top of page

నిజాయితీ ఖరీదు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Nijayathi Kharidu' New Telugu Story By Dr. Shahanaz Bathul


రచన : డా: షహనాజ్ బతుల్

ఊరిలో జనమంతా కలెక్టరు గారికి స్వాగతం పలకటానికి నిరీక్షిస్తున్నారు. కలెక్టర్ శిరీష గారికి స్వాగతం అని బ్యానర్ పెట్టారు.

ఊరి సర్పంచ్ గారు పూలదండ పుచ్చుకొని నిల్చున్నారు. ఆయన ప్రక్కన కొంతమంది పెద్దమనుషులు నిల్చున్నారు. కొంతమంది బోకెలు పుచ్చుకొని, నిల్చున్నారు. కొంతమంది మహిళలు ఒక చోట దండ పుచ్చుకొని, నిల్చున్నారు.

తమ ఊరిలో పుట్టి, మన ఊరి బడిలో చదివిన అమ్మాయి ఒక కలెక్టర్ కావడం అందరికీ సంతోషముగా ఉంది. ఆ ఊరి వాళ్లకు విశేషము కూడా.

సుజన ఒక వైపు నిల్చుంది. తన ఊరిలో పుట్టి, తను చదివిన బడిలో చదివింది. ఎవరై ఉంటారు? నేను చూసే ఉంటానా?

మామూలు నూలు చీర, వాడీ పోయిన ముఖము, చాలా బీద అమ్మాయిలా చదువుకోనీ అమ్మాయిలా కనిపిస్తుంది. సుజనను చూస్తే, ఎవ్వరూ చదువుకున్న అమ్మాయి అనుకోరు. రాబోయే కలెక్టర్ గురించి ఆలోచిస్తూ నిల్చుంది. “కలెక్టరు మేడం వస్తున్నారు”. ఎవరో అరిచారు.

అందరూ అలెర్ట్ అయ్యారు. కారు వచ్చి ఆగింది. వెనకాల పోలీస్ కారు వచ్చి, ఆగింది. బంట్రోతు కారు తలుపు తెరిచాడు. సాధారణమైన వస్త్ర ధారణతో ఒక అమ్మాయి దిగింది. ఒక వైపు నిల్చున్న వృద్ధుడి దగ్గరకు వెళుతుంది. పూల దండ మెడ లో వెయ్యనివ్వలేదు. చేతిలో తీసుకొని, బంట్రోతు కి ఇచ్చింది. గబగబా తాత దగ్గరికి, వచ్చింది.

"రామయ్య తాతా బాగున్నావా? పంటలు బాగా పండుతున్నాయా?"అడిగింది. " ఏదో పండు తున్నాయి. అకాల వర్షాలు పంట నష్టమైంది. నువ్వెవరు నా గురించి తెలుసా?"

" నేను వచ్చేసాను కదా. ఏమి బాధ పడ వద్దు నేను తాతయ్య గంగాధరం మాస్టారి కూతుర్ని." "ఆత్మ హత్య చేసుకున్నారు ఆ మాష్టారు. నీ పేరు లక్ష్మి కదూ." తండ్రి పేరు వినగానే శిరీష కళ్లు చెమ్మగిల్లాయి. కళ్ళు తుడుచుకొని, "నా పూర్తి పేరు లక్ష్మి శిరీష కదా తాతయ్య. అందరూ నన్ను ఊరిలో లక్ష్మి అని పిలిచేవారు." ఈ అమ్మాయి ముఖము చూసినట్లున్నది. ఎవరా ? అనుకున్న ఊరిజనం మన ఊరి లక్ష్మి నా అని ఆశ్చర్య పోయారు.

శిరీష , సుజన వేపు వచ్చింది. "సుజన బాగున్నావా? నీకు పిల్లలు లేరా?" ఈ పాప నా కూతురు అంటూ ఒక 5 సంవత్సరాల పాపను చూపించింది. "పాప నీ పేరేమిటి?" "స్వప్న" "నువ్వు వెంకట్ నీ పెళ్లి చేసుకున్నావు కదా ఇద్దరూ బాగున్నారా?" సుజన తల్లి, సీతమ్మ ప్రక్కనే ఉన్నది.

"ఏమి బాగు లక్ష్మి వెంకట్ వదిలేశాడు.మా ఇంటికి వచ్చింది. మమ్మల్ని కాదని పెళ్లి చేసుకుంది. తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంది." "బాధ పడకు సీతమ్మ. వెంకట్ ఊర్లోనే ఉన్నాడా?" "లేడు." శిరీష అందర్నీ పలకరించింది. అందరూ సంతోషించారు. వచ్చి తన సీట్ లో కూర్చుంది. తనకే ఆశ్చర్యముగా ఉంది. తను చదువుకున్న ఊరికే తన జిల్లాకే కలెక్టర్ గా రావడం. ఆ ఊరు ఆ జిల్లా ముఖ్య పట్టణం. తన మనస్సు గతం లోకి వెళ్ళింది. ***

గంగాధరం బడి పంతులు. అతని కి ముగ్గురు పిల్లలు, పెద్ద కొడుకు గోపాల్ ఎనిమిది చదువుతుంటే, కూతురు శిరీష ఆరవ తరగతి లో ఉన్నది. రెండో కొడుకు పవన్ 5 వ తరగతి లో ఉన్నాడు. సుజన శిరీష క్లాస్మేట్. శిరీష పదవ తరగతి లో ఉన్నప్పుడు, గంగాధరం ఆత్మ హత్య చేసుకున్నాడు.

దానికి కారణం సుజన. శిరీష ఎలా మర్చిపోగలదు. సుజనని ఏమి చేసినా పాపం లేదు అనుకున్నది. చాలా కోపం వచ్చింది.

కానీ శిరీష తల్లి ఆపింది. ఎవరి పాపాన వాళ్ళు పోతారు. తండ్రి చనిపోయాక ఎన్ని కష్టాలు పడ్డారో, తన తల్లి, అన్నపూర్ణమ్మ ఇండ్లల్లో కూలి పని చేసి, తను ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వాళ్లకు ట్యూషన్ చెప్తూ, ఇటు ట్యూషన్స్ చెప్తూ అటు ఇంటర్ చదువుతూ, క్రూర మృగాల వంటి మగ వాళ్ళను తనని తాను రక్షించు కుంటూ, ఎన్నో కష్టాలు పడి, చదివింది. తండ్రి చావు తరవాత కుటుంబము ఊరు వదిలి వెళ్లిపోయింది.

సుజన గొప్పింటి బిడ్డ, బాగా చదివేది కాదు. అందముగా ఉండేది. డబ్బు అందము ఉందని అహంకారంగా మాట్లాడేది. తను ఒక బడి పంతులు కూతురని, పేద వాళ్ళని చిన్న చూపు చూసేది. అవమానించేది. శిరీష మనస్సు గాయపడిన ఏమి చెప్పలేక ఊర్కునేది.

శిరీష క్లాస్ లో ఫస్ట్ వచ్చేది. మంచి మనస్సు ఉంది. ట్యూషన్ లో తక్కువ ఫీజు తీసుకునేది. పొలం లో పనిచేసే వాళ్ళ పిల్లలకు, పేద వాళ్ళ పిల్లలకు ఉచితముగా చెప్పేది.

మన మంచి మనతో ఉంటుంది. చెడు చేసిన వాళ్ళని దేవుడే శిక్షిస్తాడు. ఎప్పుడూ ఒకళ్ల మీద పగ తీసుకోవాలి అని మనస్సులో పెట్టుకోకూడదు అని తల్లి చెప్పింది.

పదవ తరగతి లో ఉన్నప్పుడే, సుజన ప్రేమలో పడింది, వెంకట్ తో ప్రేమలో పడింది. వెంకట్ బాగా చదివేవాడు కాదు. రౌడీ గా జులాయిగా పేరు, పొందాడు. సుజన వెంకట్ కలిసి, సినిమాకు వెళితే, “అలా అబ్బాయిలతో సినిమాకు వెళ్ళవద్దు. వెంకట్ మంచివాడు కాదు.” అని శిరీష చెప్పింది.

“నా దగ్గర డబ్బు ఉందని నీకు కుళ్ళు. నీదగ్గర డబ్బు లేదు. ఎంజాయ్ చెయ్యలేవు”. అంటూ మాట్లాడింది.

గంగా ధరమ్ కి వ్యక్తిగా, ఉపాధ్యాయునిగా మంచి పేరుంది. మానవత్వము మూర్తీభవించిన వ్యక్తి. నిజాయితీ పరుడు. బాధ్యతగా తన విధిని నిర్వర్తిస్తారు. విద్యార్థుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ఒక రోజు పాఠశాల వదిలిన తర్వాత ఏదో వ్రాసుకుంటూ కూర్చున్నారు. అందరూ వెళ్లి పోయారు. ఇక వచ్చేద్దాం అనుకున్నారు. ఒక క్కాస్ రూమ్ లో నుండి ఏవో శబ్దాలు వినిపించాయి. ఎవరా అని చూస్తే అక్కడ సుజన, వెంకట్ కూర్చొని, కబుర్లు చెప్పుకుంటున్నారు. నవ్వుకుంటున్నారు.

పదవ తరగతి లోనే ప్రేమ, ప్రేమ కాదని ఆకర్షణ అని, ప్రేమలో పడి, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని,సున్నితముగా మందలించారు.

ఇంటిలో పెద్దవాళ్ళకు చెప్పుతారని భయపడి, ఇంటికి వెళ్ళాక తన తల్లిదండ్రులతొ గంగాధరం మాష్టారు పాఠశాల వదిలి పెట్టాక, తనని ఉండమన్నారని, తన మీద అత్యాచారం చేయబోయారు అని చెప్పింది.

ఈ విషయము పాఠశాలలో ప్రాకింది. ఊర్లో అందరికీ తెలిసింది. సుజన తండ్రి రామారావు ఆ సమయములో గ్రామ సర్పంచ్. గంగాధరాన్ని కొట్టించాడు.

నీతి, నిజాయితీకి మారు పేరైన గంగాధరం గారు తట్టుకో లేక ఆత్మ హత్య చేసుకున్నారు. "మా నాన్నని వీళ్ళు అర్ధం చేసుకుంది, ఇంతేనా?" అనుకున్నది. శిరీష కళ్ళల్లో నీళ్ళు .

అమ్మ చెప్పినట్లు, సుజనకి దేవుడే శిక్ష వేశాడు. ఎంత ఖరీదైన బట్టలు తొడిగేది? ఇప్పుడు ఎలా అయిపోయింది?

"అమ్మా సుజన గారు తమరి తో మాట్లాడు తారట".అన్నాడు బంట్రోతు

బంట్రోతు పిలుపు తో వర్తమానం లోకి వచ్చింది. "లోపలికి పంపించు." అన్నది.

సుజన వచ్చి,"శిరీష.. నన్ను క్షమించు. నిన్నెన్నో మాటలన్నాను. మీ నాన్నగారు చాలా మంచివారు. నేను మా అమ్మా. నాన్నలకు చెప్తారని, భయ పడి మీ నాన్న మీద నింద వేసాను."

"మా నాన్నగారు తిరిగి రారుగా. అయినా ఒక పని చెయ్యి." "ఏమి చెయ్యాలి." "ఆ రోజు ఏమి జరిగింది అంతా సోషల్ మీడియా లో పెట్టు." "నా పరువుపోతుందిగా" "నీ పరువు వెంకట్ నీ పెళ్లి చేసుకున్నప్పుడే పోయింది. గ్రామ పంచాయితీ లో ఇప్పుడున్న సర్పంచ్ ముందు ఒప్పుకో." "అలాగే. నాకు నువ్వే సహాయము చెయ్యాలి. మా కాపురాన్ని నిలబెట్టాలి." *** శిరీష వెంకట్ని పిలిపించింది. నువ్వు సుజననీ మోసం చేసినందుకు జైల్ లో పెట్టిస్తాను. అని చెప్పేసరికి వెంకట్ ఒప్పుకున్నాడు.

శిరీష వెంకట్ ని బాగా బెదిరించింది. అతను భయపడి పోయాడు. సుజనాని, కూతుర్ని కాపురానికి తీసుకెళతా నన్నాడు.


కాపురానికి తీసుకెళ్ళాక, బాగా చూసుకోవాలి. చిత్ర హింసలు పెడితే, అరెస్ట్ చేయిస్తా నన్నది.

భార్యని కూతుర్నిబాగా చూసుకుంటా నాని వాగ్దానము చేసాడు. ఒక మంచి రోజు చూసి, సీతమ్మ కూతుర్నికాపురానికి పంపింది.

సుజన తల్లిదండ్రులు వచ్చి, శిరీష కికృతజ్ఞతలు చెప్పుకున్నారు.

సుజనా గ్రామ పంచాయితీ ముందు అందరు పెద్దల ఎదుట గంగాధరం మాస్టారి తప్పులేదని, తానే అబద్ధం చెప్పానని, అందుకే తనకు దేవుడు శిక్ష వేసాడని, అయినా తన మీద కోపం లేకుండా, శిరీష తన కాపురం నిల బెట్టిందని చెప్పి, రెండు చేతులు జోడించి క్షమార్పణ అడిగింది.


“ఎంత పని చేశావమ్మా. నిన్ను క్షమిస్తే, నిజాయితీ గల, మంచి మనస్సున మాస్టారు తిరిగి వస్తారా? ఆ తర్వాత అన్నపూర్ణమ్మ, లక్ష్మి ఎన్ని అవస్థలు పడ్డారో తెలుసా. నువ్వు నింద వేశావని తెలిసిన లక్ష్మి నీ కాపురాన్ని నిలబెట్టింది. ఈ లక్ష్మి ని చూస్తుంటే మాస్టారు గుర్తుకు వస్తున్నారు. తండ్రి లోని నిజాయితీ, మానవత్వం వారసత్వంగా తెచ్చుకుంది”

చెప్పారు సర్పంచ్ గారు.


“సర్పంచ్ గారు అయిపోయిందేదో అయిపొయింది. మా నాన్న గారి ఆయువు అంతే ఉంది. తననేమీ అనకండి,” అన్నది కలెక్టర్ లక్ష్మి శిరీష

శిరీష ఎన్నో మంచి పనులు చేసి, మంచిపేరు సంపాదించింది. తమ గ్రామాన్ని అభివృద్ధి చేసాక, బదిలీ చేయించుకొని వెళ్లి పోయింది.


గ్రామ పెద్దలు వెళ్ళ బోయే ముందు, వెళ్ళ వద్దు అన్నా రు.

మా నాన్న ఙ్నాపకాలు ఈ ఊర్లో ఉన్నాయి. నాకు వెళ్ళక తప్పదు.అని చెప్పి, అందరికీ వీడ్కోలు చెప్పి, కుటుంబముతో కలిసి వేరే ఊరు వెళ్ళిపోయింది.

&&&&&&&&

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.



రచయిత్రి పరిచయం : నా వివరములు:

నేనుబి.ఎస్సీ వరకు ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా) లో చదివాను. ఎం. ఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖ పట్నం లో చదివాను. గణితము లో రీసెర్చ్, ఐ.ఐ. టి (ఖరగ్ పూర్ ) లో చేసాను. జె. యెన్.టి.యు.హెచ్ (హైదరాబాద్) లో ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసాను.

1980 నవంబర్ దీపావళి సంచిక వనిత, మాస పత్రిక లో మొదటి వ్యాసం ప్రచురింప బడింది. వ్యాసాలూ, కుట్లు అల్లికలు, వాల్ డెకొరేషన్ పీసెస్, గ్రీటింగ్ కార్డ్స్, తయారు చేయడం, వంటలు, కవితలు, కథలు ప్రచురింప బడ్డాయి. 2000 తర్వాత చాలా కాలం వ్రాయలేదు. మళ్ళీ 2021 నుండి ప్రతిలిపిలో చాలా వ్రాసాను. 160 దాకా కథలు, చాలా వ్యాసాలూ, నాన్ ఫిక్షన్, కవితలు చాలా వ్రాసాను.

చాలా సార్లు ప్రశంసా పత్రాలు వచ్చాయి.

ఒక సాటి 10 భాగముల సీరియల్ కి బహుమతి వచ్చింది. ఒక సారి డైరీ కి బహుమతి వచ్చింది. ఒక సారి వేరే ఆన్లైన్ వీక్లీ లో ఒక కథ కు బహుమతి వచ్చింది.


షహనాజ్ బతుల్



58 views4 comments

4 Comments


Vijaya Avadhanula
Vijaya Avadhanula
Jul 07, 2022

ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని రచనలో చిత్రించారు. అందరూ చదవ వలసిన చక్కని కథ.

Like
shahnaz bathul
shahnaz bathul
Jul 11, 2022
Replying to

ధన్యవాదములు మేడం.

Like

శిరీష ది ఎంతో మంచి మనసు, తన తండ్రికి అన్యాయం జరిగినా దానికి కారకురాలైన సుజన కాపురం నిలబెట్టడమే గాక తన తండ్రి నిజాయితీ కూడా నిరూపించుకుంది. మంచి కథ వ్రాశారండీ.🌷🙏

Like
shahnaz bathul
shahnaz bathul
Jul 07, 2022
Replying to

ధన్యవాదములు

Like
bottom of page