top of page

ఏదీ వూరికే రాదు'Edi Urake Radu' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 18/12/2023

'ఏదీ వూరికే రాదు' తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంతఫ్రెండ్ పంపిన ఇండియా పోస్ట్ నవరాత్రి గిఫ్ట్ వోచర్ చూసి, ఓ! ఇదేదో, చూద్దామని దివ్య దానిపై వేలు పెడితే, తెరుచుకుంది. వెంటనే ఆరుబాక్సులు కనపడ్డాయి. ఇదివరకు ఇలానే, ఒక ఫ్రెండ్, జూవెలర్సు వాళ్లది పంపితే రాలేదు. ఇది కూడా, అదేనేమో! అనుకుంది గీత. 


 ఇండియా, పోస్ట్ మీద నమ్మకం, పంపిన ఫ్రెండ్ మీద, ట్రస్టుతో మళ్ళీ ఆ బాక్స్ మీద, ఫింగరుతో టచ్ చేస్తే, ఏమి రాలేదు. మీకు తెలియదు కానీ గీతకూ శని ఫెవికాల్ అంత దృఢంగా అంటుకుని ఉండటంవల్ల దేవుడు కూడా ఏమి చేయలేక టూటేగా నహి అంటూ గాయబ్ అయ్యాడు. 


 ఇంకా రెండు, చాన్సులున్నాయని ఆశ చావక మళ్ళీ, బాక్సును టచ్ చేసింది. "ఈసారి కంగ్రాట్స్ మీరు ఐఫోన్, గెల్చుకున్నారు. "


 'నేను ఐ ఫోన్ గెలుచుకున్నా!' సంతోషంతో అరవబోయి గీత పక్కనున్న దాన్ని చదివింది. 


 ఈ యాడును, మీరున్న, ఐదు గ్రూప్సుకు మరియు ఫిఫ్టీన్ ఫ్రెండ్సుకు షేర్ చేయండి, అక్కడొక స్కేల్ ఇచ్చాడు. అది లోడయ్యే దాకా మీ ఫ్రెండ్సుకు, షేర్ చేస్తూనే, ఉండండన్నారు. ఫ్రీగా ఐ ఫోనోస్తే ఇవి షేర్ చేయటం ఎంతసేపనీ! చేస్తూనే ఉంది. ఇండియను పోస్ట్ మీద నమ్మకంతో, పదిహేనేం కర్మా, నూట, పదిహేనుమందికి చేసుంటుంది. వూహూ ఎంతకీ స్కేల్, ఫులవ్వటము లేదని విసుగొచ్చి వంట చేయాలని ఎగ్జిట్ అయింది గీత.


 కింద కామెంట్సులో, ఇది నిజంగా జెన్యూన్, నేను, గిఫ్ట్, పొందాననీ రాసిన వాళ్ల పీక నొక్కాలనిపించింది గీతకు. యాడ్ షేర్ చేసిన కొంతమంది, ఇది, ఫేక్ మేడమని మర్యాదగా, టైప్ చేసారు. గీత ఫ్రెండ్స్, మాత్రం ఎన్నిసార్లు నువ్వు ఫూల్ అయ్యి, మమ్మలని చేస్తావే! నీకు పనిపాట లేదూ! మాకున్నాయే! అని తిట్లతో పెద్ద మెస్సులిచ్చి ఈసారి ఇలాంటివి షేర్చేస్తే, బాలకృష్ణలాగా! నీనట్టింటికి వచ్చి కొడతామన్నారు. బుద్దివచ్చింది ఇక ఎప్పటికీ! ఇలాంటివాటి జోలికి వెళ్లకూడదనుకుంది గీత. 

 

 పండగయిన తర్వాత గీత ఫ్రెండు దివ్య కాల్ చేసింది గీతకు. "ఏంటే ఎలా వున్నావని!" గీతకు ఫ్రెండ్ కమ్ చుట్టం కూడా! అవుతుంది ఈ దివ్య. గీతా! వాళ్ల ఆయనకు కజిన్. దివ్య పెళ్లిలో గీతను చూసి గోవిందు పెళ్లి చేసుకున్నాడు. 


 "బావున్నా నువ్వెలా  ఉన్నావని!" అడిగింది గీత. "మొన్న పండక్కి అదేదో ఇండియ పోస్టని పంపావు. నీకేమన్నా గిఫ్టు వచ్చిందానే!” అడిగింది దివ్యా. 


 "లేదే! ఎంతమందికి షేరు చేసినా ఆ స్కేలు నిండలేదే! విసుగొచ్చి ఎగ్జిటయ్యాను" అంది గీత. 


 "అసలు నువ్వు మన కాలేజ్ డేస్లో కూడా ఇంతే చేసేదానివి. అపుడు నీకు గుర్తుందా గీతా! ఒక పోస్టుకార్డు వచ్చేది. దానిలో జై సంతోషిమాతా పేరుతో ఒక వంద కార్డులు ఒక వారంలోగా రాసి అందరికీ పంచండి. లేదంటే మీరు ఆ తల్లి శాపానికి గురౌవుతారనుంటే! నువ్వు కార్డులు రాసి అందరికీ పంచావు. వందమందికి ఇవ్వలేకపోయా! ఇంకా పది కార్డులు బాకీ వున్నావని ఆలోచించి వారం అయింది సంతోషి మాతా ఏమి చేస్తుందోనని! దిగులుపడి జ్వరం తెచ్చుకున్నావు గుర్తొచ్చిందా!”


“ఇంకా నీవు ఆ పిచ్చి మానలేదుటే గీత. అవన్నీ బోగసు ఇపుడు అందరూ! కొరియర్ చేస్తున్నారని ఇండియా పోస్ట్ అలా చేస్తుందనుకోవచ్చు”. 


ఇంతలో గీత భర్త గోవిందు ఆఫీసు నుండి వచ్చి “ఎవరే! ఫోన్లో” అంటే, మీ చెల్లి నా ఫ్రెండు ఇదిగో మాట్లాడుతూ ఉండండి వీడియో కాల్లో వుంది” మీకు కాఫీ తెస్తానని లోపలికి వెళ్ళింది గీత. 


 "దివ్యా, బావున్నావా! ఏంటి ఇంతకాలానికి ఈ అన్న మీద దయ కలిగిందన్న" గోవిందు మాటలకు "ఆ బావున్నా అన్నయ్య! మీ ఆవిడే ఈ ఫోన్ చేయటానికి కారణం" అంది. 


 "అంతేలే నీ ఫ్రెండ్ గుర్తుంది కానీ! ఈ అన్నను మర్చిపోయావుగా!" అన్నాడు గోవిందు. 

 

 "మీ ఆవిడే! నయం గుర్తుపెట్టుకుని ఏవో షేరు చేసి మమ్మలని మర్చిపోకుండా! చేస్తుంది. నువ్వు కాల్ చెయ్యవూ! నేను చేస్తే నన్ను మర్చిపోయావా! అంటావు. ఇది మరీ బావుందంది" దివ్య. 


 "సర్లే! ఎవరోకరం చేస్తున్నాముగా! మా ఆవిడ ఏమి చేసింది షేరు" అని ఆసక్తిగా!" అడిగాడు గోవిందు. 


 గిఫ్ట్ సంగతి చెప్పింది దివ్యా. దీనితో చస్తున్నాను "మా ఫ్రెండ్స్ భార్యలకు కూడా చేసిందిటా ! వాళ్ళు వాళ్లకు తెలిసినవాళ్ళకు షేరు చేసారుట. ఇలా వూళ్లోని నా ఫ్రెండ్సు మీ ఆవిడ మాకు గిఫ్ట్ కార్డు షేరు చేసింది మీకు ఏవన్నా గిఫ్ట్స్ వచ్చాయా!" అని ఒకటే ఫోన్లు. 


 గీతకు టచ్ ఫోన్ కొనిచ్చి తప్పు చేసాను. దీని జాలి గుండె తగలబడా! అన్నిటినీ, అందర్నీ నమ్ముతుంది. రియల్ ఎస్టేట్ వాళ్లోచ్చి కాలింగ్ బెల్ కొడితే! తలుపు తియ్యకంటే వినదు. తీసి వాళ్ళు చెప్పినవి విని నా ఫోన్ నంబర్ వాళ్లకు ఇస్తుంది. నేను నిన్న మా బాసుతో మాట్లాడుతుంటే ఫోన్ చేసి ప్లాట్ దగరికి ఒకసారోచ్చి! చూడమని గోల. ఫోన్ కట్ చేస్తుంటే మాబాసు చాలా ముఖ్యమైన ఫోన్ కాలు ముందు వాళ్లతో మాట్లాడనీ" వ్యంగ్యంగా అన్నాడు. 


 

 "ఇట్లా నీ ఫ్రెండు షేర్వేణితో చస్తున్నా!" కోపంగా గోవిందు అంటుంటే గీత కాఫీ కపు గోవిందు చేతికిస్తూ 

 "షేర్వేణి ఎవరూ!"అంది గీత అనుమానంగా! గోవిందుతో. నువ్వే అన్నీ! షేర్ చేస్తావని ఇపుడే నీ పేరు మార్చానన్నాడు. " "మీ బాసు మీదున్న కోపం నామీదేగా చూపించేది కోపంగా! అంది గీత. టాపిక్కును మార్చాలని "భలే పేరు పెట్టావు అన్నయ్యా! గీత కన్నా షేర్వేణి పేరే సూపర్" అంది దివ్య. 


 "చూపుడు వేలు ఖాళీగా వుందని పిచ్చిపిచ్చివి ఎవరికి బడితే వాళ్లకు షేరు చేయకు. ఇవాళ ఆఫీస్లో అందరూ! మీకు గిఫ్ట్ ఏవన్నా వచ్చిందా! అంటే నేను తెల్లబోయి ఏమి గిఫ్టు అంటే "గీతగారు మాకు షేరు చేసారు. "ఇలాంటివి గ్రూపు లోకి ఏమొచ్చినా! గీత గారూ భలే షేరు చేస్తారనీ! వ్యంగ్యముతో కూడిన జాలి కామెంట్లును తట్టుకోలేక చస్తున్నానన్నాడు" గోవిందు దివ్యతో. 


 "గీతా! మా అన్నయ్యా చెప్పింది వినొచ్చుకదే!" అంటూ క్లాస్ తీసింది దివ్య. "అబ్బో! నువ్వు బాగా మా అన్నగారి మాట వింటునట్లు గీతను చూస్తూ!" వెటకారంగా అంది గీత. 


 "సర్లే కానీ గీతా, ఎర్ర చీరలు, ఎర్ర గాజులు ఈ దీపావళికి ఆడపడుచు, వదినలున్నవారు ముఖ్యంగా! కోనాలిట. నువ్వు మా అన్నయ్య భార్య నాకు వదినవు కాబట్టి నీవిక్కడకు వస్తె నీకు రెడ్ శారీ పెడతాను" అంది దివ్య. 


 "ఇపుడే ఒకళ్ళు నన్ను నవరాత్రి గిఫ్టనీ!ఎక్కిరించారు తమరు చేసేది ఏమిటో!"అంది గీత దివ్యను ఉద్దేశించి వ్యంగ్యంగా నవ్వుతూ


 నీది వేరు, నాది వేరు అన్న దివ్యతో గోంగూర మొక్కేమి కాదూ! అని గోవిందుతో "నీ చెల్లెలుంగారు రెడ్ శారీ కొంటుందిటా. నాకైతే క్లాస్ తీస్తారు మరి మీ చెల్లెలుకు ఇదిగో ఫోన్ ఇస్తున్నా! బాగా క్లాస్ తీయండంటూ! గోవిందు చేతిలో పెట్టింది, దొరికింది దివ్య అనుకుంటూ! గీత. 


 యేంటమ్మా! దివ్యా, ఇవన్నీ మూఢ నమ్మకాలు. ఎర్ర చీరలు ఎర్ర గాజులు అమ్ముడు పోకుండా ఉండటం వల్ల వ్యాపారులందరూ కలిసి చేస్తున్న బిజినెస్ గోల్ ఇది. మీ బలహీనతలు వ్యాపారులకు ప్రాఫిట్స్. ఇపుడే మా ఆవిడకు ఉపదేశం చేసి నీ డిమాండుకు తలవంచితే మా ఆవిడ ఇప్పటికే రా! రా! రావాలయ్య! నువ్వు రావాలయ్యనీ! నన్ను లోపలికి, పీలుస్తుంది, అప్పడాలకర్రతో, నవ్వుతూ!" అన్నాడు గోవిందు. 


 "నాకు అదంతా తెలియదు అన్నయ్యా. గీతా! నువ్వు రండి దసరాకి. ఎటూ! మనం పండుగలకు చీరలు పెట్టుకుంటాము కాకపోతే అది ఎర్ర చీర అంతే తేడా. గీతకు పెడితే ఇంకా! మంచిదని" దివ్య బతిమాలడంతో చేసేదిలేక ఒప్పుకున్నాడు గోవిందు. 


 "ఏంటే దివ్యా! గీత అంటున్నావు. ఎంత బలుపు నీకు వదినగారు అనాలనీ! తెలీదా! నన్ను వదిన గారనకపోతే నేను మీ ఇంటికి రానంది" గీత నవ్వుతూ. 


 "ఒసేయ్ ఈ చీర పెట్టటం అయిన తర్వాత నా చేతిలో నీకుందిలే అన్న దివ్యతో "అయితే నిజంగా! నేను మీఇంటికి రానంది" గీత. 


 గీతతో "నీకు దివ్య ఆడపడుచుగా! నువ్వు ఎర్ర చీర, గాజులు కొను. అపుడు మా చెల్లిని నువ్వు వదినగారు అను చెల్లుకు చెల్లు అన్నాడు" తీర్పు ఇస్తున్న పెదరాయుడు ఫోజులో గోవిందు. 


 "అబ్బా మంచి ఐడియా! ఇచ్చావు అన్నాయి. గీతను ఇక రఫ్ ఆడుకుంటానంది దివ్యా. "


 మీఇద్దరు వాదనలు ఆపితే నేను ఒక ఎర్ర లుంగీ కొనుక్కొని మీతోపాటు నారాయణ మూర్తి లెవెల్లో ఎర్రజెండ ఎర్ర జెండ ఎన్నీయల్లో పాడుకుంటానన్నాడు గోవిందు కళ్ళు, మూతి, తిప్పుతూ!, ఆమాటకు ముగ్గురు నవ్వుకున్నారు


 దసరాకి! ఎర్ర చీరలన్ని అమ్ముడుపోవటంతో వచ్చే సంక్రాంతికి, మిగిలిన దోవతులు, లుంగీలు నాన్నలకు, మామయ్యలకు పెడితే మంచిదని ప్రచారం చేయాలని పట్టణ వస్త్ర వర్తకసంఘం నిర్ణయించింది. 


 నీతి: ఏదీ వూరికే! రాదు దాని వెనుక మన బలహీన కోరిక ఒకటుంది. గమనిస్తే మీకు లాభం. లేదంటే వాళ్లకు లాభం. ఇది నా తొక్కలో వువాచ. 

***

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.96 views5 comments
bottom of page