top of page

జోక్స్ 4


Telugu Jokes Published In manatelugukathalu.com

తెలుగు జోక్స్ (చెణుకులు) - మనతెలుగుకథలు.కామ్1. బాస్ చేత చివాట్లు తిని వచ్చాడు సురేష్.

"బాగా హర్ట్ అయ్యావా..?" అడిగాడు నరేష్.

"మా ఆవిడకంటే బాస్ చాలా నయంరా! అయన పావుగంట తిట్టినా నాకు స్పృహ తప్పలేదు" నవ్వుతూ చెప్పాడు సురేష్.

***

2. "మా అయన నా మెయిల్స్ చెక్ చేస్తున్నాడు. ఆపడం ఎలా?" అడిగింది కావ్య.

వైరస్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసి అందులో వెయ్యి. చచ్చినా ఓపెన్ చెయ్యడు" సలహా ఇచ్చింది నవ్య

***

3. "మా అయన నా మెయిల్స్ చెక్ చేస్తున్నాడు. ఆపడం ఎలా?" అడిగింది సోనీ.

"పాస్ వర్డ్ మార్చు" చెప్పింది లిజి.

"ఆలా చేస్తే అయన కూడా పాస్ వర్డ్ మార్చుతాడే. అప్పుడు నేను కూడా అయన మెయిల్స్ చెక్ చెయ్యలేనుగా " బాధ పడుతూ చెప్పింది సోనీ.

***

4. "నాలో ఒక లోపం గురించి మా ఆవిడ ఎప్పుడూ సణుగుతూనే ఉంటుంది" చెప్పాడు దినకర్.

"ఏమిటది?" అడిగాడు రాజేష్.

"అదే గుర్తుకు రావడం లేదు" అన్నాడు దినకర్.

"మతిమరుపు అయి ఉంటుంది" అన్నాడు రాజేష్.

"అవును. అదే.. ఎలా కనిపెట్టావ్?" ఆశ్చర్యపోయాడు దినకర్.


***

5. యాక్సిడెంట్ అయిన భర్తను హాస్పిటల్ లో అడ్మిట్ చేసి బయట వెయిట్ చేస్తోంది భార్య.

"మీరు చాలా లక్కీ అండీ. స్పృహ రాగానే వైఫ్ వైఫ్ అని కలవరిస్తున్నారు మీవారు" చెప్పింది నర్స్.

"నా మొహం.. అయన కలవరించేది వైఫై అని. మొబైల్ గేమ్స్ ఆడుకోవడానికి.." చెప్పింది భార్య.

***

6. లావుగా ఉన్న గర్ల్ ఫ్రెండ్ తో పార్టీకి వచ్చారు సందీప్.

"అదేమిటి..? నువ్వు బొటనవేలికి ఉంగరం పెట్టుకున్నావు? నీ గర్ల్ ఫ్రెండ్ చిటికిన వేలికి ఉంగరం పెట్టుకుంది..?" పక్కకు పిలిచి అడిగాడు స్నేహితుడు వరుణ్.

"మేమిద్దరం రింగ్స్ మార్చుకున్నాంలే.. ఆవిడ ఉంగరం నా మిగతా వేళ్ళకు లూజ్. నా ఉంగరం ఆవిడ చిటికిన వేలికి మాత్రమే పడుతుంది" చెప్పాడు సందీప్.

***

7. "నాకు బా..గా.. ఆకలిగా ఉంది" భార్య చెవిలో గుసగుసగా చెప్పాడు మధు.

మరోలా అర్థం చేసుకున్న భార్య "అలాగే.. కానీండి" అంది గోముగా.

అంతే.. ఆవిడ తనకోసం ఆర్డర్ చేసుకున్న పిజ్జా క్షణంలో లాగించేసాడు మధు.

***

8. అద్దంలో తనని చూసుకొని మురిసిపోతున్న భార్య దగ్గరకు వచ్చి "బ్యూటిఫుల్.." అన్నాడు భర్త.

"నేనా లేక అద్దంలో నా ప్రతిబింబమా" అతిశయంతో అడిగింది భార్య.

"రెండూ కాదు. కొత్తగా కొన్న ఈ అద్దం" భయపడుతూనే జోక్ చేసాడు భర్త.

అద్దం ముక్కలు గుచ్చుకొని అతగాడు హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడని మీకు వేరే చెప్పనవసరం లేదనుకుంటా..


పంపినవారు: మనోజ్

ప్రచురించిన తేదీ: 20/07/2023

========================================================================

9. భార్య : ఏవండీ! మీరు హాస్పిటల్ లో జాయిన్ అయినప్పటినుంచీ, వచ్చిన పండ్లు అవి! అందరూ ఆపిల్స్ తెస్తున్నారండీ!

భర్త : ఈసారి ఎవరైనా వస్తే, ఆపిల్స్ బదులు, టమోటా తెమ్మని బోర్డు తగిలించవే! టమోటా చారు తిని చాలా రోజులైంది!

***

10. రమేష్, రాము ఇద్దరూ సిటీ బస్సు లో వెళ్తున్నారు. సడన్ గా, బయట ఒక ఆక్సిడెంట్ చూసారు. రమేష్ ఎప్పుడూ ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనుకుంటాడు.

అప్పుడు రమేష్ "accident was happened on the road "

అప్పుడు రాము" accident has happened on the road " అనాలి. తెలియక పొతే మాట్లాడకు. కొంత సేపు తర్వాత " టికెట్ తియ్యడానికి purse కోసం జేబులో చెయ్యి పెట్టాడు రాము. purse లేదు.

"నువ్వు నా purse చూసేవా రమేష్? "

"ఇందాక purse కిందన పడిపోయింది. purse was fallen లేక purse has fallen అనాలో తెలియక మాట్లాడలేదు."

***

పంపినవారు: మోహన కృష్ణ తాత

ప్రచురించిన తేదీ: 20/07/2023

========================================================================

11. హాస్పిటల్ లో డాక్టర్ చాలా బిజీ గా ఉన్నారు.

నర్సు: డాక్టర్ గారు! మిమల్ని అభినందించడానికి చాలా మంది వచ్చారండి! పంపించమంటారా?

డాక్టర్: ఎంతమంది వచ్చారు?

నర్సు: ఒక నలభై మంది ఉంటారు. అందరు ఫ్రూట్స్, స్వీట్స్ తో వచ్చారు!

డాక్టర్: అందరిని పిలిచే అంత టైం లేదు నాకు. ఒక పని చెయ్యి! టమాటా తో అభినందించడానికి వచ్చిన వారిని పంపించు.

పంపినవారు: మోహన కృష్ణ తాత

ప్రచురించిన తేదీ: 22/07/2023

========================================================================

12. టీచర్: "ఒరేయ్ రాము! నేను హోంవర్క్ 10 సార్లు రాయమంటే, ఒక సారే రాసావేంట్రా?"

రాము: "నేను ఒక్కసారి రాస్తే, 10 సార్లు రాసినట్టే టీచర్"... అన్నాడు రజనీ స్టైల్ లో...

అప్పుడు టీచర్: "నేను 100 సార్లు కొడితే, ఒక్క సారి కొట్టినట్టే..."

పంపినవారు: మోహన కృష్ణ తాత

ప్రచురించిన తేదీ: 24/08/2023

========================================================================

13. నా లైఫ్ లో ప్రతి ఇయర్ ఎవ్వరో అజ్ఞాతవాసి నాకు ఈరోజు ఐనా కనీసం ప్రపోస్ చేస్తాడు ఏమో అని ....చిన్నపాటి నుంచి పిచ్చి భ్రమలో ఉండటమే......అది నిజం మాత్రం అవ్వదు ....ఈ వాలెంటైన్స్ డే కి జోక్ ఎం చెప్పలేను ...ఎందుకు అంతే వాలెంటైన్స్ డే అంటేనే ఒక జోక్

పంపినవారు: వి వైషు

ప్రచురించిన తేదీ: 14/02/2024

========================================================================

14. టీచర్ : బంటి ఎందుకు నిన్న హోంవర్క్ చేసుకో రాలేదు ?

బంటి : టీచర్ నిన్న మా అంకుల్ వాళ్ల హోమ్ లో ఉన్నాను, అది మా హోమ్ కాదుగా టీచర్ వర్క్ చేయడానికి, సో అందుకే హోమ్ వర్క్ చేయలేదు

టీచర్ : ఆ..!

పంపినవారు: M. వేణు

ప్రచురించిన తేదీ: 16/04/2024

========================================================================

348 views0 comments

Komentar


bottom of page