాలా సేపు నిలబడి వుండడం చూసి భరించలేక కంపెనీ నేను నిలబడ్డాను సార్" అసలు సంగతి చెప్పాడు విక్రం.

అంతే ! సదరు ఫ్రొఫెసరు గారి ముఖంలో కత్తి వాటుకు నెత్తుటి చుక్క లేదు.

***

41) వెంకట్రావు, అతని భార్య అండాళ్ళు కాఫీ షాపు కు వెళ్ళి రెండు కప్పుల కాఫీ ఆర్డర్ ఇచ్చారు.

“త్వరగా కాఫీ తగెయ్యి, చల్లారిపోతే ప్రమాదం”అంటూ ఆందాళ్ళను తొందర చెయ్యసాగాడు వెంకట్రావు.

“చల్లారిపోతే ఏం?” ఆశ్చర్యంగా అడిగింది ఆండాళ్ళు.

“ఒసేయి పిచ్చి మొహమా ! అక్కడ చూడు.ఈ షాపు వాడు వేడి కాఫీకి పది రూపాయలు, కోల్డ్ కాఫీకి పాతిక రూపాయలు అని బోర్డు పెట్టాడు. కాఫీ చల్లారాక తాగినట్లు వాడికి తెలిస్తే మనకు డబుల్ వాయింపే” అసలు సంగతి చెప్పాడు వెంకట్రావు.

ఫక్క టేబుల్ వద్ద కూర్చోని ఈ సంబాషణ అంతా ఆలకిస్తున్న సుబ్బారావుకు నవ్వాగక పొలమారి భళ్ళున తాగుతున్న టీ కక్కుకున్నాడు.

***

42) "లతకు చెప్పవద్దని ఒట్టేయించుకొని నేను నీకు చెప్పిన ఆమెకు సంబంధించిన రహస్యాన్ని నువ్వు లతకు చెప్పావని లత నాతో చెప్పింది” కోపంగా అంది రాధ.

“అరే! ఆ రహస్యాన్ని లతకు చెప్పిన విషయాన్ని ఇంకెవ్వరికీ చెప్పవద్దని లతకు గట్టిగా చెప్పానే!” నొచ్చుకుంటూ అంది రేఖ.

“ఓకె.లత నాకు చెప్పిందన్న విషయం నేను నీకు చెప్పానన్న విషయం లతకు చెప్పవద్దు.” చెప్పింది రాధ.

***

43) “దేవుడికి ప్రార్ధన చేసేటప్పుడు కళ్ళు మూసుకొని వుండాలని నీకి ఎన్ని సార్లు చెప్పాలి నవీన్” కోప్పడింది నవీన్ వాళ్ళమ్మ.

“ నేను ప్రార్ధన చేసేటప్పుడు కళ్ళు మూసుకోలేదని కళ్ళు మూసుకొని ప్రార్ధన చేస్తున్న నీకెలా తెలిసింది మమ్మీ” అమాయకంగా అడిగాడు నవీన్.

అంతే. ఠక్కున నోరు మూసేసుకుంది వాళ్ళమ్మ.

***

44) "రాజు, నాకిప్పుడు మూడో నెల, మనం తప్పక వెంటనే పెళ్ళి చేసుకోవాలి” గట్టిగా చెప్పింది రేఖ.

“ సరే, అయితే ఈ రోజు నుండి మనం మన లైఫ్ పార్టనర్లలను వెదికే పని ప్రారంభిద్దాం” గాఢంగా నిట్టూరుస్తూ అన్నాడు రాజు.

***

45) "మీ కొడుకుకూ, కోడలికి ఒక్క క్షణం కూడా పడదట కదా! ఇరవై నాలుగు గంటలు కొట్టుకుంటునే వుంటారని మా కోడలు చెప్పింది" ఆసక్తిగా అడిగింది అన్నపూర్ణమ్మ.

"అందుకే నేను ఏ చీకు చింతా లేకుండా ఆరోగ్యం గా , ఆనందం గా వుండగలుగుతున్నాను" పళ్ళీలు నములుకుంటూ చెప్పింది అనసూయమ్మ.

***

46) ఆ కంపెనీలో బాస్ ను ఆ రోజు ఉదయం ఇంటి నుండి కిడ్నాప్ చేసారన్న వార్త దావానలంగా వ్యాపించింది. ఆఫీసులో అందరూ హడావిడిగాతిరుగుతుండడం చూసి రేపో మాపో రిటైర్మెంట్ కి దగ్గరలో వున్న ఒక వృద్ధ క్లర్క్ తన పక్క వారిని అడిగాడు " ఏమిటి సంగతి " అని. "మన బాస్ మన్మధ రావును ఎవరోగుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చెసారు. పది కోట్లు ఇవ్వకపోతే పెట్రోల్ పొసితగలెట్టేస్తామని బెదిరిస్తున్నారు" చెప్పాడు పక్క టేబుల్ క్లర్క్. "అయితే మనవాళ్ళు ఇప్పుడు ఏంచేస్తున్నారు?"అడిగాడు వృద్ధక్లర్క్. "ప్రతీ వారూ చందాలు వేసుకుంటున్నారు, మొత్తం అంతా కలెక్ట్ అయ్యాక ఒకే సారి ఆ కిడ్నాపర్లకు అందిస్తారట" "ఒక్కొక్కరు ఎంతవేసుకుంటున్నారో చెబితే నా వంతు కూడా ఇస్తాను" అడిగాడు వృద్ధ క్లర్క్. "తలా ఒక లీటరు" అసలుసంగతి తాపీగా చెప్పాడు పక్క టేబుల్ క్లర్క్. 47) నా భార్య ఈ ఉదయం హఠాత్తుగా చచ్చిపోయింది. నెనెంత ట్రై చేస్తున్నా ఏడుపు రావడం లేదు. చుట్టాలు,పక్కాలతో చాలా ఇబ్బందిగా వుంది. ఏదో ఒక సలహా ఇచ్చి పుణ్యం కట్టుకోరా బాబూ" ఫోన్ లో ప్రాధేయపడ్డాడు నరేష్."ఏముంది,వెరీ సింపుల్,ఆవిడ బ్రతికి వచ్చినట్లు ఒక్క సారి ఊహించుకో,వెంటనే ఏడుపు తెరలు తెరలుగ తన్నుకు వచ్చేస్తుంది" మందు కొడుతూ చెప్పాడు రమేశ్ 48) "ఈ మ్యాచ్ లో కూడా ఘోరంగా ఓడిపోయాము. ఇక మన టీం ను వెంటనే బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి" ఆవేశంగా చెప్పాడు ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్. "కరెక్టే,అందుకే కిందటి మ్యాచ్ నే నీ ఆఖరు మాచ్ గా నిర్ణయించింది సెలెక్షన్ బోర్డు" కూల్ గా చెప్పాడు టీం మేనేజర్.


పంపిన వారు : Ch. ప్రతాప్, ముంబై

ప్రచురించిన తేదీ: 25/02/2023.

-------------------------------------------------------------------------------------------------------------------------------

49) "ఎన్నికల ప్రచారానికి ఎక్కువమంది రావాలని బిరియాని, మందు బదులు మంచి రికార్డు డాన్స్ పెడుతున్నట్లు చెప్పాక ప్రజలు చాలామంది వచ్చారా . ఫరవాలేదే మన నాయకుడు సంతోష పడివుంటారు "

"ఎన్నికల ప్రచార సభకు వచ్చామన్న సంగతి మరచిపోయి మన నాయకుడు రికార్డు డాన్స్ చూసి చాలా ఆనందించారు చివరి వరకు డాన్స్ కార్యక్రమమే జరిగింది " *** *** ***

50) "మన నాయకుడి ఎన్నికల ప్రచారానికి వ్యతిరేక పార్టీ వారు ఎలా అడ్డుకొన్నారు " “నాయకుడు ప్రసంగిస్తున్న వేదిక పైన హెలికాఫ్టర్ నుండి బురద చల్లారు " *** *** ***

51) "నేను మా వారిని దేవుడిలా చూసుకొంటాను "

"అదృష్టవంతురాలివి ఎలాగైనా అర్చన చేయవచ్చు .మా వారు ఒక శాడిస్ట్ నన్ను దేవతలా చూసుకొంటూ ప్రతిరోజూనాకు అర్చన ...."

*** *** ***

52) “ఒక నెల రోజులు టీ వీ సీరియల్స్ చూడకుండా ఉంటే పట్టుచీర కొనిస్తానని చెప్పడం తప్పయింది శేఖర్”

“ఎందుకూ రా”

“వార్తలు చూడటం ప్రారంభించింది . ఇప్పుడు బూతు మాటలు నేర్చుకొంది “ *** *** ****

53) "పరీక్షలో కోడిగుడ్డు తెచ్చుకొన్న వారికి ఐదురూపాయలు ,బంగారుగుడ్డు తెచుకొన్నవారికి ఐదువందల రూపాయలు శిక్షగా వసూలు చేస్తారా. కోడిగుడ్డుకు,బంగారు గుడ్డుకు ఏమిటి బేధం "

"తప్పురాసిన వారికీ వేసే సున్నాను కోడిగుడ్డు అంటారు, ఒక్క అక్షరం వ్రాయకుండా పేపర్ ఖాళీగా ఇచ్చినవారికి వారికి వేసే సున్నాను బంగారు గుడ్డు అంటారు” *** *** ***

పంపిన వారు : ఓట్ర ప్రకాష్ రావు, తిరుత్తణి

ప్రచురించిన తేదీ: 25/02/2023.

-------------------------------------------------------------------------------------------------------------------------------

54) "పోలీసు ఉద్యోగి పెళ్ళిచూపులకొచ్చినప్పుడు పెట్టిన ఫలహారాలు నీవు చేసినట్లుగా మీ అమ్మ అబద్దం చెప్పిందా, ఆ తరువాత... "

"పెళ్ళికి ముందే ఇన్ని అబద్ధాలా ...ఈ ఫల హారాలు మీరు చేసింది . అందుకు సాక్షం ఫలహారం లో వచ్చిన తెల్ల వెంట్రుక అంటూ పెళ్లికొడుకువారు కోపంగా వెళ్లిపోయారు " *** *** ***

55 ) "ఏమిటే, రిటైర్ మెంట్ అయ్యాక హాయిగా ఇంటిలో వుండక, మరలా ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్తున్నావటగా " స్నేహితురాలిని అడిగింది

"నేను రిటైర్ అయ్యాక మా వారు నా చేత వంట చేయించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు పసిగట్టాను. అందుకే ..."అంది

*** *** ***

56) " బాల సాహిత్య రచయిత ఇంటికి వెళ్ళావా .... ఏం చేసావు . "

"బిస్కట్లు , చాక్లెట్లు తింటూ వీడియో గేమ్స్ ఆడుకొన్నాము " *** *** ***

57 ) "మీ ఇంటికి ముసుగు వేసుకొని వచ్చిన ఆ దొంగ, రాజకీయా నాయకుడుగా ఉండటానికి ఎక్కువగా అవకాశముందని ఎలా చెబుతున్నారు " అడిగాడు ఇన్స్పెక్టర్

"ఎక్కువగా బూతు మాటలు మాట్లాడాడు సార్ "

*** *** ***

58) " ఆ రాజకీయ నాయకుడు చెప్పేదంతా అబద్ధాలా ...ఎలా చెబుతావు "

" మన పార్టీ కార్యకర్తకు కిడ్నీ ఫెయిల్ అయిందని కిడ్నీ దాత కోసం వెతుకుతుంటే నేను ఇవ్వడానికి సిద్దమయ్యాను . నాకు నా పార్టీ కార్యకర్తల ప్రాణాలు ముఖ్యం. ఆసుపత్రికి వెళ్ళాక నాకు కిడ్నీ లేదని డాక్టరు చెప్పాడు ‘ అంటూ తన ప్రసంగంలో చెప్పాడు. ఎప్పటిలా వాడు చెప్పేది అబద్దమని తెలిసినా గట్టిగా చప్పట్లు కొట్టారు "

"ఎందుకలా చప్పట్లు కొట్టారు “

" వాళ్ళిచ్ఛే మందు బాటిల్ ,బిరియాని పొట్లం కోసం..."

*** *** ***

59) " ముగ్గుల పోటీకి వచ్చిన న్యాయ నిర్ణేతలు అందరూ నల్లటి కళ్లద్దాలు వేసుకొన్నరెందుకూ " "జరుగుతున్నది త్రీ డీ ముగ్గుల పోటీలు ..వాళ్ళు వేసుకొన్నది త్రీ డీ అద్దాలు " *** *** ***

60) " ఆ సినిమా టీజర్ వీడియో చూసి మోసపోయాను , చాలా చెత్త సినిమా ..ప్చ్ " అంది భార్య "నీ ప్రేమలేఖలు చూసి నేను నిన్ను పెళ్లి చేసుకొన్నట్లు " అన్నాడు భర్త *** *** ***

61) “మాకాలంలో బుడబుక్కలవాడు వచ్చాడంటే మంచి కాలం వస్తుంది... మంచి కాలం వస్తుంది అనగానే ఏమిటేమిటి అని అడిగేవారు “

"ఇప్పుడు"

“ఉచితంగా వస్తుంది ...ఉచితంగా వస్తుంది అంటేనే ఏమేమి వస్తుంది అని అడుగుతున్నారు " *** *** ***

62) గ్యాస్ ధర పెరుగుతుండటం చూసి ప్రజలందరూ తమ నియోజకపు మంత్రిదగ్గరకు వెళ్లి "గ్యాస్ సమస్య పరిష్కరించండి " అంటూ చెప్పారు.

"నాకూ గ్యాస్ సమస్య ఎక్కువగా వుంది" అంటూ మంత్రిగారు ఒక్కసారిగా నవ్వారు. *** *** ***

63 ) " పదిరోజుల క్రితం మీరు మంత్రి అయ్యాక మొదటిసారిగా చేసింది ఏమిటో చెబుతారా " " పదవి ప్రమాణం చేసాను"

" ఆ తరువాత ఏం చేశారు "అడిగాడు విలేఖరి

" ఇప్పుడు మీరడిగే ప్రశ్నలకు సమాదానాలు చెబుతున్నాను" *** *** ***

64 ) "ఖరీదైన అద్దాల బీరువా పగులగొట్టి దొంగతనం చెయ్యడం తప్పు కదా " "బీరువా తాళం చెవులు లేనప్పుడు ఎలా తీయమంటారో మీరే చెప్పండి జడ్జిగారూ " *** *** ***

65) "అన్ని టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక నీ ఆపరేషన్ వాయిదా వేసారా ....ఎందులో సమస్య వచ్చింది " "చిలుక జోస్యంలో ... మరికొన్ని రోజుల తరువాత చూడమని డాక్టరు చెప్పారు" *** *** ***

66 ) "ఆ ఇంటిలో సెల్ ఫోన్ దొంగతనం చేయడానికి వెళ్ళావు . వొట్టి చేతులతో వచ్చావు ఎందుకు మామా " అడిగింది భార్య

“ ఆ ఇంట్లో ఐదోతరగతి చదివే కుర్రోడు నిదురపోకుండా రాత్రంతా వీడియో గేమ్స్ ఆడుతుంటే నేనెలా దొంగలించగలను "అన్నాడు దొంగ.

*** *** ***

67) “మీ ఆఫీసులో లంచ్ టైం లేదా ......లంచ్ తీసుకోకుండానే పనిచేస్తున్నారా… ఎవరూ గొడవ చెయ్యలేదా …ఎందుకలా "అనడిగాడు

“ లంచ్ టైం లోనే లంచం తీసుకొనడానికి అనుమతి ఇస్తారు .డబ్బులొస్తుంది కదాని ఎవరూ గొడవ చెయ్యలేదు “

*** *** ***

68) "మంత్రిగారిని తీహార్ జైలుకు పంపడం వలన చాలా అవమాన పడ్డారా ...ఎవరేమన్నారు " "రెండేండ్ల పాలనలో ఇన్నివేల కోట్లు మాత్రమే సంపాదించావా అంటూ అక్కడున్న వారు కొందరు ఎగతాళి చేసారంట "

*** *** ***

69) "రెండు సంవత్సరాలక్రితమే నిన్ను వృద్ధాశ్రమంలో చేర్పించాలనుకొన్న మీ అబ్బాయి ఇంకా ఎందుకు చేర్పించలేదు "

" పెన్షన్ పెంచాలని కొంతమంది కోర్ట్ కు వెళ్లడం తెలుసుకొని, పెన్షన్ పెరిగితే తీసుకొనవచ్చని నన్ను ఇంకా వృద్ధాశ్రమంలో చేర్పించలేదు"

పంపిన వారు : ఓట్ర ప్రకాష్ రావు, తిరుత్తణి

ప్రచురించిన తేదీ: 20/03/2023.

------------------------------------------------------------------------------------------------------------------------------- 70) కొత్తఅల్లుడు

ఒక ఊరిలో కొత్తగా పెళ్ళయిన అల్లుడు ఏదైనా సరే ప్రత్యేకంగా ఉండాలని, తనని చూసి ఊరివాళ్ళందరు డంగైపొవాలని ఆలోచించేవాడు. ఇంకే దసరా పండగరానే వచ్చింది, తనఫ్యాషనంతా ఊళ్ళో చూపించాలని తహతహలాడుతున్న మన కొత్తఅల్లుడు బుల్లెట్ బండి మీద, 20రూ పెట్టికొన్న రంగుకళ్ళద్దాలు పెట్టుకొని బయలుదేరాడు. కాళ్ళకి 100రూపాయలుపెట్టి ఫుట్ పాత్ మీదకొన్న బూట్లు తొడిగాడు.

అత్తగారి ఊరు దగ్గరకొస్తోంది, ఇంతలోకి మన కొత్తఅల్లుడికి అత్తారింటికి దారేది హీరో ఒకప్పటి సగం విప్పుకున్న ప్యాంటు గుర్తుకొచ్చింది. తానుకూడా ఏదో కొత్తదనం చూపించాలనుకున్నాడు. అంతే ఆలస్యం చేయకుండా ప్యాంటు, షర్టు విప్పి, కష్టపడి వెనక్కితిప్పి వేసుకొన్నాడు.


ఈలవేసుకొంటు రయ్యిన బయలుదేరి, ఊరిబయట పొలం నాటువేసే వాళ్లను చూసి మరింత ఉషారుగా స్పీడు పెంచాడు. ఇంకేముంది.. జర్రునజారి బురదలో పడ్డాడు. ఒళ్ళంతా బురద..


నాటువేసే కూలీలు చూసి పరుగుపరుగున వచ్చి దగ్గరున్న సీసాలో నీళ్ళతో ముఖం కడిగి చూసి, ‘అయ్యో.. మనవూరి వెంకాయమ్మగారి అల్లుడు’ అంటు పైకిలేపి దగ్గరలోఉన్న కాలువలో ఒళ్ళంతా కడిగారు.

అంతే! అందరు ఒక్కసారిగా గొల్లుమన్నారు, మనవూరి కొత్త అల్లుడి మెడ వెనక్కి తిరిగిపోయిందని!

పంపిన వారు : వల్లూరిపల్లి ప్రసాద్

ప్రచురించిన తేదీ: 19/04/2023.

-------------------------------------------------------------------------------------------------------------------------------

71) "బావగారు! ఇంత వాన లో కూడా బయటకు వచ్చారేంటి? వాతావరణ వార్తల్లో అల్పపీడనం - బయటకు రావొద్దని చెప్పారుగా?"


"అదేంలేదు! ఈ అల్పపీడనం మహా అయితే రెండు రోజులు ఉంటుంది. తగ్గిపోతుంది. కానీ మీ అక్క మనసులో ఏర్పడ్డ అల్పపీడనం చేత, కళ్ళల్లో వచ్చే వాన - చీర కొనే వరకూ పోదు గా! అందుకే బయటకు వచ్చా!"


పంపిన వారు : మోహన కృష్ణ తాత

ప్రచురించిన తేదీ: 12/07/2023.

-------------------------------------------------------------------------------------------------------------------------------

625 views0 comments

Comentarios


bottom of page