top of page

దక్షిణ దేశ యాత్ర మొదటి భాగం


'Dakshina Desa Yathra - 1' New Telugu Web Series


Written By Ayyala Somayajula Subrahmanyam


రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


(నవగ్రహక్షేత్రాలు+పంచభూత లింగక్షేత్రాలు+పంచ సుబ్రహ్మణ్యక్షేత్రాలు+రామేశ్వరము+ కన్యాకుమారీ+మధుర.. మొదలగు నవి)

మొత్తము చూసిన క్షేత్రములు నలభై.

________________________

సాయికృష్ణా ట్రావెల్స్‌ ద్వారా జూలై తొమ్మిది బయలు దేరి మర్నాడు ఉదయము 6. 45Am కు ఎగ్‌మోర్‌ కు చేరు కున్నాము. అక్కడ కాలకృత్యములు మరియు ఉపాహారములు సేవించి మరల తొమ్మిది గంటలకు తిరుచ్చి పయనమైతిమి. తిరుచ్చి చేరుకునేసరికి దాదాపు ఒంటిగంట అయినది. అచటనుండి మరల కుంభకోణమునకు పయనమైతిమి. సాయంత్రము నాలుగు గంటలకు కుంభకోణమునకు చేరుకుంటిమి.


ఎందుకనగా నవగ్రహ ఆలయము లన్నియూ కుంభకోణ పరిసరములలోనూ, దగ్గర దగ్గర గా ఉండుటవలన కుంబకోణము ను హాల్టీంగ్‌ పాయింట్‌ గా పెట్టు కున్నాము. మొత్తం అరవై మంది ఆరు మినీ బస్సులలో (విత్‌ ఏసీ ) ప్రయాణం.


తమిళనాడులోని నవగ్రహ దేవాలయాలు కుంబకోణం సమీపంలోని చోళరాజులచే నిర్మితమైన దేవాలయాల సమూహం. హిందూపురాణాల ప్రకారం, కాలవ ఋషి

కుష్టు వ్యాదితో పాటు తీవ్రమైన అనేక వ్యాదులతో బాదపడుచుండెను. ఆ సమయమున ఆ ఋషి అనేక విధముల, వివిధ స్తోత్రములతో నవగ్రహాలను ప్రార్థించెను.

అతని భక్తికి మెచ్చి నవగ్రహాలు మహర్షికి వైద్యం అందించాయి. మానవులకు వరాలు అందించే శక్తి గ్రహాలకు లేవని భావించిన సృష్టికర్త బ్రహ్మ కు కోపం వచ్చింది.


ఆయన నవగ్రహాలు కుష్టి వ్యాధితో బాధ పడమని వారిని శపించెను. అప్పుడు నవగ్రహాలు శివుని ప్రార్థించాయి. వారికి దర్శనమిచ్చి ఈ స్థలం తమదేనని, ఆ స్థలం నుండి తమను పూజించే భక్తులను అనుగ్రహించవలసి ఉంటుందని చెప్పెను. ఒక్కో దేవాలయము ఒక్కో గ్రామములో కలదు. మరియు ఈ గ్రామాలు నవగ్రహ నివాసాలుగా పరిగణింప బడుతున్నాయి.


వీటిలో ఎనిమిది ఆలయాలు శివునికి అంకితం చేయ బడ్డాయి. సూర్యదేవాలయము మాత్రము గ్రహానికి అంకితం చేయబడ్డది. ఇది పూర్తిగా సూర్యభగవానుని మరియు ఇతర

నవగ్రహాల దేవతల ఆరాధనకు అంకితం చేయబడ్డది. మొదటిది ప్రదానదేవతగా, రెండవది పరిచారిక దేవతగా పూజించబడుతుంది. ఇది పదకొండవ లేదా పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడినది. మిగిలిన దేవాలయాలు 7వ-9వ శతాబ్దిలో నిర్మితమైనవి. -----


1. సూర్యగ్రహం: సూర్యనార్‌ కోవిల్‌( తంజావుర్‌ జిల్లా)

శివలింగం- అగస్తేశ్వర,

అమ్మవారు- ఉష, పద్మినీ


2. చంద్రగ్రహం: తింగలూరు( తంజావురు)

శివలింగం-కైలాసనాథ,

అమ్మవారు-పెరియనాయకి


3. అంగారక గ్రహం: వైధీశ్వరన్‌కోవిల్‌( మైలాడుతురై జిల్లా)

శివలింగం-వైధీశ్వర,

అమ్మవారు-తయ్యక్‌నాయకి


4. బుధగ్రహం: తిరువెంగడు( మైలాడుతురై ) (తిరునాగేశ్వరము)

శివలింగం-శ్వేతారణీశ్వర.

అమ్మవారు-బ్రహ్మవిద్యాంబిక


5. గురుగ్రహం: అలంగుడి( తిరువారూర్‌ జిల్లా).

శివలింగం-ఆపత్సహాయేశ్వర.

అమ్మవారు-ఏళవర్‌కుళని.


6. శుక్రగ్రహం: కాంచనూర్‌ ( తంజావూరు).

శివలింగం-అగ్నీశ్వర.

అమ్మవారి పేరు-కర్పగవల్లి.


7. శనిగ్రహం: తిరునల్లార్‌( కాంచనూరు).

శివలింగం-ధర్భారణ్యేశ్వర

అమ్మవారి పేరు-పూన్‌మలై (భోగవతీ దేవీ)


8. రాహుగ్రహం: తిరునాగేశ్వరం( తంజావురు).

శివలింగం-నాగనాధ.

అమ్మవారి పేరు-గిరికుచాంబిక.


9. కేతుగ్రహం: కీజ్పెరుపల్లం( మాలాడుతురై).

శివలింగం-నాగనాధ.

అమ్మవారి పేరు-సౌందర్యనాయకి.


ఇందులో ఆరు క్షేత్రాలు, కావేరీ నదికి ఉత్తర దిశగా మరియు మూడు క్షేత్రాలు దక్షిణ దిశగా కలవు

----------------------------

ఈ దేవాలయాలు చోళరాజుల కాలం నాటివి. వీటిలో కొన్ని చోళుల కంటే ముందుకల పల్లవుల కాలం నాటివిగా చెబుతారు. వీటిని దర్శించుకున్న భక్తులు తమ తమ

గ్రహపీడలను విశేషంగా తొలగించుకుంటారు. భారతదేశంలో అత్యద్భుత నిర్మాణాలు అంటే.. మొట్ట మొదటగా చెప్పుకోవలసింది ఆలయాలే.


ఏకశిలలు, గండశిలలను సైతం వెన్నముద్దలుగా మలచి.. ఎలాంటి సాంకేతిక అందుబాటులో లేని వేల ఏండ్లనాడే అద్భుతాలు సృష్టించిన శిల్పులు ఎందరో. ముఖ్యంగా దక్షినాదిలో ఏ ఆలయాన్ని చూసినా తనివితీరదు. నాటి రాజులంతా.. ఒక సాంస్కృతిక కేంద్రాలుగా ఈ ఆలయాలను అభివృద్ది చేశారు. వెయ్యేండ్లు దాటినా ఆ ఆలయాలు చెక్కుచెదరకుండా మనకు కనిపిస్తున్నాయి. ఇదంతా మనం చూడని.. మన కనుల ముందు జరగని చరిత్ర.


ఈ ఆలయాన్ని ఫలానా రాజు నిర్మించాడని చదవుకోవడం తప్ప.. ఆ నిర్మాణ అనుభూతి మనకు తెలియదు. మన కనులముందో.. నాటి రాజరాజచోళుడో.. కాకతి రుద్రదేవుడో, శ్రీకష్ణదేవరాయలో.. నాయకరాజులో.. పల్లవులో నిర్మించారని కథలు కథలు గా చెప్పుకుంటున్నాము.

మూడు రోజులలో నవగ్రహ దేవాలయాల సందర్శన జరిగింది. వీటితో పాటు కుంభకోణం పరిసర దేవాలయాల సందర్శన జరిగింది. స్వామీమలయై, చిదంబరం,

మరియు సారంగపాణీ క్షేత్రాలు:

స్వామీమలై: ఈ ఆలయం ప్రముఖ మురుగన్‌ క్షేత్రం. కుంబకోణమునకు ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు. మరియు కావేరీ నదీ తీరము తంజావూరు పట్టణము

నకు దగ్గరగా కలదు. ఆరు ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రలలో ఒకటి.


చిదంబరం: ఈ ఆలయాన్ని చిదంబర నటరాజ ఆలయము గా పిలుస్తారు. చాలా పురాతన మైన క్షేత్రం. పంచభూతాలలో ఒకటైన ఆకాశతత్త్వానికి ఈ ఆలయం ప్రతీకగా పరిగణిస్తారు. చిదంబరం అంటే ఆకాశలింగం అని అర్థం. శ్రీకాళహస్తిని వాయువుకు ప్రతీకగా, కంచిలోని ఏకాంబరేశ్వరుడిని భూమికి ప్రతీకగాచెబుతారు.

మూడు దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉంటాయి.


మరో విచిత్రం ఏమిటంటే ఈ మూడు దేవాలయాలు శాస్త్రీయపరంగా 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం ఉన్నట్లు ఋజువయ్యింది. శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు.

ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనుకభాగంలో ఓ చక్రం ఉంటుంది. దానికి ముందు

భాగంలో బంగారం బిల్వపత్రాలు ఉంటాయి. అయితే వీటిని భక్తులకు కనబడకుండా ఓ తెరను అడ్డు ఉంచుతారు అక్కడి పూజారులు. అయితే ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రం భక్తులకు చూపిస్తారు. ఈ ప్రదేశాన్నే శివోహంభవ అంటారు.


శివ అంటే దైవం, అహం అంటే మనం. మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం. ఏ రూపం లేకండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవసన్నిధి అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్ర ప్రాశస్త్యము. అదే చిదంబర రహస్యమని చెబుతారు.


కుంభేశ్వరస్వామి క్షేత్రము: తమిళనాడు లోని కుంభకోణాన్ని ఆలయాలపుట్ట అని అంటారు. సృష్టి కార్యం ప్రారంభం కావడానికి ముందే ఈ ప్రాంతం ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇక్కడ ప్రతీ అడుగుకు ఒక ఆలయం

కనిపిస్తూ ఉంటుంది. అందులో కుంభేశ్వర ఆలయం చాలా ప్రాముఖ్యము కలిగినది.


దీనిని ఆదికుంభేశ్వరఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రధాన దైవం లింగ రూపంలో ఉన్న పరమశివుడు. మిగిలిన శివలింగాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఒక కలశం ఆకారంలో పక్కాగా చెప్పాలంటే కూజా ఆకారం లో ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని మంగళనాయకి అని అంటారు. ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి ఆలయం ఉంది.

ఇక బ్రహ్మ సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందే ఈ శివలింగం ఏర్పడటం వల్ల దీనిని ఆదికుంభేశ్వరక్షేత్రం ( లింగం) అని అందురు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని15

వ శతాబ్దంలో తంజావూరు నాయకులు విస్తరింపజేశారు.

ఇక్కడి అమ్మవారిని సందర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ముఖ్యంగా పెళ్ళికాని వారికి వెంటనే వివాహం అవుతుందని, సంతానం లేనివారికి సంతానము చేకూరుతుందని భక్తుల నమ్మకం.


సారంగపాణి క్షేత్రము: కుంభకోణం దగ్గరగా కావేరీ నదీ తీరాన పంచరంగనాధ ఆలయాల్లో ఒకటి. విలక్షణమైన పురాతన మందిరం. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి కథతో ముడిపడి ఉన్న ఈ గుడిలో విష్ణుమూర్తి ఇల్లరికపు అల్లుడుగా కొలువు తీరాడు. 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ప్రముఖమైనది. ఇక్కడ.. ఉత్తరద్వార దర్శనంలేదు. స్వామీవారే ప్రత్యక్షంగా వచ్చి ఉన్నారు కాబట్టి.

150 అడుగుల ఎత్తు, 11 అంతస్తులతో సమున్నతంగా కనిపించే రాజగోపురం, తమిళనాడులోని మూడో అతిపెద్ద రాజగోపురం.


===============================================

ఇంకా ఉంది...


దక్షిణ దేశ యాత్ర రెండవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

===============================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


ఇక్కడ క్లిక్ చేయండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


Twitter Link

https://twitter.com/ManaTeluguKatha/status/1629125368069365760?s=20

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


https://www.manatelugukathalu.com/profile/ayyala/profile


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.96 views0 comments
bottom of page